|
చంద్రబాబుకు పట్టం కట్టండి: బాలయ్యతెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు పట్టం కట్టాలని యువహీరో బాలయ్య పిలుపునిచ్చారు. అసంభవాన్ని సంభవం చేయగల సత్తా ఒక్క తెలుగువారికి మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు సంక్షేమం జరగడం లేదని బాలయ్య ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2008 | 12:43 pm తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి: బాలకృష్ణరాష్ట్రంలోని 43 జిల్లాల యువశక్తి "యువగర్జన" సభా ప్రాంగణంలో చూస్తుంటే... తన కళ్లు చల్లబడ్డాయని యువ హీరో బాలకృష్ణ తెలిపారు. తెలుగు కీర్తికి కృషి చేసిన తన తండ్రి అయిన ఎన్టీఆర్‌కు యువగర్జన సభలో ఈ సందర్భంగా బాలయ్య నమస్కరించారు.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2008 | 12:31 pm ముఖ్యమంత్రి చంద్రబాబే: జనార్థన రెడ్డివచ్చే ఎన్నికల్లో తెదేపా విజయం సాధించి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలంకరిస్తారని తెదేపా సీనియర్ నేత నాగం జనార్ధన రెడ్డి జోస్యం చెప్పారు. "యువగర్జన" సభలో ఆయన మాట్లాడుతూ... సభకు విచ్చేసిన అభిమానులు, ప్రజలు, కార్యకర్తలను చూస్తుంటే... తమకు 30 సంవత్సరాలు తిరిగి వచ్చినట్లుందని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2008 | 12:20 pm ఒక్క పోలీసూ కనబడలేదు: చంద్రబాబుగుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన "యువగర్జన" సభకు ఒకవైపు తండోపతండాలుగా జనులు తరలి వస్తుంటే... మరోవైపు జన సంద్రంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగితే విజయవాడ రోడ్డుల్లో ఓ పోలీసు కూడా కనబడ లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరియే నిదర్శనమని బాబు ఎత్తి చూపారు.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2008 | 12:17 pm పార్టీ నేత చెంప చెళ్లుమనిపించిన ఉమాభారతిదురుసుతనానికి, దూకుడుతనానికి మారుపేరుగా వార్తల్లో నిలిచిన భారతీయ జనశక్తి పార్టీ అధ్యక్షురాలు ఉమాభారతి తన సొంత పార్టీకి చెందిన జిల్లా కార్యదర్శి చెంప పగులగొట్టడమే కాక తనకా హక్కుందని ధీమాగా ప్రకటించేశారు.Source: జాతీయ | 5 Nov 2008 | 12:14 pm ఎన్టీఆర్‌కు నందమూరి వారసుల ఘననివాళితెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రతిష్టాత్మక "యువగర్జన" వేదికపై ఒక్కటైన నందమూరి వారసులు ప్రజలకు అభివాదాలు తెలియజేశారు. అనంతరం యువగర్జన వేదిక ప్రాంగణంలో అలంకరించబడిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, తారకరత్న పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2008 | 11:43 am గర్జించేది మృగాలే... మనుషులు కాదు: కన్నాతెలుగుదేశం పార్టీ యువగర్జన ముసలి గర్జనతో కూడుకుని ఉందని, అందులో కుర్రాళ్లెవరూ లేరని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. అయినా గర్జించేది మృగాలు కానీ మనుషులెలా గర్జిస్తారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2008 | 11:40 am ప్రజాకంఠక పాలన అంతమొందాలి: టీడిపి గర్జనరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి ప్రజాకంఠక పాలనను అంతమొందించాలని టీడీపీ గర్జిస్తోంది. గుంటూరులో టీడీపీ చేపట్టిన యువగర్జన సభకు సమయం ఆసన్నమైంది. నందమూరి యువహీరోలైన కళ్యాణ్ రామ్, తారక రత్న, లోక్‌సభ సభ్యుడు హరికృష్ణ, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరుకు చేరుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2008 | 11:21 am "యువగర్జన" వేదికపై నందమూరి వారసులుతెలుగుదేశం పార్టీ వ్యవస్థాకుడు నందమూరి తారక రామారావు వంశధారలు వేదికపై ఒక్కటయ్యారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, తారకరత్న, పార్టీ సీనియర్ నేతలు వేదికపై కలిసికట్టుగా నిలబడ్డారు.