తెదేపాకు పూర్వ వైభవాన్ని కల్పిస్తాం: బాబు

తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో యువగర్జన పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు.
Source: ఏపీ న్యూస్ | 4 Nov 2008 | 12:00 pm

తెలంగాణపై మేమే ముందున్నాం : చిరంజీవి

ప్రత్యేక తెలంగాణ అంశంలో అందరికంటే తాము ముందున్నామని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొన్నారు. తెలంగాణ అంశంపై అన్ని పార్టీలకంటే చిరంజీవి ఓ అడుగు ముందే ఉన్నారన్న కొందరి నేతల వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని ఆయన వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 4 Nov 2008 | 11:03 am

యధేచ్చగా తరలుతున్న బియ్యం

రాష్ట్రంలో బియ్యం కొరత తీవ్రంగా ఉంది. దీన్ని సాకుగా చూపిన బియ్యం వ్యాపారులు, రైస్ మిల్లర్లు తమ ఇష్టరాజ్యంగా బియ్యం ధరలను పెంచేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 4 Nov 2008 | 10:59 am

కాంగ్రెస్-తెదేపాలకు సమాన దూరం: చిరు

రాష్ట్రంలో నూతన ఒరవడికి నాంది పలికేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు సమానదూరం పాటిస్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. ప్రజాఅంకిత యాత్రలో బిజిబిజీగా ఉన్న ఆయన కొద్దిగా వెసులుబాటు చేసుకుని ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 4 Nov 2008 | 9:01 am

లోయలో పడిన బస్సు: 20 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కోటిఘాట్‌ నుంచి రాష్ట్ర రాజధాని సిమ్లాకు వెళుతున్న ఒక బస్సు లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడ్డారు. ఫగు అనే ప్రాంతానికి సమీపంలోని లంభి అనే ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
Source: జాతీయ | 4 Nov 2008 | 8:08 am

ది ఎక్స్ ఫ్యాక్టర్.. ఉమనైజర్... బ్రిట్నీ

బ్రిట్నీ స్పియర్స్... పాప్ స్టార్స్‌లోకెల్లా సూపర్ స్టార్. ఆమె త్వరలో ప్రపంచ యాత్రకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా గ్యాప్ తర్వాత బ్రిట్నీ సరికొత్తగా కనిపించబోతోందని దేశరాజధాని ఢిల్లీలో సిమన్ కొవెల్ ప్రకటించాడు.
Source: వినోదం | 4 Nov 2008 | 7:40 am

మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి: అశ్వినీదత్

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపును సాధిస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే అలంకరిస్తారని సినీ నిర్మాత అశ్వినీదత్ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 4 Nov 2008 | 7:08 am

"భూమి పుత్రుల" నినాదంతో హాని లేదు: కాంగ్రెస్

ప్రభుత్వ కొలువుల్లో స్థానికులకే పెద్దపీట వేయాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చేస్తున్న డిమాండ్ పట్ల కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగా స్పందించింది. ఎంఎన్ఎస్‌ చేపట్టిన "మరాఠీ మానూస్" (జన్మభూమి సిద్ధాంతం)కు కేంద్ర మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మద్దతు తెలిపిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 4 Nov 2008 | 6:31 am

మాలేగావ్ పేలుళ్ళకు 'రాజకీయ రంగు'

దేశంలో సంచలనం సృష్టించిన మాలేగావ్ పేలుళ్ళకు చిన్నగా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు మద్దతుగా శివసేన వంటి సంఘ్ పరివార్ వంటి హిందూ మత శక్తులు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
Source: జాతీయ | 4 Nov 2008 | 6:07 am

అఫ్జల్‌పై కాంగ్రెస్‌కు దయ లేదు: అహ్మద్

పార్లమెంట్ దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జుల్ గురుపై కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం దయ లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ స్పష్టం చేశారు. అఫ్జల్ గురు దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటీషన్ పరిశీలనలో ఉందని అందువల్ల శిక్ష అమలులో జాప్యం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.
Source: జాతీయ | 4 Nov 2008 | 5:32 am

ఢిల్లీలో రాష్ట్రీయ శివసేన కార్యకర్తల వీరంగం

ప్రాంతీయ విద్వేషాలు దేశ రాజధానికి కూడా ప్రాకాయి. మహారాష్ట్రలో ఉత్తరభారతీయులపై జరుగుతున్న దాడులకు నిరసనగా.. న్యూఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌ (భవనం)పై శివసేన చీలిక వర్గం రాష్ట్రీయ శివసేన దాడి చేసింది.
Source: జాతీయ | 4 Nov 2008 | 5:05 am

ఆహార కుంభకోణం: 9 మందిపై ఎఫ్ఐఆర్

దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాజకీయ సంచనాలకు కేంద్ర బిందువు. అలాగే కుంభకోణాలకు పెట్టింది పేరుగా మారుతోంది. గతంలో తాజ్‌కారిడార్ కుంభకోణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. తాజాగా 35 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆహార ధాన్యాల కుంభకోణం వెలుగు చూడగా, దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి కేంద్ర నేరపరిశోధన బృందం (సీబీఐ) విచారణకు ఆదేశించింది.
Source: జాతీయ | 4 Nov 2008 | 4:49 am

ఎన్నికలకు 530 మంది పరిశీలకుల నియామకం

ఈనెలలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అంసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం 530 మంది పరిశీలకులను నియమించింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు వివిధ దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
Source: జాతీయ | 4 Nov 2008 | 4:36 am

టెలికం డిపార్టుమెంటు

కొత్తగా ప్రాక్టీసు ప్రారంభించిన ఓ కుర్రలాయరు దగ్గరికి మొదటగా ఓ క్లైంట్ రావడం గమనించిన అతను ఈ విధంగా మాట్లాడుతున్నాడు...
Source: వినోదం | 4 Nov 2008 | 4:28 am

స్టూలుపైకి ఎక్కి...!

