|
కాల్పులు జరిపిన వికారుద్దీన్ సిమి కార్యకర్త: కమిషనర్రాజధానిలోని సంతోష్ నగర్ ఐఎస్ చౌరస్తాలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్స్‌పై తుపాకీ కాల్పులు జరిపింది సిమి కార్యకర్త వికారుద్దీన్ అని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ప్రసాదరావు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్ళకు గాయాలయ్యాయని, వారిని అపోలో ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 3 Dec 2008 | 11:49 am జంట నగరాల్లో హై అలెర్ట్: బలగాల మొహరింపురాష్ట్రంలోని జంట నగారల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. సున్నితమైన పాతబస్తీలో ముందస్తు చర్యగా పోలీసు బలగాలను మొహరించారు. ముంబై ఉగ్రవాద దాడుల తాలూకు భయాందోళనలు వీడక ముందే బుధవారం సిమి తీవ్రవాద సంస్థ కార్యకర్తగా భావిస్తున్న వికారుద్దీన్, అతని అనుచరులు నలుగురు పోలీసులపై కాల్పులు జరిపి, పారిపోయిన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 3 Dec 2008 | 11:49 am సినీ నిర్మాత టి.త్రివిక్రమరావు మరణంప్రముఖ సినీ నిర్మాత తిరుమల త్రివిక్రమరావు (67) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. గత కొంతకాలంగా అస్వస్తతతో బాధపడుతున్న ఆయన ఈ రోజు స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలుSource: Yahoo! Telugu: Entertainment | 3 Dec 2008 | 10:46 am రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులుబే మూవీస్ అనే నిర్మాణ సంస్థ రాజా హీరోగా ఒక చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ సినిమా షూటింగ్ మంగళవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. కాలం మనిషి జీవితంలో ఎలాంటి మార్పు తెస్తుందనే పాయింట్‌తో ఈ సినిమానుSource: Yahoo! Telugu: Entertainment | 3 Dec 2008 | 10:26 am భారత్‌కు అండగా ఉంటాం: కండోలిజా రైస్ప్రస్తుతం ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్యగా మారిందని, ఇలాంటి తరుణంలో తాము భారత్‌కు అండగా ఉంటామని అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ మరోసారి స్పష్టం చేశారు. ముంబై పేలుళ్ల నేపథ్యంలో ఆమె బుధవారం న్యూఢిల్లీకి వచ్చిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 3 Dec 2008 | 10:23 am యతార్థ సంఘటన ఆధారంగా కళాశాలవిద్యార్థుల జీవితాల్లో జరిగే సహజ సంఘటనలతో రూపొందిన "కళాశాల" అనే చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. "ప్రేమిస్తే" చిత్రానికి ప్రాణం పోసిన శక్తివేల్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. కాగాSource: Yahoo! Telugu: Entertainment | 3 Dec 2008 | 10:11 am హైదరాబాద్‌లో పోలీసులపై కాల్పులు - గాయాలురాష్ట్ర రాజధాని వాసులు మరోసారి ఉలిక్కి పడ్డారు. ముంబై విధ్వంసం నుంచి ఇపుడిపుడే తేరుకుంటున్న దేశ ప్రజలు.. బుధవారం హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్, ఐఎస్.సదన్ చౌరస్తా జరిగిన తుపాకీ కాల్పుల సంఘటన రాజధాని వాసులను ఆందోళనకు లోనుచేసింది. ఐఎస్ఐ ఏజెంట్, సిమి కార్యకర్తగా భావిస్తున్న వికారుద్దీన్ (వికార్) విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిపారు.Source: ఏపీ న్యూస్ | 3 Dec 2008 | 10:03 am కొత్త నటుడితో ఈతరం సినిమాఈతరం ఫిలింస్ పతాకంపై పోకూరి సుబ్బారావు నిర్మిస్తాన్న తాజా చిత్రం షూటింగ్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో కొత్త నటుడిని పరిచయం చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి మరుధూరి రాజా సంభాషణలు సమకూర్చారుSource: Yahoo! Telugu: Entertainment | 3 Dec 2008 | 9:56 am రోడ్‌షోలపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణరాజకీయ పార్టీల నేతలు నిర్వహించే రోడ్ షోలకు వ్యతిరేకంగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. రోడ్‌షోలపై గతంలో కోర్టు విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీలు దాఖలు చేసిన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 3 Dec 2008 | 9:49 am షూటింగ్ పూర్తి చేసుకున్న సొంత ఊరుశ్రావ్య ఫిలింస్ బేనర్‌పై పి.సునీల్ కుమార్ దర్శకత్వంలో "సొంత ఊరు" అనే చిత్రం రూపొందుతోంది. రాజా, తీర్థ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. జీవా, జయప్రకాష్‌రెడ్డి, ఎస్‌బి శ్రీరామ్ తదితరులుSource: Yahoo! Telugu: Entertainment | 3 Dec 2008 | 9:45 am రేపు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్రాజస్థాన్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రానికి తెరపడిన విషయం తెల్సిందే. మొత్తం 200 స్థానాలు కలిగిన రాజస్థాన్ అసెంబ్లీకి గురువారం ఒకే విడతగా పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.Source: జాతీయ | 3 Dec 2008 | 9:17 am బాధించి వుంటే క్షమించండి: అచ్యుతానందన్తన మాటలు బాధ పెట్టివుంటే క్షమించాల్సిందిగా మేజర్ సందీప్ కుటుంబ సభ్యులను కేరళ ముఖ్యమంత్రి కె.