మీరట్ పేలుళ్లపై విచారణకు యూపీ ఆదేశం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగిన పేలుళ్ళపై ఆ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మీరట్‌లో శనివారం రాత్రి జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున, గాయపడిన వారికి రూ.30 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.
Source: జాతీయ | 9 Nov 2008 | 10:07 am

బాబు దిగాజరుడు నిదర్శనం: వైఎస్సార్

మొద్దుశీను హత్య కేసులో తమ ప్రమేయం ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని వైఎస్సార్ అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 9 Nov 2008 | 8:58 am

కాశ్మీర్ అంశం ద్వైపాక్షిక సమస్య: ముఖర్జీ

కాశ్మీర్ సమస్య భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సమస్యగా కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బారక్ ఒబామా ఎన్నికైన మరుక్షణమే జమ్మూకాశ్మీర్‌పై ప్రత్యేక దూతగా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ను నియమించిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 9 Nov 2008 | 8:22 am

రాజ్‌థాక్రే కేసుపై 14న పాట్నా కోర్టు విచారణ

మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌థాక్రేపై దాఖలైన పిటీషన్‌పై పాట్నా కోర్టు ఈనెల 14వ తేదీన విచారణ జరుపనుంది. దురుద్దేశ పూర్వకంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినందుకు రాజ్‌థాక్రేపై న్యాయవాది కేశవ్ కుమార్ సిన్హా కేసు పాట్నా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
Source: జాతీయ | 9 Nov 2008 | 8:06 am

ప్రజా కోర్టులో వైఎస్ దోషి: చంద్రబాబు

రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రజాకోర్టులో దోషిగా మారక తప్పదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. మొద్దుశీను హత్యపై ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. పరిటాల రవీంద్ర హత్య కేసు బండారం బయటపడుతుందనే ఉద్దేశ్యంతోనే మొద్దుశీనును హత్య చేయించారని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Nov 2008 | 7:34 am

రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు: మంత్రి జానా

మొద్దుశీను హత్య కేసులో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పాత్ర ఉందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర హోంమంత్రి కె.జానారెడ్డి కొట్టిపారేశారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై తెదేపా నేతలు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 9 Nov 2008 | 7:19 am

ఎలాంటి విచారణకైనా సిద్ధం: మంత్రి జేసీ

అనంతపురం జిల్లా జైలులో హత్యకు గురైన మొద్దుశీను హత్య కేసులో తన ప్రమేయం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖామంత్రి జేసీ.దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసుపై ప్రభుత్వం ఆదేశించే ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని ఆయన ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Nov 2008 | 6:00 am

జైలులోకి ఆయుధాలు ఎలా వచ్చాయి?

తెలుగుదేశం పార్టీ కీలక నేత హత్య కేసులోని ముద్దాయిల్లో ఒకరైన మొద్దుశీనును హతమార్చేందుకు ఆయుధాలు జైలులోకి ఎలా వచ్చాయన్నది ప్రస్తుతం ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. సాధారణంగా జిల్లా కేంద్ర కారాగారాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉంటాయి.
Source: ఏపీ న్యూస్ | 9 Nov 2008 | 5:38 am

ఇది.. సూరి కుట్రే: శీను తల్లి రామకోటమ్మ

పరిటాల రవీంద్ర హత్య కేసుకు సూత్రధారి అయిన మద్దెలచెర్వు సూరి తన కుమారుడుని హత్య చేయించాడని మొద్దుశీను తల్లి రామకోటమ్మ ఆరోపించింది. సూరి పక్కా పథకం ప్రకారమే తన కుమారుడు ఉన్న అనంతపురం జైలుకు పంపి హత్య చేయించాడని ఆమె ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Nov 2008 | 5:14 am

అనంతపురం జైల్లో మొద్దుశీను హత్య

తెలుగుదేశం పార్టీ నే, దివంగత ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దుశీను అనంతపురం జిల్లా జైల్లో దారుణ హత్యకు గురయ్యాడు. జైలులోని రిమాండ్ ఖైదీల మధ్య జరిగిన ఘర్షణల్లో శీను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
Source: ఏపీ న్యూస్ | 9 Nov 2008 | 4:57 am

చిరుతిళ్లు, మద్యం కూడా వినాశకాలే : రాందాస్

చిరుతిళ్లు, మద్యం లాంటివి దేశ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అన్బుమణి రాందాస్ పేర్కొన్నారు. అందుకే చిరుతిళ్లు, మద్యం, మత్తు పదార్థాలు లాంటివాటిని దశలవారీగా నియత్రంచాల్సిన అవసరం ఉంది ఆయన పేర్కొన్నారు.
Source: జాతీయ | 8 Nov 2008 | 10:39 pm

