మొద్దుశీను శవపరీక్ష ఓ బూటకం: తెదేపా

అనంతపురం జిల్లా కారాగారంలో దారుణ హత్యకు గురైన మొద్దుశీను మృతదేహానికి నిర్వహించిన శవపరీక్ష కేవలం బూటకమని ప్రధానప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. తలపై తగిలిన బలమైన గాయం వల్లనే మొద్దు శీను మృతి చెందినట్లు డాక్టర్‌ ప్రభాకర్‌ ఇచ్చిన నివేదికను ఇటు తెదేపా నేతలు తప్పుపట్టారు.
Source: ఏపీ న్యూస్ | 10 Nov 2008 | 12:13 pm

కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలు: దత్తన్న

కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు అనుసరిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆరోపించారు. వీటితో విసిగిపోయిన దేశ ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు. '
Source: ఏపీ న్యూస్ | 10 Nov 2008 | 12:02 pm

ప్రభుత్వ ఆదేశాలు భేఖాతర్: తగ్గని బియ్యం ధరలు

బియ్యం ధరలను తగ్గించాలని ప్రభుత్వ హెచ్చరికలను బియ్యం వ్యాపారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నట్టు నటిస్తూనే.. హోం డెలివరీ పేరిట తమకు ఇష్టమైన ధరలకు బియ్యం అమ్ముతూ రెండు చేతులా అర్జిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Nov 2008 | 11:59 am

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 572 పాయింట్లు పుంజుకుని 10,536 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 175 పాయింట్లు పెరిగి 3,148 వద్ద ముగిసింది. సోమవారం ఉదయం 191...
Source: Yahoo! Telugu: News | 10 Nov 2008 | 11:29 am

ప్రపంచ భాషల్లోకి తెలుగు సాహిత్యం: ఆవుల

ప్రపంచ భాషల్లోకి తెలుగు సాహిత్యాన్ని అనువదించాల్సిన అవసరం ఉందని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం మాజీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఆవుల మంజులత పిలుపునిచ్చారు. ప్రపంచ భాషల్లోకి అనువదిస్తేనే తెలుగు సాహిత్యానికి తగిన గుర్తింపు లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2008 | 11:28 am

రేప్ కేసులో మంత్రి తనయుడికి బెయిల్

జర్మనీ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో గోవా విద్యా శాఖ మంత్రి అంటానాసియో మోన్సరేట్ తనయుడు రోహిత్‌కు కోర్టు బెయిల్ అందించింది. ఈ అత్యాచారం కేసుకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌ను జర్మనీ బాలిక తల్లి ఉపసంహరించుకున్న నేపథ్యంలో అతనికి...
Source: Yahoo! Telugu: News | 10 Nov 2008 | 11:11 am

నవంబర్ 14న సూర్య సన్నాఫ్ కృష్ణన్

గజిని చిత్రం ఫేమ్ సూర్య ద్విపాత్రాభినయంలో నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రాన్ని నవంబర్ 14న 550 ప్రింట్లతో విడుదల చేయనున్నారు. తెలుగు నిర్మాతలైన శోభారాణి, సీజే రమణ ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో...
Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2008 | 10:48 am

సింహాచలంలో ఘనంగా నృసింహ యాగం

త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో సింహాచలంలో సుదర్శన నృసింహయాగాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆరున్నర గంటలకు మంగళాశాసనముతో ప్రారంభమైన కార్యక్రమం అనంతరం అగ్ని మధనం, శాంతి పాఠం, పారాయణంలతో కొనసాగింది.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2008 | 10:41 am

ఎస్‌వీ భక్తి ఛానెల్‌లో తిరుపతి గర్భాలయ పూజలు

తిరుమల గర్భాలయంలో స్వామి వారికి జరుగుతున్న పూజా కార్యక్రమాలను ఎస్‌వీ భక్తి ఛానెల్‌లో వచ్చే ఏడాది జనవరి 14నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని ఆ ఛానెల్ సీఈవో కేఎస్ శర్మ తెలిపారు. దీనికోసం ప్రత్యేక సెట్టింగ్ ఏర్పాట్లు చేస్తామన్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2008 | 10:31 am

తిరుమలలో ఘనంగా కైశిక ద్వాదశి ఉత్సవాలు

శ్రీవారి మంగళకైశిక ద్వాదశి మహోత్సవాలు తిరుమలలో సోమవారం ఉదయం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉగ్ర నరసింహావతారంతో శ్రీవారు భార్యలైన శ్రీదేవి, భూదేవిలతో సహా తిరుమల మాడ వీధుల్లో ఊరేగారు.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2008 | 10:06 am

మొద్దుశీనుకు రీ పోస్టుమార్టం: భార్య డిమాండ్

అనంతపురం జైలులో హత్యకు గురైన మొద్దు శీను మృతదేహానికి రీపోస్టు మార్టం నిర్వహించాలని ఆయన భార్య లక్ష్మీరాజ్యం డిమాండ్ చేసింది. ఆయన చావులో పలురకాల అనుమానాలున్నందున మరోసారి పోస్టుమార్టం నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2008 | 9:58 am

మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇశాంత్ శర్మ

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆద్యంతం రివర్స్ స్వింగ్‌తో అద్భుతంగా రాణించిన ఇశాంత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. స్పిన్‌కు అనుకూలిస్తుందని చెప్పే భారత్ పిచ్‌లపై నాలుగు టెస్టుల్లో కలిపి అతను పదిహేను వికెట్లు పడగొట్టాడు.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2008 | 9:44 am

చివరి టెస్టులోనూ ఆసీస్ చిత్తు: ట్రోఫీ భారత్‌దే

నాగ్‌పూర్‌లో జరిగిన చివరి టెస్టులోనూ ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 172 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్ బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకుంది. భారత్ నిర్ణయించిన 382 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 209 పరుగులకే ఆలౌటైంది.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2008 | 9:12 am

గురునానక్ జయంత్యుత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

సిక్కుల ఆరాధ్యదైవం గురునానక్ దేవ్‌జీ జయంత్యుత్సవాలకోసం భాగ్యనగరి ముస్తాబవుతోంది. గురుద్వారా శ్రీ గురుసింగ్ సభ (హైదరాబాద్), గురుద్వారా సాహెబ్ (సికింద్రాబాద్)లు తొలిసారిగా ఈ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశాయి.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2008 | 8:32 am

14న 550 ప్రింట్లతో వస్తున్న "సూర్య S/o కృష్ణన్"

"గజిని" సూర్య ద్విపాత్రాభినయంతో ఆస్కార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వి. రవిచంద్రన్ నిర్మాతగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన భారీ చిత్రం "సూర్య S/o కృష్ణన్". హారిస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవల సోని...
Source: వినోదం | 10 Nov 2008 | 7:51 am

రాయలసీమ పర్యటనకు ప్రజారాజ్యం సిద్ధం!

ఉత్తరాంధ్ర, తెలంగాణా పర్యటనలు విజయవంతం కావడంతో సమరోత్సాహంలో ఉన్న ప్రజారాజ్యం.. అదే ఊపుతో రాయలసీమ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనకు ఇప్పటికే ప్రణాళికలు ఖరారు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 10 Nov 2008 | 7:04 am

క్రమశిక్షణా కమిటీ చర్య తీసుకుంటుంది: మొయిలీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్లను అమ్ముకున్నారని ఆరోపణలు చేసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మార్గరెట్ ఆల్వాపై పార్టీ క్రమశిక్షణా కమిటీ విచారించి చర్య తీసుకుంటుందని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్పమొయిలీ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 10 Nov 2008 | 6:29 am

మొద్దుశీను మృతదేహంతో బంధువుల రాస్తారోకో

అనంతపురం జిల్లా జైలులో దారుణ హత్యకు గురైన కరుడుగట్టిన హంతకుడు మొద్దుశీను మృతదేహం సొంత గ్రామం గుంటూరు జిల్లా నరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామానికి చేరింది. భౌతికకాయాన్ని స్వీకరించిన బంధువులు రీపోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. తెనాలి-నార్కెట్‌పల్లి రహదారిపై రాస్తారోకోకు దిగారు.
Source: ఏపీ న్యూస్ | 10 Nov 2008 | 5:48 am

ఆశిమానంద ఆశ్రమంలో ఏటీఎస్ తనిఖీలు

మాలేగావ్ బాంబు పేలుళ్లు 'తీగ లాగితే డొంక కదిలింది' అనే చందంగా మారాయి. ఈ పేలుళ్ళలో సంబంధం ఉన్నందుకు సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ను మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 10 Nov 2008 | 4:56 am

భలే మోసం చేశాను

ఒక పల్లెటూరి వాడు ఢిల్లీ వెళ్ళివచ్చి తన భార్యతో "నేను ఢిల్లీలో పోలీసులని భలే మోసం చేశాను" అని చెప్పాడు...
Source: వినోదం | 10 Nov 2008 | 4:43 am

కోర్టు ఇంజెక్షన్లు వచ్చేలా..!

"డాక్టరీ చదివి రాజకీయ నాయకుడైన మీరు మీ విద్యానుభవం ఎలా ఉపయోగిస్తున్నారు?"...
Source: వినోదం | 10 Nov 2008 | 4:41 am

నేడు మంత్రివర్గం భేటీ: కీలకాంశాలపై చర్చ

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశంకానుంది. సుమారు రెండు గంటల పాటు జరిగే ఈ సమావేశంలో కీలకాంశాలపై చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గతవారంలో తెలుగుదేశం పార్టీ గుంటూరులో నిర్వహించిన యువగర్జన, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రోడ్‌షోలు, అనంతపురం జిల్లా జైలులో దారుణ హత్యకు గురైన మొద్దుశీను హత్య తదితర అంశాలపై చర్చ జరుగనుంది.
Source: ఏపీ న్యూస్ | 10 Nov 2008 | 4:24 am

ఆ తర్వాతే లోక్‌సభ ఎన్నికలు: మంత్రి లాలూ

త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఆరంభమవుతుందని కేంద్ర రైల్వే శాఖామంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సూచన ప్రాయంగా వెల్లడించారు.
Source: జాతీయ | 10 Nov 2008 | 4:10 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2008 | 4:01 am

బుల్లితెరలో నేటి కార్యక్రమాలు

ఈటీవీ 06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 సినిమా 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ...
Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2008 | 3:57 am