గుంటూరులో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలోని వర్గ విభేధాలు భగ్గుమన్నాయి. యువగర్జనకు ఏర్పాట్లు సాగుతున్న ప్రాంతంలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. తెదేపా ప్రతిష్టాత్మకంగా నిర్వహించదలచిన యువగర్జనకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి.
Source: ఏపీ న్యూస్ | 26 Oct 2008 | 10:32 am

రైతులను ఆదుకున్న ప్రభుత్వం మాదే: వైఎస్

అప్పుల ఊబిలో కూరుకున్న రైతులను గట్టెక్కించిన ఘనత తమదేనని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. ఇచ్ఛాపురంలో ఆదివారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 26 Oct 2008 | 10:03 am

ప్రరాపా తీర్థం పుచ్చుకున్న కేశినేని శ్రీనివాస్

రాష్ట్రంలోని ప్రైవేట్ ట్రావెల్స్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న విజయవాడకు చెందిన కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని శ్రీనివాస్ ఆదివారం ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇందుకోసం ఆయన తన భారీ అనుచరగణంతో శనివారం రాత్రి ఊరేగింపుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆదివారం ఉదయం పార్టీ అధినేత చిరంజీవి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Oct 2008 | 9:27 am

అవినీతి కేసులో సిక్కిం మాజీ సీఎంకు జైలుశిక్ష

ఒక అవినీతి కేసులో సిక్కిం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నార బహదూర్ భండారికీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఇదే కేసులో మరో ఐఏఎస్ అధికారికి కూడా ఆరు నెలల కారాగార శిక్షను కోర్టు విధించింది.
Source: జాతీయ | 26 Oct 2008 | 5:53 am

లోక్‌సభకు 'ముందస్తు' లేదు: మన్మోహన్

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు రావొచ్చని వస్తున్న ఊహాగానాలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కొట్టిపారేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని ఆదివారం స్పష్టం చేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ఆసియా-ఐరోపా దేశాల ఏడవ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని.. శనివారం రాత్రి ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేరుకున్నారు.
Source: జాతీయ | 26 Oct 2008 | 5:30 am

అక్టోబరు 26, 2008 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 శుభోదయం 09.00 పంచతంత్రం 09.30 విష్ణు పురాణం 11.00 చెప్పాలనిఉంది 12.00 ఈనాడు సినిమా 15.00 అభిరుచి 15.30 ఈనాడు సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 26 Oct 2008 | 5:18 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 26 Oct 2008 | 5:14 am

లెఫ్ట్‌కి దూరం కావడం బాధాకరమే: మన్మోహన్

అణు ఇంధన సమస్యపై వామపక్ష మిత్రులకు దూరమవడం పట్ల తాను సంతోషంగా లేనని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. భారత్ ప్రస్తుతం పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఈ పరిస్థితుల్లో లౌకికవాదానికి, జాతీయవాదానికి కట్టుబడిన పార్టీలన్నీ కలిసి కట్టుగా మతవాద, ప్రాంతీయవాద విభజన శక్తులపై పోరాడవలసి ఉందని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు.
Source: జాతీయ | 26 Oct 2008 | 12:37 am

చంద్ర వ్యోమగామికి బెంగళూరులో శిక్షణ

ఉద్యానవన నగరం బెంగళూరుకు మరో భాగ్యం దక్కింది. మానవ సహిత చంద్రయానంలో పాల్గొనే భారతీయ వ్యోమగాములకు బెంగళూరు ఆతిథ్యమివ్వనుంది. నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలోని అత్యాధునిక వ్యోమగామి శిక్షణా సంస్థలో చంద్రయానం చేయనున్న వ్యోమగాములు కఠిన శిక్షణ పొందనున్నారు.
Source: జాతీయ | 26 Oct 2008 | 12:11 am

రిటైర్‌మెంట్ యోచనలో దలైలామా..!

టిబెటన్ల పవిత్ర ఆధ్యాత్మిక గురువు దలైలామా రిటైర్ కాబోతున్నారని ధర్మశాలలోని ప్రవాస టిబెట్ పార్లమెంట్ స్పీకర్ కర్మా చోపెల్ తెలిపారు. నవంబర్‌లో టిబెట్ పార్లమెంట్ ప్రత్యేక సాధారణ సమావేశం గురించి దలైలామా తమతో మాట్లాడారని చెప్పారు.
Source: జాతీయ | 25 Oct 2008 | 11:09 pm

చంద్రుడికి మరింత చేరువలో చంద్రయాన్-1

చంద్రయాన్-1 ఉపగ్రహంలోని 440 న్యూటన్ లిక్విడ్ ఇంజిన్ శనివారం ఉదయం 5.48 గంటల సమయంలో 16 నిమిషాల పాటు మండించటం జరిగిందని శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో చంద్రయాన్-1 ఉపగ్రహం భూమికి 74,715 కిలోమీటర్ల ఎత్తులో నిలిచిందని తెలిపారు. ఇద్ భూమికి అతి దూరంలోని పాయింట్ కాగా, 336 కిలోమీటర్ల ఎత్తును భూమికి అతి దగ్గరి గమన పాయింట్‌గా నిర్దేశించినట్లుగా ఇస్రో ప్రతినిధి ఎస్ సతీష్ పేర్కొన్నారు.
Source: జాతీయ | 25 Oct 2008 | 8:50 pm