మార్పును కోరుకుంటున్న ప్రజలు: చిరంజీవి

రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి జోస్యం చెప్పారు. అమెరికాలో మార్పు అనే నినాదంతో నల్లజాతి వజ్రం బారక్ ఒబామా చరిత్ర సృష్టించారని, అలాంటి మార్పు కోసం రాష్ట్ర ప్రజలు వేసి చూస్తున్నారని చిరు అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 6 Nov 2008 | 9:17 am

ప్రారంభమైన "ఓ.. ఉదయం... ఓ.. సాయంత్రం"

"ఓ.. ఉదయం... ఓ.. సాయంత్రం" అనే చిత్రానికి మలయాళ దర్శకుడు తనుబాలక్ దర్శకత్వం వహిస్తున్నారు. "కాశీపట్నం చూడరబాబూ!" ఫేమ్ ఆనంద్ హీరోగా, "డేంజర్" ఫేమ్ షెరేన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వర్మ.ఎస్. ఏపూరి నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న...
Source: వినోదం | 6 Nov 2008 | 9:00 am

మాకూ వేతనాలు పెంచరూ: కేజీ బాలకృష్ణన్

దేశంలో వివిధ కోర్టుల్లో పని చేస్తున్న న్యాయమూర్తుల జీతభత్యాలను కూడా పెంచాలని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 6 Nov 2008 | 8:46 am

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం: మొయిలీ

వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యువగర్జన సభ కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 6 Nov 2008 | 8:02 am

మాలేగావ్‌ పేలుళ్లు: ఆర్మీ అధికారి అరెస్టు

మాలేగావ్ పెలుళ్ల కేసులో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన ఆర్మీ అధికారిని మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) అరెస్టు చేసింది. గత సెప్టెంబరులో మహారాష్ట్రలోని మాలేగావ్‌లో వరుస పేలుళ్లు జరుగగా, ఐదుగురు దుర్మరణం పాలైన విషయం తెల్సిందే. గత ఐదు రోజుల పాటు లెఫ్టినెంట్ కనల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్‌ వద్ద పోలీసులు విచారణ జరిపారు.
Source: జాతీయ | 6 Nov 2008 | 7:50 am

మార్పును కోరుకుంటున్న ప్రజలు: అద్వానీ

ప్రస్తుతం దేశ ప్రజలంతా మార్పును ఆశిస్తున్నరాని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ అభిప్రాయపడ్డారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 6 Nov 2008 | 6:15 am

తెదేపాతోనే ఎన్నికల పొత్తు: కారత్

వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతోనే పొత్తు పెట్టుకుంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ పొత్తుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీతో వెళ్లాలన్న విషయంపై ఒక నిర్ణయానికి వచ్చామని చెప్పారు.
Source: జాతీయ | 6 Nov 2008 | 6:15 am

కాళ్ళు లేవు గనుకే

"భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుంది?" అడిగాడు సూర్యం...
Source: వినోదం | 6 Nov 2008 | 4:36 am

లంగ్ క్యాన్సర్

"ఓ సిగరెట్ వుంటే ఇస్తావా?" అడిగాడు అముల్...
Source: వినోదం | 6 Nov 2008 | 4:35 am

తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి: బాలకృష్ణ

రాష్ట్రంలోని 43 జిల్లాల యువశక్తి "యువగర్జన" సభా ప్రాంగణంలో చూస్తుంటే... తన కళ్లు చల్లబడ్డాయని యువ హీరో బాలకృష్ణ తెలిపారు. తెలుగు కీర్తికి కృషి చేసిన తన తండ్రి అయిన ఎన్టీఆర్‌‌కు యువగర్జన సభలో ఈ సందర్భంగా బాలయ్య నమస్కరించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Nov 2008 | 4:03 am

ఒక్క పోలీసూ కనబడలేదు: చంద్రబాబు

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన "యువగర్జన" సభకు ఒకవైపు తండోపతండాలుగా జనులు తరలి వస్తుంటే... మరోవైపు జన సంద్రంతో ట్రాఫిక్‌‌కు అంతరాయం కలిగితే విజయవాడ రోడ్డుల్లో ఓ పోలీసు కూడా కనబడ లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరియే నిదర్శనమని బాబు ఎత్తి చూపారు.
Source: ఏపీ న్యూస్ | 6 Nov 2008 | 4:01 am

చంద్రబాబుకు పట్టం కట్టండి: బాలయ్య

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు పట్టం కట్టాలని యువహీరో బాలయ్య పిలుపునిచ్చారు. అసంభవాన్ని సంభవం చేయగల సత్తా ఒక్క తెలుగువారికి మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు సంక్షేమం జరగడం లేదని బాలయ్య ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Nov 2008 | 4:00 am

నవంబరు 06, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి
Source: Yahoo! Telugu: Entertainment | 6 Nov 2008 | 3:27 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 6 Nov 2008 | 3:25 am

పరీక్షల్లో మోసాలు... ఉపేక్షించకండి : సుప్రీం

పరీక్షల్లో మోసాలకు, అక్రమాలకు పాల్పడేవారిపై ఉపేంక్షించరాదని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాంటివారిని కఠినంగా శిక్షించే అంశంలో ఉపేక్షించవద్దని సుప్రీం సూచించింది. ఓ కేసు విచారణలో భాగంగా న్యాయవాదులు జస్టిస్ అల్టమమాన్ కబీర్, జస్టిస్ మార్కెడేయ కాట్టులతో కూడిన ధర్మాసనం పై విధంగా...
Source: జాతీయ | 6 Nov 2008 | 12:18 am

