ఆర్థిక సంక్షోభానికి వాజ్‌పేయి కారణం: గోవిందాచార్య

ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యానికి మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి‌ ప్రధాన కారణమని భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానకార్యదర్శి కేఎన్.గోవిందాచార్య ఆరోపించారు. దీనిపై ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గత ఎన్డీయే ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్లే దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుని పోయిందని ఆయన విమర్శించారు.
Source: జాతీయ | 25 Nov 2008 | 11:54 am

రోడ్‌ షోలపై స్టే విధించిన రాష్ట్ర హైకోర్టు

వివిధ రాజకీయ పార్టీలు నిర్వహించే రోడ్‌షోలపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఇటీవల నిర్వహించిన రోడ్‌షోలలో 11 మంది చనిపోయిన విషయం తెల్సిందే. దీని ప్రధానాంశంగా చేసుకుని కడపకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్నిదాఖలు చేసింది.
Source: ఏపీ న్యూస్ | 25 Nov 2008 | 11:34 am

ఒలింపిక్‌ పోటీల్లో చెస్‌ను ప్రవేశపెట్టండి: ఆనంద్

ఒలింపిక్ పోటీల్లో చెస్‌ను ఓ క్రీడాంశంగా ప్రవేశపెట్టాలని ప్రపంచ ఛాంపియన్ విశ్వనాధన్ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో చెస్‌ను ఒలింపిక్ క్రీడగా ప్రవేశపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Source: Yahoo! Telugu: News | 25 Nov 2008 | 11:17 am

మరోమారు రెచ్చిపోయిన మంత్రి మారెప్ప

రాష్ట్ర మార్కెటింగ్ శాఖామంత్రి మూలింటి మారెప్ప మరోమారు రెచ్చిపోయారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఇస్తే.. బిక్షగాడి చేతిలో భగవద్గీతను పెట్టడమేనని సంచలన వ్యాఖ్యలు చేసిన మారెప్ప.. తాజాగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (డీఎస్)పై నిప్పులు చెరిగారు.
Source: ఏపీ న్యూస్ | 25 Nov 2008 | 11:06 am

మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 208 పాయింట్ల పతనం

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) మంగళవారం నష్టాల బాటలో పయనించింది. అమెరికా మార్కెట్‌ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో 258 పాయింట్ల వృద్ధి చెంది 9,161 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, తదనంతర లావాదేవీల్లో 9,183 పాయింట్ల గరిష్ట స్థాయిని
Source: Yahoo! Telugu: News | 25 Nov 2008 | 11:04 am

తెరమీదకు తండ్రి వివాదం: తివారీకి కోర్టు పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎన్.డి. తివారీని తన తండ్రి అని పేర్కొంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేందుకు తమ ముందు హాజరు కావాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి తివారీని ఆదేశించారు. అలాగే ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్‌ను...
Source: Yahoo! Telugu: News | 25 Nov 2008 | 11:04 am

గౌరవ వేతనం పెంపుకు ప్రభుత్వ సుముఖత

రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనం పెంచేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జేసీ దివాకరరెడ్డి పేర్కొన్నారు. అలాగే కౌన్సిలర్లకు గౌరవ వేతనం ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని...
Source: Yahoo! Telugu: News | 25 Nov 2008 | 11:03 am

టీడీపీతో పొత్తుకు సీపీఎం సై: రాఘవులు

తెలుగుదేశంతో పొత్తుకు సీపీఎం సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు పేర్కొన్నారు. ఈ నెలాఖరున జరగనున్న పొలిట్‌బ్యూరో అనంతరం టీడీపీతో పొత్తు అంశాన్ని అధికారికంగా ప్రకటించనున్నామని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 25 Nov 2008 | 11:02 am

దేశానికి అద్వానీ యోగ్యుడు కాదు: గోవిందాచార్య

భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌కే అద్వానీ దేశానికి యోగ్యుడు కాదని ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి గోవిందాచార్య వ్యాఖ్యానించారు. బీజేపీ వరకు అయితే ఎల్‌కే అద్వానీ ఉత్తమమేన వ్యక్తేనని, పార్టీలో సమర్థులు లేకపోవడం వలనే
Source: Yahoo! Telugu: News | 25 Nov 2008 | 10:40 am

రాజకీయ పార్టీల నేతల రోడ్‌షోలకు బ్రేక్!

ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల నేతలు నిర్వహించే రోడ్‌షోలు ఎక్కువయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్, తెదేపా తరపున నందమూరి సినీ హీరోలు రోడ్‌షోలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షిస్తూ.. పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 25 Nov 2008 | 10:33 am

రాయచోటి మార్కెట్ యార్డులో కాల్పులు

రైతు ప్రోత్సాహక ఉత్సావాల్లో భాగంగా మంగళవారం కడప జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య ఘర్షణ చెలరేగింది. రుణ మాఫీ పథకం వర్తించని రైతులకు రూ.5000 చొప్పున ప్రోత్సాహక బహుమతి అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశించిన విషయం తెల్సిందే. ఇందులో భాగంగా కడప జిల్లా రాయచోటి మార్కెట్ యార్డులో ప్రోత్సాహక నగదును పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు.
Source: ఏపీ న్యూస్ | 25 Nov 2008 | 10:22 am

తెదేపా-వామపక్షాల పొత్తు విచారకరం: ఉండవల్లి

తెలుగుదేశం పార్టీతో వామపక్షాల మధ్య పొత్తు పెట్టుకోవడం పట్ల తీవ్రవిచారం వ్యక్తం చేస్తున్నట్టు రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కమార్ అన్నారు. ఆయన మంగళవారం తెదేపా, వామపక్షాల పొత్తుకు నిరసనగా బహీర్‌బాగ్‌ కాల్పుల్లో మరణించిన అమరవీరుల ఘాట్‌ను సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Nov 2008 | 10:11 am

ప్రసాద్ ల్యాబ్స్‌లో లైఫ్‌స్టైల్ లోగో ఆవిష్కరణ

ముప్పలనేని శివ దర్శకత్వంలో ఓరుగంటి మధుసూధనరెడ్డి సమర్పణలో రూపొందుతున్న చిత్రం "లైఫ్‌స్టైల్". శ్రీమాధవ్ పట్నాయక్ నిర్మిస్తున్న ఈ చిత్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది
Source: Yahoo! Telugu: Entertainment | 25 Nov 2008 | 9:57 am

వైఎస్‌ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెడుతాం: బాబు

అవినీతే ఊపిరిగా చేసుకుని పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిని ప్రజాకోర్టులో దోషిగా నిలబెడుతామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. విజయనగరంలో తెదేపా ఆధ్వర్యంలో జరుగుతున్న మహాధర్నాలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 25 Nov 2008 | 9:56 am

ఛార్మి కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం

లేడి ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో ఛార్మి హీరోయిన్‌గా రూపొందుతోన్న చిత్ర షూటింగ్ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రేమ్స్ ఎంటర్‌టైన్‌‍మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్.రాజశేఖర్ నిర్మిస్తున్నారు. కె.ఆర్.కె.పవన్ దర్శకుడు.
Source: Yahoo! Telugu: News | 25 Nov 2008 | 9:47 am

ఛార్మి కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం

లేడి ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో ఛార్మి హీరోయిన్‌గా రూపొందుతోన్న చిత్ర షూటింగ్ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రేమ్స్ ఎంటర్‌టైన్‌‍మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్.రాజశేఖర్ నిర్మిస్తున్నారు. కె.ఆర్.కె.పవన్ దర్శకుడు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Nov 2008 | 9:47 am

అవినీతి వల్లే వోక్స్ వ్యాగన్ రాలేదు: బాబు

ప్రభుత్వ అవినీతి కారణంగానే విశాఖపట్నంకు రావాల్సిన ఓక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ రాకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అధికార ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఈ సందర్భంగా...
Source: Yahoo! Telugu: News | 25 Nov 2008 | 9:31 am

