ప్రత్యేక తెలంగాణపై పీఆర్పీ సానుకూల ప్రకటన

ప్రత్యేక తెలంగాణపై ప్రజారాజ్యం పార్టీ కూడా సానుకూలంగా స్పందించింది. ప్రత్యేక తెలంగాణపై చిరు పార్టీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందా? అని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్న నేపథ్యంలో... ప్రజారాజ్యం పార్టీ తమ విధానాన్ని ప్రకటించింది. కేంద్రం ప్రత్యేక తెలంగాణకు ప్రతిపాదిస్తే తమ పార్టీ అడ్డు చెప్పబోదని ఆ పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 31 Oct 2008 | 10:51 am

పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించిన పాటిల్

వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లిన అస్సోంలోని కొక్రాజ్ పూర్, బర్పేటలను శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి సందర్శించారు. ఈ పేలుళ్ల ఘటనపై శివరాజ్ పాటిల్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం లొకొప్రియో గోపినాథ్ బార్డోలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగనుంది.
Source: జాతీయ | 31 Oct 2008 | 10:03 am

అస్సోం పేలుళ్లపై తగిన చర్యలు: కేబినెట్ డిమాండ్

అస్సోంలో తీవ్రవాదులు సృష్టించిన విధ్వంసంపై కేంద్ర హోం శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ తగిన చర్యలు తీసుకోవాలని యూనియన్ కేబినేట్ విజ్ఞప్తి చేసింది. పేలుళ్ల దుశ్చర్యలో ప్రమేయమున్న వారిని వెంటనే కనుగొనాలని, వారిని కఠినంగా శిక్షించాలని కేబినేట్ పేర్కొంది.
Source: జాతీయ | 31 Oct 2008 | 9:40 am

తెలంగాణ రాష్ట్రమిస్తేనే సరిపోదు : జీవన్ రెడ్డి

తెలంగాణ వాదులను గుర్తించి కేంద్రం తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే మాత్రమే సరిపోదని రోడ్ల, భవనాల శాఖా మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రస్తుతం అభివృద్ధిలో పూర్తి వెనుకబడి ఉందని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 31 Oct 2008 | 8:27 am

మేయర్ పదవికి మల్లికాభేగం రాజీనామా

విజయవాడ మేయర్ పదవికి మల్లికా భేగం శనివారం రాజీనామా చేయనున్నారు. రెండేళ్ల మేయర్ పదవి కాలం శుక్రవారంనాటికి ముగియనుండడంతో రేపటికి తన పదవినుంచి వైదొలగనున్నట్లు మల్లికాభేగం మీడియా ప్రతినిధుల సమక్షంలో తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 31 Oct 2008 | 8:27 am

వాణిజ్యపంటలపై మద్దతు ధర: అఖిలపక్షం ధర్నా

పత్తి, సోయా తదితర వాణిజ్యపంటలకు మద్దతు ధరను కల్పించాలని కోరుతూ... ఆదిలాబాద్‌లో శుక్రవారం అఖిలపక్షం మహాధర్నా నిర్వహించనుంది. ఈ ధర్నాలో ఎక్కువ సంఖ్యలో అన్నదాతలు పాల్గొననున్నారు.
Source: ఏపీ న్యూస్ | 31 Oct 2008 | 8:26 am

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్

విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ప్రతినిధులు కోరారు. విద్యారంగంలోని సమస్యలను సర్కారు తీర్చకుంటే నవంబర్ ఐదో తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని విద్యార్థి సమాఖ్య ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
Source: ఏపీ న్యూస్ | 31 Oct 2008 | 8:26 am

ఇందిరమ్మ, వల్లభాయ్ పటేల్‌లకు ఘన నివాళులు

స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి, స్వర్గీయ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిల సందర్భంగా వారికి ప్రముఖులు ఘన నివాళులర్పించారు. శుక్రవారం ఇందిరా గాంధీ ఘాట్‌ను ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌లు సందర్శించి పుష్పగుచ్చాలతో శ్రద్ధాంజలి ఘటించారు.
Source: జాతీయ | 31 Oct 2008 | 8:26 am

ఉచిత విద్యాబిల్లుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్!

ఉచిత విద్యా బిల్లుకు కేంద్ర మంత్రి మండలి పచ్చజెండా ఊపింది. ఈ బిల్లు ద్వారా ఆరేళ్ల నుంచి 14 సంవత్సరాల వరకు గల పిల్లలకు కేంద్రం ఉచిత విద్యను అందించనుంది. దీనితో 6-14 సంవత్సరాల పిల్లలకు విద్య తప్పనిసరి అవుతుందని ఆర్థిక మంత్రి పి. చిదంబరం వెల్లడించారు.
Source: జాతీయ | 31 Oct 2008 | 8:26 am

జగిత్యాలలో మెగాస్టార్ రోడ్‌షో

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తున్న మలివిడత "ప్రజా అంకిత యాత్ర"లో భాగంగా... శుక్రవారం ఆయన జాగిత్యాలలో రోడ్ షోలో పాల్గొననున్నారు. మెగాస్టార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంకిత యాత్ర గత గురువారం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ప్రారంభమైంది.
Source: ఏపీ న్యూస్ | 31 Oct 2008 | 6:42 am

