ఓ ఉదయం ఓ సాయంకాలం పాటల రికార్డింగ్

ఆనంద్, డేంజర్ ఫేమ్ షరీన్ జంటగా నటిస్తున్న చిత్రం "ఓ ఉదయం ఓ సాయంకాలం". ఈవూరి విజన్ పతాకంపై వర్మ ఎస్.ఈవూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ తనుబాలక్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Oct 2008 | 10:52 am

నిన్న నేడు రేపు సక్సెస్: నిర్మాత వెల్లడి

"నిన్న నేడు రేపు" సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ విజయం సాధించిందని చిత్ర నిర్మాత నూకారపు సూర్యప్రకాశరావు తెలిపారు. ఈ సినిమాలో రవికృష్ణ, తమన్నా, అక్షర హీరోహీరోయిన్లుగా నటించారు. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Oct 2008 | 10:47 am

చీరాలలో సీపీఐ ముట్టడితో నారయణ అరెస్టు

కోస్తా కారిడార్ ఏర్పాటుకు నిరసనగా చీరాలలో బుధవారం సీపీఐ కార్యకర్తలు భూ సేకరణ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సహా ఇరవై మంది కార్యకర్తలను పోలీసులు ఖైదు చేశారు.
Source: Yahoo! Telugu: News | 15 Oct 2008 | 10:45 am

ఆదాయ పన్ను చెల్లింపులో అవార్డు కూడా పొందా

ఆదాయ పన్నును సక్రమంగా చెల్లించినందుకై కేంద్ర సర్కారు నుంచి సమ్మాన్ అవార్డును కూడా అందుకున్నానని ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి తెలిపారు. ఆదాయాన్ని ప్రభుత్వానికి సరిగ్గా చూపి, పన్ను కట్టానని, ఈ విషయంలో తనకెవ్వరూ నీతులు చెప్పనవసరం లేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 15 Oct 2008 | 10:35 am

రాజమండ్రిలో ప్రరాప నేతలతో నాగబాబు సమీక్ష

రాజమండ్రి వచ్చిన ప్రజా రాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి సోదరుడు నాగబాబు రాజమండ్రిలో పార్టీ జిల్లా నేతలతో సమీక్ష సమావేశం జరిపారు. జిల్లాలో త్వరలో జరుగనున్న చిరంజీవి యాత్ర, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై ఆయన సమీక్షించారు.
Source: Yahoo! Telugu: News | 15 Oct 2008 | 10:27 am

కన్నుల పండువగా సిరిమాను ఉత్సవాలు

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం విజయనగరం పైడితల్లి జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం సిరిమాను ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విజయనగరంలో పైడి తల్లిని కొలిచే ఈ ఉత్సవాలు కన్నుల పండువగా సాగాయి.
Source: Yahoo! Telugu: News | 15 Oct 2008 | 10:22 am

ఫిరోజ్, నఫీజా, నళినిలతో ద్విభాషా చిత్రం

ఫిరోజ్, నఫీజా, నళిని హీరోహీరోయిన్లుగా ఒక ద్విభాషా చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షార్వి దర్శకుడు. ఎన్.సుబ్రమణియన్, ఎన్.లక్ష్మణన్ నిర్మాతలు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Oct 2008 | 10:18 am

భైంసాలో కర్ఫ్యూ రెండు గంటల పాటు సడలింపు

ఆదిలాబాద్ జిల్లా, భైంసాలో కర్ఫ్యూను బుధవారం పాక్షికంగా సడలించారు. మత ఘర్షణల నేపథ్యంలో అరురోజులుగా భైంసాలో కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉద్రిక్తత కొంత మేర తగ్గడంతో బుధవారం ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు కర్ఫ్యూ సడలించారు.
Source: Yahoo! Telugu: News | 15 Oct 2008 | 10:15 am

తమిళులపై దాడి: నిరసనగా 39మంది ఎంపీల రాజీనామా

శ్రీలంకలో తమిళులపై దాడిని నిరసిస్తూ డీఎంకేకు చెందిన 39మంది ఎమ్మెల్యేలు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు వారంత బుధవారం డీఎంకే పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధికి రాజీనామా లేఖలను అందజేశారు.
Source: జాతీయ | 15 Oct 2008 | 9:52 am