మాజీ ఫుట్‌బాల్ గోల్ కీపర్ తంగరాజ్ మృతి

భారత మాజీ ఫుట్‌బాల్ గోల్‌ కీపర్ పీటర్ తంగరాజ్ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. మృతి చెందేనాటికి ఆయనకు 74 ఏళ్లు. తంగరాజ్‌కు భార్య, ఓ కుమారుడుతో పాటు ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Nov 2008 | 9:29 am

భారత్‌లో అణు రియాక్టర్ల నిర్మాణంపై రష్యా దృష్టి

భారత్‌లో మరిన్ని అణు రియాక్టర్లు నిర్మించేందుకు రష్యా సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. అణు ఇంధన సరఫరా గ్రూపు (ఎన్ఎస్‌జీ) నుంచి ఇటీవల అనుమతులు పొందడంతో ఇతర దేశాలు భారత్‌లో అణు రియాక్టర్లు నిర్మించేందుకు మార్గం సుగమం
Source: Yahoo! Telugu: News | 25 Nov 2008 | 9:26 am

సోన్‌పుర్ మేళాలో 'మంత్రి లాలూ' ఆట బొమ్మలు

సాధారణంగా పిల్లలకు ఆట బొమ్మలంటే ఎంతో ఇష్టం. అది కూడా రకరకాల వింత బొమ్మలంటే మరీ ఇష్టం. ఏ బజారులో చూసిన రోజురోజుకు కొత్త బొమ్మలు ప్రత్యక్షం అవుతున్నాయి. రకరకాల ఆట బొమ్మలు రావడం విశేషమేమి కాదు. ఇక్కడ మనం చెప్పుకోవలసింది ఇంకొకటి ఉంది. అదేంటంటే.....
Source: జాతీయ | 25 Nov 2008 | 9:17 am

నేడు ఇండో - పాక్ కార్యదర్శుల భేటి

భారత్ - పాకిస్థాన్ హోంశాఖ కార్యదర్శుల స్థాయి సమావేశం మంగళవారం జరుగనుంది. ఇందులో ఇరుదేశాలు పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ చర్చలు గత నాలుగేళ్ళుగా జరుగుతున్నాయని మంగళవారం జరగబోయే చర్చలు ఐదోసారని ఆ శాఖ అధికారులు తెలిపారు.
Source: జాతీయ | 25 Nov 2008 | 8:53 am

నిందితులతో సంబంధం లేదు: ప్రవీణ్ తొగాడియా

మాలేగావ్ బాంబు పేలుళ్ళ కేసు 'తీగ లాగితే డొంక' కదిలిన చందంగా మారింది. ఈ పేలుళ్లకు హిందూ ఉగ్రవాదులకు సంబంధాలు ఉన్నట్టు మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) పేర్కొంటోంది. ఇందుకు సంబంధించి సాధ్వి ప్రజ్ఞాసింగ్‌తో పాటు.. లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్‌ను పోలీసులు ఏటీఎస్ అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 25 Nov 2008 | 5:58 am

నిద్రమత్తు వీడిన యూపీఏ ప్రభుత్వం: అద్వానీ

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ పాలన గడువు చివరి దశకు చేరుకున్నాక గానీ ఉగ్రవాదం పట్ల యూపీఏ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడలేదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఆరోపించారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు తమ ఇష్టానుసారంగా పెట్రేగి పోతున్నా పట్టించుకోని ప్రధాని మన్మోహన్ సింగ్ ఇప్పటికి కళ్లు తెరిచారని ఆయన విమర్శించారు.
Source: జాతీయ | 25 Nov 2008 | 5:52 am

"సల్మాన్ ఖాన్" బాటలో లారాదత్త..!

