మీపై దాడి జరిగితే ఏం చేశారు: రోశయ్య

తెలుగుదేశం అధికారంలో ఉండగా సాక్షాత్ ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఏం చేశారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కె.రోశయ్య ప్రశ్నించారు. గురువారం శాసనసభలో రాష్ట్ర శాంతి భద్రతలు, ఉగ్రవాదంపై జరిగిన చర్చలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రస్థాయిలోనే ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 4 Dec 2008 | 11:06 am

రైతు సమస్యలపై ప్రతిపక్షాల పాదయాత్ర

రాష్ట్రంలోని రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష పార్టీలు గురువారం అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించాయి. ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర పార్టీల నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Dec 2008 | 10:52 am

మతం - ఉగ్రవాదాలను ముడిపెట్టొద్దు: బాబు

మతాన్ని, ఉగ్రవాదాన్ని ఒకేలా చూడటమో లేదా రెండింటికి ముడిపెట్టడమో చేయరాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. గురువారం జరిగిన శాసనసభ సమావేశంలో ఉగ్రవాదం అనే అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది.
Source: ఏపీ న్యూస్ | 4 Dec 2008 | 10:51 am

నా స్టైలే వేరు అంటున్న రాజశేఖర్

డాక్టర్ రాజశేఖర్, భూమిక జంటగా "నా స్టైలే వేరు" అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. జి.రామ్‌ప్రసాద్ దర్శకుడు. మాగంటి గోపీనాథ్ నిర్మాత. చిత్రానికి కోన వెంకట్ స్క్రీన్‌ప్లే, మాటలు సమకూరుస్తున్నారు. కథ, కథనాల్లో కొత్తదనం, కథానాయకుడి
Source: Yahoo! Telugu: Entertainment | 4 Dec 2008 | 10:39 am

సొంత ఊరు షూటింగ్ పూర్తి

శ్రావ్య ఫిలింస్ బేనర్‌పై పి.సునీల్ కుమార్ దర్శకత్వంలో "సొంత ఊరు" అనే చిత్రం రూపొందుతోంది. రాజా, తీర్థ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. జీవా, జయప్రకాష్‌రెడ్డి, ఎస్‌బి శ్రీరామ్ తదితరులు
Source: Yahoo! Telugu: Entertainment | 4 Dec 2008 | 10:38 am

నింగి నేల నాదే ఆడియో ఆవిష్కరణ

చైనా భాషలో నిర్మితమయిన "ఇన్‌విజిబుల్ వింగ్స్" అనే చిత్రం "నింగి నేల నాదే" పేరుతో తెలుగులోకి అనువాదమవుతోంది. చావా సుధారాణి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల ప్రసాద్
Source: Yahoo! Telugu: Entertainment | 4 Dec 2008 | 10:37 am

8.40 శాతానికి పడిపోయిన ద్రవ్యోల్బణం

భారత్ టోకు ధరల సూచి నవంబరు 22తో ముగిసిన వారాంతానికి 8.40 శాతానికి పడిపోయింది. అంతకుముందు వారం ద్రవ్యోల్బణం 8.84 శాతం వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గత ఏడాది ఇదే వారాంతానికి ద్రవ్యోల్బణం 3.11 శాతం వద్ద ఉంది.
Source: Yahoo! Telugu: News | 4 Dec 2008 | 10:36 am

చెన్నారెడ్డి నా పేరు ప్రస్తావించలేదు: వైఎస్సార్

హైదరాబాద్‌లో జరిగిన మత ఘర్షణల్లో తన పాత్ర ఉందని అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చెప్పలేదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. కడప, విజయవాడలకు చెందిన మనుషులు వచ్చి ఈ మతఘర్షణలకు పాల్పడ్డారని మాత్రమే అన్నారని వైఎస్సార్ గురువారం వివరించారు.
Source: ఏపీ న్యూస్ | 4 Dec 2008 | 10:31 am

మైనారిటీల పక్షపాతి కాంగ్రెస్: అక్బరుద్దీన్

రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం కోసం ఎవరైనా ఏమైనా చేశారంటే.. అది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ అన్నారు. ప్రసుత్తం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఉగ్రవాదంపై తీవ్ర చర్చ సాగింది.
Source: ఏపీ న్యూస్ | 4 Dec 2008 | 10:19 am

రాష్ట్రంలో శాంత్రి భద్రతలు భేష్: హోమంత్రి

రాష్ట్రంలో శాతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని హోమంత్రి కె.జానారెడ్డి స్పష్టం చేశారు. గురువారం జరిగిన శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర శాంతిభద్రతలపై వాడివేడి చర్చ సాగింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంపై విరుచుక పడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 4 Dec 2008 | 10:11 am