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2008 | 11:15 am 'గుడ్లు' వేసినవారికి అభివందనాలు : చిరుతన మెడలో దండలు వేసినవారికే కాక తనపై కోడి గుడ్లు వేసినవారికి కూడా వందనాలు తెలపడం ద్వారా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన హుందాతనాన్ని కాపాడుకున్నారు. ప్రజా అంకితయాత్ర సందర్భంగా జన సందోహంలోంచి గుర్తు తెలియని వ్యక్తులు చిరంజీవిపై కోడిగుడ్లు విసరడం...Source: ఏపీ న్యూస్ | 5 Nov 2008 | 11:12 am హరికృష్ణ మాటలు బాధాకరం: పురంధరేశ్వరితెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును "మా నాయకుడు" అని తన సోదరుడైన రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ చెప్పడం బాధాకరమని కేంద్ర మంత్రి పురంధరేశ్వరి చెప్పారు. తండ్రికి అన్యాయం చేసిన, అవమానించిన చంద్రబాబును సీఎంను చేస్తానని హరికృష్ణ చెప్పడం ఆందోళన కరమని ఆమె వాపోయారు.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2008 | 11:08 am ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతపై పాటిల్ సమీక్షకేంద్ర హోం శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ ఈశాన్య భారత ప్రాంతంలో భద్రతా ప్రమాదం గురించి న్యూఢిల్లీలో అత్యున్నత స్థాయి పోలీసు అధికారులతో చర్చించారు. ఈశాన్య రాష్ట్రాలలోను, సరిహద్దులనుంచి వస్తున్న ఉగ్రవాద ప్రమాదాన్ని అడ్డుకునేందుకు గాను తాజాగా భద్రతా వ్యూహాన్ని పాటిల్ ప్రకటించనున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.Source: జాతీయ | 5 Nov 2008 | 10:00 am బారక్ ఒబామాకు మన్మోహన్ అభినందనలుఅమెరికా నూతన అధ్యక్షుడిగా చారిత్రాత్మక విజయం సాధించిన సెనేటర్ బారక్ ఒబామాను భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ అభినందనలు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా తన హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నట్లుగా ప్రధాని సందేశం పంపారు.Source: జాతీయ | 5 Nov 2008 | 9:00 am ఒబామా హయాంలో సంబంధాల పురోగతి: కాంగ్రెస్అమెరికా 44వ అధ్యక్షుడిగా ఎంపికైన బారక్ ఒబామా హయాంలో అమెరికా భారత్ సంబంధాలు మరింత దృఢతరమవుతాయని కాంగ్రెస్ పార్టీ విశ్వాసం ప్రకటించింది. యువశక్తికి, ఉప్పొంగే క్రియాశీలత్వానికి, ప్రగతి శీల వైఖరికి ఒబామా సంకేతంగా నిలిచారని, భారత్‌ను కూడా ప్రస్తుతం ఇవే నడిపిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి చెప్పారు.Source: జాతీయ | 5 Nov 2008 | 7:00 am ఆర్జేడీ ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామామహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఉత్తర భారతీయులకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో చేపట్టిన హింసాత్మక చర్యలకు నిరసనగా రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీలు, ఎమ్మెల్యేలలో అత్యధిక శాతం తమ రాజీనామాలను సమర్పించారు. ఆర్జేడీ అధ్యక్షుడు, రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇచ్చిన పిలువు మేరకు వీరు పార్టీ నాయకత్వానికి తమ రాజీనామా లేఖలను అందించారు.Source: జాతీయ | 5 Nov 2008 | 4:00 am భీంసేన్ జోషిని వరించిన భారత రత్నప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు భీంసేన్ జోషీకి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత రత్నను ప్రకటించింది. సంగీత లోకానికి జోషీ చేసిన సేవలను ప్రశంసిస్తూ దేశ అత్యున్నత పురస్కారాన్ని కట్టబెడుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.Source: జాతీయ | 4 Nov 2008 | 8:57 pm బాలిక రేప్ కేసు : మంత్రి కుమారుడు లొంగుబాటుఓ పధ్నాలుగేళ్ల జర్మన్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న గోవా విద్యాశాఖ మంత్రి కుమారుడు రోహిత్ పోలీసులకు లొంగిపోయాడు. దాదాపు మూడు వారాలుగా తప్పించుకు తిరుగుతున్న రోహిత్ నాటకీయ పరిమాణాల మధ్య పోలీసులకు లొంగిపోవడం విశేషం.Source: జాతీయ | 4 Nov 2008 | 6:30 pm గంగ పరిరక్షణ కోసం చర్యలు : కేంద్రంహిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా నదిని పరిరక్షించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా గంగానదిని జాతీయ నదిగా గుర్తించేందుకు కేంద్రం సంకల్పించింది. ఈ విషయమై ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.Source: జాతీయ | 4 Nov 2008 | 6:01 pm
|