|
ఎంకే రాజీనామాను తిరస్కరించిన ప్రధానిముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన ఘాతుకం దేశ రాజకీయాల్లో పెను సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే ఈ పేలుళ్లకు నైతిక బాధ్యత వహిస్తూ.. కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ రాజీనామా చేసిన విషయం తెల్సిందే. అదేకోవలో జాతీయ భద్రతా సలహాదారు ఎంకే.నారాయణన్ కూడా తన రాజీనామా చేశారు. ఈ పేలుళ్ళలో కేంద్ర నిఘా వర్గాల వైఫల్యం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.Source: జాతీయ | 30 Nov 2008 | 12:09 pm ఖమ్మంలో జోరుగా లంక పొగాకు సాగుఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో లంక పొగాకు సాగు సాగుతోంది. ఈ పంటకు గత ఏడాది మంచి గిట్టుబాటు ధర లభించడంతో ఇక్కడి రైతులే కాకుండా.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పొగాకు రైతులు ఇక్కడకు వచ్చిన ఈ పంటను సాగుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 30 Nov 2008 | 11:22 am పూర్తికాని కరీంనగర్ రింగ్ రోడ్డు నిర్మాణంకరీంనగర్ జిల్లా మథని నియోజకవర్గంలో 90 శాతం మేరకు గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. ఈప్రాంతాలకు సరైన రోడ్డు సౌకర్యాలు కల్పించాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో అప్పటి పాలకులు రింగ్ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డును నిర్మించి ఎన్నో ఏళ్లు గడిచి పోయింది. ఈ రోడ్డును సజావుగా పూర్తిచేయాలని స్థానికులు మొరపెట్టుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 30 Nov 2008 | 11:21 am కారంపూడిలో వైభవంగా వీర ఆరాధనోత్సవాలుచారిత్రక ఆధారాల ప్రకారం పల్నాటి యుద్ధం 11వ శతాబ్దంలో జరిగినట్టు ఆధారాలు చెపుతున్నాయి. నాగమ్మకు, బ్రహ్మనాయుడికి మధ్య జరిగిన యుద్ధంలో బ్రహ్మనాయుడు విజయం సాధించారు. ఈ యుద్ధంలో వీరమరణం పొందిన 60 మందికి పిండప్రదానాలను పెట్టేందుకుగాను ఏడాదిలో ఒకరోజును ఎంపిక చేస్తారు.Source: ఏపీ న్యూస్ | 30 Nov 2008 | 11:19 am ఫలించిన కడప వాసుల 'ప్రాజెక్టు' కలలుకడప జిల్లాలో ఉన్న పలు దిర్భిక్ష ప్రాంతాల్లో లక్కిరెడ్డిపల్లి ఒకటి. ఈ మండలంలో ఎన్నో ఏళ్ళ క్రితం శంకుస్థాపనకు నోచుకున్న సాగునీటి ప్రాజెక్టు వెలిగల్లు దీని నిర్మాణం ఎపుడో పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ.. గత తొమ్మిదేళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొంది.Source: ఏపీ న్యూస్ | 30 Nov 2008 | 11:17 am ఉగ్రవాదుల నుంచి తప్పించుకున్న రాజధాని వాసిఉగ్రవాదుల చెర నుంచి హైదరాబాద్ వాసి సురక్షితంగా బయటపడిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రా బ్యాంకులో ప్రధాన నిర్వహణాధికారి (జనరల్ మేనేజర్)గా పని చేసే ఎస్.సూర్యనారాయణ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ఒక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ముంబైకు వెళ్లి తాజ్ హెరిటేజ్ హోటల్‌లో దిగారు.Source: ఏపీ న్యూస్ | 30 Nov 2008 | 11:16 am నాలుగోసారి బాక్సింగ్ ఛాంపియన్‌గా మేరికాంప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ కిరీటాన్ని భారత్‌కు చెందిన మేరికాం నాలుగో పర్యాయం దక్కించుకుంది. ఫైనల్లో రుమేనియాకు చెందిన స్టెలుటా డ్యూటాపై 7-1తో విజయం సాధించిన మేరికాం ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన మహిళా బాక్సర్‌గా అవతరించింది.Source: Yahoo! Telugu: News | 30 Nov 2008 | 9:46 am పాటిల్ స్థానంలో కొత్త హోం మంత్రిగా చిదంబరంఇప్పటివరకు ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం దేశ కొత్త హోం మంత్రిగా శివరాజ్ పాటిల్ స్థానంలో నియమితులయ్యారు. చిదంబరం ఆధీనంలోని ఆర్థిక శాఖను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వయంగా తన వద్దనే ఉంచుకున్నారు.Source: Yahoo! Telugu: News | 30 Nov 2008 | 9:29 am రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలురాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమయ్యాయి. కాగా, ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేసేందుకు సభా వ్యవహారాల సంఘం స్పీకర్ కార్యాలయంలో సమావేశమైంది.Source: ఏపీ న్యూస్ | 30 Nov 2008 | 9:19 am ప్రజల దృష్టికి ఎల్లంపల్లి అవకతవకలుఎల్లంపల్లి ప్రాజెక్టులో అవకతవకలను ప్రజల దృష్టికి తీసుకు వెళుతామని ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్ యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. విధానసభ సమావేశాల తర్వాత కమిటీ సమావేశాన్ని నిర్వహించి, ఈ అవకతవకలను ప్రజల ముందుకు తీసుకు వస్తామన్నారు.Source: Yahoo! Telugu: News | 30 Nov 2008 | 9:14 am ఆరోగ్యమే మహాభాగ్యం: ముఖ్యమంత్రి వైఎస్'ఆరోగ్యమే మహాభాగ్యం' అన్నారు మన పెద్దలు. ఈ నానుడికి ఏమాత్రం తీసిపోకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేకంగా వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం టెన్‌కే (10కె) రన్ (పరుగు పందెం)ను ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 30 Nov 2008 | 9:08 am శాసనసభ సమావేశాలకు గట్టి భద్రత ఏర్పాట్లుగట్టి భద్రత మధ్య శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ముంబయిపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శానససభా ప్రాంగణంలోనూ, పరిసరాల్లోనూ గస్తీలు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు.Source: Yahoo! Telugu: News | 30 Nov 2008 | 8:55 am కేంద్ర హోం మంత్రిగా పి.చిదంబరంకేంద్ర హోం మంత్రిగా పళనిస్వామి చిదంబరం నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన నిర్వహిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ బాధ్యతలను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అప్పగించనున్నారు.Source: జాతీయ | 30 Nov 2008 | 8:52 am ముంబై స్టాక్ మార్కెట్ భవనాన్ని పేల్చేస్తాం: డిఎంవాణిజ్య రాజధాని ముంబైలోని దేశీయ మార్కెట్ భవనాన్ని పేల్చేస్తామని దక్కన్ ముజాహిదీన్ (డిఎం) తీవ్రవాద సంస్థ తాజాగా మరో ఈమెయిల్ బెదిరింపులు చేసింది.Source: జాతీయ | 30 Nov 2008 | 8:33 am మంత్రి పదవికి రాజీనామా చేసిన శివరాజ్ పాటిల్కేంద్రమంత్రి శివరాజ్ పాటిల్ ఎట్టకేలకు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముంబై మారణహోమానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు తన రాజీనామా లేఖను ఆదివారం పంపారు. అయితే.. దీనిపై ప్రధాని ఆమోదముద్ర వేయాల్సి వుంది.Source: జాతీయ | 30 Nov 2008 | 8:24 am హోం మంత్రి పదవికి పాటిల్ రాజీనామాముంబయిలో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో హోం మంత్రి పదవికి శివరాజ్ పాటిల్ రాజీనామా చేశారు. సర్వత్రా విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ముందుగా ఊహించినట్టే ఆయన తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఆదివారం ఉదయం సమర్పించారు.Source: Yahoo! Telugu: News | 30 Nov 2008 | 7:43 am పాటిల్, దేశ్‌ముఖ్‌లపై కేంద్ర మంత్రుల విమర్శలుముంబయిలో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో హోం మంత్రి శివరాజ్ పాటిల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్‌లపై కేంద్ర మంత్రులు మండిపడ్డారు. ఢిల్లీలో శనివారం రాత్రి జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుందని పార్టీ...Source: Yahoo! Telugu: News | 30 Nov 2008 | 6:45 am వైజయంతి మాలకు అక్కినేని పౌండేషన్ అవార్డుఅలనాటి మేటినటి, పద్మశ్రీ వైజయంతిమాల బాలికి అక్కినేని నాగేశ్వరరావు అవార్డును అందించనున్నారు. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరపున అందించే ఈ అవార్డు కింద ఆమెకు 2009 జనవరి 10న జుబ్లీహాల్‌లో జరిగే కార్యక్రమంలో రూ. 4లక్షల నగదు, జ్ఞాపిక అందించనున్నారు.Source: Yahoo! Telugu: News | 30 Nov 2008 | 6:07 am ఈ వారంSource: Yahoo! Telugu: News | 30 Nov 2008 | 5:57 am మీ రోజుSource: Yahoo! Telugu: News | 30 Nov 2008 | 5:52 am ఆంధ్ర- తమిళనాడు రంజీకి వాన బ్రేక్విజయవాడలో తమిళనాడు- ఆంధ్ర జట్ల మధ్య జరగాల్సిన రంజీ సూపర్ లీగ్ మ్యాచ్‌కు వర్షంతో అంతరాయం ఏర్పడింది. గ్రూపులో కర్ణాటకకన్నా ఓ పాయింట్ వెనుకబడి ఉన్న తమిళనాడు ఈ మ్యాచ్ ద్వారా అగ్రస్థానానికి ఎగబాకాలని ఆశిస్తుండగా...Source: Yahoo! Telugu: News | 30 Nov 2008 | 5:47 am రాజీనామాకు సిద్ధపడిన హోంమంత్రి పాటిల్?ముంబై ఘాతుకం తర్వాత కేంద్ర హోమంత్రి శివరాజ్ పాటిల్ ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముంబై మారణహోమం అనంతరం కాంగ్రెస్ అత్యున్నత విధాయక మండలి (సీడబ్ల్యూసి) శనివారం అత్యవసరంగా సమావేశమైంది.Source: జాతీయ | 30 Nov 2008 | 5:11 am ఉగ్రవాదులకు ముంబై స్థానికుల సాయంముంబై నగరవాసులు కొందరు తమకు సహాయం చేశారని ముంబై దాడుల సందర్భంగా పోలీసులకు పట్టుబడిన పాక్ ఉగ్రవాది అజమ్ అమీర్ కసాబ్ వెల్లడించాడు. గత మూడు రోజులుగా ఉగ్రవాద దాడితో కంపించి పోతున్న ముంబై నగరానికి చెందిన కనీసం అయిదుమంది వ్యక్తులు తమకు సహాయం చేశారని కసాబ్ తెలిపాడు.Source: జాతీయ | 30 Nov 2008 | 12:45 am అఖిలపక్ష సమావేశానికి ప్రధాని పిలుపుదేశాన్ని నివ్వెరపర్చిన ముంబై ఉగ్రవాద దాడుల నిరోధక చర్యలు ముగిసిన తర్వాత ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను మరింత కఠినతరం చేయడంపై ఏకాభిప్రాయ సాధనకోసం, ఫెడరల్ ఏజెన్సీ స్థాపన కోసం ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.Source: జాతీయ | 29 Nov 2008 | 9:44 pm ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపండి: సిడబ్ల్యూసియుపిఎ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన శక్తినంతా వినియోగించి ఉగ్రవాద భూతాన్ని నిర్మూలించాలని కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కమిటీ తీర్మానించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదంపై కఠినవైఖరి అవలంబిస్తామని ప్రధాని మన్మోహన్ శనివారం శపథం చేశారు.Source: జాతీయ | 29 Nov 2008 | 9:04 pm త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం రక్షణ శాఖ కార్యదర్శి విజయ్ సింగ్, త్రివిధ బలగాల అధిపతులు, ఇంటెలిజన్స్ ఛీప్‌తో సమావేశమై ముంబై దాడుల ప్రభావం గురించి చర్చించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను ఎలా నిరోధించగలం అనే అంశంపై కూడా ప్రధాని కూలంకషంగా చర్చలు జరిపారు.Source: జాతీయ | 29 Nov 2008 | 8:42 pm పట్టుబడ్డ ఉగ్రవాదే ఏటీఎస్ ఛీఫ్ హంతకుడుమూడు రోజులుగా ముంబైలో సాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక పోరులో పట్టుబడిన ఏకైక ఉగ్రవాది మహమ్మద్ అజ్మల్ అమిన్ కసాబ్ బుధవారం రాత్రి దాడి మొదలైన కొద్ది సేపటికే ఏటిఎస్ ఛీఫ్ హేమంత్ కర్‌కారేని, ఎన్‌కౌంటర్ నిపుణుడు విజయ్ సలాస్కర్, అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టేలను కాల్చి చంపేశాడని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి.Source: జాతీయ | 29 Nov 2008 | 6:54 pm
|