పాలకుల నిర్లక్ష్యమే సమస్యలకు కారణం: చిరు

దీర్ఘకాలికంగా ప్రజా సమస్యలు.. సమస్యలుగానే మిగిలి పోవడానికి పాలకులే కారణమని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ఆరోపించారు. ఆయా ప్రభుత్వాల హయాంలలో జరిగిన, జరుగుతున్న అవినీతిలో కొంతశాతం నిధులను ప్రజా సమస్య పరిష్కారానికి మళ్లిస్తే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Dec 2008 | 12:14 pm

బీహార్‌ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ వ్యాధి: హైఅలెర్ట్

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో విస్తరించిన బర్డ్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు క్రమేణా పొరుగు రాష్ట్రమైన బీహార్‌కు విస్తరిస్తున్నాయి. ఫలితంగా బీహార్ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ వ్యాధిపై హైఅలెర్ట్ ప్రకటించారు. ఇందుకోసం బీహార్ రాష్ట్ర సరిహద్దుల్లో నిశిత తనిఖీలు జరుగుతున్నాయి.
Source: జాతీయ | 18 Dec 2008 | 11:19 am

వాస్తవాలను ప్రజల ముందుంచాలి: ఎన్‌బీఏ

తీవ్రవాద దాడులు జరిగిన సమయంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు మీడియా తొలి ప్రాధాన్యత ఇవ్వాలని న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌బిఏ) సూచించింది. ముఖ్యంగా.. దేశంలో ఉగ్రవాదులు దాడులు జరుపుతున్న సమయంలో ప్రత్యక్ష ప్రసారం చేయరాదని అభిప్రాయపడింది.
Source: జాతీయ | 18 Dec 2008 | 11:07 am

24న జమ్మూకాశ్మీర్ చివరి దశ ఎన్నికల పోలింగ్

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసన సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి దశ ఎన్నికల పోలింగ్ ఈనెల 24వ తేదీన జరుగనుంది. ఇప్పటి వరకు జరిగిన ఆరు దశల పోలింగ్‌ ప్రశాతంగా ముగియడంతో ఆఖరి దశ పోలింగ్‌ను కూడా శాంతియుతంగా ముగించేందుకు భద్రతా బలగాలు కట్టుదిట్టమైన చర్యలు చేస్తున్నాయి.
Source: జాతీయ | 18 Dec 2008 | 10:52 am

ముంబై దాడుల్లో దావూద్ హస్తం ఉంది...

గత నెల 26న ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మాఫియా డాన్ హస్తం ఉన్నట్లు రష్యా ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు రష్యా తన నిఘా‌వర్గాల సమాచారాన్ని భారత్‌తో పంచుకుంది.
Source: జాతీయ | 18 Dec 2008 | 10:52 am

జమ్మూకాశ్మీర్‌లో అధికారం మాదే: ముఫ్తీ

జమ్మూకాశ్మీర్ శాసనసభకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణమే తీవ్రవాదం/ఉగ్రవాదం నిరోధానికి కఠిన చట్టాన్ని ప్రవేశపెడతామన్నారు.
Source: జాతీయ | 18 Dec 2008 | 10:21 am

తరాలు మారినా న్యాయపోరాటంలో ఫలితం వుండదు..

బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో నీటి కోసం రాష్ట్ర ప్రజలు అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు
Source: ఏపీ న్యూస్ | 18 Dec 2008 | 8:39 am

26 నుంచి చంద్రబాబు జన చైతన్య యాత్రలు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. జన చైతన్య యాత్రల పేరుతో ప్రతి రెవెన్యూ మండలంలో ఆయన బహిరంగ సభలు నిర్వహించి, ప్రజలను చైతన్య పరుస్తారు. ఈ మేరకు తెదేపా అధిష్టానం బాబు పర్యటన షెడ్యూల్‍‌ను ఖరారు చేసింది.
Source: ఏపీ న్యూస్ | 18 Dec 2008 | 5:17 am

నికోబార్ ద్వీపంలో భూకంపం

నికోబార్ ద్వీపంలోని తూర్పు దిశలో భూమి కంపించింది. భూకంపం రిక్టర్ స్కేలుపై 5.4 గా నమోదైందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 18 Dec 2008 | 5:06 am

నేటి నుంచి చిరంజీవి నాలుగో విడత ప్రచారం

ప్రజారాజ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి తన నాలుగో విడత ప్రచారాన్ని గురువారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ పర్యటన నల్గొండ జిల్లాలో మూడు రోజుల పాటు సాగుతుంది. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన యూదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం చిరు యాత్రకు శ్రీకారం చుడుతారు.
Source: ఏపీ న్యూస్ | 18 Dec 2008 | 4:52 am

హైదరాబాద్‌లో ఏసీబీ అధికారుల దాడులు

ఏసీబీ అధికారులు హైదరాబాద్ నగరంలో దాడులు ముమ్మరం చేశారు. గురువారం నగరంలోని జీహెచ్ఎంసీ అధికారులు, ఆర్డీఓ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 18 Dec 2008 | 4:30 am

డిసెంబరు 18, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి
Source: Yahoo! Telugu: Entertainment | 18 Dec 2008 | 3:30 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 18 Dec 2008 | 3:26 am

మా మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది..నాగబాబు

ప్రజారాజ్యం పార్టీ మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగకరంగా వుంటుందని ఆ పార్టీ నాయకుడు నాగబాబు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో మూడురోజుల పర్యటనకోసం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ
Source: ఏపీ న్యూస్ | 17 Dec 2008 | 2:17 pm

ఉగ్రవాది అజ్మల్ కేసు వాదిస్తే పుట్టగతులుండవ్...

ముంబై ఉగ్రవాద దాడుల్లో పట్టుబడ్డ ముహమ్మద్ అజ్మల్ కేసును వాదించేందుకు ఒప్పుకుంటే మీకు పుట్టగతులుండవని శివసేన హెచ్చరించింది. ఉగ్రవాది అజ్మల్ కేసును వాదించేందుకు
Source: జాతీయ | 17 Dec 2008 | 12:42 pm