చిరంజీవి కడప యాత్రలో అపశృతి

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కడప జిల్లాలో చేపట్టిన ప్రజా అంకిత యాత్రలో అపశృతి దొర్లింది. గురువారం మైదుకూరులో చిరు నిర్వహించిన రోడ్‌షో సందర్భంగా ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు కన్నుమూశారు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2008 | 10:28 am

కేంద్ర ఈసీకి ప్రజారాజ్యం నేతల ఫిర్యాదు

ముఖ్యమంత్రి వైఎస్ సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రజారాజ్యం పార్టీ నేతలపై జరిగిన దాడులను ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇందుకోసం పీఆర్పీ న్యాయ సలహా విభాగం ఛైర్మన్ పి.శివశంకర్, సీనియర్ నేత తుమ్మల శ్రీనివాస్‌, అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్‌లు గురువారం ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2008 | 10:14 am

రామచంద్రయ్య ఫిరాయింపుపై టీడీపీ ఫిర్యాదు

టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన రామచంద్రయ్య పార్టీ ఫిరాయించి ప్రజారాజ్యం పార్టీలో చేరినందున ఆయనపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2008 | 10:14 am

రాష్ట్ర పోలీసుల అదుపులో బంగ్లా జాలర్లు

బంగ్లాదేశ్‌కు చెందిన 17 మంది జాలర్లను శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఎచ్చెర్ల మండలం, బుడగొట్లపాలెం గ్రామంలో వారిని ఖైదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2008 | 10:03 am

డిలైట్ నౌకలోని భారతీయులు సురక్షితం

సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన "డిలైట్" సరుకు రవాణా నౌకలోని భారతీయ సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని భారత జాతీయ నావికుల సంఘం (ఎన్‌యూఎస్ఐ) ప్రతినిధి సునీల్ నాయర్ వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2008 | 9:37 am

నటి మోనికాను పరిణయమాడను: రాహుల్

'బిగ్‌ బాస్ రియాలిటీ షో' ద్వారా మరింత దగ్గరైన నటి మోనికీ బేడిని వివాహం చేసుకోబోనని భారతీయ జనతా పార్టీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ మహాజన్ స్పష్టం చేశారు. రాహుల్, మోనికా బేడీ 'బిగ్ బాస్ రియాల్టీ షో' పాల్గొని, ఆ తర్వాత వీరిద్దరు షో నుంచి నిష్క్రమించిన విషయం తెల్సిందే. మోనికా తనకిష్టమైన స్నేహితురాలని, తాను ఆమెను పెళ్లి చేసుకోబోనన్నారు.
Source: జాతీయ | 20 Nov 2008 | 9:31 am

ఎన్నికల కమిషన్‌కు ప్రజారాజ్యం ఫిర్యాదు

పులివెందులలో తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడి సంఘటనపై ప్రజారాజ్యం పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ తరహా దాడులను అడ్డుకోవాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2008 | 9:23 am

పైరేట్లకు 30 మిలియన్ డాలర్ల ముడుపులు: ఐరాస

నౌకలను హైజాక్ చేయడం ద్వారా ఈ ఏడాది సోమాలియా సముద్రపు దొంగలు ఇప్పటివరకు 25 నుంచి 30 మిలియన్ డాలర్ల ముడుపులు పొందారని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ వెల్లడించారు. సోమాలియాలో నెలకొని
Source: Yahoo! Telugu: News | 20 Nov 2008 | 9:14 am

వరంగల్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ బలి

వరంగల్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి. గోవిందరావు పేట మండలం, మొట్లగూడెం సమీపంలోని తపమొంచ అడవిలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని ఆ వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2008 | 9:10 am

చిరు రోడ్‌షోలో మళ్లీ విషాదం: ఇద్దరు బలి

కడప జిల్లా, మైదుకూరులో ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి గురువారం తలపెట్టిన రోడ్‌షోకోసం వచ్చిన ఓ అభిమాని విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. నాలుగంతస్తుల భవనం పైన చిరుకోసం వేచి చూస్తున్న సమయంలో జరిగిన తొక్కిసలాటతో విద్యుత్ షాక్ తగిలి కన్నుమూశాడు.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2008 | 9:06 am

