|
'ప్రజారాజ్యం' పార్టీకి ఈసీ గుర్తింపుమెగాస్టార్ చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చింది. దీంతో ఆ పార్టీ తొలిఅంకం పూర్తయింది. ఇక రెండో అంకంగా పార్టీకి ఎన్నికల గుర్తును కేటాయించడమే. ఈ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం అధికారులు సూచన ప్రాయంగా వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 16 Oct 2008 | 10:50 am సోనియా సభకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనుమతికాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో జరుగనున్న భారీ బహిరంగ సభకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వచ్చే 19వ తేదీన ఆ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని లాల్ పేరెడ్స్ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు నిర్ణయించింది.Source: జాతీయ | 16 Oct 2008 | 10:07 am మెరుగుపడని మంత్రి దాస్ మున్షీ ఆరోగ్యంకేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడ లేదు. బుధవారం పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన్ను పరిశీలిస్తున్న వైద్యులు వెల్లడించారు. గత సోమవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురైన మంత్రి దాస్ మున్షీని ఆగమేఘాల మీద దేశ రాజధానిలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 16 Oct 2008 | 9:58 am పీఆర్పీ రిజిస్ట్రేషన్‌కు తొలగిన అడ్డంకులుమెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ రిజిస్ట్రేషన్‌కు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయని ఆ పార్టీ ప్రతినిధి డాక్టర్ వినయ్ స్పష్టం చేశారు. పీఆర్పీకి తప్పకుండా పూర్తి క్లియరెన్స్ లభిస్తుందని, ఇంకా ఎన్నికల కమిషన్ ప్రజారాజ్యం పార్టీని రాజకీయ పార్టీగా ప్రకటించాల్సిందే మిగిలి ఉందని వినయ్ అన్నారు.Source: ఏపీ న్యూస్ | 16 Oct 2008 | 9:41 am టీడీపీ అధికారంలోకి వస్తే అవినీతి ప్రక్షాళన: బాబుతాము తిరిగి అధికారంలోకి వస్తే పారదర్శకత విధానం ప్రవేశపెట్టడం ద్వారా అవినీతిని ప్రక్షాళన చేస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ పాలనలో అన్ని విభాగాల్లోనూ అవినీతి బాగా పెరిగిపోయిందన్నారు.Source: Yahoo! Telugu: News | 16 Oct 2008 | 9:25 am మాడ్రిడ్ మాస్టర్స్ మూడో రౌండులో జకోవిచ్మూడో సీడ్ నోవాక్ జకోవిచ్ (సెర్బియా) మాడ్రిడ్ మాస్టర్స్ మూడో రౌండులోకి ప్రవేశించాడు. గాయం కారణంగా ప్రత్యర్థి విక్టర్ హానెస్కు (రుమేనియా) రెండో రౌండు మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో జకోవిచ్ పరాజయం గండం నుంచి బయటపడ్డాడు. ఈ మ్యాచ్‌లోSource: Yahoo! Telugu: News | 16 Oct 2008 | 9:19 am ఆనంద్, క్రామ్నిక్ రెండో గేమ్ కూడా డ్రాజర్మనీ రాజధాని బాన్‌లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బుధవారం జరిగిన రెండో గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ డ్రాగా ముగించాడు. రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన ఆనంద్ ప్రత్యర్థి వ్లాదిమీర్ క్రామ్నిక్ (రష్యా)పైSource: Yahoo! Telugu: News | 16 Oct 2008 | 9:07 am సచిన్ ఎన్నడూ రికార్డుల కోసం ఆడలేదు: కాంబ్లిటెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ మరో 15 పరుగుల దూరంలో ఉండగా, అతని చిన్ననాటి స్నేహితుడు, ఒకప్పటి సహచరుడు వినోద్ కాంబ్లి మాట్లాడుతూSource: Yahoo! Telugu: News | 16 Oct 2008 | 8:52 am తెలంగాణపై టీడీపీ నిర్ణయం సరైందే: మధుయాష్కీప్రత్యేక తెలంగాణపై తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం సరైందేనని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ విషయంపై తెదేపా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడం ఏమాత్రం సరికాదని గౌడ్ తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 16 Oct 2008 | 8:46 am మొహలీ టెస్ట్: రెండు జట్లకు గాయాల బెడదమొహలీలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య రెండో టెస్ట్ శుక్రవారం ప్రారంభం కానుంది. అయితే కీలక ఆటగాళ్ల గాయాలు రెండు జట్లను కలవరపెడుతున్నాయి. టీం ఇండియా టెస్ట్ కెప్టెన్, లెగ్‌స్నిన్నర్ అనిల్ కుంబ్లే భుజం గాయంతో బాధపడుతుండగా, ఆస్ట్రేలియాSource: Yahoo! Telugu: News | 16 Oct 2008 | 8:41 am మేం కోరుకున్న జట్టును ఇవ్వలేదు: మాలిక్టొరంటోలో జరిగిన నాలుగు దేశాల ట్వంటీ- 20 టోర్నమెంట్‌కు వెళ్లివచ్చిన పాకిస్థాన్ జట్టుపై ఆ జట్టు కెప్టెన్ షోయబ్ మాలిక్, కోచ్ లాసన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్‌కు తామనుకున్న జట్టును పంపలేదని వారు వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 16 Oct 2008 | 8:25 am గుంటూరు కలెక్టరేట్ ముట్టడితో సీపీఐ కార్యకర్తల అరెస్టుగుంటూరు జిల్లా కలెక్టరేట్‌ను సీపీఐ కార్యకర్తలు గురువారం ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. అయితే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పరిస్థితి విషమించకుండా అడ్డుకున్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ...Source: Yahoo! Telugu: News | 16 Oct 2008 | 8:17 am జెట్ ఎయిర్‌వేస్ చర్యపై ఉద్యోగుల నిరసనకేబిన్ సిబ్బందితో సహా 300మంది జెట్ ఎయిర్‌వేస్ సిబ్బంది తమను ఉద్యోగాల్లోంచి తీసివేస్తూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ముంబైలో నిరసన తెలిపారు. ఎటువంటి నోటీసు లేకుండా ఉన్నట్లుండి తమను ఉద్యోగాలనుంచి తొలగించడం కంపెనీకి భావ్యం కాదని నిరసన తెలుపుతున్న కేబిన్ క్రూ సిబ్బంది ఆక్రోశం వెలిబుచ్చారు.Source: జాతీయ | 16 Oct 2008 | 8:01 am తిరుపతి సభకు డబ్బెక్కడిది: చిరుకు మంత్రి ప్రశ్నతనను తాను నిజాయితీపరుడిగా చెప్పుకుంటున్న ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి తిరుపతిలో భారీ ఎత్తున నిర్వహించిన బహిరంగ సభకు డబ్బులెలా వచ్చాయి, ఎంత ఖర్చయ్యాయి అనే విషయాన్ని బహిర్గత పరచాలని వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.Source: Yahoo! Telugu: News | 16 Oct 2008 | 7:59 am ఏఐని తాకిన విమానయాన రంగ సంక్షోభంఅంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా కష్టాల్లో చిక్కుకున్న విమానయాన రంగంలో రోజుకో సంచలనం చోటుచేసుకుంటుంది. ఇప్పటికే ప్రైవేట్ రంగ పౌర విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ 1900 మంది సిబ్బందిని తొలగించేందుకు రంగంSource: Yahoo! Telugu: News | 16 Oct 2008 | 7:54 am ఎయిర్ ఇండియా ఉద్యోగులను తొలగించం: ప్రఫుల్దేశ విమానయాన రంగంలో నెలకొన్న తాజా పరిస్థితులు ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన జెట్‌ఎయిర్‌వేస్.. తన కంపెనీకి చెందిన వెయ్యిమంది ఉద్యోగులపై వేటు వేయడంతో మిగిలిన సంస్థల్లో పని చేస్తున్న సిబ్బందిలోనూ ఆందోళన మొదలైంది.Source: జాతీయ | 16 Oct 2008 | 7:50 am మెక్ కెయిన్, ఒబామాల