|
యువగర్జనకు అన్నీ అటంకాలే: తెదేపాగుంటూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించదలచిన యువగర్జనకు ప్రభుత్వ అధికారులు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారని తెలుగేదశం పార్టీ తెలుగుయువత నేత రవిచంద్ర ఆరోపించారు. దీనిపై ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో జరుపనున్నSource: ఏపీ న్యూస్ | 1 Nov 2008 | 11:43 am శ్రీలంక తమిళుల కోసం సినీ తారల నిరాహార దీక్షశ్రీలంక సైన్యానికి, ఎల్టీటీఈకి మధ్య జరుగుతున్న పోరులో శ్రీలంక తమిళులపై సైన్యం చేస్తున్న హింసను నిరసిస్తూ... దక్షిణ భారత సినీ తారలు శనివారం ఒక రోజు పాటు నిరాహార దీక్షను చేపట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, టీనగర్‌లో జరిగిన ఈ నిరాహార దీక్షలో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్, మనోరమ వంటి అగ్ర సినీ తారలతో పాటు అగ్రహీరోయిన్లు త్రిష, నయన తార, రమ్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు.Source: జాతీయ | 1 Nov 2008 | 11:22 am సింగరేణిని ఆధునీకరించడమంటే ఇది కాదు!సింగరేణి ఆధునీకరణ అంటే మానవశక్తిని నిర్వీర్యం చేయడం కాదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ప్రజా అంకిత మలివిడత యాత్ర కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నుంచి గత గురువారం ప్రారంభమైంది.Source: ఏపీ న్యూస్ | 1 Nov 2008 | 10:25 am ప్రభుత్వ ఉద్యోగులకు 6.59 శాతం డిఏ పెంపురాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తాయిలాన్ని ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న డిఏ పెరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.Source: ఏపీ న్యూస్ | 1 Nov 2008 | 10:22 am అస్సోం పేలుళ్ళ వెనుక ఐఎస్ఎఫ్-ఐఎం హస్తంఅస్సోం రాష్ట్రంలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ వెనుక ఇస్లామిక్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని స్థానిక న్యూస్ ఛానల్ ఒకటి వార్తా కథనాన్ని ప్రచురించింది. గురువారం అస్సోంలోని వివిధ ప్రాంతాల్లో 18 వరుస బాంబు పేలుళ్ళు జరిగిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 1 Nov 2008 | 8:26 am తెలంగాణపై చర్చించేందుకు సిద్ధం : హరీష్రావుతెలంగాణ చరిత్రపై ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డితో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్‌రావు సవాల్ విసిరారు. సంగారెడ్డిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... తెలంగాణను అభివృద్ధి చేశామని చెబుతున్న ముఖ్యమంత్రి మాటలన్ని వట్టి బూటకమేనని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 1 Nov 2008 | 8:22 am తెలుగుజాతిని అవమానిస్తున్నారు...! లగడపాటికొందరు రాజకీయ వాదులు ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బ్లాక్‌డేగా ప్రకటించి తెలుగుజాతిని తీవ్రంగా అవమానిస్తున్నారని శనివారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ విరుచుకుపడ్డారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లగడపాటి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 1 Nov 2008 | 8:18 am కాంగ్రెస్ తెదేపా నేతల మధ్య ఘర్షణలుప్రకాశం జిల్లా అద్దంకిలో శనివారం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శనివారం ఉదయం ఇందిరమ్మ సంబరాలు అద్దంకిలో ప్రారంభమయ్యాయి. ఈ సంబరాల సందర్భంగా తెదేపా నాయకుడు కరణం బలరాం పెన్షన్లను అమలు చేయడంపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారుSource: ఏపీ న్యూస్ | 1 Nov 2008 | 8:16 am తెలుగు జాతికే గర్వకారణం : ముఖ్యమంత్రితెలుగు భాషకు ప్రాచీన హోదాను కేంద్ర ప్రభుత్వం కల్పించడం తెలుగు జాతికే గర్వకారణమని ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి చెప్పారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 53వ ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలకు సీఎం ముఖ్య అతిధిగా హాజరయ్యారు.Source: ఏపీ న్యూస్ | 1 Nov 2008 | 8:14 am పొట్టి శ్రీరాములుకు వైఎస్సార్ ఘన నివాళిప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం ఆశువులు బాసిన పొట్టి శ్రీరాములు శిలావిగ్రహానికి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.Source: ఏపీ న్యూస్ | 1 Nov 2008 | 8:10 am ఉపాధ్యాయులకు అండగా నిలుస్తాం : చిరు హామీడిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తున్న ఉపాధ్యాయులకు ప్రజారాజ్యం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న చిరు శుక్రవారం మెట్‌పల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టిన ఉపాధ్యాయులను కలిశారు.Source: ఏపీ న్యూస్ | 1 Nov 2008 | 8:04 am రాష్ట్రావతరణ దినోత్సవాన్ని వ్యతిరేకించిన తెరాసఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తూ... తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పలు జిల్లాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న మంత్రులను, ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ వర్గాలు అడ్డుకున్నాయి.Source: ఏపీ న్యూస్ | 1 Nov 2008 | 8:01 am తీవ్రవాదుల నుంచే పాకిస్థాన్‌కు ప్రధాన ముప్పుభారత్ కన్నా ఆఫ్గన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న తీవ్రవాదుల నుంచే పాకిస్థాన్‌కు ప్రధాన ముప్పు పొంచి ఉందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బారక్ ఒబామా వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 1 Nov 2008 | 7:51 am మహిళా క్రికెట్: ఆసీస్ చేతిలో భారత్ ఓటమిఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత మహిళా జట్టు వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత్‌పై అన్ని రంగాల్లో రాణించడంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.Source: Yahoo! Telugu: News | 1 Nov 2008 | 7:23 am అస్సోంలో పర్యటించనున్న ప్రధాని, సోనియావరుస బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లిన అస్సోం రాష్ట్రంలో ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీలు శనివారం పర్యటించనున్నారు. ఈ పేలుళ్ళలో 77 మంది మృత్యువాత పడగా, మరో 450 మందికి పైగా గాయపడ్డారు.Source: జాతీయ | 1 Nov 2008 | 7:18 am ఆరోగ్య శ్రీ పరిధిలో మరో 77 వైద్యసేవలుఆరోగ్య శ్రీ పథకం కిందకు మరో 77 వైద్య సేవలను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పద్నాలుగు చికిత్సలకు సంబంధించిన ఈ వైద్య సేవలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.Source: Yahoo! Telugu: News | 1 Nov 2008 | 6:57 am తెలంగాణ జిల్లాల్లో తెరాస అధ్వర్యంలో బ్లాక్ డేతెలంగాణ జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్రావతరణ దినాన్ని తెరాస బ్లాక్ డేగా పాటిస్తోంది. ఈ సందర్భంగా శనివారం వివిధ జిల్లాల్లో ఆ పార్టీ కార్యకర్తలు ధర్నాలు, ఆందోళనలతో నిరసన కార్యక్రమాలను చేపట్టారు.Source: Yahoo! Telugu: News | 1 Nov 2008 | 6:42 am నన్‌పై అత్యాచారం కేసు: పోలీసుల సస్పెన్షన్ఒరిస్సా అల్లర్ల సమయంలో ఓ క్రైస్తవ సన్యాసినిపై అత్యాచారం జరిగిన సమయంలో ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. కాంథమాల్ కలెక్టర్, ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆదారంగా ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం...Source: Yahoo! Telugu: News | 1 Nov 2008 | 6:41 am నాలుగో టెస్ట్‌కు భజ్జీ: బీసీసీఐ ప్రయత్నాలునాలుగో టెస్ట్‌లో హర్భజన్ సింగ్‌ను ఆడించేందుకు బీసీసీఐ వర్గాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా హర్భజన్ కోసం ట్యూ సర్టిఫికేట్‌ను సైతం ఈ వర్గాలు తెప్పించాయి. ప్రస్తుతం గాయం కారణంగా బాధపడుతున్న భజ్జీ త్వరగా...Source: Yahoo! Telugu: News | 1 Nov 2008 | 6:04 am మంత్రుల