1940లో ఒక గ్రామం సెన్సార్ పూర్తి

బాలాదిత్య, శ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "1940లో ఒక గ్రామం". నరసింహ నంది దర్శకుడు. శ్రీ లక్ష్మీనరసింహ సినిమా పతాకంపై నందిరెడ్డి నరసింహారెడ్డి, జువ్విశెట్టి శ్రీరావమ్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నందిరెడ్డి నాగమ్మ సమర్పకురాలు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Oct 2008 | 9:31 am

ఐరాస, జి-8లలో సంస్కరణలకు ప్రధాని పిలుపు

ఐక్యరాజ్యసమితి, జి-8లలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక సంక్షోభం కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల వాణిని విన్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Source: Yahoo! Telugu: News | 15 Oct 2008 | 9:22 am

రిటైర్మెంట్ వదంతులను తోసిపుచ్చిన కుంబ్లే

టీం ఇండియా కెప్టెన్ అనిల్ కుంబ్లే తన రిటైర్మెంట్‌పై వస్తున్న వదంతులను తోసిపుచ్చాడు. మీడియాలో ఇటీవల కాలంలో కుంబ్లే రిటైర్మెంట్‌పై పెద్దఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుంబ్లే మాట్లాడుతూ.. రిటైర్మెంట్‌పై
Source: Yahoo! Telugu: News | 15 Oct 2008 | 9:19 am

2014 ఒలింపిక్స్: మంత్రిని నియమించిన రష్యా

సోచిలో జరిగే 2014 శీతాకాల ఒలింపిక్స్ నిర్వహణ కోసం రష్యా ప్రత్యేకంగా మంత్రిని నియమించింది. కొత్తగా నియమించిన మంత్రి ఒలింపిక్స్ నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. సంక్షోభ నివారణలో ఆరితేరిన ద్మిత్రీ కొజాక్ ఈ బాధ్యతలు చేపట్టారు.
Source: Yahoo! Telugu: News | 15 Oct 2008 | 8:58 am

పవన్ పర్యటనకు విశేష స్పందన

పీఆర్పీ నేత, మెగాస్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ రంగారెడ్డి పర్యటనకు విశేష స్పందన లభించింది. ఇంకా.. వికారాబాద్, పరిగి, తాండూరు వంటి తదితర ప్రాంతాల్లో పవన్ పర్యటించనున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన పవన్ ఇబ్రహీం పట్నంలోని పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేసి, జెండాను ఆవిష్కరించారు.
Source: ఏపీ న్యూస్ | 15 Oct 2008 | 8:41 am

పన్ను ఎగ్గొట్టే అలవాటు నాకు లేదు : చిరు

ప్రభుత్వానిక పన్ను ఎగ్గొట్టే అలవాటు తనకు లేదని ప్రజారాజ్యం అధినేత, మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. పన్ను సక్రమంగా కట్టినందుకు ఆదాయపన్ను శాఖ తనకు అవార్డు కూడా ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 15 Oct 2008 | 8:37 am

ఎంపీ పదవికి కనిమొళి గుడ్‌బై!

తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి రాజ్యసభ సభ్యత్వానికి బుధవారం గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు తన పోస్ట్‌డేటెడ్ రాజీనామా లేఖను సీఎం కరుణానిధికి కనిమొళి పంపించారు. గత కొద్దిరోజులుగా శ్రీలంకలో తమిళులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో, శ్రీలంకకు ఆర్థిక సాయాన్ని ఆపివేయాలంటూ డీఎంకే కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తుంది.
Source: జాతీయ | 15 Oct 2008 | 8:15 am

మధ్యప్రదేశ్‌‍లోనూ సోనియాకు చుక్కెదురు

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొనాల్సిన ర్యాలీకి అనుమతి ఇచ్చేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా నిరాకరించింది. ఈ నెల 19న మధ్యప్రదేశ్‌లో సోనియా గాంధీ పర్యటన సందర్భంగా భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్స్‌లో ర్యాలీ నిర్వహించాలని
Source: Yahoo! Telugu: News | 15 Oct 2008 | 8:02 am

