జీలం నది వంతెన కూలి 15 మంది మృతి

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జీలం నది వంతెన కూలిపోయింది. ఆ సమయంలో వంతెన నిర్మాణంలో కూలీల్లో 15 మంది దుర్మరణం పాలైనట్టు సమాచారం. మరికొందరు గల్లంతయ్యారు. గల్లంతైనవారి కోసం అధికారులు అన్వేషణ ప్రారంభించారు. శ్రీనగర్‌కు 92 కిలోమీటర్ల దూరంలో గల ఉరి పట్టణం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
Source: జాతీయ | 16 Nov 2008 | 11:47 am

షెడ్యూల్ ప్రకారమే లోక్‌సభ ఎన్నికలు: ప్రధాని

పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు ఉండబోవని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయని తేల్చిచెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో లోక్‌సభకు ముందస్తుగానే ఎన్నికలు జరుగుతాయనే వార్తలను ఆయన కొట్టిపారేశారు.
Source: జాతీయ | 16 Nov 2008 | 11:29 am

మినీ సమరంలో విజయం మాదే: సోనియా

మినీ ఎన్నికల సమరంగా పరిగణిస్తున్న ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాల వ్యతిరేకత, పార్టీలోని అసమ్మతి సెగలు తమ పార్టీకి విజయాన్ని చేకూర్చి పెడతాయని ఆమె అభిప్రాయపడుతున్నారు.
Source: జాతీయ | 16 Nov 2008 | 8:14 am

29 నుంచి ఆర్టీసీలో మోగనున్న సమ్మెసైరన్!

తమ ప్రధాన డిమాండ్లను నిర్ణీత గడువులోగా పరిష్కరించని పక్షంలో ఈనెల 29వ తేదీ నుంచి సమ్మెబాట పట్టనున్నట్టు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసును అందజేసింది.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2008 | 7:35 am

తెదేపా ఆధ్వర్యంలో మరో ఐదు గర్జనలు!

తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు గుంటూరు యువగర్జన ఓ టానిక్‌లా ఉపయోగపడింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న తెదేపా నేతలు మరో ఐదు గర్జలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఈనెల 30 లేదా డిసెంబరు ఒకటో తేదీన పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2008 | 7:11 am

డిసెంబరు 15న అసెంబ్లీ రద్దు: మంత్రి ధర్మాన

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఊహాగానాలు షికారు చేస్తున్న తరుణంలో రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ముందస్తు ఎన్నికల సమరానికి మరింత బలం చేకూర్చాయి. రాష్ట్ర అసెంబ్లీని వచ్చే నెల 15వ తేదీ తర్వాత రద్దయ్యే అవకాశాలు ఉన్నట్టు మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2008 | 6:51 am

కావలి వద్ద తీరందాటిన ఖైముక్ తుఫాను

పెను ఉప్పెన తప్పింది. రాష్ట్ర ప్రజానీకం భయం వీడారు. ఎంతగానో భయభ్రాంతులకు గురిచేసిన ఖైముక్ తుఫాను.. క్రమేణా బలహీన పడింది. వాతావరణ శాఖ అధికారుల అంచనాలకు భిన్నంగా బలహీనపడి, నెల్లూరు జిల్లా కావలి సమీపంలో తీరందాటింది. తీరం దాటే సమయానికి ఇది మరింత బలహీనపడిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలియజేసింది.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2008 | 6:33 am

నవంబరు 16, 2008 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 శుభోదయం 09.00 పంచతంత్రం 09.30 విష్ణు పురాణం 11.00 చెప్పాలనిఉంది 12.00 ఈనాడు సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 16 Nov 2008 | 5:19 am

ఈ వారం


Source: Yahoo! Telugu: Entertainment | 16 Nov 2008 | 5:17 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 16 Nov 2008 | 5:15 am

ప్రజారాజ్యంలో చేరిన ఉపేంద్ర, శివశంకర్‌

ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు పర్వతనేని ఉపేంద్ర, పి, శివశంకర్ కొత్తగా ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీలో చేరడంతో చిరంజీవి స్థాపించిన నూతన పార్టీకి బలం పుంజుకుంది. నందమూరి తారక రామారావు హయాంలో తెలుగుదేశంలో నెంబర్ టూ స్థానంలో ఉన్న ఉపేంద్ర శనివారం ప్రజారాజ్యం పార్టీ రాజకీయ సలహాదారుగా చేరారు.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2008 | 1:18 am

నక్సల్స్ హెచ్చరికతో ఆగిన రైళ్ల రాకపోకలు

నల్గొండ జిల్లాలోని దామచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణానదిపై అడ్డంగా నిర్మించిన బ్రిడ్జిని పేల్చివేస్తామని నక్సల్స్ శనివారం అర్థరాత్రి హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో రైళ్ల రాకపోకలను అధికారులు ఆపివేశారు.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2008 | 1:00 am

సంక్షోభ నివారణకు ఆర్థిక ప్యాకేజి: మన్మోహన్

ప్రపంచ ఆర్థిక సంక్షోభం వ్యవస్థాపర సంక్షోభంగా బద్దలు కానుందని హెచ్చరించిన ప్రధాని మన్మోహన్, భారత్ తదితర వర్థమాన దేశాలను తాకుతున్న మాంద్యాన్ని నివారించడానికి గాను సమన్వయంతో కూడిన ఆర్థిక ప్యాకేజీని అందించాలని ప్రపంచనేతలను కోరారు.
Source: జాతీయ | 16 Nov 2008 | 12:44 am

చిరు ఎన్నటికీ వైఎస్ కాలేరు.. కాబోరు: పిసిసి

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తాను వైఎస్ లాంటి వాడిని కానని చెప్పిన మాటలు అక్షర సత్యాలని ప్రదేశ కాంగ్రెస్ కమిటీ వ్యాఖ్యానించింది. శనివారం గాంధీ భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన పిసిసి అధికార ప్రతినిధులు ఎన్. తులసీ రెడ్డి, బి. కమలాకరరావు ప్రజారాజ్యం పార్టీ అధినేత వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 15 Nov 2008 | 8:11 pm

పేలుళ్లకు ఆర్డీఎక్స్ సరఫరా చేసిన పురోహిత్

మాలెగావ్ పేలుళ్ల కేసులో అరెస్టయిన లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్‌కు 2007లో జరిగి సంజాతా పేలుళ్లతోనూ సంబంధం ఉందని మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం ఎటిఎస్ ప్రకటించింది. 68 మంది మరణించిన సంజాతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ళ ఘటనలో పురోహిత్ ఆర్డీఎక్స్‌ను ఉపయోగించినట్లుగా ఎటిఎస్ శనివారం నాసిక్ కోర్టుకు తెలియపర్చింది.
Source: జాతీయ | 15 Nov 2008 | 6:34 pm