|
సిక్ ఆఫ్ ది ఇయర్... మాంటెక్సింగ్ప్రణాళికా సంఘం అధ్యక్షుడు మాంటెక్ సింగ్‌కు 2008వ సంవత్సరానికిగాను లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సిక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానంచేశారు. ఆర్ధిక రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చిన దరిమిలా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.Source: జాతీయ | 24 Nov 2008 | 1:02 pm బిగ్ బి బాబాయ్ ప్రసాద్ శ్రీవాత్సవ్ కన్నుమూతప్రసిద్ధ సాహిత్యకారుడు, కవి డాక్టర్. హరివంశ్ రాయ్ బచ్చన్ సోదరుడు శారదా ప్రసాద్ శ్రీవాత్సవ్ (96) శనివారం రాత్రి బాబూపట్టి ప్రతాప్‌గఢ్‌లో దివంగతులైనారు. ఈయన మాజీ విదేశాంగమంత్రి రాజా దినేష్‌సింగ్‌కు ఆప్తమిత్రులు.Source: జాతీయ | 24 Nov 2008 | 1:02 pm పెట్రో ధరల తగ్గింపుపై విపక్షాల ధర్నాపెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... డిసెంబర్ 2వ తేదీన దేశ వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు చేపడుతామని వామపక్షాలు, తెలుగుదేశం, జేడీ (ఎస్) పార్టీలు హెచ్చరించాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోయినప్పటికీ, యూపీఏ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం లేదని విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించాయి.Source: జాతీయ | 24 Nov 2008 | 12:39 pm మత్స్యదర్శినిని ప్రారంభించిన వైఎస్రాష్ట్రంలోని మత్స్యకారులను ప్రోత్సహించేందుకుగాను ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రరాజధానిలో మత్స్యదర్శిని కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మత్స్యకారులు ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాల్సిందిగా వైఎస్ కోరారు.Source: ఏపీ న్యూస్ | 24 Nov 2008 | 12:35 pm తెదేపాతో పొత్తుకు సీపీఐ సై..!వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి సీపీఐ పోటీ చేయనుంది. ఇందులో భాగంగా... సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో తెదేపాతో సీపీఐ పొత్తు పెట్టుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆమోదం తెలిపింది. ఇకపోతే... తెదేపాతో చేతులు కలిపి వచ్చే ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహ్యాలపై ఈ సమావేశంలో సీపీఐ నేతలు చర్చలు జరిపారు.Source: ఏపీ న్యూస్ | 24 Nov 2008 | 12:23 pm హిమాలయాలకు వెళ్లిపోతా : ఉమా భారతిమధ్యప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ గనుక అధికారంలోకి వచ్చినట్లయితే తాను హిమాలయాలకు వెళ్ళిపోతానని ఉమా భారతి ప్రతినపూనారు. ఈ రాష్ట్రంలో ఏ ఇతర పార్టీ అధికారంలోకి వచ్చినా తాను సహిస్తాను గానీ, భాజపా మాత్రం అధికారంలోకి రాకూడదన్నదే తన అభిమతమని ఆమె స్పష్టం చేశారు.Source: జాతీయ | 24 Nov 2008 | 12:11 pm తీవ్రవాదంపై యూపీఏ మెతకవైఖరి: అద్వానీతీవ్రవాదంపై యూపీఏ ప్రభుత్వం మెతకవైఖరిని అవలంబిస్తుందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ప్రధాని అభ్యర్థి ఎల్.