త్వరలో ప్రేక్షకుల ముందుకు "ఆవకాయ్ బిర్యానీ"

కమల్ కామరాజు, బిందు మాధవి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతూ, శేఖర్ కమ్ముల నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న చిత్రం "ఆవకాయ్ బిర్యానీ". అనీస్ కురువిల్లా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నవంబర్...
Source: వినోదం | 23 Oct 2008 | 11:18 am

తెలంగాణ బిల్లు ద్వారా నిబద్ధత చాటాం

తెలంగాణ బిల్లు ద్వారా తమ నిబద్ధత చాటుకున్నామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తాము గతంలో చెప్పినట్టే పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టి, తన నిబద్ధత చాటుకున్నామన్నారు.
Source: Yahoo! Telugu: News | 23 Oct 2008 | 10:18 am

హాంకాంగ్ సిక్సెస్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నమెంట్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ఏడుగురు సభ్యుల బృందాన్ని ఎంపిక చేసింది. ఈ బృందానికి ప్లేయింగ్ కోచ్ జాన్ డేవిసన్ నేతృత్వం వహిస్తారు. హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ నవంబరు 8, 9 తేదీల్లో జరగనుంది.
Source: Yahoo! Telugu: News | 23 Oct 2008 | 10:04 am

ప్రొక్యూర్‌మెంట్ చట్టం ప్రక్రియపై సీఎం సమీక్ష

కొత్తగా ప్రవేశపెట్టదలచిన ప్రొక్యూర్ మెంట్ చట్టంపై మార్గదర్శకాలు ఖరారు చేసేందుకై రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించారు.
Source: Yahoo! Telugu: News | 23 Oct 2008 | 10:04 am

స్విస్ ఇండోర్ ఏటీపీ క్వార్టర్స్‌లో పేస్- డ్లౌహీ

బాసెల్‌లో జరుగుతున్న స్విస్ ఇండోర్ ఏటీపీ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారుడు లియాండర్ పేస్, అతని డబుల్స్ భాగస్వామి లూకాస్ డ్లౌహీ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు. 891,000 యూరోల ప్రైజ్‌మనీ కలిగిన ఈ టోర్నమెంట్ తొలి రౌండు
Source: Yahoo! Telugu: News | 23 Oct 2008 | 9:47 am

టాప్- 20లోకి సచిన్‌ పునరాగమనం

బ్రయాన్ లారా అత్యధిక పరుగులు రికార్డును ఇటీవల అధిగమించిన టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్- 20లో మళ్లీ చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో
Source: Yahoo! Telugu: News | 23 Oct 2008 | 9:27 am

వినియోగదారుల వివరాల కోసం ఎస్‌బీఐ విజ్ఞప్తి

దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గురువారం నిబంధనల ప్రకారం అవసరమైన వివరాలను తెలియజేయాలని తన వినియోగదారులను కోరింది. ఈ వివరాలు తెలియజేయని ఖాతాదారుల అకౌంట్‌లను స్తంభింపజేస్తామని
Source: Yahoo! Telugu: News | 23 Oct 2008 | 8:11 am

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మితిమీరిన వ్యయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మితిమీరిన వ్యయం అవుతోంది. మెక్ కెయిన్, బారక్ ఒబామాల మధ్య హోరాహోరీగా సాగుతున్న పోరుకు ఐదు బిలియన్ డాలర్ల మేర ఖర్చు కాగలదని సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ సంస్థ తెలిపింది. కేవలం అధ్యక్ష ఎన్నికలకు మాత్రమే
Source: Yahoo! Telugu: News | 23 Oct 2008 | 7:39 am

రైతన్నల ధర్నా: ఆర్మూరులో 144 సెక్షన్

నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో గురువారం ఎర్రజొన్న రైతులు ఆందోళనలకు దిగడంతో పోలీసు శాఖ ముందస్తుగా ఆర్మూరులో 144 సెక్షన్ అమలు చేసింది. తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని రైతులు ఆరోపించారు
Source: ఏపీ న్యూస్ | 23 Oct 2008 | 7:23 am

దేవేందర్ గౌడ్‌కు సోనియా గాంధీని కలిసే ఛాన్స్!

ఎట్టకేలకు నవతెంలంగాణ పార్టీ అధ్యక్షుడు దేవేందర్ గౌడ్‌కు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీని కలుసుకునే అవకాశం లభించింది. కాగా... గురువారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు సోనియా గాంధీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ లభించినట్లు కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం గౌడ్‌కు తెలిపింది.
Source: ఏపీ న్యూస్ | 23 Oct 2008 | 7:19 am

అనంతపురంలో బాబు పర్యటన

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం అనంతపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వేరుశెనగ పంట తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 23 Oct 2008 | 7:15 am

నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. దేవరకొండ ప్రాంతంలోని గిరిజన వాడల్లో జరిగే ఇందిరమ్మ సంబరాల్లో సీఎం పాల్గొననున్నారు.
Source: ఏపీ న్యూస్ | 23 Oct 2008 | 7:08 am

గృహ 'హింస' మగాళ్లకు కాదు... ఆడవారికే...