రాష్ట్రంలో వైఎస్ పాలన భేష్: అక్బరుద్దీన్ ప్రశంస

రాష్ట్రంలో వైఎస్ హయాంలోనే ముస్లింలకు మేలు జరిగిందని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ కొనియాడారు. వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల కారణంగా ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్య అవకాశాలు పొందుతున్నారని ప్రశంసించారు.
Source: Yahoo! Telugu: News | 4 Dec 2008 | 8:36 am

సన్‌రేస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం

సర్దార్ పటేల్, సురేష్, మహేష్, విను, వివేక్, ప్రవీణ్, దినేష్, గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా ఎస్.రాజశేఖర్ అనే నూతన నిర్మాత చిత్ర నిర్మాణం చేపట్టారు. ఈ సినిమా షూటింగ్ బుధవారం ఉదయం ప్రసాద్ ఐమాక్స్‌లో ప్రారంభం అయింది. రాజ్.కె.ఎస్.గోపి దర్శకుడు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Dec 2008 | 8:25 am

గర్ల్‌ఫ్రెండ్ కావాలంటున్న సంతోష్ పవన్

సంతోష్ పవన్, మౌనిక, వైశాలి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావలె". డ్రీమ్‌ల్యాండ్ సినిమా పతాకంపై ఎం.జానికిరామ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి ఆయనే దర్శకుడు. ఈ సినిమా పాటలు ఇటీవల మార్కెట్‌లోకి
Source: Yahoo! Telugu: Entertainment | 4 Dec 2008 | 8:19 am

కామన్వెల్త్ గేమ్స్‌కోసం 44మంది బాక్సర్లకు శిక్షణ

ఢిల్లీలో 2010లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకై ఎంపిక చేసిన జాబితాలో ఒలింపిక్ కాంస్య పతక గ్రహీత విజేందర్ సింగ్ సహా 44మంది బాక్సర్లకు చోటు లభించింది. క్రీడల మంత్రిత్వ శాఖ ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
Source: Yahoo! Telugu: News | 4 Dec 2008 | 6:52 am

గవర్నర్‌కు విలాస్‌రావ్ రాజీనామా లేఖ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ అధికారికంగా గురువారం గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపారు. ఐదు రోజుల క్రితం రాజీనామా చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ విలాస్‌రావ్ చేసిన ప్రతిపాదనను బుధవారం కాంగ్రెస్ అధిష్టానం
Source: Yahoo! Telugu: News | 4 Dec 2008 | 6:51 am

భారత్ టూర్‌కు ఇంగ్లాండ్ జట్టు రెడీ

భారత్ టూర్‌కు ఇంగ్లాండ్ జట్టు సిద్ధమవుతోంది. భారత్‌తో రెండు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు అబుదాబి మార్గంలో వచ్చేందుకు ఇంగ్లాండ్ సరంజామా సర్దుకుంటోంది. గురువారం అబుదాబి రానున్న ఇంగ్లాండ్ జట్టు అక్కడ ప్రాక్టీసు చేసిన తర్వాత వచ్చే వారం...
Source: Yahoo! Telugu: News | 4 Dec 2008 | 5:51 am

భారత్‌కు పాక్ సహకరించాలి: రైస్ ఉద్ఘాటన

పాకిస్థాన్ విషయంలో భారత్ అనుసరిస్తున్న కఠిన వైఖరికి బుధవారం అమెరికా కూడా గొంతు కలిపింది. ముంబయి తీవ్రవాద దాడులపై చర్చలు జరిపేందుకు భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీతో అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కండొలిజా
Source: Yahoo! Telugu: News | 4 Dec 2008 | 5:50 am

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

రాజస్థాన్ అసెంబ్లీలోని 200 స్థానాలకు గురువారం ఉదయం ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ముంబయి తీవ్రవాద దాడుల నేపథ్యంలో ఈ ఎన్నికలకు అధికారిక యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. అన్ని నియోజకవర్గాల్లోనూ
Source: Yahoo! Telugu: News | 4 Dec 2008 | 5:47 am

భారత్‌ స్నేహాన్ని బలహీనంగా భావించొద్దు: సోనియా

భారత్ కోరుకుంటున్న స్నేహ సంబంధాలను పొరుగు దేశాలు బలహీనంగా తీసుకోవద్దని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆమె బుధవారం యురి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
Source: జాతీయ | 4 Dec 2008 | 5:41 am

సికింద్రాబాద్, కాకినాడల మధ్య 25 ప్రత్యేక రైళ్లు

ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్-కాకినాడల మధ్య 25 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. డిసెంబరు 5, 22, 24, 29, 31, జనవరి 2, 4, 6, 8, 10, 12, 14, 16 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి...
Source: Yahoo! Telugu: News | 4 Dec 2008 | 5:35 am

