అనిల్ దర్శకత్వంలో రవిబాబుతో 'రాస్కెల్'

అసాధ్యుడు చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన అనిల్ కృష్ణ ప్రస్తుతం జంక్షన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంక్షన్ చిత్రంలో హీరోగా నటిస్తున్న రవిబాబు, దర్శకుడు అనిల్ కృష్ణ కాంబినేషన్‌లో మరో చిత్రం ప్రారంభానికి సిద్ధమైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Nov 2008 | 11:29 am

మార్కెట్ పతనం : సెనెక్స్ 565 పాయింట్లు డౌన్

స్టాక్ మార్కెట్ మరోసారి పతనం దిశగా పయనించింది. దీంతో మంగళవారం స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలు ముగిసే సమయానికి 565 పాయింట్ల పతనంతో సెన్సెక్స్ 9,971 పాయింట్ల వద్ద ముగిసింది.
Source: Yahoo! Telugu: News | 11 Nov 2008 | 11:05 am

ఉద్యోగార్థుల వయో పరిమితి పెంపు

ఉద్యోగార్థుల వయో పరిమితిని పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు, ఓసీ అభ్యర్థుల వయో పరిమితిని 39 ఏళ్లకు పెంచుతున్నామని వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 11 Nov 2008 | 10:58 am

ఒబామాపై వ్యాఖ్యలు నిజం కావు : ప్రధాని

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎంపికైన బారక్ ఒబామా భారత్ పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారనే వ్యాఖ్యలను ప్రధాని మన్మోహన్ సింగ్ తోసిపుచ్చారు. అధ్యక్షునిగా ఎంపికైన తర్వాత ఒబామా తనతో మాట్లాడేందుకు ప్రయత్నించారని అయితే సమయాభావం వల్ల...
Source: Yahoo! Telugu: News | 11 Nov 2008 | 10:52 am

సీనియర్లతో వైఎస్, డీఎస్ మంతనాలు

ఎన్నికలకు పార్టీ యంత్రాగాన్ని సిద్ధం చేసే క్రమంలో సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి వైఎస్, పీసీసీ చీఫ్ డీఎస్‌లు మంగళవారం సమావేశమయ్యారు. డీఎస్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహం గురించి విస్తృతంగా చర్చించారు.
Source: Yahoo! Telugu: News | 11 Nov 2008 | 10:38 am

చిరంజీవి పిలిస్తే పీఆర్పీలోకి: శివశంకర్

మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానిస్తే ప్రజారాజ్యం పార్టీలో చేరే అంశాన్ని పరిశీలిస్తానని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శివశంకర్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తాను అసంతృప్తిగానే ఉన్నానని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 11 Nov 2008 | 10:27 am

టెస్ట్ ర్యాంకింగ్స్ : రెండో స్థానంలో భారత్

నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాపై సాధించిన టెస్ట్ విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకునన్న భారత్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లోనూ రెండో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియాపై 2-0 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకున్న భారత్ ఏడు పాయింట్లు మెరుగుపర్చుకుని మొత్తం...
Source: Yahoo! Telugu: News | 11 Nov 2008 | 10:14 am

శీను హత్యపై కోర్టులో భోరుమన్న సూరి

మొద్దు శీను హత్యోదంతంపై అనంతపురం సెషన్స్ కోర్టులో మద్దెల చెరువు సూరి మంగళవారం భోరున విలపించారు. పరిటాల హత్య కేసు విచారణకోసం కోర్టుకు వచ్చిన సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. న్యాయమూర్తి ముందు శీను హత్య గురించి మాట్లాడుతున్న సమయంలో...
Source: Yahoo! Telugu: News | 11 Nov 2008 | 9:53 am

గాయంతో డేవీస్ కప్‌కు దూరం : నాదల్

గాయం కారణంగా వచ్చే నెల జరగనున్న డేవీస్ కప్ ఫైనల్‌లో తాను పాల్గొనబోవడం లేదని స్పెయిన్‌కు చెందిన ప్రపంచ నంబర్ వన్ రఫెల్ నాదల్ పేర్కొన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నాదల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
Source: Yahoo! Telugu: News | 11 Nov 2008 | 8:52 am