తొలగింపునకు నారాయణ డిమాండ్ఇసుక కుంభకోణం వ్యవహారానికి సంబంధించి మంత్రులు జేసీ దివాకర్ రెడ్డి, గొల్లపల్లి సూర్యారావులను మంత్రివర్గం నుంచి తప్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూSource: Yahoo! Telugu: News | 1 Nov 2008 | 5:46 am గంగూలీకి భయం: గిల్లీ పుస్తకంలో లొల్లిఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ రాసిన పుస్తకంలో భారత క్రికెటర్ల గురించి చోటు చేసుకున్న కొన్ని విషయాలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ పుస్తకం ద్వారా సచిన్‌పై కొన్ని విమర్శలు చేసిన గిల్‌క్రిస్ట్ భారత మాజీ కెప్టెన్ గంగూలీ పైనా...Source: Yahoo! Telugu: News | 1 Nov 2008 | 5:43 am రాజధాని పోస్టాఫీసుల్లో స్టాంపు పత్రాల విక్రయంరాజధాని హైదరాబాద్‌తో పాటు శివారులోని 29 పోస్టాఫీసుల్లో నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లను శనివారం నుంచి విక్రయించనున్నామని తపాలా శాఖ మేనేజర్ (మార్కెటింగ్) తెలిపారు. రూ.పది, ఇరవై, యాభై, వంద విలువ కలిగిన స్టాంపు పేపర్లు అందుబాటులో ఉంటాయన్నారు.Source: Yahoo! Telugu: News | 1 Nov 2008 | 5:38 am మూడో టెస్ట్‌లో కుంబ్లే చేతికి గాయంఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు కెప్టెన్ అనిల్ కుంబ్లే గాయపడడంతో మైదానం నుంచి నిష్క్రమించాడు. కుంబ్లే నిష్క్రమణతో మూడో రోజు చివరివరకు వైస్ కెప్టెన్ ధోనీ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.Source: Yahoo! Telugu: News | 1 Nov 2008 | 5:27 am ఎట్టకేలకు 'విద్యా హక్కు బిల్లు'కు కేబినెట్ ఆమోదందీర్ఘకాలికంగా ఎదురుచూస్తూ వచ్చిన విద్యా హక్కు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో విద్యారంగంలో సంస్కరణలు మరింత ఊపందుకోనున్నాయి. ఈ బిల్లు ప్రకారం ఆరేళ్ళ నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు పిల్లలకు ఉచిత నిర్భంధ విద్యను ప్రభుత్వ విధిగా అందిచాల్సి వుంటుంది.Source: జాతీయ | 1 Nov 2008 | 4:50 am నన్ రేప్ కేసు: 5మంది పోలీసుల సస్పెండ్ఒరిస్సాలోని కంధమాల్ జిల్లాలో ఇటీవల జరిగిన మత కల్లోలం సందర్భంగా ఏ క్రైస్తవ సన్యాసిపై దుండుగులు అత్యాచారం జరిపిన ఉదంతంలో అయిదు మంది పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జిల్లా కలెక్టర్, పోలీసు సూపర్నెంట్ సంయుక్తంగా ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.Source: జాతీయ | 31 Oct 2008 | 9:57 pm చంద్రయాన్ తొలి చిత్రాలను చూసిన ప్రధానిచంద్రయాన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో, ప్రధాని మన్మోహన్ సింగ్ చంద్రయాన్-1 ఉపగ్రహ కెమెరా తీసిన తొలి చిత్రాలను శుక్రవారం వీక్షించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్ జి మాధవన్ నాయర్ శుక్రవారం సాయంత్రం డాక్టర్ సింగ్‌ను ఢిల్లీలో కలిసి అక్టోబర్ 22న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 ఉపగ్రహ విశేషాలను వివరించారు.Source: జాతీయ | 31 Oct 2008 | 7:36 pm పేలుళ్లకు బాధ్యత తమదే: ఐఎస్ఎఫ్అసోమ్లో గురువారం వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 77 మంది ప్రజలను చంపి వందలాది మందిని గాయపర్చిన ఘటనకు బాధ్యత తనదేనని ఇస్లామిక్ సెక్యూరిటీ ఫోర్స్ - భారతీయ ముజాహిదీన్ (ఐఎస్ఎప్-ఐఎమ్) నేడు ప్రకటించింది. ఇంతవరకు ఈ సంస్థ గురించి భారత్‌లో ఎవరికీ పెద్దగా తెలియక పోవడం గమనార్హం.Source: జాతీయ | 31 Oct 2008 | 5:14 pm తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీనా హోదాతెలుగు వారందరికీ ఓ శుభవార్త.... యూపీఏ ప్రభుత్వం శుక్రవారం ఓ తీపి కబురు చెప్పింది. అదేమిటో తెలుసా? మన తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడమే..!. ఈ మేరకు తెలుగుతో పాటు కన్నడ భాషకు కూడా ప్రాచీన హోదా కల్పిస్తున్నట్లు యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది.Source: జాతీయ | 31 Oct 2008 | 2:59 pm
|