వైమానిక దాడులు జరగొచ్చు: అంటోనీ హెచ్చరిక

ఉగ్రవాదులు మరోమారు దాడులకు తెగబడే అవకాశం ఉందని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ సందేహం వ్యక్తం చేశారు. భూ, సముద్ర మార్గాల ద్వారా దాడులు నిర్వహించిన ఉగ్రవాదులు ఈ దఫా వైమానికి దాడులు నిర్వహించ వచ్చని ఆయన హెచ్చరించారు. అందువల్ల త్రివిధ దళాధిపతులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 4 Dec 2008 | 5:24 am

ఎట్టకేలకు తిరువూరు యువకుడి విడుదల

ముంబయిలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులతో సంబంధాలు ఉండొచ్చన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా, తిరువూరు యువకుడు షేక్ మస్తాన్‌ను బుధవారం ఎట్టకేలకు విడుదల చేశారు. అందుబాటులో ఉండాలనే నిబంధనపై విడుదల చేస్తున్నామని సీఐ మనోహర్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 4 Dec 2008 | 5:17 am

రోడ్‌షోలపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ

రాజకీయ పార్టీల రోడ్‌‌షోలపై స్టే ఎత్తివేతకు హైకోర్టు బుధవారం నిరాకరించింది. రాజకీయ పార్టీల షోలకోసం రోడ్లు వేయలేదని చెబుతూ స్టే తొలగించాలన్న టీడీపీ, తెరాస, ప్రజారాజ్యం పార్టీల విజ్ఞప్తులను తోసిపుచ్చింది.
Source: Yahoo! Telugu: News | 4 Dec 2008 | 4:43 am

రాజస్థాన్‌లో గట్టి భద్రత నడుమ పోలింగ్ ప్రారంభం

రాజస్థాన్‌లో గట్టి భద్రత నడుమ గురువారం పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 200 అసెంబ్లీ సీట్లకుగాను 2193 మంది అభ్యర్దులు పోటీపడుతున్నారు. 3.62 కోట్లమంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు
Source: జాతీయ | 4 Dec 2008 | 4:26 am

యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల

విద్యార్థుల జీవితాల్లో జరిగే సహజ సంఘటనలతో రూపొందిన "కళాశాల" అనే చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. "ప్రేమిస్తే" చిత్రానికి ప్రాణం పోసిన శక్తివేల్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. కాగా
Source: Yahoo! Telugu: Entertainment | 4 Dec 2008 | 3:45 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 4 Dec 2008 | 3:03 am

విశాఖలో రంగురాళ్ళ ముఠా గుట్టురట్టు

విశాఖపట్నంలో రంగురాళ్ళను అక్రమంగా తవ్వుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 30 లక్షల రూపాయల విలువ చేసే రంగురాళ్ళను స్వాధీనం చేసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 3 Dec 2008 | 12:24 pm

విద్యుత్ సరఫరా వైఫల్యంపై తెదేపా వాకౌట్

రాష్ట్రంలోని రైతులకు విద్యుత్ సరిగా సరఫరా కావడం లేదని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో భాగంగా.. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే విద్యుత్ సరఫరా అంతరాయం సమస్యను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది.
Source: ఏపీ న్యూస్ | 3 Dec 2008 | 12:22 pm

మండలిని కుదిపేసిన ఇసుక తుఫాను

శాసన సభను ఇసుక కుంభకోణం కుదిపేసింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి జేసి.దివాకర్‌ రెడ్డిపై మరో మంత్రి గొల్లపల్లి సూర్యారావు చేసిన ఆరోపణలపై హౌస్ కమిటీతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుపట్టారు. అంతేకాకుండా ఇసుక కుంభకోణంపై ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వివరణకు ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు.
Source: ఏపీ న్యూస్ | 3 Dec 2008 | 12:15 pm

వరుణ దేవుడూ మా వైపే: ముఖ్యమంత్రి

వరుణ దేవుడు కూడా తమవైపే ఉండి ఆశీర్వదిస్తూ.. క్రమం తప్పకుండా వర్షాలు కురిపిస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో విద్యుత్ సరఫరాపై విపక్షాలు విరుచుక పడ్డాయి. ప్రభుత్వ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశాయి.
Source: ఏపీ న్యూస్ | 3 Dec 2008 | 12:07 pm

సినీ నిర్మాత టి.త్రివిక్రమరావు మరణం

ప్రముఖ సినీ నిర్మాత తిరుమల త్రివిక్రమరావు (67) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. గత కొంతకాలంగా అస్వస్తతతో బాధపడుతున్న ఆయన ఈ రోజు స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు
Source: Yahoo! Telugu: Entertainment | 3 Dec 2008 | 10:46 am