సవతి కొడుకు మీద ఉన్న కసి కొద్దీ వాడి ముక్కు గట్టిగా కొరికింది సుందరమ్మ...
Source: వినోదం | 4 Nov 2008 | 4:26 am

మాట వినకుంటే సమ్మె చేస్తాం : ఎన్ఎంయూ

కొన్నాళ్లుగా సమ్మె శబ్ధం వినిపించని ఆర్టీసీలో మళ్లీ సమ్మె శంఖం వినిపించే సూచనలు కన్పిస్తున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 16న సమ్మె ప్రారంభిస్తామంటూ ఆర్టీసీ గుర్తింపు యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) ప్రకటించింది. ఇందులో భాగంగా ఎన్ఎంయూ...
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2008 | 10:54 pm

పాశ్వాన్‌కు భద్రత పెంపు : ప్రధాని హామీ

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కు అవసరమైన భద్రతను కల్పిస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ఆయన పాశ్వాన్‌కు హామీ కూడా ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో పాశ్వాన్‌పై బాంబు దాడి జరిగిన అనంతరం ప్రధాని ఈ హామీ ఇవ్వడం గమనార్హం.
Source: జాతీయ | 3 Nov 2008 | 7:50 pm

బాబు అక్రమ ఆస్థుల చిట్టా ఇదిగో... ఉండవల్లి

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేల ఎకరాల భూమిని అక్రమంగా సంపాధించారని కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ ఆస్థులకు సంబంధించిన వివరాలను ఉండవల్లి ఓ బుక్‌లెట్ రూపంలో విడుదల చేయడం విశేషం.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2008 | 6:45 pm

దొంగకోసం పోలీసుల పాగా : విద్యార్థి బలి

ఓ దొంగను పట్టుకోవడం కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ అమాయక విద్యార్ధి బలైన ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా విద్యార్ధిపై కాల్పులు జరిపిన పోలీసులు ఆపై పొరబాటు జరిగిందంటూ ప్రకటించడం గమనార్హం.
Source: జాతీయ | 3 Nov 2008 | 6:14 pm

ముగిసిన టీచర్ల సమ్మె : అసంతృప్తితో జాక్టో

గత 13 రోజులుగా అనధికారికంగా మూతపడిన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు మంగళవారం నుంచి తెరచుకోనున్నాయి. ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ఆధ్వర్యంలో సమ్మె బాట పట్టిన లక్షలాది టీచర్లు మళ్లీ విధులకు హాజరుకానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి...
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2008 | 5:50 pm

బాలిక రేప్ కేసు : మంత్రి కుమారుని కోసం వేట

గోవాలో ఇటీవల జర్మనీ బాలికపై జరిగిన అత్యాచారంలో నిందితునిగా పేర్కొనబడుతోన్న ఆ రాష్ట్ర మంత్రి కుమారుని కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. గోవా విద్యాశాఖ మంత్రి అంటానాసియో మోన్‌సెరట్టేస్ కుమారుడైన రోహిత్‌ తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ సదరు జర్మన్ బాలిక...
Source: జాతీయ | 3 Nov 2008 | 5:30 pm

జగన్‌ నువ్వు రావాలి : కాంగ్రెస్ పిలుపు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. ఇందుకోసం విశాఖ జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఓ ప్రదర్శనను సైతం ఏర్పాటు చేయనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2008 | 5:03 pm

చిరు వ్యాఖ్యలపై మంత్రి బొత్సా ధ్వజం

అవినీతిని అంతమొందిస్తానని ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ మండిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2008 | 12:12 pm

టాక్సీ డ్రైవర్‌గా "యువరాజు"

"అతడు" తర్వాత మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో మహేష్ బాబు టాక్సీ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. ఒక కథానాయికగా పార్వతీ...
Source: వినోదం | 3 Nov 2008 | 12:10 pm

ఉల్లాసంగా... ఉత్సాహంగా..." ట్రైలర్

యశోసాగర్ హీరోగా, స్నేహఉల్లాల్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం "ఉల్లాసంగా... ఉత్సాహంగా..." అమృత్ అమరనాథ్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి కరుణాకర్ దర్శకత్వం వహించారు. గతంలో పవన్‌కళ్యాణ్ హీరోగా వచ్చిన "తొలిప్రేమ" చిత్రం ద్వారా కరుణాకర్...
Source: వినోదం | 3 Nov 2008 | 12:01 pm

"నిన్న నేడు రేపు" ట్రైలర్ మీ కోసం...

ఎస్.పి.ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవికృష్ణ, అక్షర, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించి తెరకెక్కిన చిత్రం "నిన్న నేడు రేపు". "హైదరాబాద్ నవాబ్స్" ఫేం లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో నూకారపు సూర్యప్రకాశ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో...
Source: వినోదం | 3 Nov 2008 | 11:56 am