|
నేత కార్మికుల బతుకులు దుర్భరం: చంద్రబాబురాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక నేత కార్మికుల బతుకులు దుర్భరమయ్యాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. నేతన్నలు ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని, వారి తరపున పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు హామీ ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 17 Oct 2008 | 10:58 am విశాఖలో ఆరెస్సెస్ జాతీయ సమావేశాలు ప్రారంభంవిశాఖలో ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. నగర శివార్లలోని గుడిలోవ విజ్ఞాన విహార పాఠశాలలో మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలను ఆరెస్సెస్ సంఘ్ చాలకు సుదర్శన్ జీ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.Source: Yahoo! Telugu: News | 17 Oct 2008 | 10:15 am ప్రకాశం జిల్లాలో నకిలీ బంగారం ముఠా అరెస్ట్నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతూ వచ్చిన ఓ ముఠాను ప్రకాశం జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు వారాల క్రితం ఒంగోలులో ఓ బియ్యం వ్యాపారిని నకిలీ బంగారం అచ్చుతో మోసగించారు.Source: Yahoo! Telugu: News | 17 Oct 2008 | 9:42 am విపక్షాల ఆరోపణలు అర్థరహితం: సబితాకాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే విపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని రాష్ట్ర గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు వైఎస్సార్‌ను ఓడించాలని చూస్తున్నాయని, అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తుందని సబితా జోస్యం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 17 Oct 2008 | 9:08 am హరికృష్ణతో బహిష్కృత నేత కృష్ణాయాదవ్ భేటీనకిలీ నోట్ల కుంభకోణంలో చిక్కుకోవడం ద్వారా గత శాసనసభ ఎన్నికలకు ముందుగా టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి కృష్ణాయాదవ్ శుక్రవారం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణతో సమావేశమయ్యారు.Source: Yahoo! Telugu: News | 17 Oct 2008 | 9:04 am పార్లమెంట్ ఉభయసభలు వాయిదాపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ, రాజ్యసభ సభాపతి, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీల నేతృత్వంలో సమావేశమైన సభలు ప్రారంభంకాగానే పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఇటీవల మృతి చెందిన ఇద్దరు ఎంపీలు, ఏడుగురు మాజీ ఎంపీలలకు ఉభయసభలు సంతాపం వ్యక్తం చేశాయి.Source: జాతీయ | 17 Oct 2008 | 8:39 am నిర్ణయంపై సమీక్ష కోరాం: మంత్రి ప్రఫుల్తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా జెట్ ఎయిర్‌వేస్ అధినేత నరేష్ గోయల్‌ను కోరామని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి ప్రఫుల్ పటేల్ చెప్పారు. అలాగే సమస్యకు గల మూలాలను గుర్తించి పరిష్కరించుకోవాల్సిందిగా సూచించినట్టు మంత్రి పటేల్ చెప్పారు.Source: జాతీయ | 17 Oct 2008 | 8:25 am ధులే పట్టణంలో కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేతధులే పట్టణ పరిసర ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం కర్ఫ్యూని పూర్తిగా ఎత్తివేసింది. మత ఘర్షణలు జరగడంతో అధికారిక యంత్రాంగం అక్టోబరు 5న ధులే పట్టణంలో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పట్టణంలో అల్లర్లు సద్దుమణగడంతోSource: Yahoo! Telugu: News | 17 Oct 2008 | 8:22 am లోక్‌సభ సమావేశాలు సోమవారానికి వాయిదాపార్లమెంట్ సమావేశాలు శుక్రవారం పునరుద్ధరించబడ్డాయి. ఇటీవల దేశంలో జరిగిన తీవ్రవాదులు, ఆలయ తొక్కిసలాటల్లో మృతి చెందినవారికి పార్లమెంట్ సభ్యులు నివాళులు అర్పించారు. వారి