|
అటతీరును బట్టే జట్టులో చోటు: పాంటింగ్ఆటతీరును మెరుగుపరచుకోకుంటే జట్టులో స్థానం కోల్పోవాల్సి వస్తుందని ఆసీస్ క్రికెటర్లను కెప్టెన్ పాంటింగ్ హెచ్చరించాడు. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో స్థాయికి తగ్గ ఆటతీరును కనబరచకపోవడంతోనే ఓటమి పాలు కావాల్సి వచ్చిందన్నాడు.Source: Yahoo! Telugu: News | 12 Nov 2008 | 11:26 am టాటా సంస్థలకు ముందస్తు హెచ్చరికలుప్రపంచ ఆర్థిక సంక్షోభం పర్యవసానాలు ఎదుర్కునే దిశగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తమ గ్రూపులోని 98 సంస్థల సీఈవోలు, ఎండీలకు టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా సూచించారు. నగదు చెలామణి, వ్యయాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు.Source: Yahoo! Telugu: News | 12 Nov 2008 | 11:15 am భారత్‌లో ప్రచండ రెండో పర్యటన ప్రారంభంనేపాల్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత రెండో సారిగా పుష్పకమాల్ దహల్ ప్రచండ బుధవారం భారత్ వస్తున్నారు. పన్నెండు మంది సభ్యుల బృందంతో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఖాట్మండునుంచి నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానంలో బయలు దేరారు.Source: Yahoo! Telugu: News | 12 Nov 2008 | 10:54 am రుణాలను మాఫీ చేసిన ఘనత మాదే: వైఎస్రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి తెలిపారు. రుణమాఫీ ద్వారా 60లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందారని వైఎస్సార్ వివరించారు. అంతేకాకుండా బకాయిలు కట్టిన రైతులకు తమ ప్రభుత్వం..Source: Yahoo! Telugu: News | 12 Nov 2008 | 10:37 am విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: జానామొద్దుశీను హత్యోదంతాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని రాష్ట్ర హోం మంత్రి జానారెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి తగినవిధంగా బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. శీను హత్యపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా...Source: Yahoo! Telugu: News | 12 Nov 2008 | 10:36 am వారసత్వ రాజకీయాలపై నమ్మకం లేదు: ఎమ్మెస్సార్వారసత్వ రాజకీయాలపై తనకు ఏమాత్రం నమ్మకం లేదని, అందుకే తన వారసులెవరూ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ పేర్కొన్నారు. రాజకీయాల నుంచి తాము తప్పుకునే ప్రసక్తే లేదని, అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం...Source: Yahoo! Telugu: News | 12 Nov 2008 | 9:35 am ప్రజా ఉద్యమాలతో దూసుకెళ్తాం: రాఘవులుఎన్నికల ముందు ప్రజా ఉద్యమాలు చేసి ప్రజలకు మరింత చేరువవుతామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వి. రాఘవులు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐతో కలిసే పోటీ చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడమే వామపక్షాల ప్రధాన లక్ష్యమని...Source: Yahoo! Telugu: News | 12 Nov 2008 | 9:35 am అసోంలో కూలిన మిగ్ -21 విమానంఅసోంలో ఓ మిగ్-21 యుద్ధ విమానం కూలగా, అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. శివ్‌సాగర్ జిల్లాలోని గరియాపాతర్ సమీపంలో మథురాపూర్ వద్ద ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఈ విమానం కుప్ప కూలింది.Source: Yahoo! Telugu: News | 12 Nov 2008 | 9:22 am పార్టీ మారే ఆలోచనలో ఉన్నా: దొరబాబు!రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో వలసలు అధికమవుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ప్రజారాజ్యం పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు వలసపోతుంటే మరోవైపు వివిధ పార్టీల్లోనూ కొంత మేర ఈ వలస ప్రభావం కన్పిస్తూనే ఉంది.Source: Yahoo! Telugu: News | 12 Nov 2008 | 9:08 am కాంగ్రెస్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్: కేసీఆర్ప్రత్యేక తెలంగాణ ఇస్తామని వాగ్ధానం చేసిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే డిసెంబర్ తొలివారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణాకు అనుకూలంగా తీర్మానం చేయాలని తెరాస అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. అదే విధంగా రెండో వారంలో జరిగే పార్లమెంట్...Source: Yahoo! Telugu: News | 12 Nov 2008 | 9:00 am పెట్రో పరిశ్రమలు: 15న విపక్షాల మహాధర్నాకోస్తా తీరంలో పెట్రో రసాయనాల పరిశ్రమల ఏర్పాటును నిరశిస్తూ ఈనెల 15వ తేదీన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మహాధర్నాను నిర్వహించేందుకు సమాయత్తమయ్యాయి. ఇందుకోసం విశాఖను వేదికగా నిర్ణయించాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు గల కోస్తాతీర ప్రాంతంలో పెట్రో రసాయన పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.Source: ఏపీ న్యూస్ | 12 Nov 2008 | 7:50 am మార్గరెట్ ఆల్వా రాజీనామాకు సోనియా ఆమోదంసంచనల ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మార్గరెట్ ఆల్వా.. తన పదవికి చేసిన రాజీనామాను ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదించారు. నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు మార్గరెట్‌పై చర్య తీసుకునే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.Source: జాతీయ | 12 Nov 2008 | 7:12 am కాంగ్రెస్‌కు పుత్తూరు ఎమ్మెల్యే గుడ్‌బై..!రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలనుంది. పుత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు తిరిగి మాతృసంస్థ తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇందుకోసం ఆయన వేగంగా పావులు కదుపుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.Source: ఏపీ న్యూస్ | 12 Nov 2008 | 6:57 am "జగన్మోహిని" తల్లిగా జ్యోతిలక్ష్మిరాజా, నమిత, మీరాచోప్రా నాయకా నాయకులుగా మురళి సినీ ఆర్ట్స్ పతాకంపై హెచ్. మురళి నిర్మిస్తోన్న చిత్రం "జగన్మోహిని". ఎస్.కె. విశ్వనాథన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నమిత టైటిల్ పాత్రను పోషిస్తుండగా...Source: వినోదం | 12 Nov 2008 | 6:55 am ఉచితంగా ఇస్తున్నారు"డాక్టర్...! మీ దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే ఏదో ఉచితంగా ఇస్తున్నారంట...?" ఆశ్చర్యంగా అడిగాడు ఓ రోగి...Source: వినోదం | 12 Nov 2008 | 6:53 am పిండిమిల్లులో పనిజేస్తున్నారు"వదినా... అన్నయ్య ఇది వరకు నల్లగా, తారుడబ్బాలా ఉండేవారు కదా... ఇప్పుడేమో తెల్లగా నిగనిగలాడుతున్నారు. కారణమేంటి?" అడిగిందిSource: వినోదం | 12 Nov 2008 | 6:53 am భాజపా జాబితా: ఘజియాబాద్ నుంచి రాజ్‌నాథ్ పోటీవచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఘజియాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే.. మరికొందరు నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.Source: జాతీయ | 12 Nov 2008 | 6:51 am మున్షీ ఆరోగ్యం యధాతథం: పీఎం చేతికి ఐబీ శాఖగుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర ప్రచార, ప్రసారాల శాఖామంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. దీంతో ఆయన నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ బాధ్యతలను ప్రధాని మన్మోహన్ సింగ్ స్వీకరించారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సూచన మేరకు ప్రధాని ఐబీ శాఖను పర్యవేక్షిస్తారని రాష్ట్రపతి భవన్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.Source: జాతీయ | 12 Nov 2008 | 6:50 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 12 Nov 2008 | 3:43 am బుల్లి తెరలో నేటి కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 శ్రీకృష్ణ లీలలు 15:00 ప్రేమ మందిరం 15:30 లక్ష్యం ...Source: Yahoo! Telugu: Entertainment | 12 Nov 2008 | 3:36 am ఉగ్రవాద లింకులపై సైన్యంలో విచారణ: కపూర్మాలెగావ్ పేలుడు ఘటనకు సంబంధించి సైన్యంలో పనిచేస్తున్న అధికారిని అరెస్టు చేయడంతో భారత సైన్యం ప్రతిష్ట మసకబారింది. భారత దేశపు అత్యంత లౌకిక స్వభావంతో కూడిన ప్రొఫెషనల్ సంస్థ భారతీయ సైన్యం ఇలాంటి పరిస్థితిని పునరావృతం చేయనివ్వనని శపథం చేసింది.Source: జాతీయ | 11 Nov 2008 | 11:45 pm రాహుల్ గాంధీ చేతల్లో ఒబామా 'మార్పు' మంత్రంఅమెరికా ఎన్నికల్లో ఒబామా మార్పు మంత్రం ఓటర్లపై ఎంత గొప్పగా ప్రభావితం వేసిందో చరిత్రకెక్కింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఇప్పుడు యువ మంత్రాన్ని జపిస్తున్నారు. దేశ రాజకీయాల్లోకి కొత్త రక్తం తీసుకురావాలనే తనదైన తపనను రాహుల్ తనకు అవకాశం ఉన్న ప్రతిచోటా ప్రదర్శిస్తూ వస్తున్నారు.Source: జాతీయ | 11 Nov 2008 | 10:26 pm అనిల్ దర్శకత్వంలో రవిబాబుతో 'రాస్కెల్'అసాధ్యుడు చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన అనిల్ కృష్ణ ప్రస్తుతం జంక్షన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంక్షన్ చిత్రంలో హీరోగా నటిస్తున్న రవిబాబు, దర్శకుడు అనిల్ కృష్ణ కాంబినేషన్‌లో మరో చిత్రం ప్రారంభానికి సిద్ధమైంది.Source: Yahoo! Telugu: Entertainment | 11 Nov 2008 | 12:11 pm తారలకు డీఎస్ విందు: సీనియర్లతో మంతనాలుకాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వేడిరాజుకుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వేగంగా పావులు కదుపుతున్నారు. భవిష్యత్ ప్రణాళికపై తన నివాసంలో పార్టీకి చెందిన సీనియర్లతో చర్చలు జరిపారు. పనిలోపనిగా తమ పార్టీ తీర్థం పుచ్చుకున్న సినీ తారలను ఏవిధంగా ఉపయోగించుకోవాలన్న అంశంపై కూడా ఆయన మంతనాలు నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 11 Nov 2008 | 12:09 pm
|