రేపు జమ్మూకాశ్మీర్‌లో ఐదో విడత పోలింగ్

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఐదో దశ ఎన్నికల పోలింగ్ శనివారం జరుగనుంది. ఈ ఎన్నికల్లో ఉగ్రవాదులు, వేర్పాటువాదుల పిలుపునకు ఏమాత్రం లెక్కచేయని జమ్మూకాశ్మీర్ ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న విషయం తెల్సిందే.
Source: జాతీయ | 12 Dec 2008 | 11:26 am

ఈనెల 18న మెగాస్టార్ తొలి 'ప్రజా అంకిత సభ'

రాజకీయ పార్టీలు నిర్వహించే రోడ్‌షోల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు బ్రేక్ వేయడంతో రాజకీయ పార్టీలు తమ పంథాను మార్చుకుంటున్నాయి. రోడ్‌షోల స్థానంలో గ్రామ సభలను నిర్వహించేందుకు ఆయా పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులోభాగంగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన తొలి గ్రామ సభను ఈనెల 18వ తేదీన మెదక్ జిల్లాలలో నిర్వహించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2008 | 11:12 am

సుప్రభాత సేవ బదులు తిరుప్పావై సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సుప్రభాత సేవ బదులు తిరుప్పావై సేవ నిర్వహించనున్నారు. డిసెంబర్ 17 నుంచి జనవరి 15వరకు ఈ మార్పును అమలు చేయనున్నామని తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 12 Dec 2008 | 10:51 am

తీవ్రవాదానికి వ్యతిరేకంగా ముంబైలో మానవహారం

తీవ్రవాదానికి వ్యతిరేకంగా తామందరం కలసికట్టుగా నిలబడి పోరాడతామని చాటి చెప్పేందుకు... ముంబై నగర వాసులంతా శుక్రవారం ఓ భారీ మానవహారాన్ని ఏర్పాటు చేయనున్నారు. విద్రోహకర, విచ్ఛిన్నకర శక్తులను ఎదుర్కోవడంలో ముందువరుసలో ఉంటామని ఈ సందర్భంగా వారు నొక్కి చెప్పనున్నారు.
Source: జాతీయ | 12 Dec 2008 | 10:36 am

ప్రతి కుటుంబానికీ ఇల్లు ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఇల్లు కలిగి ఉండాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ తెలిపారు. దీనికోసమే తాము గ్రామ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ పేదలకోసం ఇల్లు నిర్మించే పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 12 Dec 2008 | 10:19 am

ఛత్తీస్‌గఢ్ సీఎంగా రమణ్ సింగ్ ప్రమాణ స్వీకారం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్‌పూర్‌లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Source: జాతీయ | 12 Dec 2008 | 10:10 am

బాబ్లీపై రాజకీయ లబ్ధికోసం బాబు డ్రామా

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాంశాన్ని వివాదం చేయడం ద్వారా రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోపించారు. ఈ వివాదం పరిష్కారం కావాలన్న ఆతృత ఆయనలో ఏమాత్రం కన్పించడం లేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 12 Dec 2008 | 10:02 am

బాబ్లీ తీర్మానానికి డిప్యూటీ స్పీకర్ తిరస్కృతి

గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ సహా వివిధ ప్రాజెక్టులపై చర్చకోరుతూ టీడీపీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు. టీడీపీ సభ్యుల విజ్ఞప్తిని పరిశీలిస్తాం కానీ తీర్మానం మాత్రం చేయలేమని ఆయన స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 12 Dec 2008 | 9:53 am

సీపీఎం రాష్ట్రకమిటీ సమావేశాలు

హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగే సీపీఎం రాష్ట్ర స్థాయి సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి ప్రకాష్‌కారత్, పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం‌ ఏచూరి హాజరు కానున్నారు
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2008 | 9:46 am

సంగమేశ్వరంలో భక్తుల పుష్కర స్నానాలు

కర్నూలు జిల్లా, సంగమేశ్వరంలో శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కర స్నానాలు చేశారు. తుంగభద్ర పుష్కరాలకోసం కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు.
Source: Yahoo! Telugu: News | 12 Dec 2008 | 9:28 am

వీహెచ్‌పీ ఆందోళనతో రాజధానిలో ఉద్రిక్తత

కోఠీలోని పోచమ్మ దేవాలయ కూల్చివేతకు నిరనసగా విశ్వహిందూపరిషత్, భజరంగదళ్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టడంతో రాజధానిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Source: Yahoo! Telugu: News | 12 Dec 2008 | 8:56 am

సుబేదార్ ఎస్సై, సీఐ సస్పెండ్: జానారెడ్డి

స్వప్నికపై దాడికి సంబంధించి సుబేదార్ సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేస్తున్నట్టు హోం మంత్రి జానారెడ్డి శుక్రవారం ప్రకటించారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వప్నికను, ఆమె తల్లిదండ్రులను పరామర్శించిన మీదట ఆయన ఈ ప్రకటన చేశారు.
Source: Yahoo! Telugu: News | 12 Dec 2008 | 8:50 am

గోపిచంద్, కాజల్ జంటగా కొత్త చిత్రం

వరుస విజయాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న గోపిచంద్ కథానాయకుడిగా, "శౌర్యం" వంటి సూపర్ హిట్‌ను అందించి "ది బెస్ట్" డైరక్టర్‌గా అభినందనలు పొందిన "శివ" దర్శకత్వంలో కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది.
Source: వినోదం | 12 Dec 2008 | 8:29 am

సాక్ష్యాధారాలు లేకుండా ఏమీ చేయలేము: పాక్

ముంబయి తీవ్రవాద దాడులకు తమ భూభాగం నుంచే కుట్ర జరిగిందనే దానికి సాక్ష్యాధారాలు అందజేయాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి తెలిపారు. ఆధారాలు లేకుండా తాము ముందుకెళ్లలేమని స్పష్టం చేశారు. ముంబయి
Source: Yahoo! Telugu: News | 12 Dec 2008 | 8:25 am

ప్రజాస్వామ్యమే తీవ్రవాదాన్ని అణిచివేయగలదు: జర్దారీ

పాకిస్థాన్ భూభాగంలో తీవ్రవాదం వ్యాప్తిని నిరోధించడం ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడం ద్వారానే సాధ్యపడుతుందని ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అభిప్రాయపడ్డారు. మిలటరీ నిరంకుశత్వం నుంచి దేశాన్ని విడిపించడం, ప్రజాస్వామ్యాన్ని
Source: Yahoo! Telugu: News | 12 Dec 2008 | 8:00 am

ఆదుకున్న ప్రయార్: ఇంగ్లాండ్ 316 ఆలౌట్

చెన్నై టెస్టులో భారత బౌలర్ల దూకుడును ఎదుర్కునేందుకు తీవ్రంగా శ్రమించిన ఇంగ్లాండ్ ఎట్టకేలకు మొదటి ఇన్నింగ్స్‌లో 316 పరుగులు చేసింది. తొలి రోజున స్ట్రాస్ (123 నాటౌట్), కుక్ (52 నాటౌట్)లు రాణించగా, చివర్లో మాట్ ప్రియార్ (53 నాటౌట్) ఆదుకోవడంతో...
Source: Yahoo! Telugu: News | 12 Dec 2008 | 7:49 am

హల్వా పార్శిల్

"పావుకిలో హల్వా పార్శిల్ చేయమంటే.. ఐదువందల రూపాయలకు బిల్లు వేశావేమిటి...?" కోపంగా అడిగాడు గిరీశం...
Source: వినోదం | 12 Dec 2008 | 5:52 am

కట్నం అదనంగా వస్తుందని..!

