రైల్వే మంత్రి లాలూపై బాల్‌థాకరే గరంగరం

రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై శివసేన అధ్యక్షుడు బాల్‌థాకరే మండిపడుతున్నారు. మహారాష్ట్రలో రైల్వేశాఖకు సంబంధించిన పరీక్షలు నిర్వహించకుండా ఆపేస్తామంటూ లాలూ చేసిన వ్యాఖ్యలు శివసేన అధ్యక్షునికి కోపం తెప్పించాయి.
Source: జాతీయ | 24 Oct 2008 | 8:41 am

ఆర్థికపరమైన డిమాండ్లను పరిష్కరించం : సీఎం

ఉపాధ్యాయ ఐక్య కార్యచరణ సమితి(జాక్టో)తో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆర్థికపరమైన డిమాండ్లను పరిష్కరించబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 24 Oct 2008 | 7:40 am

ప.గోదావరి జిల్లా నేతలతో సీఎం భేటీ

పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం జరుపనున్నారు. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు ఎలా ఉన్నాయనే విషయంపై ఆయన క్షుణ్ణంగా సమీక్షించనున్నారని పార్టీ శ్రేణులు తెలిపాయి.
Source: ఏపీ న్యూస్ | 24 Oct 2008 | 7:36 am

భైంసాలో కర్ఫ్వూ సడలింపు

ఆదిలాబాద్ భైంసా పట్టణంలో అల్లర్లు సద్దుమణుగుతున్నట్లు తెలుస్తోంది. వటోలిలో క్రమంగా మత ఘర్షణలు తగ్గి, ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. భైంసా పూర్తిగా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో.... ఆ ప్రాంతంలో పోలీసు శాఖ విధించిన కర్ఫ్యూ ఎత్తివేతపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Oct 2008 | 7:32 am

అమర వీరులకు దేవేందర్ గౌడ్ ఘన నివాళి

తెలంగాణ త్యాగ శీలురకు నవతెలంగాణ పార్టీ అధినేత దేవేందర్ గౌడ్ శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవేందర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక తెలంగాణ అంశంపై అన్ని రాజకీయ పక్షాలు సానుకూలంగా స్పందించాయని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 24 Oct 2008 | 7:30 am

సమ్మె విరమించని ఉపాధ్యాయ సంఘాలు

తమ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జాక్టో) చేపట్టిన సమ్మె నేటికి మూడో రోజుకు చేరుకుంది. తొలి రోజు సమ్మె శాంతియుతంగా జరిగినా...
Source: ఏపీ న్యూస్ | 24 Oct 2008 | 7:27 am

ఆంధ్ర నుంచి ఢిల్లీకి: పార్లమెంట్‌లో నేడు తెలంగాణం

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలంటూ కోరుతున్న నేతలకు శుక్రవారం ప్రత్యేకరోజు కానుంది. ఇన్నాళ్లు మాటలకే పరిమితమైన తెలంగాణ వాదం శుక్రవారం లోక్‌సభలో ప్రైవేటు బిల్లు రూపంలో సందడి చేయనుంది.
Source: ఏపీ న్యూస్ | 24 Oct 2008 | 7:22 am

దాసరిని పరామర్శించిన చిరంజీవి

సినీ ప్రముఖుడు దాసరి నారాయణ రావును ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దాసరి చికిత్స నిమిత్తం ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కాగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని చిరు పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు
Source: ఏపీ న్యూస్ | 24 Oct 2008 | 7:13 am

శ్రీలంక తమిళుల కోసం... మహా 'మానవహారం'

శ్రీలంక ప్రభుత్వానికి అక్కడి తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈకి మధ్య జరుగుతోన్న యుద్ధంలో అమాయక తమిళులు బలవుతున్నారంటూ తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Source: జాతీయ | 24 Oct 2008 | 6:21 am

పట్టుపడుతున్నాడు

"రాను రాను మా ఆయనకి మూర్ఖత్వం అధికమైపోతోంది" చెప్పింది విమల...
Source: వినోదం | 24 Oct 2008 | 5:47 am

మీటర్ పైన ఎంతిస్తారు?

"టాక్సీ డ్రైవర్‌గా ఉన్న మనిషిని బట్టల షాపులో పనికి కుదర్చటం తప్పయి పోయింది" వగరుస్తూ అన్నాడు దానయ్య...
Source: వినోదం | 24 Oct 2008 | 5:46 am

"పద్మశ్రీ ఏడుకొండలు"లో నేనా...? నో ఛాన్స్...!

అల్లరి నరేష్ హీరోగా, విజయ సారధి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న తాజా చిత్రం "పద్మశ్రీ ఏడుకొండలు"లో "హ్యాపీడేస్" ఫేమ్ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోందని వార్తలు వెలువెత్తిన సంగతి తెలిసిందే. నల్లమలుపు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం స్వస్తిక్ క్రియేషన్స్....
Source: వినోదం | 24 Oct 2008 | 5:43 am

నేతలకు ఆత్మపరిశీలన అవసరం : సోమనాథ్

లోక్‌సభలో వివిధ పార్టీల నేతలు చేస్తున్న రభసపై స్పీకర్ సోమనాధ్ చటర్జీ అసహనం వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలను సజావుగా సాగనివ్వకుండా అడ్డుపడుతున్న సభ్యులు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పీకర్ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 24 Oct 2008 | 4:10 am

పేలుళ్ల కేసులో వీహెచ్‌పి మహిళ అరెస్టు...?