బీసీసీఐ టెక్నికల్ కమిటీలో గంగూలీ

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ టెక్నికల్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. సునీల్ గవాస్కర్ నేతృత్వంలోని ఆ కమిటీలో గంగూలీని కూడా నామినేట్ చేస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి ఎన్.శ్రీనివాసన్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2008 | 8:47 am

కళ్యాణ్ రామ్ సరసన హన్సిక..!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన హన్సిక నటించబోతుందట. టాలీవుడ్ బ్యూటీక్వీన్‌గా పేరు కొట్టేసిన ఈ భామ.. "కంత్రి", "దేశముదురు" వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న "బిల్లా"లో ఐటమ్ సాంగ్ చేస్తోంది.
Source: వినోదం | 20 Nov 2008 | 8:32 am

చత్తీస్ మాజీ సీఎం జోగిపై దాడి: తప్పిన ముప్పు

చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో అజిత్ జోగి వాహనశ్రేణిని లక్ష్యంగా చేసుకొని మర్వాహీ ప్రాంతంల ఈ దాడి జరిగింది. చత్తీస్‌గఢ్
Source: Yahoo! Telugu: News | 20 Nov 2008 | 8:20 am

కాన్పూర్ వన్డేలో భారత్ లక్ష్యం 241

కాన్పూర్‌లో గురువారం జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్ల ధాటికి నిలబడలేని ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 48.4 ఓవర్లలో 240 పరుగులు చేసి, ఆలౌటైంది. తొలి రెండు వన్డేలతో పోల్చితే ఇది వారికి అత్యధిక స్కోరు అయినప్పటికీ భారత్‌ ప్రస్తుత ఫాంను బట్టి...
Source: Yahoo! Telugu: News | 20 Nov 2008 | 8:05 am

పొత్తులకు ద్వారాలు తెరిచే ఉన్నాం: ధర్మపురి

వచ్చే ఎన్నికల కోసం ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా తెలంగాణా రాష్ట్ర సమితికి ఆహ్వానం పలికినట్టుగా ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2008 | 8:02 am

ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన మలివిడత పోలింగ్

నక్సలైట్ల ప్రాబల్యం అధికంగా ఉండే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా గురువారం మలివిడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ చివరి దశ పోలింగ్‌లో మొత్తం 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో 50 మంది మహిళా అభ్యర్థులతో పాటు.. 687 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 88,14,228 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Source: జాతీయ | 20 Nov 2008 | 5:24 am

భద్రతపై ఇంటలిజెన్స్ బ్యూరో కీలక సమావేశం

దేశ భద్రతపై ఇంటలిజెన్స్ బ్యూరో ఈనెల 22వ తేదీ నుంచి రెండు రోజుల పాటు సమీక్షా సమావేశం నిర్వహించనుంది. ఇందులో 28 రాష్ట్రాలకు చెందిన డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లతో పాటు ఇంటలిజెన్స్‌ బ్యూరో విభాగానికి చెందిన 35 మంది జాయింట్ డైరక్టర్లు కూడా హాజరుకానున్నారు. దేశ రాజధానిలో వచ్చే 22, 23 తేదీల్లో ఈ సమావేశం జరుగుతుంది.
Source: జాతీయ | 20 Nov 2008 | 5:11 am

ఎప్పుడంటే అప్పుడు...!

భార్యా, భర్తలు చీరల విషయంలో పోట్లాడుకుంటున్నారు...
Source: వినోదం | 20 Nov 2008 | 5:03 am

సబ్బునీటితో కడిగితే..!

"నేను నా కంప్యూటర్‌ను శుభ్రం చేశాక, అది పని చేయడం మానేసింది" సర్వీసు సెంటర్లో రిపేరుకిస్తూ చెప్పాడు రమేష్...
Source: వినోదం | 20 Nov 2008 | 5:02 am

కనుచూపు మేరలోనే ప్రత్యేక తెలంగాణ : కేసీఆర్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుచూపు మేరలోనే ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నిర్ణయం తీసేసుకుందనే సమాచారం తనకు అందిందని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 19 Nov 2008 | 11:23 pm

తెలంగాణపై నిర్ణయం చెప్పక తప్పదు : డీఎస్

రాబోయే ఎన్నికలలోపు ప్రత్యేక తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో ఓ నిర్ణయం చెప్పి తీరాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి రెండో ఎస్సార్సీ వేస్తామని చెప్పినట్టుగానే ఈసారి ఎన్నికల్లోనూ ఈ విషయమై ఏదో ఓ నిర్ణయం చెప్పక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 19 Nov 2008 | 10:40 pm