పదో రోజుకు చేరిన ఉపాధ్యాయుల సమ్మె

తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఉపాధ్యాయ సంయుక్త కార్యాచరణ కమిటీ (జాక్టో) చేపట్టిన సమ్మె శుక్రవారానికి పదో రోజుకు చేరుకుంది. గురువారం జరిగిన సమ్మెలో ఆయా జిల్లాల్లోని పలు మంత్రులను ఉపాధ్యాయులు ఘెరావ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 31 Oct 2008 | 5:24 am

చంద్రయాన్-2 ప్రయోగానికి సన్నాహాలు

భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-1 ఉపగ్రహ వాహక నౌక విజయవంతంగా తన లక్ష్యాన్ని చేరుకున్న నేపథ్యంలో అంతరిక్ష శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 ప్రయోగం దిశగా సన్నాహాలు చేస్తున్నారు. చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించి రష్యా సహకారాన్ని తీసుకోనున్నట్లు ఇస్రో అధ్యక్షుడు మాధవన్ నాయర్ వెల్లడించారు.
Source: జాతీయ | 31 Oct 2008 | 5:17 am

అసోం పేలుళ్లు: 61కి చేరిన మృతుల సంఖ్య

అస్సోంలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య 61కి చేరుకుంది. ఈ పేలుళ్లలో మరో 470 మంది గాయాలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. అసోంలోని 12 చోట్ల జరిగిన ఈ వరుస బాంబు పేలుళ్ల సందర్భంగా గౌహతిలో పోలీసులు గురువారం విధించిన కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది.
Source: జాతీయ | 31 Oct 2008 | 4:56 am

పేలుళ్లలో తమ పాత్ర లేదు: ఉల్ఫా

గురువారం అస్సాంలో సంభవించిన వరుస బాంబు పేలుళ్లలో తమ పాత్ర లేదని నిషిద్ధ ఉల్ఫా సంస్థ పేర్కొంది. అస్సాం చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా జరిగిన ఈ వరుస పేలుళ్లలో దాదాపు 60 మంది పైగా మృతి చెందగా 450మంది ప్రజలకు గాయాలు తగిలిన విషయం తెలిసిందే.
Source: జాతీయ | 31 Oct 2008 | 12:19 am

సాధ్వి ప్రాగ్యకు పార్టీ టికెట్: బిజెఎస్

మహారాష్ట్రలోని మాలెగావ్ పేలుళ్ల కేసులో పోలీసులు అరెస్టు చేసిన సాధ్వి ప్రాగ్యకు మధ్యప్రదేశ్‌లోరాబోయే శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున టికెట్ ఇస్తామని ఉమాభారతి నేతృత్వంలోని భారతీయ జనశక్తి పార్టీ ప్రతిపాదించింది.
Source: జాతీయ | 30 Oct 2008 | 6:42 pm

ముంబయిలో ఉత్తరాదివారిపై ఆగని దాడులు

ఉత్తరాది రాష్ట్రాలవారిపై ముంబయిలో సాగుతున్న దాడులు ఇప్పట్లో ఆగే సూచనలు కన్పించడం లేదు. ముంబయిలో నివశిస్తున్న ఉత్తరాది రాష్ట్రాలవారిపై దాడులకు పాల్పడుతున్నవారు తాజాగా ఓ ఉత్తరాది జర్నలిస్ట్‌ను సైతం తమ లక్ష్యంగా చేసుకున్నారు
Source: జాతీయ | 30 Oct 2008 | 3:14 pm

అసోం మృతులకు లక్ష పరిహారం : ప్రధాని హామీ

అసోం పేలుళ్లలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ. లక్ష పరిహారాన్ని చెల్లించనున్నట్టు ప్రధాని మన్మోహన్ ప్రకటించారు. అలాగే ఈ దుర్ఘటనలో గాయపడినవారికి రూ. 50 వేల సాయం అందించనున్నట్టు ప్రధాని పేర్కొన్నారు.
Source: జాతీయ | 30 Oct 2008 | 2:22 pm

ప్రవాసాంధ్రులకూ... సంక్షేమం : చిరంజీవి హామీ

తెలంగాణ ప్రాంతంలో ప్రజా అంకిత యాత్ర ప్రారంభించిన ప్రజా రాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని వారికోసమే కాక విదేశాల్లో పనిచేస్తున్న ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం కూడా చర్యలు తీసుకుంటామని చిరంజీవి ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Oct 2008 | 2:08 pm

టీచర్ల సమ్మె బాధాకరం : సీఎం

రాష్ట్రంలో టీచర్లు సమ్మె విరమించకపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న సీఎం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఉపాధ్యాయుల డిమాండ్లలో ఎక్కువగా ఆర్థికపరమైన కోర్కెలే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Oct 2008 | 1:44 pm

భైంసాలో సద్దుమణిగిన ఘర్షణలు: కర్ఫ్యూ ఎత్తివేత

మతఘర్షణలతో దద్ధరిల్లిన భైంసా‌లో పరిస్థితిని అదుపుచేసేందుకు విధించిన కర్ఫ్యూను గురువారం ఎత్తివేశారు. మత ఘర్షణలు చెలరేగడంతో భైంసాలో కర్ఫ్యూను విధించిన సంగతి తెలిసిందే. 20రోజుల పాటు పోలీసుల పహారాలో, కర్ఫ్యూ నీడలో ఉన్న భైంసాలో పరిస్థితులు యధావిధిగా చక్కబడటంతో కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు జిల్లా ఎస్పీ గురువారం ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Oct 2008 | 1:30 pm