వరంగల్‌లో చిరంజీవి పర్యటన

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి సోమవారం వరంగల్‌లో విస్తృతంగా పర్యటించనున్నారు. వరంగల్ జిల్లా కేంద్రం నుంచి చిరంజీవి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా అంకితయాత్ర ప్రారంభంకానుంది.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2008 | 10:27 am

వైభవంగా తితిదే నాలుగో విడత కళ్యాణమస్తు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నాలుగో విడత కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా 7500 జంటలు ఒకటయ్యాయి. రాష్ట్రంలోని 294 నియోజక వర్గాల్లో తితిదే కల్యాణమస్తును ఘనంగా నిర్వహించింది. ఆదివారం శుక్లపక్ష పంచమి ఉదయం 10.55 గంటల నుంచి 11.10 గంటల మధ్య మూల నక్షత్రం, ధనుర్లగ్నం శుభముహూర్తంలో ఈ సామూహిక వివాహాలు జరిగాయి.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2008 | 10:21 am

యువగర్జన ఏర్పాట్లు ముమ్మరం: తెదేపా

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న యువగర్జన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గుంటూరు సమీపంలో జరుగుతున్న వీటిని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మైసూరా రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావులు పరిశీలించారు.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2008 | 10:16 am

మందుపాతర పేలుడు: ఎనిమిది మంది అరెస్ట్

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌లను లక్ష్యంగా చేసుకొని ఆదివారం జరిగిన మందుపాతర పేలుడుకు సంబంధించి పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఆదివారం ఈ ఇద్దరు
Source: Yahoo! Telugu: News | 3 Nov 2008 | 10:04 am

యువగర్జనపై మంత్రి కన్నా విసుర్లు

యువగర్జన నిర్వహణపై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖామంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ధ్వజమెత్తారు. ఆయన కృష్ణా జిల్లాలో ఒక రోజు పాటు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కూచిపూడి నాట్యానికి పుట్టినిల్లుగా పేరొందిన కూచిపూడిలో ఆర్టీసీ బస్టాండును మంత్రి ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2008 | 10:02 am

చంద్రబాబుచే యువగర్జన సీడీ ఆవిష్కరణ

టీడీపీ గుంటూరులో మంగళవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న యువగర్జన సభకు సంబంధించిన సీడీని పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు సోమవారం ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌కు సంబంధించిన విశేషాలను సీడీలో పొందుపరిచిన ఈ సీడీలో యువగర్జనకు సంబంధించిన పాటలను కూడా పొందుపరిచారు.
Source: Yahoo! Telugu: News | 3 Nov 2008 | 10:01 am

చర్చల సఫలంతో జాక్టో సమ్మె విరమణ

ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో పదమూడు రోజులుగా చేపడుతున్న సమ్మెను విరమిస్తున్నట్టు ఉపాధ్యాయ సంఘం నేతలు ప్రకటించారు. మంగళవారం నుంచి విధులకు హాజరు కానున్నామని తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 3 Nov 2008 | 10:00 am

భారత్‌పై సంక్షోభం ప్రభావం: ప్రధాని హెచ్చరిక

అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావం భారత్‌పై ఉంటుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థను ఈ సంక్షోభం ప్రభావితం చేస్తుందని ప్రధాని సోమవారం హెచ్చరించారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు
Source: Yahoo! Telugu: News | 3 Nov 2008 | 9:55 am

తరువాతి తరాలకు కుంబ్లే స్ఫూర్తి: సచిన్

క్రికెట్‌కు ఆదివారం రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా టెస్ట్ కెప్టెన్ అనిల్ కుంబ్లే, మేటి లెగ్‌స్పిన్నర్ అనిల్ కుంబ్లే భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాడని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. అతనొక గొప్ప క్రికెటర్. తరువాతి తరాలకు
Source: Yahoo! Telugu: News | 3 Nov 2008 | 9:46 am