గృహ హింస చట్టం ఆడవారిని ఉద్దేశించి రూపొందించిందని అది వారికి మాత్రమే వర్తిస్తుందని, పురుషులు ఈ చట్టం కింద ఆడవారిపై కేసులు పెట్టేందుకు వీలులేదని హైకోర్టు స్పష్టం చేసింది. గృహ హింస చట్టం ఆడవారి భద్రత కోసం చేసినదని ఈ చట్టం కింద ఆడవారిని విచారించేందుకు అవకాశం లేదని హైకోర్టు పేర్కొంది.
Source: ఏపీ న్యూస్ | 23 Oct 2008 | 6:41 am

ఫుల్ డ్రస్ వేసుకురా?

“డాక్టర్‌ ... ఆ పేషెంట్‌కి ఎన్నిసార్లు ‘శీర్షాసనం’ వేసి చూయించినా అర్ధం కావడం లేదు. మళ్ళీ మళ్ళీ చేసి చూపించమంటున్నాడు” ఆయాసంతో చెప్పింది నర్స్...
Source: వినోదం | 23 Oct 2008 | 6:04 am

కోళ్లకు పడని రోజేంటి?

"వారంలో ఏ రోజంటే కోళ్లకు పడదు?" అడిగాడు సుమన్...
Source: వినోదం | 23 Oct 2008 | 5:58 am

తుడా పరిధిలోకి శ్రీకాళహస్తి: సీవీఎస్‌కే శర్మ

శ్రీకాళహస్తిని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) పరిధిలో చేర్చనున్నట్టు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సీవీఎస్‌కే శర్మ తెలిపారు. ఈ రెండు పట్టణాలను సమీపంలోని ప్రాంతాలతో కలపడం ద్వారా గ్రేటర్ తిరుపతిని తీర్చిదిద్దాలనుకుంటున్నామని వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 23 Oct 2008 | 5:45 am

వటోలీ ఉదంతం వెనుక రాజకీయ పార్టీల పాత్ర

ఆదిలాబాద్ జిల్లా, వటోలీలో చోటు చేసుకున్న సజీవ దహనం ఉదంతం వెనుక రాజకీయ పార్టీల కుట్ర దాగి ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందని జాతీయ మైనారిటీ కమిషన్ తెలిపింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో లబ్ధికోసమే అవి అల్లర్లను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించింది.
Source: Yahoo! Telugu: News | 23 Oct 2008 | 5:35 am

నటి జీవితపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు రాజశేఖర్ భార్య, నటి జీవితకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కడప జిల్లా, పొద్దుటూరు పట్టణంలో ఫస్ట్ క్లాస్ అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హరిత ఈ వారెంట్‌ను జారీ చేశారు.
Source: Yahoo! Telugu: News | 23 Oct 2008 | 5:27 am

తెలంగాణాకు అనుకూలమే: ప్రణబ్‌కు టీడీపీ లేఖ

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు తాము అనుకూలంగా ఉన్నట్లుగా తెలుగుదేశం పార్టీ లిఖిత పూర్వకంగా తెలిచజేసింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ మేరకు రాసిన ఓ లేఖను పార్టీ నేతలు బుధవారం యూపిఏ నేత ప్రణబ్ ముఖర్జీకి అందచేశారు.
Source: ఏపీ న్యూస్ | 23 Oct 2008 | 1:00 am

నన్ను యువరాజుగా పిలవకండి: రాహుల్

తనను యువరాజుగా పిలవవద్దని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అభ్యర్థించారు. యువరాజు అనే పదం వారసుడు అనే అర్థం ఇస్తుందని, వారసత్వ భావాన్ని అది కల్గిస్తుంది కాబట్టే ఆ పదాన్ని తనకు వర్తించడం తనకు ఏ మాత్రం ఇష్టం ఉండదని రాహుల్ పేర్కొన్నారు.
Source: జాతీయ | 22 Oct 2008 | 5:37 pm

గ్రంథాలయ ఉద్యోగుల సమ్మె

నవంబర్ ఒకటో తేదీ నుంచి గ్రంథాలయ ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలకావడంతో... నవంబర్ 1న చేపట్ట తలపెట్టన సమ్మెను యధాతథంగా కొనసాగించనున్నట్లు గ్రంథాలయ సంఘం బుధవారం ప్రకటించింది.
Source: ఏపీ న్యూస్ | 22 Oct 2008 | 1:28 pm

"బిల్లా"కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసునిగా తెరమీదకు వచ్చాడు ప్రభాస్. హీరోగా ఎత్తూ, ఫిజిక్ ఉండి తనదైన శైలిలో టాలీవుడ్‌లో నిలదొక్కుకున్నాడు. చేసింది తక్కువ చిత్రాలైనా ప్రేక్షకుల మదిలో మాస్ హీరోగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. పెద్దనాన్న ఇమేజ్ సినిమాల్లో....
Source: వినోదం | 22 Oct 2008 | 1:22 pm

24న రాష్ట్రానికి అద్వానీ రాక!

భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్. కె. అద్వానీ ఈ నెల 24వ తేదీన భాగ్యనగరానికి రానున్నారు. అద్వానీ ఆంగ్ల రచన "మై కంట్రీ మై లైఫ్".. తెలుగు అనువాదం "నా దేశం నా జీవితం" పుస్తకాన్ని ట్యాంక్ బండ్‌లోని ఓ రెస్టారెంట్లో చినజీయర్‌స్వామి ఆవిష్కరించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 22 Oct 2008 | 1:20 pm

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రం!

హాలీవుడ్, బాలీవుడ్ తరహాలో టాలీవుడ్ కూడా మల్టీస్టారర్ చిత్రాలు నిర్మిస్తోంది. దీనికి ప్రధాన హీరోలు కూడా మందుకు రావడం విశేషం. తాజాగా "సవాల్" చిత్రాన్ని నిర్మించిన తోట వెంకటేశ్వర రెడ్డి ఈ ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాంత్, శ్రీహరి, సురేష్‌లతో సాయిదివ్య క్రియేషన్స్ పతాకంపై...
Source: వినోదం | 22 Oct 2008 | 1:09 pm

"దేవర కొండయ్య" ఆడియో విడుదల

స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్. నారాయణ మూర్తి కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "దేవర కొండయ్య". ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మంగళవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌ ప్రివ్యూథియేటర్‌లో జరిగింది. ముఖ్య అతిథి నాయి బ్రాహ్మణ సేవా సంఘ...
Source: వినోదం | 22 Oct 2008 | 12:54 pm

వేణుగోపాలచారికి బెయిల్ మంజూరు

ఓ హెడ్ కానిస్టేబుల్‌పై డాడి చేసిన కేసులో ఆరు నెలల పాటు జైలు శిక్ష పడిన తెలుగుదేశం పార్టీ నేత వేణుగోపాలచారికి ఆదిలాబాద్ సెషన్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.
Source: ఏపీ న్యూస్ | 22 Oct 2008 | 12:41 pm

దాగుడు మూతలు : మరోసారి రాజ్‌కు బెయిల్

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్ఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్‌థాకరే విషయంలో దాగుడు మూతలు కొనసాగుతున్నాయి. కార్యకర్తలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారన్న ఆరోపణలతో మంగళవారం రెండుసార్లు అరెస్ట్ అయిన రాజ్‌కు రెండు సార్లూ కస్టడీకి తరలించాలని కోర్టు తీర్పునివ్వడం... వెనువెంటనే బెయిల్...
Source: జాతీయ | 22 Oct 2008 | 12:06 pm

నదుల సంధానం అవసరం: స్టాండింగ్ కమిటి

దేశంలో మొత్తం 30 జీవనదుల మధ్య అనుసంధానం జరగాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బుధవారం స్పష్టం చేసింది. అలా జరిగితేనే వరద నియంత్రణ సాధ్యమై నీటి లభ్యతకు ఎలాంటి ఢోకా ఉండబోదని కమిటి పేర్కొంది. బుధవారం నదుల అనుసంధానంపై స్టాండింగ్ కమిటి తన నాలుగవ నివేదికను పార్లమెంటుకు సమర్పించింది.
Source: జాతీయ | 22 Oct 2008 | 11:48 am

బీహార్‌లో పడవ మునక: 24మంది మహిళల దుర్మరణం

బీహార్‌‌ దుదెల్లా ఘాట్ వద్ద ఓ పడవ నీట మునిగిన సంఘటనలో 24 మంది మహిళలు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. గంగానదీకి సమీపంలోని దుదెల్లా అనే గ్రామం ఉందని, ఈ ప్రాంతంలో 24 మంది మహిళలు గడ్డి కోసుకుని పడవ ద్వారా తీరానికి చేరుకుంటుండగా ఈ సంఘటన చోటుచేసుకుందని జిల్లా మేజిస్ట్రేట్ ఉదయ్ నారాయణ్ విలేకరులతో వెల్లడించారు.
Source: జాతీయ | 22 Oct 2008 | 11:38 am

సీఎంను కలిసిన టీచర్ ఎమ్మెల్సీలు

ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) చేపట్టిన సమ్మెను విరమింప చేయాలని కోరుతూ బుధవారం టీచర్ ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిని హైదరాబాద్‌లో కలిశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Oct 2008 | 11:25 am