వరకట్నం దోషులకు శిక్ష తగ్గించబోం : సుప్రీం

వరకట్నం కేసులో ముద్దాయిగా శిక్ష ఎదుర్కొంటున్న నేరస్థులను శిక్షా కాలానికి ముందే విడుదల చేయడం ప్రభుత్వం చేతిలో లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. వరకట్నం కేసులో శిక్ష పడినవారు శిక్షను పూర్తిగా అనుభవించి తీరాల్సిందేనని కోర్టు పేర్కొంది.
Source: జాతీయ | 5 Nov 2008 | 10:02 pm

భారత్‌లో పోలీయో వాక్సిన్ కోసం గేట్స్ సాయం

పోలీయో నిర్మూలనా కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పోలియో నిరోధానికి చిన్న పిల్లల్లో వేస్తున్న చుక్కల మందుతో పాటు ఇంజక్షన్స్ కూడా చేసేందుకు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలో ప్రారంభం...
Source: జాతీయ | 5 Nov 2008 | 9:50 pm

శబరి యాత్రకు భారీ ఏర్పాట్లు : కేరళ ప్రభుత్వం

ఈ నెల 15 నుంచి శబరి మలై అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు రావడం ప్రారంభం అవుతుందని కేరళ ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా అయ్యప్ప దర్శనానికి వచ్చేవారి సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాటు చేశామని ప్రభుత్వం పేర్కొంది.
Source: జాతీయ | 5 Nov 2008 | 9:22 pm

రాష్ట్రంలో పొత్తులు ఖరారు : త్వరలో వివరాలు

రాష్ట్రంలో ఏ పార్టీతో ఎన్నికల పొత్త పెట్టుకోవాలనే అంశంలో తాము ఓ నిర్ధరణకు వచ్చినట్టు సీపీఎం పొలిట్‌‍బ్యూరో సభ్యుడు సీతారం ఏచూరి తెలిపారు. తాము తీసుకున్న ఈ నిర్మయాన్ని పూర్తి వివరాలతో కొద్దిరోజుల్లోనే వెల్లడిస్తామని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Nov 2008 | 9:22 pm

పదివేల గిరిజన ఉద్యోగాలు : ప్రభుత్వం

ప్రభుత్వ శాఖల్లో ఇప్పటివరకు ఖాళీగా ఉన్న ఎస్టీ బ్యాక్‌లాగ్ రిజర్వడ్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రెడ్యా నాయక్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రకాల సంస్థలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 5 Nov 2008 | 8:13 pm

బాబు మాటలు వాస్తవం కాబోవు : రోశయ్య

యువగర్జన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్న వ్యాఖ్యలేవీ వాస్తవం కాబోవని రాష్ట్ర అర్థికమంత్రి రోశయ్య పేర్కొన్నారు. తాను తిరిగి అధికారంలోకి రావడం జరిగేపని కాదని తెలిసినా చంద్రబాబు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని ఈ సందర్భంగా రోశయ్య ఎద్దేవా చేశారు.
Source: ఏపీ న్యూస్ | 5 Nov 2008 | 7:36 pm

ముఖ్యమంత్రి చంద్రబాబే: జనార్థన రెడ్డి

వచ్చే ఎన్నికల్లో తెదేపా విజయం సాధించి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలంకరిస్తారని తెదేపా సీనియర్ నేత నాగం జనార్ధన రెడ్డి జోస్యం చెప్పారు. "యువగర్జన" సభలో ఆయన మాట్లాడుతూ... సభకు విచ్చేసిన అభిమానులు, ప్రజలు, కార్యకర్తలను చూస్తుంటే... తమకు 30 సంవత్సరాలు తిరిగి వచ్చినట్లుందని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 5 Nov 2008 | 12:20 pm

పార్టీ నేత చెంప చెళ్లుమనిపించిన ఉమాభారతి

దురుసుతనానికి, దూకుడుతనానికి మారుపేరుగా వార్తల్లో నిలిచిన భారతీయ జనశక్తి పార్టీ అధ్యక్షురాలు ఉమాభారతి తన సొంత పార్టీకి చెందిన జిల్లా కార్యదర్శి చెంప పగులగొట్టడమే కాక తనకా హక్కుందని ధీమాగా ప్రకటించేశారు.
Source: జాతీయ | 5 Nov 2008 | 12:14 pm

ఈ నెల చివరి వారంలో ఇందుమతి

గతంలో "అందరూ దొంగలే" చిత్రాన్ని రూపొందించిన జియో మీడియా ఆర్ట్స్ అధినేత హర్షారెడ్డి తాజాగా స్వీయదర్శకత్వంలో "ఇందుమతి" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివాజీ, శ్వేతాభరద్వాజ్, విజయ్, రఘుబాబు, హర్షవర్ధన్, శ్రీనివాస్‌రెడ్డి, తులసి, గిరిబాబు,
Source: Yahoo! Telugu: Entertainment | 5 Nov 2008 | 12:01 pm

ఉదయ్ చెప్పిన ఏక్‌లవ్‌యుడు ముచ్చట్లు

"చిత్రం", "నువ్వు-నేను", "మనసంతా నువ్వే" తదితర విజయవంతమైన చిత్రాలతో లవర్‌బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఉదయ్ తదనంతరం పట్టుకోల్పోయాడు. తరువాత వచ్చిన చిత్రాలు అంతగా విజయాలు సాధించకపోవడంతో
Source: Yahoo! Telugu: Entertainment | 5 Nov 2008 | 12:01 pm

మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 511 పాయింట్ల పతనం

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం నష్టాల బాటలో పయనించింది. 300 పాయింట్ల వృద్ధితో 10,931 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం 10,945 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అయితే సెన్సెక్స్ తరువాత భారీ అమ్మకాల కారణంగా లాభాలను
Source: Yahoo! Telugu: News | 5 Nov 2008 | 12:00 pm