మృతికి సంతాపసూచకంగా లోక్‌సభ సమావేశాలనుSource: Yahoo! Telugu: News | 17 Oct 2008 | 8:08 am లీలావతి నుంచి అమితాబ్ బచ్చన్ డిశ్ఛార్జిబాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌ను శుక్రవారం ముంబయిలోని లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు. కొన్ని రోజుల క్రితం తీవ్రమైన కడుపు నొప్పితో అమితాబ్ ఈ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఈ అనారోగ్యం నుంచి ప్రస్తుతంSource: Yahoo! Telugu: News | 17 Oct 2008 | 7:55 am సంక్షోభ నివారణ సదస్సుకోసం భారత్‌కు ఆహ్వానంప్రపంచ ఆర్థిక సంక్షోభ నివారణ, ఆర్థిక వ్యవస్థకు మరమ్మతులపై వ్యూహ రచనకోసం తలపెట్టిన అత్యవసర ప్రపంచ సదస్సుకు హాజరు కావాలని యురోపియన్ యానియన్, జీ-8 పారిశ్రామిక దేశాలు భారత్‌ను ఆహ్వానించాయి.Source: Yahoo! Telugu: News | 17 Oct 2008 | 7:53 am మళ్లీ టీడీపీలో చేరుతా: కృష్ణయాదవ్రాష్ట్రంలో ఎన్నికల హడావుడి వేడెక్కుతోంది. ఒకవైపు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వలసపోతుంటే... మరోవైపు మాజీ మంత్రులు తమ తమ సొంత గూటికే చేరుకుంటున్నారు. ఈ జాబితాలో కృష్ణయాదవ్ కూడా చేరారు. తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు నందమూరి హరికృష్ణతో మాజీ టీడీపీ మంత్రి శుక్రవారం సమావేశమయ్యారు.Source: ఏపీ న్యూస్ | 17 Oct 2008 | 7:45 am ఎంసీపీఐ అధినేత ఓంకార్ కన్నుమూతఎంసీపీఐ వ్యవస్థాపకులు, కమ్యూనిస్ట్ సీనియర్ నేత ఎం. ఓంకార్ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఓంకార్ శ్వాస గాలిలో కలిసిపోయిందని ఆయన కుటుంబీకులు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 17 Oct 2008 | 7:26 am ఆస్పత్రి నుంచి అమితాబ్ డిశ్చార్జ్బాలీవుడ్ 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. తీవ్రమైన కడుపునొప్పికి లోనైన అమితాబ్ గత వారం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే. వారం రోజులుగా డాక్టర్ల పర్యవేక్షణలో గడిపిన అమితాబ్ ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జ్ చేస్తున్న ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 17 Oct 2008 | 7:03 am డిసెంబర్‌లో అమెరికా అణు వాణిజ్య బృందం రాకఅమెరికాకు చెందిన భారీ అణు వాణిజ్య బృందం డిసెంబర్‌లో భారత్ సందర్శిస్తుందని ఆ దేశ వాణిజ్య మంత్రి కార్లోస్ గుటిరెజ్ తెలిపారు. అమెరికా-భారత్ వాణిజ్య మండలి నేతృత్వంలో ఈ బృందం భారత్ వెళ్లనుందని వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 17 Oct 2008 | 6:55 am బెంగాల్ కోసం హైటెక్ ఈవీఎంల సేకరణపశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం 70 వేల హైటెక్ ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్లు)లను సేకరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)కు హైటెక్Source: Yahoo! Telugu: News | 17 Oct 2008 | 6:49 am ఎంసీపీఐ నేత ఓంకార్ అనారోగ్యంతో కన్నుమూతగత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఎంసీపీఐ నేత ఓంకార్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు.Source: Yahoo! Telugu: News | 17 Oct 2008 | 6:36 am ఏఐ ఉద్యోగులకు స్వచ్ఛంద సెలవు పథకంతమ సంస్థ ఉద్యోగులకు ఎయిర్ ఇండియా స్వచ్ఛంద సెలవు పథకాన్ని ప్రతిపాదించింది. ఈ పథకం కింద నిర్వాహకేతర (నాన్ ఆపరేషనల్) ఉద్యోగులు మూడు నుంచి ఐదేళ్ళ పాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లవచ్చు. ఈ సెలవు కాలానికి ఎలాంటి వేతనాన్ని చెల్లించరని ఎయిర్ ఇండియా ప్రతినిధి జితేందర్ భార్గవ్ వెల్లడించారు.Source: జాతీయ | 17 Oct 2008 | 6:26 am సిక్కింలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు సీసీఈఏ అనుమతిసిక్కిం రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ (ఆర్థిక వ్యవహారాల కమిటీ) ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖామంత్రి కపిల్ సిబాల్ వెల్లడించారు. ఈ కమిటీ సమావేశం గురువారం న్యూఢిల్లీలో జరిగింది.Source: జాతీయ | 17 Oct 2008 | 5:46 am దేశ రాజధానిలో బంగ్లాదేశ్ ఆత్మాహుతి బృందందేశ రాజధాని బంగ్లాదేశ్‌లో ఆత్మాహుతి బృందం మొకటి సంచరిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో న్యూఢిల్లీలో హై అలెర్ట్‌ను ప్రకటించారు. కేంద్ర నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులతో పాటు.. ఇతర నిఘా సంస్థలను అప్రమత్తం చేశారు.Source: జాతీయ | 17 Oct 2008 | 4:12 am 'స్వలింగ సంపర్కం'పై క్యాబినెట్‌లో ప్రస్తావనకేంద్ర హోం శాఖామంత్రి శివరాజ్ పాటిల్, వైద్య ఆరోగ్య శాఖామంత్రి అన్బుమణి రామదాస్‌ల మధ్య చెలరేగిన స్వలింగ సంపర్క వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. దీంతో ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.Source: జాతీయ | 17 Oct 2008 | 4:12 am అక్టోబరు 17, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 17 Oct 2008 | 3:24 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 17 Oct 2008 | 3:23 am ఆదిలాబాద్ హింసకు కారకులను శిక్షిస్తాం: వైఎస్గత వారం ఆదిలాబాద్ జిల్లాలో మత హింసకు పాల్పడిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని.. దీనికి సంబంధించిన చర్యలను చేపట్టనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఈ అంశంపై విచారణ చేపట్టి నిజానిజాల్ని వెలికే తీయాల్సిందిగా సీబీఐని ఆదేశించినట్లు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 17 Oct 2008 | 12:11 am వరికి రూ. 50 బోనస్‌ను ప్రకటించిన కేంద్రంవరికి మద్దతు ధరకు మరో రూ. 50 బోనసు అదనంగా చేర్చాలని కేంద్ర మంత్రి వర్గ ఆర్ధిక వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో వరి ధాన్యం సేకరణకు ఈ నిర్ణయం ఎంతగానే ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి వర్గం అంచనా వేసింది.Source: జాతీయ | 16 Oct 2008 | 9:29 pm పోటా కన్నా కఠిన చట్టం: రాజ్నాథ్రానున్న ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే... పోటా కన్నా కఠిన చట్టాన్ని అమలు చేస్తామని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఉగ్రవాదం మీద పోరాడేందుకు... దాన్ని ఉక్కు పాదాల కింద అణగద్రొక్కేందుకు పోటా కన్నా కఠిన చట్టం అవసరమని అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 16 Oct 2008 | 8:47 pm వెయ్యి మందికి పైగా సీపీఐ కార్యకర్తల అరెస్ట్రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో కలెక్టరేట్ ముట్టడించేందుకు ప్రయత్నించిన సుమారు వెయ్యిమందికి పైగా సీపీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్లస్థలాల కోసం గత నలభై రోజులుగా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే.Source: ఏపీ న్యూస్ | 16 Oct 2008 | 8:11 pm తొలగించిన ఉద్యోగులను చేర్చుకున్న జెట్ ఎయిర్వేస్అంతర్జాతీయ సంక్షోభంతో నష్టాల్లో కూరుకపోయిన జెట్ ఎయిర్‌వేస్ సంస్థ... మరింతగా నష్టాల్లో కూరుకుపోకుండా ఉండేందు కోసం సుమారు 1900 మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తప్పించింది. అయితే తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని నిర్ణయించినట్లు జెట్ ఎయిర్‌వేస్ సంస్థ అధినేత సురేష్ ఘోయల్... గురువారం రాత్రి ప్రకటించారు.Source: జాతీయ | 16 Oct 2008 | 6:58 pm తెలంగాణ కోసం చలో ఢిల్లీ : దేవేందర్ప్రత్యేక తెలంగాణపై పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ ఢిల్లీకి పయనం కానున్నట్టు నవ తెలంగాణ ప్రజా పార్టీ అధినేత దేవేందర్ గౌడ్ తెలిపారు. తెలంగాణ అంశానికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 16 Oct 2008 | 3:33 pm తివారీ గవర్నర్ పదవికి తగరు : బీజేపీప్రతి వ్యక్తికి మౌలిక విలువలతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని అవి లేని వ్యక్తి ఉన్నత పదవులకు అర్హుడు కాదని బీజేపీ పేర్కొంది. రాష్ట్ర గవర్నర్ నారాయణ్‌దత్ తివారీపై తాజాగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.Source: ఏపీ న్యూస్ | 16 Oct 2008 | 1:33 pm 19న ప్రారంభమవుతున్న సుశాంత్ "కరెంట్"అక్కినేని నాగేశ్వరరావు మనుమడు సుశాంత్ హీరోగా నటించిన తొలిచిత్రం "కాళిదాసు". అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా సుశాంత్‌తో నాగసుశీల ద్వితీయ చిత్రాన్ని...Source: వినోదం | 16 Oct 2008 | 1:26 pm కళాఖండాల నెలవు... సాలార్‌జంగ్ మ్యూజియంరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పర్యాటకులు సందర్శించాల్సిన అనేక ప్రదేశాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర రాజధానిగా మాత్రమే కాకుండా ఎన్నో అద్భుత సందర్శనా ప్రదేశాలను కల్గిన హైదరాబాద్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా అలరాడుతోంది.Source: వినోదం | 16 Oct 2008 | 12:43 pm నత్తనడకన పులిచింతల ప్రాజెక్టు పనులురాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో మొట్టమొదట ప్రారంభించిన ప్రాజెక్టు పులిచింతల. ఈ ప్రాజెక్టును నాలుగేళ్ళలో పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు చూస్తే మరో మూడేళ్లు పట్టేలా కనిపిస్తున్నాయి.Source: ఏపీ న్యూస్ | 16 Oct 2008 | 12:41 pm ఎన్నికల్లో పోటీ చేయనున్న నటి విజయశాంతివచ్చే ఎన్నికల్లో తల్లి తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు విజయశాంతి పోటీ చేయనున్నట్టు ఆమె తన మనస్సులో మాటను వెల్లడించారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన మనస్సులోని మాటను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల పోరులోSource: ఏపీ న్యూస్ | 16 Oct 2008 | 12:39 pm సన్నివేశాల చిత్రీకరణలో పాయిజన్రాజీవ్ కనకాల, నాగేంద్రప్రసాద్, విజయ్ సామ్రాట్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం "పాయిజన్". సింధు తులానీ, సుహాసిని కథానాయికలు. ఫణిరాజు దర్శకుడు. డి.రమేష్‌బాబు ఈ చిత్ర నిర్మాత.Source: Yahoo! Telugu: Entertainment | 16 Oct 2008 | 11:45 am రామోజీ ఫిలింసిటీలో సలీం షూటింగ్శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న 50వ చిత్రం "సలీం". ఈ సినిమా ద్వారా కార్పొరేట్ సంస్థ రిలయన్స్ తెలుగు సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. బిగ్ పిక్చర్స్ పేరుతో లక్ష్మీ పసన్న పిక్చర్స్‌తో కలసి రిలయన్స్Source: Yahoo! Telugu: Entertainment | 16 Oct 2008 | 11:42 am కామెడీ ఎక్స్‌ప్రెస్ రెండో షెడ్యూల్ షూటింగ్కౌషల్, రాజేష్, శ్రీనివాసరెడ్డి, ఆషాషైనీ (మయూరి), ధర్మవరపు సుబ్రమణ్యం, సారిక రామచంద్రరావు తదితరుల ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం "కామెడీ ఎక్స్‌ప్రెస్". టి.వి.మీడియా పతాకంపై కె.శంకర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీనివాస్Source: Yahoo! Telugu: Entertainment | 16 Oct 2008 | 11:38 am నరేష్ కొత్త చిత్రం పద్మశ్రీ ఏడుకొండలునరేష్, తమన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "పద్మశ్రీ ఏడుకొండలు". స్వస్తిక్ క్రియేషన్స్ పతాకంపై ముప్పవరపు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయసారధి దర్శకుడు. యువత స్వశక్తి మీద పైకిరావడానికి ప్రయత్నంSource: Yahoo! Telugu: Entertainment | 16 Oct 2008 | 11:30 am
|