"ఎప్పుడు చూసిన ఆ వంట వార్పు పుస్తకాన్ని ముందేసుకుని చదువుతున్నావ్... ఏమిటి సంగతి...?" అడిగాడు సంతోష్...
Source: వినోదం | 12 Dec 2008 | 5:49 am

నాకు.. వారికి సంధానకర్తలు మీరే: చిరంజీవి

ప్రజల బలమైన కోరికతో రాజకీయాల్లోకి వచ్చాను. ఇందుకోసం తనను ఇంతవాడిని చేసిన తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమయ్యాను. ఇలాంటి తరుణంలో ప్రజలకు మేలుచేయడమే తన ఏకైక లక్ష్యం, ధ్యేయం. ఇందుకోసం నాకు, ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా జిల్లా కమిటీ సభ్యులు ఉండాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2008 | 5:34 am

అమీర్ గజినీ వస్తున్నాడు...

క్రిస్మస్ కానుకగా దేశవ్యాప్తంగా విడుదలకానున్న అమీర్‌ఖాన్ "గజినీ" విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. గజినీ ట్రెయిలర్‌లో అమీర్ ఎమోషన్స్ చూసిన సినీ జనం, ఈ చిత్రం బిగ్ హిట్ అవుతుందని చెపుతున్నారు.
Source: వినోదం | 11 Dec 2008 | 3:35 pm

ఉగ్రవాదంపై అంతర్జాతీయ చట్టం రూపొందించాలి... కలామ్

ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించియున్న ఉగ్రవాదాన్ని మట్టుబెట్టటానికి అంతర్జాతీయ చట్టాన్ని తీసుకురావాలని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలామ్ అభిప్రాయపడ్డారు. ముంబైతో బాటు దేశంలోని ప్రధాన నగరాలు ఉగ్రవాదుల
Source: జాతీయ | 11 Dec 2008 | 2:54 pm

బాబ్లీపై విపక్షాల ధర్నా: నేతల అరెస్ట్

మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుతో సహా ఇతర 11 ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపి వేయాలని తెలుగుదేశం పార్టీతో సహా విపక్షాలు ఢిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద ధర్నా చేపట్టాయి.
Source: ఏపీ న్యూస్ | 11 Dec 2008 | 2:32 pm

పాకిస్థాన్‌పై దాడి చేయం కాని... : మంత్రి ప్రణబ్

పొరుగు దేశమైన పాకిస్థాన్‌పై తాము దాడి చేయం కాని వారు ఉగ్రవాద మూకలపై కఠిన చర్య తీసుకోవాలని భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. దాడి ఒక్కటే సమస్యకు పరిష్కారం కాబోదని అన్నారు.
Source: జాతీయ | 11 Dec 2008 | 2:32 pm

జనవరి 9న అరుంధతి విడుదల

అనుష్క ద్విపాత్రాభినయం చేసిన సినిమా "అరుంధతి". మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎం.శ్యామ్‌ప్రసాద్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. "తలంబ్రాలు", "ఆహుతి" చిత్రాలు తీసిన శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
Source: Yahoo! Telugu: Entertainment | 11 Dec 2008 | 11:44 am

నేను బిజినెస్‌మేన్‌ని కాదు: వెంకీ

మనకున్న అగ్రహీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. చిత్రం చేసినప్పుడే దాని గురించి ఆలోచించి... ఆ తర్వాత జయాపజయాలను గురించి పెద్దగా పట్టించుకోని కథానాయకుడు వెంకీ. అలాగని సినిమా అటు ఇటూ అయితే దాని గురించి ఆలోచించడు అనుకుంటే...
Source: వినోదం | 11 Dec 2008 | 11:34 am

త్వరలో కరెంట్ రెండో షెడ్యూల్

నటసామ్రాట్ అక్కినేని మనవడు సుశాంత్ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం "కరెంట్". అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల
Source: Yahoo! Telugu: Entertainment | 11 Dec 2008 | 11:24 am

క్లైమాక్స్ చిత్రీకరణలో రోమియో

శ్రీహరి ప్రధానపాత్రలో ఆర్యన్ రాజేష్, శ్రద్ధ ఆర్య జంటగా నటిస్తున్న చిత్రం "రోమియో". సుధా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. రామకృష్ణ దర్శకుడు. శ్రీనివాస్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్ర క్లైమాక్స్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 11 Dec 2008 | 11:16 am