కె. అద్వానీ వ్యాఖ్యానించారు. యూపీఏ గద్దెనెక్కిన నాలుగు సంవత్సరాల్లో తీవ్రవాదాన్ని తుదిముట్టించే చర్యలపై నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని అద్వానీ ధ్వజమెత్తారు.Source: జాతీయ | 24 Nov 2008 | 11:57 am మోకా కోర్టుకు మాలేగావ్ నిందితులుమాలేగావ్ బాంబు పేలుళ్లలో నిందితులుగా పేర్కొంటున్న సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్‌తో పాటు మరో ఏడుగురు నిందితులను మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళానికి చెందిన (ఏటీఎస్) పోలీసులు మోకా కోర్టు ముందు హాజరు పరిచారు.Source: జాతీయ | 24 Nov 2008 | 11:27 am విద్వేషాలను రెచ్చగొట్టవద్దు : చంద్రబాబుప్రత్యేక తెలంగాణా రాష్ట్రం అంశంపై కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితిలు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాగ్నులను రెచ్చగొడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. ఈ అంశంపై ప్రజలను రెచ్చగొట్టటం మానాలని రెండు పార్టీలకు బాబు హితవు పలికారు...Source: ఏపీ న్యూస్ | 24 Nov 2008 | 10:49 am ప్రజాసేవ తప్ప... మాకు తొడగొట్టడం రాదు: వైఎస్సార్30 సంవత్సరాలుగా సినీరంగంలో కోట్లాను కోట్లు సంపాదించి ఒక్క గ్రామానికి కూడా మేలు చేయని ప్రరాపా అధినేతలా మాకు తొడగొట్టడం, మీసం తిప్పడం రాదని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలను ఆదుకోవడం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడటం తప్పనిస్తే... చిరంజీవిలా మాకు తొడగొట్టడం... మీసం తిప్పడం తెలియవని వైఎస్సార్ అన్నారు.Source: ఏపీ న్యూస్ | 24 Nov 2008 | 10:45 am రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలుబంగ్లాదేశ్, చైనాల మీదుగా వీస్తోన్న బలమైన తూర్పుగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో మరో మూడు, నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ విభాగం తెలియజేసింది.Source: ఏపీ న్యూస్ | 24 Nov 2008 | 10:27 am చత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన రీపోలింగ్చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భద్రతా కారణాల రీత్యా పోలింగ్ జరగని 33 స్టేషన్లలో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది. కాగా, మావోయిస్టుల ప్రభావం గల బస్తర్ డివిజన్‌లోని ఏడు నియోజక వర్గాలలోని 33 స్టేషన్లకు జరుగుతున్న ఈ రీపోలింగ్ కోసం... ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది.Source: జాతీయ | 24 Nov 2008 | 10:26 am "చిరు"పై వైఎస్సార్ విమర్శల వర్షంప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా, సోమవారం ఒంగోలు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ చిరంజీవిపై విమర్శల వర్షం కురిపించారు. రాజకీయాల్లో రాణించాలంటే ఇతరులకు సాయం చేసే గుణం ఉండాలని, అది చిరంజీవికి లేదంటూ వైఎస్సార్ చిరుపై విరుచుకుపడ్డారు...Source: ఏపీ న్యూస్ | 24 Nov 2008 | 10:25 am తమిళంలో కృష్ణవంశీ చందమామనవదీప్, కాజల్, శివబాలాజీ, సింధుమీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "చందమామ". క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నిర్దేశకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని సభాపతిSource: Yahoo! Telugu: Entertainment | 24 Nov 2008 | 10:22 am సమర్థుడు 80 శాతం షూటింగ్ పూర్తిరాజా, సంజన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "సమర్థుడు". ఈ సినిమాలో కృష్ణంరాజు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అర్జున్ దర్శకుడు. ఆకుల సురేష్, ఎం.