|
ఎన్‌కౌంటర్లు కాదు...ఫాస్ట్ ట్రాక్ కోర్టులే శరణ్యంయాసిడ్ దాడి కేసులో నిందితులకు శిక్షను ఎన్‌కౌంటర్ల ద్వారా విధించడం సరికాదని పీఆర్పీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఇలాంటి దాడుల విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చన్నారు.Source: Yahoo! Telugu: News | 13 Dec 2008 | 11:02 am మాస్టర్స్ ఫైనల్ సిరీస్‌కు సైనా ఓకేహైదరాబాదీ బ్యాడ్మింటన్ టీన్ సంచలనం సైనా నెహ్వాల్ డబ్ల్యూఎస్ఎస్ మాస్టర్స్ ఫైనల్ సిరీస్‌లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జోక్యంతో ప్రత్యేక కారణాలతో ఆమెకు పునరుద్ధరించిన పాస్‌పోర్టును...Source: Yahoo! Telugu: News | 13 Dec 2008 | 10:51 am తీవ్రవాదులపై పాక్ చర్యలను విశ్వసించలేం: ప్రణబ్తమ భూభాగంలోని తీవ్రవాదులపై పాక్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తాము అంత తేలిగ్గా విశ్వసించలేమని విదేశీ వ్యవహారాల మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి చర్యలను కంటితుడుపుగా తీసుకుని వదిలేసిందని గుర్తు చేశారు.Source: Yahoo! Telugu: News | 13 Dec 2008 | 10:39 am కొత్త తీవ్రవాద నిరోధక చట్టంపై కేంద్రం పరిశీలనఅర్థవంతమైన ఆంక్షలతో కూడిన కొత్త తీవ్రవాద నిరోధక చట్టం ప్రవేశపెట్టే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని న్యాయశాఖ మంత్రి హెచ్‌ఆర్ భరద్వాజ్ తెలిపారు. ప్రస్తుతం దానిని హోం మంత్రిత్వశాఖ పరిశీలనకు పంపామన్నారు.Source: Yahoo! Telugu: News | 13 Dec 2008 | 10:29 am నిధుల కోసం ఎయిర్ ఇండియా ఎదురు చూపుప్రభుత్వం నుండి రూ. 2,500 కోట్ల నిధుల కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘు మీనన్ వెల్లడించారు. మరో ప్రముఖ విమానయాన సంస్థ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో విలీనం...Source: Yahoo! Telugu: News | 13 Dec 2008 | 10:11 am స్నేహితుడి భార్యపై కామోన్మాది దాడిస్వప్నిక, ప్రణీతలు ప్రేమోన్మాది యాసిడ్ దాడికి గురైన వార్త రాష్ట్రంలో కలకలం రేగిస్తుండగానే కామంతో కళ్లు మూసుకుపోయిన మరో ఉన్మాది స్నేహితుడి భార్యను వేటకొడవలితో నరికి హత్య చేసేందుకు ప్రయత్నించాడు.Source: Yahoo! Telugu: News | 13 Dec 2008 | 9:33 am భారత ప్రజాస్వామ్యంపై ఉగ్రవాద దాడుల దెబ్బముంబయిలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులు భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసిందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఈ దాడుల ద్వారా ప్రజలపైనే కాక దేశంపైన, దేశ ఆర్థిక వ్యవస్థపైనా పెద్ద దెబ్బ తగిలినట్లయిందన్నారు.Source: Yahoo! Telugu: News | 13 Dec 2008 | 8:55 am న్యూ ఇయర్ కానుకగా "కొంచెం-ఇష్టం.. కొంచెం-కష్టం""బాయ్స్" బాయ్ సిద్ధార్థ్ హీరోగా, హ్యాపీడేస్ ఫేం తమన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం "కొంచెం-ఇష్టం.. కొంచెం-కష్టం". యూత్‌ఫుల్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాను నల్లమలపు బుజ్జి నిర్మిస్తుండగా, పార్థసారథి దర్శకత్వం వహిస్తున్నారు.Source: వినోదం | 13 Dec 2008 | 8:53 am ఉగ్రవాద దేశం ముద్ర రాకూడదనే దాడులు: పాక్ఉగ్రవాద దేశంగా పాకిస్థాన్‌పై ముద్ర పడకూడదనే జమాత్ ఉద్ దవాపై దాడులు జరపాల్సి వచ్చిందని ఆ దేశ రక్షణ మంత్రి చౌదరి అహ్మద్ ముఖ్తార్ అన్నారు. ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానానికి అనుగుణంగా చర్యలు తీసుకోకుంటే తమపై ఉగ్రవాద దేశంగా ముద్ర పడేదని పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 13 Dec 2008 | 7:34 am ఆదుకున్న ధోనీ, భజ్జీ: భారత్ 241 ఆలౌట్చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగే తొలి టెస్టులో కెప్టెన్ ధోనీ, హర్భజన్ సింగ్‌లు బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్ 241 పరుగుల గౌరవ ప్రద స్కోరును సాధించగలిగింది. తద్వారా ఇంగ్లాండ్‌కు 75 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సమర్పించుకుంది.Source: Yahoo! Telugu: News | 13 Dec 2008 | 7:03 am చేసిన