త్వరలో బీసీ ఆత్మగౌరవ సభ : అల్లు అరవింద్

త్వరలో బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్టు ప్రజారాజ్యం పార్టీ కోర్ కమిటీ సభ్యుడు అల్లు అరవింద్ ప్రకటించారు. ఇటీవలికాలంలో రాష్ట్రం మొత్తంలో ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Nov 2008 | 9:36 pm

అయ్యప్ప భక్తులకు అధనపు భద్రత : ఆంటోనీ

ఈ నెల 16 నుంచి కేరళలోని శబరిమల యాత్రలో పాల్గొనే భక్తులకు సైనిక బలగాలతో గట్టి భద్రత ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ పేర్కొన్నారు. అయ్యప్పస్వామి భక్తులకు గట్టి భద్రత కల్పించే దిశగా కొద్దిరోజుల క్రితం కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ కేంద్రాన్ని అభ్యర్ధించిన...
Source: జాతీయ | 8 Nov 2008 | 9:25 pm

కాంగ్రెస్‌ను రద్దు చేయాల్సింది ప్రజలే : మోడీ

కేంద్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాల్సిన పని ప్రజలదేనని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక కాంగ్రెస్‌ను రద్దు చేయాలంటూ మహత్మాగాంధీ కోరారని అయితే అది ఇప్పటివరకు సాధ్యం కాలేదని అందువల్ల ప్రజలే ఆ పనికి పూనుకోవాలని ఆయన...
Source: జాతీయ | 8 Nov 2008 | 8:45 pm

చిరుతోనే సామాజిక న్యాయం : జోగయ్య

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితోనే సామాజిక న్యాయం సాధ్యమని ఆ పార్టీ నేత చేగొండి హరిరామ జోగయ్య పేర్కొన్నారు. బడుగులకు, బీసీలక రాజ్యాధికారం ఇవ్వాలన్న ఆశయంతోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని ఈ సందర్భంగా జోగయ్య వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Nov 2008 | 8:03 pm

పీఆర్పీ సహనం కోల్పోతోంది : రఘువీరా

ప్రజారాజ్యం పార్టీ సహనం కోల్పోతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తాము మాత్రం ఎవరిపైనా విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టబోమంటూ పేర్కొన్న ఆ పార్టీ రెండు నెలలు కాకముందే మాట తప్పిందని రఘువీరా పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Nov 2008 | 7:34 pm

ఒమన్‌లో ప్రధాని : సంయక్త నిధి ఏర్పాటు

గల్ఫ్ దేశమైన ఒమన్ పర్యటనలో భాగంగా ప్రధాని మన్మోహన్ శనివారం మస్కట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్‌కు ఒమన్ ఉప ప్రధాని సయ్యిద్ ఫహ్ద్ బిన్ మహమూద్ బిన్ మహ్మద్ అల్ సెడ్ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 50 కోట్లతో భారత్-ఒమన్ నిధిని ఏర్పాటు...
Source: జాతీయ | 8 Nov 2008 | 6:22 pm

హద్దుదాటే ప్రయత్నం : ముగ్గురు తీవ్రవాదుల హతం

దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు చొరబాటుదారులను భారత సరిహద్దు దళాలు మట్టుబెట్టాయి. జమ్మూకాశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలోని సబ్జియాన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో మృతి చెందినవారు లష్కరే తొయిబాకు చెందిన తీవ్రవాదులుగా భద్రతా దళాలు పేర్కొంటున్నాయి.
Source: జాతీయ | 8 Nov 2008 | 5:47 pm

మీరట్‌లో పేలుళ్లు : ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో శనివారం సాయంత్రం సంభవించిన పేలుళ్లలో ఐదుగురు మృతి చెందగా మరో ఆరుగురికి గాయలయ్యాయి. నగరంలోని ఓ ఇనుప సామాన్ల దుకాణంలో ఈ పేలుడు సంఘటన చోటు చేసుకుంది.
Source: జాతీయ | 8 Nov 2008 | 5:22 pm

ఆర్మీ ఆస్పత్రి నుంచి సోమనాథ్ డిశ్చార్జ్

లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆస్పత్రి నుంచి శనివారం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అయితే ఒక వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతిలో ఉండాలని సోమనాథ్‌కు డాక్టర్లు సూచించారు.
Source: జాతీయ | 8 Nov 2008 | 12:09 pm