వెంకటేశ్వరరెడ్డి నిర్మాతలు. ఇటీవల ఈ చిత్ర యూనిట్ బ్యాంకాక్‌లో పాటల చిత్రీకరణనుSource: Yahoo! Telugu: Entertainment | 24 Nov 2008 | 10:16 am బ్లేడ్ బాబ్జీ విజయోత్సవ వేడుకఅల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన "బ్లేడ్ బాబ్జీ' చిత్ర విజయోత్సవం శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఆర్ట్స్ గ్యాలరీలో జరిగింది. సత్యప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిప్రసాద్ దర్శకుడు. విజయోత్సవ సభలో నరేష్ మాట్లాడుతూ.. "అల్లరి", "సీమశాస్త్రి"Source: Yahoo! Telugu: Entertainment | 24 Nov 2008 | 10:11 am కమల్ హీరోగా ఓ మై గాడ్యోగా మాస్టర్ కమల్ హీరోగా "ఓ మై గాడ్" అనే చిత్రం రూపొందుతోంది. ఆయన ఈ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. వైట్ లోటస్ పతాకంపై సేతు మాధవన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గిరిధర్ గోపాల్ దర్శకుడు.Source: Yahoo! Telugu: Entertainment | 24 Nov 2008 | 9:56 am కింగ్ ఆడియో ఆవిష్కరణనాగార్జున, త్రిష, మమతా మోహన్‌దాస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "కింగ్". శ్రీనువైట్ల దర్శకుడు. శివప్రసాద్‌రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగింది.Source: Yahoo! Telugu: Entertainment | 24 Nov 2008 | 9:43 am ఇంతకీ ఆయన సొంత ఊరికి ఏం చేశారో? : చిరంజీవిపదే పదే తన సొంతఊరుకు ఏం చేశానని అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఇంతకీ ఆయన సొంత ఊరుకు ఏం చేశారో చెప్పాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రతి సవాలు విసిరారు. ప్రజా అంకిత యాత్రల సందర్భంగా తన చర్యలపై కాంగ్రెస్ నేతలు అతిగా స్పందిస్తున్నారని చిరంజీవి తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 24 Nov 2008 | 9:22 am రాష్ట్రపతి పదిరోజుల పర్యటన ప్రారంభంఇండోనేషియా, వియత్నాంలలో భారత రాష్ట్రపతి ప్రతిభా దేవీసింగ్ పాటిల్ పది రోజుల పర్యటన నేడు ప్రారంభమైంది. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఈ రోజు ఉదయం వియత్నాంలోని హో చి మిన్హ్, ఎర్‌స్ట్‌వైల్ సెయ్‌గాన్‌లలో పర్యటిస్తారు.Source: జాతీయ | 24 Nov 2008 | 8:04 am ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకున్న ఉపేంద్రరాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో... రాజకీయ పార్టీల్లో నేతల వలసలు కొనసాగుతూనే ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో నటి జయసుధ వంటి సినీ తారలు రంగ ప్రవేశం చేస్తుంటే.. మరోవైపు ప్రజారాజ్యం పార్టీలో కాంగ్రెస్ నేతలు చేరుతున్నారు. ఇందులో భాగంగా... మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పర్వతనేని ఉపేంద్ర సోమవారం ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 24 Nov 2008 | 7:41 am "నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా..": అక్కినేని"సినిమాకు "కింగ్" టైటిల్ పెట్టాలంటే ఒక అర్హత కావాలి. ఒక లెవల్ ఉండాలి. అందరూ ఇలాంటి టైటిల్ పెట్టుకోలేరు. కొంతమందికే ఆ అవకాశం లభిస్తుంది. ఆ అర్హత, లెవెల్ మీరు నాకిచ్చారు" అంటూ అభిమానులను ఉద్దేశించి నాగార్జున పేర్కొన్నారు. నాగార్జున, త్రిష, మమతామోహన్‌దాస్...Source: వినోదం | 24 Nov 2008 | 7:39 am మారెప్ప వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ డీఎస్ ఆగ్రహంప్రత్యేక తెలంగాణ ఇస్తే... భిక్షగాడి చేతిలో భగవద్గీత పెట్టినట్లేనని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి మారెప్ప చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై డీఎస్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలను కించపరిచేలా మారెప్ప చేసిన వ్యాఖ్యలు సబబు కాదని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 24 Nov 2008 | 7:29 am కాంగ్రెస్ సీనియర్ నేత కొమ్మినేని హఠాన్మరణంకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొమ్మినేని శేషగిరిరావు సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. శనివారం రాత్రి ఆయనకు తీవ్రంగా గుండెపోటు రావడంతో కేర్ ఆసుపత్రిలో చేర్పించగా, ఈరోజు ఉదయం మరణించారు. కాగా, కొమ్మినేని ప్రస్తుతం వాలంటీర్స్ కోర్ కమిటీకి ఛైర్మన్‌గా, రాజీవ్ పంచాయితీ సంఘటన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు...Source: ఏపీ న్యూస్ | 24 Nov 2008 | 6:56 am క్షేమంగా ఇంటికి చేరిన నౌకా సిబ్బందిరెండు నెలల క్రితం హైజాక్‌కు గురయిన "స్టాల్ట్ వాలర్ మర్చంట్ నేవీ"కి చెందిన నౌకలోని భారతీయ సిబ్బంది ఐదుగురు సోమవారం క్షేమంగా ముంబయి చేరుకున్నారు. నౌక కెప్టెన్ ప్రభాత్ గోయల్‌తో సహా మిగిలిన వారు మరో వారంలోపు ముంబయి చేరుకోనున్నారు. కాగా, హైజాక్‌కు గురయిన పైనౌకలో మొత్తం 18 మంది భారతీయులు ఉన్నారు.Source: జాతీయ | 24 Nov 2008 | 6:48 am జమ్మూలో రెండో విడత ఎన్నికలు: 65 శాతం పోలింగ్జమ్మూ-కాశ్మీర్ రెండో విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైంది. ఆదివారం జరిగిన ఈ రెండో విడత ఎన్నికలను బహిష్కరించాలన్న వేర్పాటు వాదుల పిలుపును ప్రజలు ఏమాత్రం లెక్కచేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.Source: జాతీయ | 24 Nov 2008 | 5:48 am తిరగాల్సిన ఖర్మేంటి..?"అర్ధరాత్రి వీధిలో తిరుగుతున్నావ్. నిన్ను చూస్తే నాకు చాలా అనుమానంగా ఉంది. సంజాయిషీ ఇచ్చుకోగలవా?" అడిగాడు గస్తీ కానిస్టేబుల్...Source: వినోదం | 24 Nov 2008 | 5:07 am తిరుగు టపా..!"ఇంతదాకా నేను పన్నెండు కథలు రాసి వివిధ పత్రికలకు ఇచ్చాను అన్నీ వచ్చేశాయి. ఇంకా ఒక్కటి మాత్రం రావాలి" మిత్రుడితో చెప్పాడు రామనాథం...Source: వినోదం | 24 Nov 2008 | 5:06 am నవంబరు 24, 2008 కార్యక్రమాలు06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 సినిమా 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 విజయం 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరంSource: Yahoo! Telugu: Entertainment | 24 Nov 2008 | 3:06 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 24 Nov 2008 | 3:03 am సంపాదన కంటే ప్రజాసేవలోనే ఆనందం: వైఎస్వ్యక్తిగత సంపాదన కంటే ప్రజాసేవ చేయడంలోనే తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ అన్నారు. రాజకీయాల్లో ఉండటం ద్వారానే తనకు ప్రజాసేవ చేసే భాగ్యం లభించిందన్నారు.Source: Yahoo! Telugu: News | 24 Nov 2008 | 12:00 am మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 12 పాయింట్ల పతనంబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సోమవారం స్పల్ప నష్టాలను చవిచూసింది. 