|
జమ్మూ కాశ్మీర్‌లో ఏడు విడతల్లో ఎన్నికలుః ఇసిజమ్మూ కాశ్మీర్‌లోని 87 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు విడతల్లో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదివారం ఢిల్లీలో ఒక ప్రకటన జారీ చేసింది.Source: జాతీయ | 19 Oct 2008 | 10:58 am సెజ్‌లకు భూ కేటాయింపులు వద్దు: రాఘవులుదేశవ్యాప్తంగా సెజ్‌లకు వ్యతిరేక వాతావరణం నెలకొన్న నేపధ్యంలో కోస్తా కారిడార్‌తో పాటు రాష్టంలో సెజ్‌లకు కేటాయించిన భూములపై పునఃసమీక్ష జరిపి భూములను వెనక్కు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 19 Oct 2008 | 10:30 am వికలాంగులకు వచ్చేనెల నుంచి రూ.500ల పెన్షన్నవంబర్ నుంచి రాష్ట్రంలోని వికలాంగులకు ప్రతినెలా రూ500ల ఫించన్‌ను తమ ప్రభుత్వం అందించనుందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. పెంచిన ఫించన్‌ను ప్రతినెలా 75 లక్షల మందికి ఇస్తామని ఆయన ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 19 Oct 2008 | 8:49 am ఢిల్లీలో కూలిన మెట్రో ఫ్లైఓవర్: నలుగురు మృతులుదేశ రాజధాని న్యూఢిల్లీ తూర్పు ప్రాంతంలోని షకార్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న ప్లై ఓవర్ కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సారధ్యంలో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కూలిపోయి బస్సు పైన పడిన ఘటనలో బస్సు డ్రైవరుతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.Source: జాతీయ | 19 Oct 2008 | 5:41 am ఉగ్రవాదం కంటే ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రమాదంఉగ్రవాదం కంటే ఓటు బ్యాంకు రాజకీయాలు చాలా ప్రమాదకరమని భారతీయ జనతాపార్టీ నేత ఎల్ కె అద్వానీ పేర్కొన్నారు. కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలు ఉగ్రవాదం కంటే ఎక్కువగా దేశానికి హాని చేస్తున్నాని ఆయన విమర్శించారు.Source: జాతీయ | 19 Oct 2008 | 5:10 am టాటా తర్వాత.. ఇక ఆర్సెలర్ మిట్టల్ వంతు.!పశ్చిమబెంగాల్ సింగూర్‌లో నానో ప్రాజెక్టు కోసం ప్రముఖ వ్యాపార సంస్థ టాటా మోటార్స్ కంపెనీ.. ఆక్రమిత భూములు అంశంపై ఎదుర్కొన్న వివాదం.. తర్వాత.. ఇప్పుడు ప్రముఖ అంతర్జాతీయ ఉక్కు ఉత్పత్తుల దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ ఎదుర్కోనుంది.Source: జాతీయ | 19 Oct 2008 | 12:15 am అవసరమైన మోతాదులో ఎరువులున్నాయి: పూనంరాష్ట్రంలో ప్రస్తుతానికి అవసరమైన మోతాదులో ఎరువులు అందుబాటులో ఉన్నాయని... అయితే వీటిని సక్రమపద్ధతిలో పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనర్ పూనం మాలకొండయ్య వెల్లడించారు. సబ్సీడీపై రైతులకు ఇస్తున్న ఎరువులు దుర్వినియోగం చేస్తే సత్వరమే వారిపై నిత్యావసరాల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2008 | 11:12 pm చంద్రునిపై ఇంధన సంపద: మాధవన్ నాయర్చంద్రునిపై ఇంధన సంపద భారీ స్థాయిలో ఉన్నట్లుగా ఇప్పటికే గుర్తించామని.. భారత అంతరిక్ష పరిశోధన సంఘం (ఇస్రో) ఛైర్మన్ మాధవన్ నాయర్ వెల్లడించారు. ఈ ఇంధన సంపదను చంద్రుని నుంచి విజయవంతంగా తీసుకువస్తే... కొన్ని వేల సంవత్సరాల పాటు యావత్ ప్రపంచానికి ఇంధన కొరత లేకుండా పోయే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.Source: జాతీయ | 18 Oct 2008 | 11:11 pm మత మార్పిళ్లలో ఎలాంటి తప్పు లేదు: పున్యానీఒక మతం నుంచి మరొక మాతానికి మారడంలో ఎలాంటి తప్పూ లేదని... మానవ హక్కుల కార్యకర్త రామ్‌పున్యానీ వెల్లడించారు. ఈ మత మార్పిళ్లు ఇప్పడు జరిగేవి కాదని.... గతంలో భౌద్ధ మతంలోకి.. జైన మతంలోకి అనేక మంది మారిన ఉదంతాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2008 | 6:41 pm మెజార్టీ పార్టీగా పీఆర్‌పీ అవతరిస్తుంది: నాగబాబురానున్న అసెంబ్లీ శాసనసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ మెజార్టీ పార్టీగా అవతరిస్తుందని ఆ పార్టీ నేత నాగేంద్ర బాబు జోస్యం చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రజారాజ్యం పార్టీ పట్ల వారి పూర్తి మద్దతును అందించడమే ఇందుకు నిదర్శనమని.. ఆయన వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2008 | 4:52 pm రైలు ప్రాజెక్టుకు భూమి తిరిగి ఇచ్చిన మాయావతిరాయ్బరేలీలో రైల్ కోచ్ ఫ్యాక్టరీకోసం కేటాయించిన భూమిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి బహుజన్ సమాజ్ అధినేత మాయావతి శనివారం వెనక్కు తీసుకున్నారు. రాయ్‌బరేలీ సోనియా గాంధీ నియోజకవర్గం కావడం గమనార్హం.Source: జాతీయ | 18 Oct 2008 | 2:57 pm
|