అచ్యుతానందన్ విజ్ఞప్తి చేశారు. మేజర్ సందీప్ లేకుంటే.. అతని ఇంటికి 'కుక్క'లు కూడా వెళ్లవని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించి, సరికొత్త వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 3 Dec 2008 | 8:10 am ఈనెల 12న తెలంగాణా ప్రాంత బంద్తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని ఆ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయ సంఘాలు ఈనెల 12వ తేదీన తెలంగాణ ప్రాంత బంద్‌కు పిలుపునిచ్చాయి. దానికి ముందు ఐదో తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద అధ్యాపకులు, విద్యార్థులు సామూహిక నిరాహారదీక్షలు చేపడుతారు.Source: ఏపీ న్యూస్ | 3 Dec 2008 | 7:33 am భారత్ అదుపులో పాక్ మత్స్యకారులుపాకిస్థాన్కు చెందిన ఏడుగురు అనుమానాస్పద మత్స్యకారులను భారత కోస్తాతీర గస్తీ దళం (కోస్ట్‌గార్డు) మంగళవారం అదుపులోకి తీసుకుంది. అరేబియా సముద్రంలోని భారత సముద్ర మార్గంలోకి హద్దుమీరి ప్రవేశించడంతో వీరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారుSource: జాతీయ | 3 Dec 2008 | 6:59 am న్యూఢిల్లీకి చేరుకున్న కండోలిజా రైస్అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ బుధవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆమె ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో పాటు.. కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం కానున్నారు.Source: జాతీయ | 3 Dec 2008 | 6:41 am సైనిక చర్యను తోసిపుచ్చలేం: ప్రణబ్ ముఖర్జీపాకిస్థాన్లోని తీవ్రవాద స్థావరాలపై సైనిక చర్యను తోసిపుచ్చలేమని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. అయితే తమ డిమాండ్లపై పాకిస్థాన్ స్పందించే తీరును బట్టి ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెపుతుందని ఆయన తేల్చి చెప్పారు.Source: జాతీయ | 3 Dec 2008 | 6:30 am కిల్ మి ప్లీజ్.. లేదా మావాళ్లను చంపేస్తారు: కసబ్ముంబై మారణహోమంలో పోలీసులకు దొరికిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసమ్‌ను ఇంటరాగేట్ చేసే కొద్ది ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్న చిన్న దొంగతనాలు చేసే తాను.. తన కెరీర్ బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే ఉగ్రవాదంలో చేరినట్టు చెప్పాడు.Source: జాతీయ | 3 Dec 2008 | 5:33 am ముంబైకు వచ్చిన ఉగ్రవాదులు పది మందే: గఫూర్దేశ వాణిజ్య రాజధానిలో విధ్వంసం సృష్టించేందుకు ముంబైకు పది మంది ఉగ్రవాదులు మాత్రమే వచ్చారని మహానగర పోలీసు కమిషనర్ హాసన్ గఫూర్ స్పష్టం చేశారు. ముంబైలో మారణహోమం సృష్టించేందుకు 15 మంది ఉగ్రవాదులు వచ్చినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.Source: జాతీయ | 3 Dec 2008 | 5:14 am డిసెంబరు 03, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 శ్రీకృష్ణ లీలలు 15:00 ప్రేమ మందిరంSource: Yahoo! Telugu: Entertainment | 3 Dec 2008 | 3:07 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 3 Dec 2008 | 3:06 am రోడ్‌షోలకు చట్టబద్ద నిర్వచనం లేదు : ప్రరాపారోడ్ షోకు ఎలాంటి చట్టబద్ధమైన నిర్వచనం లేదని, వీటిని అడ్డుకోవాలన్న నిర్ణయం రాజ్యాంగం ప్రతిపాదించిన హక్కుల్ని తొసిపుచ్చినట్లవుతుందని ప్రజారాజ్యం పార్టీ సోమవారం హైకోర్టులో కౌంటరు దాఖలు చేసింది. రోడ్‌షోలు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ... అభిప్రాయ సంస్థ దాఖలు చేసిన పిటీషన్‌పై కోర్టు గత నెల11వ తేదీన విచారణ చేపట్టి స్టే విధిస్తూ రాజకీయ పార్టీలు కౌంటరు దాఖలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందిSource: ఏపీ న్యూస్ | 3 Dec 2008 | 2:46 am ఉన్నికృష్ణన్ తండ్రికి క్షమాపణ చెప్పను..అచ్యుతానందన్ముంబైలో ఉగ్రవాదులపై తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాడి వీరమరణం చెందిన ఉన్నికృష్ణన్ కుటుంబానుద్దేశించి తాను అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కేరళ ముఖ్యమంత్రి స్పష్టం చేశారుSource: ఏపీ న్యూస్ | 2 Dec 2008 | 3:13 pm ఆదుకోమంటున్న అన్నదాతలుపశ్చిమ గోదావరి జిల్లాలో వరి సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నారు పోసిన నాటినుంచి కుప్ప వేసే వరకూ ప్రకృతి, ప్రభుత్వం చిన్నచూపు చూశాయి. వరినారు పోసేందుకు సరైన సమయంలో విత్తనాలు లభ్యంకాకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు.Source: ఏపీ న్యూస్ | 2 Dec 2008 | 2:29 pm భారత్--నేపాల్ సరిహద్దులో భూకంపంసిక్కిం రాష్ట్రంవద్ద భారత్-నేపాల్ సరిహద్దులో మంగళవారం ఉదయం గం 10.42 నిమిషాలకు భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేలు పై 4.2 గా నమోదైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారుSource: జాతీయ | 2 Dec 2008 | 1:08 pm వచ్చే ఎన్నికల్లో తెరాసతో పొత్తు కల్ల--వై.యస్రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కాంగ్రెస్ ఎట్టిపరిస్థితుల్లోను పొత్తు పెట్టుకోదని రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వై.యస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. మేము ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పేదలకు ఉపయోగపడేదిగాSource: ఏపీ న్యూస్ | 2 Dec 2008 | 12:20 pm
|