భాజపాను ఓడిస్తాం: దిగ్విజయ్ సింగ్

ఈనెల 27వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడిస్తామని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ జోస్యం చెప్పారు. భోపాల్‌లో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాజపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
Source: జాతీయ | 2 Nov 2008 | 10:22 am

ప్రరాపాలో కలహాలు లేవు: డాక్టర్ మిత్రా

ప్రజారాజ్యం పార్టీలో ఎలాంటి అంతర్గత కలహాలు లేవని ఆ పార్టీ అధికారి ప్రతినిధి డాక్టర్ మిత్రా స్పష్టం చేశారు. దీనిపై ఆయన ఆదివారం నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 2 Nov 2008 | 9:03 am

వైభవంగా తితిదే నాలుగో విడత కళ్యాణమస్తు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నాలుగో విడత కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా 7500 జంటలు ఒకటయ్యాయి. రాష్ట్రంలోని 294 నియోజక వర్గాల్లో తితిదే కల్యాణమస్తును ఘనంగా నిర్వహించింది. ఆదివారం శుక్లపక్ష పంచమి ఉదయం 10.55 గంటల నుంచి 11.10 గంటల మధ్య మూల నక్షత్రం, ధనుర్లగ్నం శుభముహూర్తంలో ఈ సామూహిక వివాహాలు జరిగాయి.
Source: ఏపీ న్యూస్ | 2 Nov 2008 | 6:58 am

ఎంపీ ఎన్నికలు: భాజపా రెండో జాబితా విడుదల

మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. ఈ జాబితాలో 64 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కాగా, 17 మంది సిట్టింగ్ అభ్యర్థులకు మళ్లీ పోటీ చేసేందుకు ఆ పార్టీ అవకాశం కల్పించలేదు.
Source: జాతీయ | 2 Nov 2008 | 6:08 am

రాజ్ థాకరేపై జార్ఖండ్‌లో హత్యా నేరం

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ థాకరేపై మరో 15 మందిపై జార్కండ్ కోర్టులో హత్యానేరం నమోదైంది. ముంబై నగరంలో అక్టోబర్ చివరి వారం ఒక రైలు ప్రయాణీకుడి హత్య ఘటనలో వీరిని నిందితులగా పేర్కొంటూ జార్ఖండ్ కోర్టులో హత్యానేరం నమోదు చేశారు.
Source: జాతీయ | 2 Nov 2008 | 12:08 am

కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాలి: అద్వానీ

కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని ముందుగా ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాని అభ్రర్థి ఎల్ కె అద్వానీ చెప్పారు. పాలక యుపిఎ ప్రభుత్వ దుష్ట విధానాలతో భారత్ నలగిపోతోందని పేర్కొన్నారు.
Source: జాతీయ | 1 Nov 2008 | 7:07 pm

ఉగ్రవాదంతో మెతగ్గా వ్యవహరించేది లేదు‌: ప్రధాని

కేంద్రంలోని యుపిఎ కూటమి ప్రభుత్వం ఉగ్రవాదంపై మెతక వైఖరి అవలంబిస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న వార్తలను ప్రధాని మన్మోహన్ తోసిపుచ్చారు. అస్సోమ్‌లో గురువారం ఉగ్రవాదుల బాంబుపేలుళ్ల ఘటనలో బాధితులను కలసి పరామర్శించిన తర్వాత విలేఖరులతో మాట్లాడిన ప్రధాని.. ఉగ్రవాదంతో తాము రాజీ పడబోమని తేల్చి చెప్పారు.
Source: జాతీయ | 1 Nov 2008 | 6:42 pm

నవంబర్ 9న 'వాల్ పోస్టర్' సంగీతం

మన్మోహన్, మధుశర్మలు జంటగా స్నేహరెడ్డి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న వాల్ పోస్టర్ చిత్రం ఆడియో ఈ నెల తొమ్మిదిన విడుదల కానుంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో మార్కెట్‌లోకి రానున్నట్టు చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Nov 2008 | 12:41 pm

గౌరీ పండిట్ హీరోయిన్‌గా 'హౌస్‌పుల్'

గతంలో గోపీచంద్ హీరోగా వచ్చిన ఆంధ్రుడు చిత్రంలో హీరోయిన్‌గా నటించిన గౌరీ పండిట్ ప్రస్తుతం హౌస్‌పుల్ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్రసిద్ధార్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అజయ్ భుయాన్...
Source: Yahoo! Telugu: Entertainment | 1 Nov 2008 | 12:39 pm

బ్యాంకాక్ పయనానికి 'పున్నమినాగు'

ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్రధారిగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పున్నమినాగు. సౌండ్ అండ్ క్లాప్స్ పతాకంపై యండమూరి వీరేంధ్రనాథ్ కథతో రూపొందుతోన్ని ఈ చిత్రానికి జి. విజయ్ కుమార్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Nov 2008 | 12:37 pm

తెలుగు జాతికే గర్వకారణం : ముఖ్యమంత్రి

తెలుగు భాషకు ప్రాచీన హోదాను కేంద్ర ప్రభుత్వం కల్పించడం తెలుగు జాతికే గర్వకారణమని ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి చెప్పారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 53వ ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలకు సీఎం ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 1 Nov 2008 | 11:47 am

యువగర్జనకు అన్నీ అటంకాలే: తెదేపా

గుంటూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించదలచిన యువగర్జనకు ప్రభుత్వ అధికారులు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారని తెలుగేదశం పార్టీ తెలుగుయువత నేత రవిచంద్ర ఆరోపించారు. దీనిపై ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో జరుపనున్న
Source: ఏపీ న్యూస్ | 1 Nov 2008 | 11:43 am

శ్రీలంక తమిళుల కోసం సినీ తారల నిరాహార దీక్ష

శ్రీలంక సైన్యానికి, ఎల్టీటీఈకి మధ్య జరుగుతున్న పోరులో శ్రీలంక తమిళులపై సైన్యం చేస్తున్న హింసను నిరసిస్తూ... దక్షిణ భారత సినీ తారలు శనివారం ఒక రోజు పాటు నిరాహార దీక్షను చేపట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, టీనగర్‌లో జరిగిన ఈ నిరాహార దీక్షలో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్, మనోరమ వంటి అగ్ర సినీ తారలతో పాటు అగ్రహీరోయిన్లు త్రిష, నయన తార, రమ్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Source: జాతీయ | 1 Nov 2008 | 11:22 am

సింగరేణిని ఆధునీకరించడమంటే ఇది కాదు!

సింగరేణి ఆధునీకరణ అంటే మానవశక్తిని నిర్వీర్యం చేయడం కాదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ప్రజా అంకిత మలివిడత యాత్ర కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నుంచి గత గురువారం ప్రారంభమైంది.
Source: ఏపీ న్యూస్ | 1 Nov 2008 | 10:25 am

ప్రభుత్వ ఉద్యోగులకు 6.59 శాతం డిఏ పెంపు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తాయిలాన్ని ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న డిఏ పెరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
Source: ఏపీ న్యూస్ | 1 Nov 2008 | 10:22 am