ఛత్తీస్‌గఢ్‌లో నేడు మలివిడత పోలింగ్

ఛత్తీస్‌గఢ్‌లో గురువారం మలివిడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 51 అసెంబ్లీ స్థానాలకు గాను 687 మంది అభ్యర్ధులు మలి విడత పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నెల 17న ఛత్తీస్‌గఢ్‌లోని 39 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 19 Nov 2008 | 10:08 pm

ఎల్ బరాదేకి ఇందిరాగాంధీ శాంతి బహుమతి

అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ మహ్మద్ ఎల్ బరాదేకి ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ ఇటీవల సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.
Source: జాతీయ | 19 Nov 2008 | 9:49 pm

ఆర్ఎస్ఎస్, బజరంగదళ్‌‌లపై నిషేధం లేదు : బ్రిటన్

ఆర్ఎస్ఎస్, బజరంగదళ్ సంస్థలపై నిషేధం విధించే ఉద్ధేశ్యమేదీ తమకు లేదని బ్రిటన్ ప్రభుత్వం తాజాగా పేర్కొంది. అందువల్ల ఆయా సంస్థల్లో సభ్యులుగా ఉన్నవారు బ్రిటన్‌లో పర్యటించేందుకు ఎలాంటి నిరోధం ఉండబోదని బ్రిటన్ స్పష్టం చేసింది.
Source: జాతీయ | 19 Nov 2008 | 7:43 pm

శనీశ్వరుని దివ్య సన్నిధి శనిశింగణాపూర్

దైవ భక్తి ప్రాతిపాదికన హిందువులకు ఉన్న నమ్మకాలు అన్నీ ఇన్నీ కావు. లేక్కలేనన్ని దేవుళ్లను పూజించే హిందువులు ఆ దేవుళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన శక్తి ఉందని ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే హిందువులు ఒక్కో దేవున్నీ పూజించే విధానంలో..
Source: వినోదం | 19 Nov 2008 | 6:46 pm

పథకం ప్రకారమే వటోలీ మారణకాండ : కమిషన్

వటోలీలో అక్టోబర్ 11న పథకం ప్రకారమే ముస్లీం కుటుంబాన్ని అగంతకులు దగ్ధం చేశారని జాతీయ మైనారిటీ కమిషన్ పేర్కొంది. మతతత్వ శక్తులే ఈ ముస్లీం కుటుంబాన్ని బలి తీసుకుని ఉంటాయని ఈ సందర్భంగా మైనారిటీ కమిషన్ అనుమానం వ్యక్తం చేసింది.
Source: ఏపీ న్యూస్ | 19 Nov 2008 | 6:41 pm

సీపీఎం నేత హత్య కేసు : 21మందికి జీవిత ఖైదు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సీపీఎం నేత జోహార్ అలీ హత్య కేసులో నిందితులైన 21 మందికి ఆరాంబాగ్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయనున్నట్టు నిందితుల తరపు న్యాయవాది పేర్కొన్నారు.
Source: జాతీయ | 19 Nov 2008 | 6:22 pm

మహారాష్ట్ర ఉపాధిలో స్థానికులకే పెద్దపీట: గణాంకాలు

ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌థాక్రే గగ్గోలు పెడుతున్న విషయం తెల్సిందే. అయితే మహారాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు మాత్రం స్థానికులకే 90 శాతం ఉపాధి అవకాశాలు కల్పించినట్టు చెబుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం ఉపాధి అవకాశాల్లో మహారాష్ట్ర వాసులకు 90 శాతం ఉద్యోగాలు కల్పించారు.
Source: జాతీయ | 19 Nov 2008 | 12:12 pm

చేవెళ్ళ ప్రాజెక్టుతో 16.4 లక్షల ఎకరాలకు నీరు: వైఎస్

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చేవెళ్ళలో చేపట్టే సాగునీటి ప్రాజెక్టు ద్వారా 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. అలాగే హైదరాబాద్‌కు 30 టీఎంసీల తాగునీరు లభిస్తుందని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 19 Nov 2008 | 11:58 am