బాలీవుడ్‌ అగ్రతార లారాదత్త ఈ మధ్య చాలా బిజీబిజీగా ఉంటోందట. అంతేకాదు.. ఆమెకు వస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకునేందుకు ఆచీతూచీ వ్యవహరిస్తోందట. స్క్రిఫ్ట్ బాగుంటేనే ఆ సినిమాలో నటించేందుకు అంగీకరిస్తుందని బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం.
Source: వినోదం | 25 Nov 2008 | 5:42 am

వైఎస్ రక్త చరిత్ర వివరించన్కర్లేదు: ప్రజారాజ్యం

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి రక్తచరిత్రను ప్రత్యేకంగా వివరించనక్కర లేదని ప్రజారాజ్యం పార్టీ ఘాటుగా ఆరోపించింది. దీనిపై ఆ పార్టీ నేతలైన సి.రామచంద్రయ్య, కోటగిరి విద్యాధరరావులు సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం గుప్పించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Nov 2008 | 5:37 am

నేడు హస్తినాపురానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణా అంశం ఇప్పటికే రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్ ఢిల్లీ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Source: ఏపీ న్యూస్ | 25 Nov 2008 | 5:26 am

సీరియల్ చూడటం ఆపదు

"తిండైనా మానగలను కానీ పేకాట ఆడనిదే బతకలేను"...
Source: వినోదం | 25 Nov 2008 | 5:15 am

విరిగిపోతోందే తప్ప!

"ఎప్పుడూ మీరు ఇదే ఫ్యాన్‌ని రిపేర్‌కు తెస్తున్నారేంటి సార్...!" అడిగాడు ఎలక్ట్రీషియన్...
Source: వినోదం | 25 Nov 2008 | 5:13 am

నవంబరు 25, 2008 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి
Source: Yahoo! Telugu: Entertainment | 25 Nov 2008 | 3:29 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 25 Nov 2008 | 3:26 am

మారెప్ప నోట వైఎస్ మాట: టిడిపి ధ్వజం

ప్రత్యేక తెలంగాణాను ఇవ్వడమంటే బిచ్చగాడి చేతికి భగవద్గీత ఇవ్వడమే నంటూ రాష్ట్ర మంత్రి మారెప్ప వ్యాఖ్యానించడంపై తెలుగు దేశం పార్టీ మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి వైఎస్ హస్తముందని ఆరోపించింది. తన శిష్యులుగా చలామణి అవుతున్న మంత్రుల వెనుక వైఎస్ నిలబడి వారితో ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయిస్తున్నారని టిడీపీ ధ్వజమెత్తింది.
Source: ఏపీ న్యూస్ | 24 Nov 2008 | 10:31 pm

విచారణ పేరిట ఎటీఎస్ ఘాతుకాలు: ప్రాగ్యా

మాలెగావ్ పేలుళ్ల కేసులో విచారణ పేరిట ముంబై ఉగ్రవాద నిరోధక దళ పోలీసులు తనను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టడమే కాక అశ్లీల సీడీని చూడమని బలవంత పెట్టారని ఈ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వీ ప్రాగ్య మోకా కోర్టులో తెలిపారు. అంతే కాకుండా తనను నగ్నంగా బట్టలూడదీస్తామని, చంపుతామని ఎటీఎస్ పోలీసులు బెదిరించారని చెప్పారు.
Source: జాతీయ | 24 Nov 2008 | 7:30 pm

శ్రీలంక పరిస్థితిపై చర్చకు అఖిల పక్ష భేటీ

శ్రీలంక పరిస్థితిపై చర్చించేందుకు గాను మంగళవారం అఖిలపక్ష సమావేశానికి పిలుపు ఇచ్చినట్లుగా తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ప్రకటించారు. శ్రీలంక సమస్యకు మేలైన పరిష్కారం ఇవ్వడానికి అఖిల పక్ష భేటీ సమావేశం దోహదపడుతుందని ఈ సందర్భంగా కరుణానిధి పేర్కొన్నారు.
Source: జాతీయ | 24 Nov 2008 | 5:48 pm