74 పాయింట్ల వృద్ధితో 8,841 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం కాసేపటికే 9,042 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అయితే తర్వాత లాభాలను నిలుపుకోలేక సెన్సెక్స్Source: Yahoo! Telugu: News | 24 Nov 2008 | 12:00 am తమిళంలో కృష్ణవంశీ చందమామనవదీప్, కాజల్, శివబాలాజీ, సింధుమీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "చందమామ". క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నిర్దేశకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని సభాపతిSource: Yahoo! Telugu: News | 24 Nov 2008 | 12:00 am విచ్ఛినకర రాజకీయాలు ఓ సవాలు: సోనియావిచ్ఛినకర రాజకీయాలు దేశానికి ఒక సవాలు వంటివని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం వ్యాఖ్యానించారు. కొంత మందికి అధికారంలోకి వచ్చేందుకు వీటిని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. అయితే ఇటువంటిSource: Yahoo! Telugu: News | 24 Nov 2008 | 12:00 am గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు: కేసీఆర్ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ లభించగలదని తెరాస చీఫ్ కేసీఆర్ అన్నారు. తెలంగాణలో 12శాతం మంది గిరిజనులు ఉన్నప్పటికీ, ఆంధ్రలో కలిసి ఉన్నందునే ఆరు శాతం మేర రిజర్వేషన్ ప్రయోజనం పొందగలుగుతున్నారని చెప్పారు.Source: Yahoo! Telugu: News | 24 Nov 2008 | 12:00 am మేటి అథ్లెట్లుగా బోల్ట్, ఇసిన్బయేవాజమైకాకు చెందిన ట్రిపుల్ ఒలింపిక్ స్ప్రింట్ ఛాంపియన్ ఉసైన్ బోల్ట్, రష్యాకు చెందిన పోల్‌వాల్ట్ రారాణి ఎలీనా ఇసిన్‌బయేవాలు ఈ ఏటి మేటి అథ్లెట్లుగా నిలిచారు. వారికి ఐఏఏఎఫ్ అథ్లెట్స్ ఆఫ్ ది ఇయర్ 2008 అవార్డులను ఆదివారం మొనాకోలో బహూకరించారు.Source: Yahoo! Telugu: News | 24 Nov 2008 | 12:00 am తొలి టెస్టులో కివీస్‌పై ఆసీస్ ఘన విజయంబ్రిస్బేన్లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్ణయించిన 327 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌటైంది.Source: Yahoo! Telugu: News | 24 Nov 2008 | 12:00 am బ్లేడ్ బాబ్జీ విజయోత్సవ వేడుకఅల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన "బ్లేడ్ బాబ్జీ' చిత్ర విజయోత్సవం శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఆర్ట్స్ గ్యాలరీలో జరిగింది. సత్యప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిప్రసాద్ దర్శకుడు. విజయోత్సవ సభలో నరేష్ మాట్లాడుతూ.. "అల్లరి", "సీమశాస్త్రి"Source: Yahoo! Telugu: News | 24 Nov 2008 | 12:00 am నాలుగో వన్డేలో విజయం: సిరీస్ భారత్ కైవసంతొలి నాలుగు వన్డేల్లో విజయభేరి మోగించిన టీం ఇండియా స్వదేశంలో జరుగుతున్న హీరోహోండా కప్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌లో ఇంకా మూడు వన్డేలు జరగాల్సివుంది. వర్షం కారణంగా బెంగుళూరులో ఆదివారం జరిగిన నాలుగో వన్డేనుSource: Yahoo! Telugu: News | 24 Nov 2008 | 12:00 am మిగిలిన మ్యాచ్‌లలో రిజర్వు ఆటగాళ్లకు ఛాన్స్ఇంగ్లాండ్తో వన్డే సిరీస్‌ను ఇప్పటికే గెలుచుకున్నందున మిగిలిన మూడు వన్డేలలో రిజర్వు ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నామని భారత జట్టు కెప్టెన్ ధోనీ ప్రకటించాడు. సత్తా చాటేలా వారికి కూడా అవకాశం కల్పించేందుకు సిద్ధ పడతామన్నాడు.Source: Yahoo! Telugu: News | 24 Nov 2008 | 12:00 am
|