చివరి వాడివేడి వాగ్వాదంనవంబర్ 4న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్న మెక్ కెయిన్, బారక్ ఒబామాల మధ్య వాగ్వాదం బుధవారం వాడివేడిగా సాగింది. టీవీల ద్వారా ప్రసారమైన ఈ వాగ్వాదంలో ఇరువురు ఆర్థిక, ఆరోగ్య, ఇంధన, విద్యా విధానాలపై ఘాటుగా చర్చించారు.Source: Yahoo! Telugu: News | 16 Oct 2008 | 7:31 am రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలుపార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం 36 రోజుల పాటు సాగే ఈ సమావేశాలు నవంబరు 21వ తేదీతో ముగుస్తాయి. ఈ సమావేశాల్లో 71 శాసన, రెండు ఆర్థిక, ఒక శాసనయేతర అంశాలపై చర్చ చేపట్టాలని నిర్ణయించారు.Source: జాతీయ | 16 Oct 2008 | 5:33 am రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఓ జిమ్మిక్కు: మాయావతికాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో నిర్మించతలపెట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎన్నికల జిమ్మిక్కుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి అభివర్ణించారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంపై ఇరు పార్టీల మధ్య ఇప్పటికే తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 16 Oct 2008 | 5:13 am అక్టోబరు 16, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 16 Oct 2008 | 3:11 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 16 Oct 2008 | 3:09 am వైఎస్‌వి ఊసరవెల్లి రాజకీయాలు: కేసీఆర్రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డివి ఊసరవెల్లి రాజకీయాలని తెలంగాణా రాష్ట్ర సమితి కె. చంద్రశేఖరరావు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణాను దోచుకుతింటున్న వారందరికీ తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 15 Oct 2008 | 10:51 pm రూ. 400 కోట్లు చెల్లించనున్న టాటా సంస్థప్రముఖ వ్యాపార సంస్థ టాటా మోటార్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నానో ప్రాజెక్టు కోసం ఇచ్చే భూమిపై ఒక స్క్వేర్ మీటరుకు రూ. 900 మేర వసూలు చేయాలని గుజరాత్ ప్రభుత్వం ధరను నిర్ణయించినట్లు అధికా వర్గాలు వెల్లడించాయి. సింగూరు నుంచి వైదొలగిన టాటా ప్రాజెక్టును గుజరాత్‌లోని సనంద్‌లో ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే.Source: జాతీయ | 15 Oct 2008 | 8:21 pm ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పచ్చజెండారాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 50వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మంత్రి వర్గ సమావేశం పచ్చజెండా ఊపింది.Source: ఏపీ న్యూస్ | 15 Oct 2008 | 7:28 pm రాష్ట్రంలో ప్రత్యేక విశ్వవిద్యాలయాల ఏర్పాటురాష్ట్రంలో అత్యాధునిక పరిశోధన సంస్థలు అలాగే... ప్రత్యేక విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత మరియు రానున్న కాలంలో ప్రాముఖ్యత కలిగిన ఈ-గవర్నెన్స్ లాంటి అంశాలను బోధించడంలో ఇవి ప్రత్యేకత కలిగి ఉండేలా ప్రణాళిక చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Oct 2008 | 5:34 pm మూకుమ్మడి రాజీనామాలు ఓ బూటకం: జయలలితశ్రీలంక తమిళులను కాపాడేందుకు తమిళనాడు ఎంపీలు తమ పదవులకు సామూహికంగా రాజీనామా ఇవ్వడం బూటకమని, పచ్చి దగా అని ఏఐఎడిఎంకె ధ్వజమెత్తింది. శ్రీలంకలోని తమిళులను కాపాడటంలో నిజంగా డీఎంకే అధినేతకు ఆసక్తి