జేడీ(యు) ఎంపీల రాజీనామాకు స్పీకర్ ఆమోదం

మహారాష్ట్రలో ఉత్తరాదివారిపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీహార్‌కు చెందిన ఐదుగురు జేడీ(యు) ఎంపీలు చేసిన రాజీనామాలకు లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఆమోద ముద్ర వేశారు. గతవారం జరిగిన ఈ రాజీనామాల పర్వంలో ఎంపీల రాజీనామా...
Source: Yahoo! Telugu: News | 11 Nov 2008 | 8:37 am

రక్షణ సహకారానికి భారత్, ఖతార్ దేశాలు ఓకే

ఇరు దేశాల మధ్య రక్షణకు సంబంధించిన సహకారానికి భారత్, ఖతార్లు ఓ కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రక్షణ పరంగా అన్నింటికీ వీలు కల్పించే ఒడంబడికగా ఇరు దేశాల అధికారులు ఈ ఒప్పందాన్ని అభివర్ణించారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్...
Source: Yahoo! Telugu: News | 11 Nov 2008 | 8:28 am

వచ్చే ఎన్నికల్లో యువతకు పట్టం: నాగబాబు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేయనున్నట్టు ప్రజారాజ్యం పార్టీ నేత, చిరంజీవి సోదరుడు నాగబాబు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 11 Nov 2008 | 6:13 am

చిరంజీవి సొంతగడ్డపై వైఎస్ రోడ్‌షో

తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు నిర్వహిస్తున్న ప్రచారానికి ధీటుగా ముఖ్యమంత్రి వైఎస్ జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అన్ని రాజకీయ పార్టీల నేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా ప్రరాపా అధినేత చిరంజీవి ఇప్పటికే ప్రజాఅంకిత యాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Nov 2008 | 5:59 am

16 నుంచి 'సీమ' గడ్డపై చిరు 'ప్రజాఅంకిత' యాత్ర

అధికార, ప్రతిపక్ష పార్టీల కంచుకోట రాయలసీమ గడ్డపై ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి 'ప్రజాఅంకిత' యాత్ర ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఉత్తర కోస్తా, తెలంగాణా జిల్లాల్లో నిర్వహించిన చిరు యాత్రలు సక్సెస్ అయిన విషయం తెల్సిందే. ఇదే తరహాలో రాయలసీమ యాత్రను కూడా విజయవంతం చేసేందుకు పీఆర్పీ నేతలు గట్టిపట్టుదలతో ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Nov 2008 | 5:51 am

'బేర్‌ మినిమమ్‌ డ్రెస్‌'

"సార్..‌! బికినీ బేతింగ్‌ డ్రెస్ ధరించే అమ్మాయిల గురించి మీరేమంటారు...?" అడిగాడు వినోద్...
Source: వినోదం | 11 Nov 2008 | 4:57 am

గన్‌మెన్‌లను వెనక్కి..!

"అయ్యవారూ నాకు భగవంతుడి ఆశీస్సులు అందించండి" పూజారిని అడిగాడు మంత్రి...
Source: వినోదం | 11 Nov 2008 | 4:53 am

"అనగనగా ఒక అరణ్యం"లో ఏం జరిగింది?

హ్యాపీ మూవీ క్రియేషన్స్ పతాకంపై బెనజీర్ సమర్పణలో కౌశల్, ఏక్తాత్రివేది, శ్రీ రేఖ, సైరాభాను హీరోహీరోయిన్లుగా శేఖర్ చంద్ర దర్శకత్వంలో టి. సుల్తాన్ నిర్మిస్తున్న "అనగనగా ఒక అరణ్యం" చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. హిందీలో ఈ సినిమాను హమ్ ఆప్ కే...
Source: వినోదం | 11 Nov 2008 | 4:48 am

అహ్మదాబాద్ పేలుళ్లు: కీలక నిందితుడి అరెస్టు

గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లో జరిగిన వరుస పేలుళ్ళ కేసుకు సంబంధించి కీలక నిందితుడిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గత జులై 26వ తేదీన అహ్మదాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెల్సిందే.
Source: జాతీయ | 11 Nov 2008 | 4:45 am