మహారాష్ట్ర టెక్స్‌టైల్ నగరంగా పేరొందిన మాలెగావ్ పట్టణంలో మోటర్ సైకిల్ బాంబు పేలుళ్లు జరిగి నెలరోజులు కాకముందే రాష్ట్ర పోలీసు శాఖ ఈ పేలుళ్ల చిక్కుముడిని బద్దలు కొట్టింది. ఈ పేలుళ్ల కోసం వాడిన మోటర్ సైకిల్ గతంలో విశ్వహిందూ పరిషత్‌లో పనిచేసిన మహిళకు చెందిందిగా పోలీసులు కనిపెట్టారు.
Source: జాతీయ | 23 Oct 2008 | 8:14 pm

మాలెగావన్ పేలుళ్లలో హిందూ తీవ్రవాద సంస్థలు...?

మహారాష్ట్రలో ఇటీవల జరిగిన వరుస పేలుళ్లలో తీవ్రవాద సంస్థల ప్రమేయం ఉన్నట్లుగా మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం-ఏటీఎస్- ప్రకటించడంతో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు మొదలయ్యాయి.
Source: జాతీయ | 23 Oct 2008 | 6:53 pm

శ్రీలంక తమిళుల భద్రతకు అద్వానీ దౌత్యం..!

శ్రీలంక తమిళుల ప్రాణాలు కాపాడేందుకు గాను లోక్‌సభలో ప్రతిపక్ష నేత, బిజెపి తరపున ప్రధాని పదవికి అభ్యర్థి అయిన ఎల్ కె అద్వానీ శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపాక్షేతో ట్రాక్ టూ దౌత్యానికి నడుం బిగించారు.
Source: జాతీయ | 23 Oct 2008 | 5:08 pm

విజయవాడ మామా అల్లుళ్లు

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్వయాన పి. ఉపేంద్రకు అల్లుడవుతారు. అయితే వీరి మధ్య తలెత్తిన మనస్పర్థలు ఫలితంగా ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా పార్లమెంటు లాబీలో రాజగోపాల్, విహెచ్‌తో గొడవపడ్డారని తెలిసింది.
Source: ఏపీ న్యూస్ | 23 Oct 2008 | 2:49 pm

తెలంగాణపై పీఆర్పీ స్పష్టత తెలపాలి: తెరాస

ప్రత్యేక తెలంగాణ అంశంపై ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి స్పష్టమైన వైఖరి ఏమిటో తెలపాలని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి రామారావు డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 23 Oct 2008 | 1:13 pm

సోనియాతో దేవేందర్ సమావేశం

ఎట్టకేలకు నవతెలంగాణ ప్రజాపార్టీ అధినేత దేవేందర్ గౌడ్ యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీతో గురువారం భేటీ అయ్యారు. సోనియాగాంధీని కలుసుకోవడానికి దేవేందర్ మొదట్లో చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. ధర్నా నిర్వహించిన అనంతరం సోనియాను కలుసుకునే ఛాన్స్ దేవేందర్‌కు లభించింది.
Source: ఏపీ న్యూస్ | 23 Oct 2008 | 1:08 pm

చత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు పెద్ద ఛాలెంజ్ : సీఆర్పీఎఫ్

చత్తీస్‌ఘడ్‌లో ఎన్నికల నిర్వహణ అతి పెద్ద సవాల్ లాంటిదని గురువారం కేంద్ర రిజర్వ్ పోలీస్ శాఖ (సీఆర్పీఎఫ్) పేర్కొంది. ఇటీవల చత్తీస్‌ఘడ్‌లో తమ దళాలపై నక్సల్స్ దాడి చేసిన నేపథ్యంలో సీఆర్పీఎఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Source: జాతీయ | 23 Oct 2008 | 12:34 pm

పులులకు మద్దతు : ఎండీఎంకే అధినేత వైగో అరెస్ట్

శ్రీలంకకు చెందిన తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈకి మద్దతుగా ప్రసంగించిన ఎండీఎంకే అధినేత వైగోను గురువారం తమిళనాడు ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వైగో చేసిన ప్రసంగం జాతి సమైఖ్యతను దెబ్బతీసేలా ఉందని అందుకే ఆయనను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది.
Source: జాతీయ | 23 Oct 2008 | 12:33 pm

జర్మనీ బాలిక అత్యాచారం కేసు : మంత్రి అల్లుడిపై ఆరోపణ

గోవా విద్యాశాఖ మంత్రి అటనాసియో మోన్సరెట్టా కుమారుడు రోహిత్‌చే అత్యాచారం చేయబడిందని పేర్కొంటున్న జర్మనీ బాలిక కేసు గురువారం మరో కొత్త మలుపు తిరిగింది. తన కూతురిపై మరో మంత్రి మేనల్లుడు కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ జర్మనీ బాలిక తల్లి పోలీసులకు గురువారం పిర్యాధు చేసింది.
Source: జాతీయ | 23 Oct 2008 | 10:59 am

ఎన్నికల నిర్వహణ, భద్రతా చర్యలపై ఈసీ కసరత్తు

దేశంలో జరుగనున్న సాధారణ ఎన్నికల నిర్వహణ, భద్రతా చర్యలపై ఎన్నికల సంఘం అప్పుడే కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఆరు రాష్ట్రాల అధికారులతో చర్చించేందుకు ఎన్నికల కమిషనర్ గోపాలస్వామి సిద్ధమయ్యారు. ఈ మేరకు తొలివిడతగా ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అధికారులతో ఎన్నికల నిర్వహణ గురించి గోపాల స్వామి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Source: జాతీయ | 23 Oct 2008 | 10:57 am