ముంబై పేలుళ్ళలో పాక్ హస్తం: ప్రణబ్

ముంబై మారణహోమం వెనుక పాకిస్థాన్‌కు చెందిన కొన్ని దుష్టశక్తుల హస్తం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సందేహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ముంబై నగరంపై జరిగిన దాడులకు సంబంధించి అందిన ప్రాథమిక సమాచారంలో పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు తెలిసిందన్నారు.
Source: జాతీయ | 28 Nov 2008 | 10:39 am

భారత్‌కు రానున్న పాక్ ఐఎస్ఐ చీఫ్!

ముంబై వరుస పేలుళ్ళపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు పాకిస్థాన్‌ గూఢాచార సంస్థ ఐఎస్ఐ అధిపతి భారత్‌కు రానున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కోరిక మేరకు ఆయన్ను పాకిస్థాన్ ప్రభుత్వం న్యూఢిల్లీకి పంపనుంది.
Source: జాతీయ | 28 Nov 2008 | 10:23 am

ముంబైలో న్యూస్ ఛానళ్ళ ప్రసారాలు బంద్

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఉగ్రవాదుల ఏరివేతకు సాగుతున్న పోరు వల్ల స్థానికులు భయభ్రాంతులకు గురికాకుండా ఉండేందుకు న్యూస్ ఛానళ్ళ ప్రసారాలను బంద్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
Source: జాతీయ | 28 Nov 2008 | 10:17 am

పేలుళ్ళ వెనుక లష్కరే-ఇ-తోయిబా హస్తం!

ముంబై మారణహోమం వెనుక లష్కరే-ఇ-తోయిబా సంస్థకు చెందిన తీవ్రవాదులు హస్తం ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. పథకం ప్రకారమే ఈ సంస్థ ముంబైలో దాడులకు పాల్పడిందని భద్రతాధికారులు వెల్లడించారు. పేలుళ్ళ అనంతరం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రొవియన్స్‌లో ఈ సంస్థకు చెందిన ముగ్గురు ఆత్మాహుతి దళ సభ్యులను అరెస్టు చేసినట్టు తెలిపారు.
Source: జాతీయ | 28 Nov 2008 | 9:54 am

ఎన్‌ఎస్‌జి కమెండోల అదుపులో తాజ్ హోటల్

నక్షత్ర హోటల్ తాజ్‌ను ఎట్టకేలకు ఎన్‌ఎస్‌జి కమెండోలు తమ అదుపులోకి తెచ్చుకున్నారు. కరుడుగట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇక్కడ ఉగ్రవాదులు ఉపయోగించిన ఏడు మెషిన్‌గన్‌లు, నాలుగు చైనా కంపెనీ తయారు చేసిన గ్రెనేడ్లను కమెండోలు స్వాధీనం చేసుకున్నారు.
Source: జాతీయ | 28 Nov 2008 | 9:25 am

ఒబెరాయ్ హోటల్‌ నుంచి 93 మందికి విముక్తి

ఉగ్రవాదుల చెరలోని ఒబెరాయ్ నక్షత్ర హోటల్‌ నుంచి 93 మందికి 37 గంటల తర్వాత విముక్తి లభించింది. ఉగ్రవాదులతో హోరాహోరీగా పోరాడిన ఎన్‌ఎస్‌జి కమెండోలు.. ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీలలో కొంతమందిని సురక్షితంగా రక్షించారు.
Source: జాతీయ | 28 Nov 2008 | 9:22 am

తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చిన పాక్ ఆర్మీ!

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించేందుకు పాకిస్థాన్ తన వంతు సాయం చేసినట్టు ఆర్మీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయం ఇంటలిజెన్స్ వర్గాలు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు వినికిడి.
Source: జాతీయ | 28 Nov 2008 | 7:52 am

ఐరాస తీర్పును ఉల్లంఘించిన పాక్: మోడీ

ఐక్యరాజ్య సమితి తీర్పు (యూఎన్ కోడ్)ను పాకిస్థాన్ ఉల్లంఘించిందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. ఉగ్రవాదుల బాంబు దాడులకు మారణహోమంగా మారిన ముంబైను ఆయన గురువారం సందర్శించి, క్షతగాత్రులను పరామర్శించారు.
Source: జాతీయ | 28 Nov 2008 | 7:08 am

ఒబెరాయ్‌లో కొనసాగుతున్న హోరాహోరీ పోరు

తీవ్రవాదుల గుప్పెట్లో ఉన్న ఒబెరాయ్ హోటల్‌లో ఎన్‌ఎస్‌జి కమాండోలకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఈ హోటల్‌లో బందీలుగా ఉన్న వారిని సురక్షితంగా రక్షిస్తున్నారు.
Source: జాతీయ | 28 Nov 2008 | 6:20 am

నారిమన్ హౌస్‌లో 'రెడ్ ఆపరేష్'

నారిమన్ హౌస్‌లో ఎన్‌ఎస్‌జి బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. తీవ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న విదేశీ పౌరులను సురక్షితంగా రక్షించేందుకు భారత ఆర్మీ శాయశక్తులా కృషి చేస్తోంది. అందుకోసం బందీలకు ఎలాంటి హాని కలుగకుండా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా... రెడ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.
Source: జాతీయ | 28 Nov 2008 | 5:54 am