ఉన్నట్లయితే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నుంచి డీఎంకే మంత్రులను తక్షణం కరుణానిధి వెనక్కు తీసుకోవాలని జయలలిత సవాల్ చేశారు,Source: జాతీయ | 15 Oct 2008 | 1:23 pm రామసేతుపై యూపీఏ వైఖరి సరికాదు: భాజపారామసేతు వ్యవహారంపై యూపీఏ ప్రభుత్వం డోలాయమానస్థితిలో ఉందని భారతీయ జనతా పార్టీ ధ్వజమెత్తింది. వివాదాస్పద రామసేతు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ధోరణి లేదని భాజపా విమర్శించింది. మొదట రామసేతు ఉన్నదన్న ప్రభుత్వం, తర్వాత కొద్ది రోజులకు రాముడున్నట్లు చరిత్రే లేదని కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిందని భాజపా సీనియర్ నేత వి.కె. మల్హోత్ర ఎత్తి చూపారు.Source: జాతీయ | 15 Oct 2008 | 12:20 pm ఇలియానాదక్షిణాది సినీ పరిశ్రమలో అతితక్కువ కాలంలో అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగిన నటీమణుల్లో ఇలియానా కూడా ఒకరు. వైవీఎస్ చౌదరి "దేవదాసు" చిత్రంలో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఇలియానా, ఇప్పటికే తెలుగులో ప్రముఖ యువహీరోలందరి సరసనSource: Yahoo! Telugu: Entertainment | 15 Oct 2008 | 11:58 am కేంద్ర మంత్రి దాస్ మున్షీ ఆరోగ్యం మెరుగుగుండెపోటు కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ ఆరోగ్యం మెరుగైందని వైద్యులు వెల్లడించారు. వైద్యుల చికిత్సకు మున్షీ స్పందిస్తున్నారని వైద్యులు బుధవారం తెలిపారు.Source: జాతీయ | 15 Oct 2008 | 11:41 am లాంఛనంగా "ఎయిర్ షో" ప్రారంభంరాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో తొలి అంతర్జాతీయ ఎయిర్ షో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షోను విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ల పటేల్ ప్రారంభించారు. ఎయిర్ షో ప్రారంభాన్ని పురస్కరించుకుని ప్రదర్శించిన భారతీయ సంప్రదాయ నృత్యం అతిథులను ఎంతగానో అలరించింది.Source: ఏపీ న్యూస్ | 15 Oct 2008 | 11:40 am ఓ ఉదయం ఓ సాయంకాలం పాటల రికార్డింగ్ఆనంద్, డేంజర్ ఫేమ్ షరీన్ జంటగా నటిస్తున్న చిత్రం "ఓ ఉదయం ఓ సాయంకాలం". ఈవూరి విజన్ పతాకంపై వర్మ ఎస్.ఈవూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ తనుబాలక్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Oct 2008 | 10:52 am నిన్న నేడు రేపు సక్సెస్: నిర్మాత వెల్లడి"నిన్న నేడు రేపు" సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ విజయం సాధించిందని చిత్ర నిర్మాత నూకారపు సూర్యప్రకాశరావు తెలిపారు. ఈ సినిమాలో రవికృష్ణ, తమన్నా, అక్షర హీరోహీరోయిన్లుగా నటించారు. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Oct 2008 | 10:47 am నితిన్ "హీరో" ట్రైలర్ మీకోసం...నితిన్, భావన హీరోహీరోయిన్లుగా నాగబాబు, రమ్యకృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం "హీరో". మన్యం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మన్యం రమేష్ నిర్మించిన ఈ చిత్రానికి సుధాకర్ నాయుడు (జీవీ) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...Source: వినోదం | 15 Oct 2008 | 10:46 am ఫిరోజ్, నఫీజా, నళినిలతో ద్విభాషా చిత్రంఫిరోజ్, నఫీజా, నళిని హీరోహీరోయిన్లుగా ఒక ద్విభాషా చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షార్వి దర్శకుడు. ఎన్.సుబ్రమణియన్, ఎన్.లక్ష్మణన్ నిర్మాతలు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Oct 2008 | 10:18 am
|