అరెస్టు కోసం వేచి చూస్తున్నా: బాల్‌థాక్రే

తన అరెస్టు కోసం వేచి చూస్తున్నట్టు శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్‌థాక్రే ప్రకటించారు. అంతేకాకుండా మాలేగావ్ బాంబు పేలుళ్ళ కేసులో మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) అరెస్టు చేసిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ను విడుదల చేయించేందుకు పేరొందిన న్యాయవాదిని నియమించేందుకు తమవంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
Source: జాతీయ | 11 Nov 2008 | 4:13 am

మార్గరెట్ అల్వా పదవికి ఎసరు తెచ్చిన ఆరోపణలు

మూడు దశాబ్దాలుగా పార్టీకి తనవంతు సేవలు అందిస్తూ వచ్చిన మార్గరెట్ అల్వా తన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) ప్రధాన కార్యదర్శి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. సొంత పార్టీ నేతలపై ఆమె చేసిన ఆరోపణలే ఆమె పదవికి ఎసరు తెచ్చాయి.
Source: జాతీయ | 11 Nov 2008 | 3:51 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 11 Nov 2008 | 3:51 am

బుల్లితెరలో నేటి కార్యక్రమాలు

ఈటీవీ 06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరం 15.30 లక్ష్యం 16.00 శిరీష
Source: Yahoo! Telugu: Entertainment | 11 Nov 2008 | 3:30 am

ఎల్టీటీఈపై కేంద్ర ప్రభుత్వ నిషేధం పొడిగింపు

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్ట పరిధిలో ఏర్పడిన ట్రిబ్యునల్ ఎల్టీటీఈ తిరుగుబాటుదారులపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని రెండేళ్ల పాటు పొడిగించింది. ఈ నిషేధ పొడిగింపు మే 14 నుంచి అమల్లోకి వస్తుంది.
Source: జాతీయ | 11 Nov 2008 | 1:23 am

మొద్దుశీను శవపరీక్ష ఓ బూటకం: తెదేపా

అనంతపురం జిల్లా కారాగారంలో దారుణ హత్యకు గురైన మొద్దుశీను మృతదేహానికి నిర్వహించిన శవపరీక్ష కేవలం బూటకమని ప్రధానప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. తలపై తగిలిన బలమైన గాయం వల్లనే మొద్దు శీను మృతి చెందినట్లు డాక్టర్‌ ప్రభాకర్‌ ఇచ్చిన నివేదికను ఇటు తెదేపా నేతలు తప్పుపట్టారు.
Source: ఏపీ న్యూస్ | 10 Nov 2008 | 12:13 pm

కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలు: దత్తన్న

కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు అనుసరిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆరోపించారు. వీటితో విసిగిపోయిన దేశ ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు. '
Source: ఏపీ న్యూస్ | 10 Nov 2008 | 12:02 pm

ప్రభుత్వ ఆదేశాలు భేఖాతర్: తగ్గని బియ్యం ధరలు

బియ్యం ధరలను తగ్గించాలని ప్రభుత్వ హెచ్చరికలను బియ్యం వ్యాపారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నట్టు నటిస్తూనే.. హోం డెలివరీ పేరిట తమకు ఇష్టమైన ధరలకు బియ్యం అమ్ముతూ రెండు చేతులా అర్జిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Nov 2008 | 11:59 am

రాజస్థాన్‌లో ప్రారంభమైన నామినేషన్ల పర్వం

రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల నాలుగో తేదీన రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. కాగా, నామినేషన్ల దాఖలు ఈనెల 17వ తేదీ చివరి తేదీ. 18వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు.
Source: జాతీయ | 10 Nov 2008 | 11:44 am

'ఆదిత్య' సన్ మిషన్ రూపకల్పన: నాయర్

చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన శాస్త్రవేత్తల్లో ఎక్కడలేని ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ స్ఫూర్తితో 'ఆదిత్య' పేరుతో సన్ మిషన్‌ను తయారు చేస్తామని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ ప్రకటించారు.
Source: జాతీయ | 10 Nov 2008 | 11:37 am