తప్పుకు సరైన శిక్ష: శ్రీనివాస్ తండ్రితన కుమారుడు చేసిన తప్పుకు సరైన శిక్ష పడిందని యాసిడ్ దాడి కేసులో ప్రధాన నిందితుడైన శాఖమూరి శ్రీనివాస్ తండ్రి అభిప్రాయపడ్డారు. ఇది తన కుమారుడికి పడాల్సిన శిక్షేనని ఒక టీవీ మీడియా సంస్థకు ఫోనులో తన స్పందనను చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 13 Dec 2008 | 6:52 am ఎన్‌కౌంటర్‌పై స్వప్నిక తల్లిదండ్రుల హర్షంయాసిడ్ దాడి నిందితులైన శ్రీనివాస్, సంజయ్, హరికృష్ణల ఎన్‌కౌంటర్‌పై స్వప్నిక, ప్రణీతల తల్లిదండ్రులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. కాల్పుల్లో చావడం ద్వారా వారికి తగిన శాస్తి జరిగినట్టయిందన్నారు.Source: Yahoo! Telugu: News | 13 Dec 2008 | 6:36 am ప్రజామోదం మేరకే ఎన్‌కౌంటర్: మంత్రి పొన్నాలయాసిడ్ దాడి నిందితులకు ప్రజాభీష్టం, ప్రజామోదం మేరకే ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. విద్యార్థినులపై యాసిడ్ దాడికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడైన శాఖమూరి శ్రీనివాస్‌తో పాటు.. అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులను అరెస్టు చేసిన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 13 Dec 2008 | 6:36 am పార్లమెంట్‌పై దాడి.. నేటికి ఏడేళ్ళు పూర్తిదేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తూ పార్లమెంట్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడులకు ఏడేళ్ళు పూర్తయింది. ఈ దాడి సందర్భంగా వీరమరణం పొందిన అమర వీరులకు లోక్‌సభ సభ్యులు ఘననివాళులు అర్పించారు. గత 2001 సంవత్సరం 13వ తేదీన దేశ రాజధానిలోని పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెల్సిందే. ఈ దాడి జరిగి నేటికి (శనివారానికి) ఏడేళ్ళు పూర్తయింది.Source: జాతీయ | 13 Dec 2008 | 6:24 am యాసిడ్ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హర్షాతిరేకాలుఇద్దరు విద్యార్థినులపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం పట్ల రాష్ట్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి, రాజకీయ, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తుండగా, పౌర హక్కుల వేదిక, మేధావుల సంఘాలు మాత్రం ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తున్నాయి.Source: ఏపీ న్యూస్ | 13 Dec 2008 | 5:37 am మర్చిపోవద్దు మామా..!"పాత చొక్కా గుడ్డ విలువ చెయ్యని నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా...?" కోపంగా గద్దించాడు మామ...Source: వినోదం | 13 Dec 2008 | 5:28 am మా ఆయనే అడుగుతాడు"ఈ హాలీడేని జాలీడేగా గడిపేశాం. ఈ అనుభవాన్నంతా మీ అమ్మతో చెబుతావా డార్లింగ్..?" అన్నాడు ప్రియుడు...Source: వినోదం | 13 Dec 2008 | 5:24 am ఆత్మరక్షణ కోసమే పోలీసుల కాల్పులు: జిల్లా ఎస్పీరాష్ట్రంలో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి నిందితులకు తగిన శాస్తి జరిగింది. ప్రేమోన్మాదంతో ఇద్దరు విద్యార్థినులపై యాసిడ్ దాడి చేసి, వారిని జీవితాంతం క్షోభకు గురి చేసిన ముగ్గురు నిందితులు వరంగల్ జిల్లా పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.Source: ఏపీ న్యూస్ | 13 Dec 2008 | 5:20 am యాసిడ్ దాడి నిందితులపై పోలీసుల ఎన్కౌంటర్వరంగల్లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నవిద్యార్థినులు స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి చేసిన నిందుతులు పోలీసుల ఎన్ కౌంటర్‌లో మృతిచెందారు. పోలీసుల విచారణ సమయంలో నిందితులు వారిపై కత్తులుSource: ఏపీ న్యూస్ | 13 Dec 2008 | 4:41 am సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రమణ్ సింగ్ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ రెండో సారి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, భాజపా పాలిత ముఖ్యమంత్రులు, పలువురు ఎన్డీయే నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా రెండో సారి విజయం సాధించిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 12 Dec 2008 | 2:06 pm
|