పులివెందులలో 'మెగా'షోకు పోటెత్తిన జనం

అది ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కోట. అక్కడ జరిగే ప్రతి సంఘటన ఆయన కనుసన్నల్లో జరుగుతుంది. అక్కడ నివశించే ప్రతి పౌరునికి ఆయన మాటే వేదం. ప్రతి పనివాడు ఆయన అనుచరులు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే. అదే పులివెందుల గడ్డ.
Source: ఏపీ న్యూస్ | 19 Nov 2008 | 11:55 am

కరుణానిధికి జయలలిత లీగల్ నోటీసు

చెన్నైలోని అంబేద్కర్ న్యాయ కళాశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కరుణానిధికి ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత లీగల్ నోటీసు పంపించారు. ఈ ఘర్షణల వెనుక ప్రతిపక్ష పార్టీల పాత్ర ఉందని ముఖ్యమంత్రి కరుణానిధి వ్యాఖ్యలు చేయడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 19 Nov 2008 | 11:52 am

కాంగ్రెస్ ఓటమి కోసం ఛాటింగ్ చేయండి : బాబు

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీని గద్దె దించే దిశగా ఐటీ నిపుణులు ఛాటింగ్ ప్రచారాన్ని నిర్వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్థులను తమ సొంతం చేసుకుని రాష్ట్రాన్ని దివాళా స్థితికి తెచ్చిన వైఎస్‌ను అధికారం నుంచి సాగనంపాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 Nov 2008 | 11:49 am

చూపంతా అటు వైపే : సీఎం ఊరిలో నేడు 'చిరు' సందడి

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తన ప్రజా అంకిత యాత్రలో భాగంగా నిర్వహిస్తోన్న రాయలసీమ పర్యటన ఓ ముఖ్య ఘట్టానికి చేరుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సొంత నియోజక వర్గమైన కడప జిల్లాలోని పులివెందులలో బుధవారం చిరంజీవి పర్యటించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 Nov 2008 | 11:39 am

దేశంలో 70 శాతం మంది బచ్చాలే: రాహుల్

ఈ దేశానికి పట్టిన అదృష్టమో.. లేదా దురదృష్టమో గానీ.. భరతగడ్డపై 70 శాతం మంది బచ్చాలేనని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్.. తనను బచ్చాగా వ్యాఖ్యానించడం పట్ల రాహుల్ తీవ్రంగా స్పందించారు.
Source: జాతీయ | 19 Nov 2008 | 11:30 am

సంక్రాతి కానుకగా జయమ్ము నిశ్చయంబురా

"జయమ్ము నిశ్చయంబురా...జంకు బొంకు లేక సాగిపొమ్మురా..." అంటూ అలనాటి పాటలోని చరణాన్ని టైటిల్‌గా పెట్టి నరి ఎంటర్‌టైన్‌మెంట్ కొత్తవారితో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భూపాల్, సాత్విక్, సుచరిత హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని
Source: Yahoo! Telugu: Entertainment | 19 Nov 2008 | 11:21 am

ముఖ్యమంత్రికి శివప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు

ఎగువ తరగతి టిక్కెట్ రేటు 50 రూపాయలకు పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి డా.వై.ఎస్. రాజశేఖరరెడ్డికి కామాక్షి కళా మూవీస్ అధినేత శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వలన సినీ పరిశ్రమకు
Source: Yahoo! Telugu: Entertainment | 19 Nov 2008 | 11:16 am

21న శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం

బాబూమోహన్ కుమారుడు ఉదయ్ బాబు హీరోగా పరిచయమవుతున్న "శ్రీమేడారం సమక్క- సారక్క మహాత్యం" చిత్రం ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకురానుంది. వేముగంటి దర్శకత్వంలో బాబూమోహన్ ఈ సినిమాను నిర్మించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Nov 2008 | 10:50 am

నింగినేల నాదేగా ఇన్‌విజిబుల్ వింగ్స్

హైదరాబాద్‌లో జరిగిన 2007 అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా బంగారు ఏనుగు గెలుచుకున్న "ఇన్‌విజిబుల్ వింగ్స్" అనే చైనా చిత్రాన్ని తెలుగులో "నింగినేల నాదే" అనే పేరుతో అనువదిస్తున్నారు. నాలుగేళ్ల పాప గాలిపటంతో
Source: Yahoo! Telugu: Entertainment | 19 Nov 2008 | 10:39 am