చిరు కాన్వాయ్‌కు ఎమ్మార్పీఎస్ బ్రేక్

ప్రజారాజ్యం చీఫ్ చిరంజీవి కాన్వాయ్‌ను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు సోమవారం అడ్డుకున్నారు. ఎస్సీల వర్గీకరణపై వైఖరి స్పష్టం చేయాలని వారు రోడ్డుపై బైఠాయించగా, వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, పోలీసులు జోక్యం చేసుకుని, వారిని సమాధాన పరిచారు.
Source: Yahoo! Telugu: News | 3 Nov 2008 | 9:36 am

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామాదే విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి బరాక్ ఒబామా విజయం సాధిస్తారని వెనుజులా అధ్యక్షుడు హ్యుగో చావెజ్ జోస్యం చెప్పారు. ఆఫ్రికన్-అమెరికా జాతీయుడు వైట్‌హౌస్ పీఠాన్ని అధిరోహించడం సామాన్యమైన విషయం కాదన్నారు.
Source: Yahoo! Telugu: News | 3 Nov 2008 | 9:33 am

నాగ్‌పూర్ టెస్ట్‌: ధోనీకి సారథ్య బాధ్యతలు

టెస్ట్ కెప్టెన్ అనిల్ కుంబ్లే రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో మిగిలిన చివరి నాగ్‌పూర్ టెస్ట్‌లో టీం ఇండియా సారథ్య బాధ్యతలను బీసీసీఐ వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అప్పగించింది. వన్డే, టెస్ట్ జట్ల కెప్టెన్సీ బాధ్యతలను
Source: Yahoo! Telugu: News | 3 Nov 2008 | 9:31 am

నాగ్‌పూర్ టెస్ట్‌లో మరో దిగ్గజం రిటైర్మెంట్

భారత క్రికెట్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీల రిటైర్మెంట్‌లతో భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఎప్పటికీ గుర్తుండిపోనుంది. ఢిల్లీలో జరిగిన మూడో టెస్ట్ అనంతరం అనిల్ కుంబ్లే రిటైర్మెంట్ ప్రకటించగా, సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్ట్ అనంతరం
Source: Yahoo! Telugu: News | 3 Nov 2008 | 8:40 am

టీడీపీ నా కన్నతల్లి : తలసాని

తెలుగుదేశం పార్టీ తన కన్నతల్లి లాంటిదని సోమవారం ఆ పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో తలసాని మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.... తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని చెప్పారు
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2008 | 8:38 am

పేలుళ్ళ విచారణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్

అస్సోం వరుస పేలుళ్ళకు బాధ్యులైన వారిని పసిగట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని అస్సోం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి) ర్యాంకు అధికారి నేతృత్వంలో ఈ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది.
Source: జాతీయ | 3 Nov 2008 | 8:21 am

ప్రజాప్రతినిధుల రాజీనామాలకు లాలూ డిమాండ్

మహారాష్ట్రంలో బీహారీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలని కోరారు. బీహారీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇటీవల బీహార్‌‌లో
Source: Yahoo! Telugu: News | 3 Nov 2008 | 7:22 am

జాక్టో నేతలతో ముఖ్యమంత్రి భేటీ

ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జాక్టో)ల డిమాండ్లపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి స్వయంగా సోమవారం జాక్టో సంఘాలతో చర్చిలు జరపనున్నారని విశ్వసనీవర్గాలు తెలిపాయి
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2008 | 7:11 am

15 తర్వాత ఆర్జేడీ ఎంపీలు రాజీనామా: లాలూ

కేంద్ర రైల్వేశాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఆగ్రహం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తొలిసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఉత్తరభారతీయులపై జరుగుతున్న దాడుల పట్ల కేంద్రం నిర్లిప్తంగా వ్యవహరించడం పట్ల ఆయన మండిపడ్డారు.
Source: జాతీయ | 3 Nov 2008 | 4:41 am

హత్యాయత్నంపై విచారణకు బుద్ధదేవ్ ఆదేశం

ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై ఆదివారం జరిగిన హత్యాయత్నంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
Source: జాతీయ | 3 Nov 2008 | 4:20 am

నవంబరు 03, 2008 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 సినిమా 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 విజయం 14.30 శ్రీ కృష్ణ లీలలు
Source: Yahoo! Telugu: Entertainment | 3 Nov 2008 | 3:02 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 3 Nov 2008 | 3:00 am