జెట్, కింగ్‌ఫిషర్‌లను విలీనం చేయం: మల్య, గోయల్

జెట్ ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విలీనంపై వినిపిస్తున్న ఊహాగానాలను రెండు సంస్థల అధిపతులు తోసిపుచ్చారు. రెండు కంపెనీలను విలీనం చేసే ప్రతిపాదనలేవీ తమ పరిశీలనలో లేవని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధిపతి విజయ్ మాల్యా, జెట్
Source: Yahoo! Telugu: News | 15 Oct 2008 | 7:56 am

కాంగ్రెస్‌ సినీ సందడి : పార్టీలో చేరిన జయసుధ

సహజనటి జయసుధ బుధవారం కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఎన్నో రకాల పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ చేస్తున్న ప్రజాసేవ నచ్చి తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఈ సందర్భంగా జయసుధ పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Oct 2008 | 7:28 am

యూపీ బాటలోనే ఎంపీ : సోనియా ర్యాలీకి నో ఛాన్స్

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి మరోసారి చుక్కెదురైంది. సోనియా నిర్వహించ తలబెట్టిన ర్యాలీకి అనుమతి నిరాకరించిన ఉత్తరప్రదేశ్ బాటలోనే మధ్యప్రదేశ్ కూడా ప్రయాణిస్తోంది.
Source: జాతీయ | 15 Oct 2008 | 7:11 am

లాంఛనంగా "ఎయిర్ షో" ప్రారంభం

రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో తొలి అంతర్జాతీయ ఎయిర్‌ షో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షోను విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ల పటేల్ ప్రారంభించారు. ఎయిర్‌ షో ప్రారంభాన్ని పురస్కరించుకుని ప్రదర్శించిన భారతీయ సంప్రదాయ నృత్యం అతిథులను ఎంతగానో అలరించింది.
Source: ఏపీ న్యూస్ | 15 Oct 2008 | 6:51 am

భూసేకరణ కార్యాలయ ముట్టడి: నారాయణ అరెస్ట్

ప్రకాశం జిల్లా చీరాలలో అప్రకటిత ఎమెర్జెన్సీని విధించడంపై సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కోస్తా కారిడార్‌కు చీరాలలో ఏర్పాటు చేసిన భూసేకరణ కార్యాలయాన్ని నారాయణ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇప్పటికే చీరాలలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
Source: ఏపీ న్యూస్ | 15 Oct 2008 | 6:33 am

సీపీఐ ధర్నాకు నిరాకరణ : పోలీసుల మోహరింపు

చీరాలలో బుధవారం ఎక్కడ చూచినా పోలీసులు మోహరించడంతో ఆ ప్రాతంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. కోస్తా కారిడార్‌కు వ్యతిరేకంగా సీపీఐ నిర్వహించ తలపెట్టిన ధర్నాను అడ్డుకునేందుకై పోలీసులు ఇలా రంగంలోకి దిగడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 15 Oct 2008 | 5:48 am

'మెగా' యాత్రకు 'చిరు' విరామం : పీఆర్పీ

ప్రజారాజ్యం అధినేత, మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ప్రజా అంకిత యాత్రను ఎనిమిది రోజులకు కుదిస్తూ పీఆర్పీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత చిరంజీవికి గొంతునొప్పితో పాటు స్వల్ప అస్వస్థత కలిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Source: ఏపీ న్యూస్ | 15 Oct 2008 | 5:36 am

రాష్ట్రపతి పాటిల్‌కు బెదిరింపు ఈ-మెయిళ్లు

దేశ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ అధికారిక వెబ్‌సైట్‌కు ఐదు బెదిరింపు ఈ-మెయిళ్స్ వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రపతిపై పలు ఆరోపణలు చేస్తూ ఈ-మెయిళ్లను గుర్తు తెలియని వ్యక్తులు పంపించడం జరిగిందని వారు తెలిపారు.
Source: జాతీయ | 15 Oct 2008 | 4:15 am

అక్టోబరు 15, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 శ్రీకృష్ణ లీలలు 15:00 ప్రేమ మందిరం
Source: Yahoo! Telugu: Entertainment | 15 Oct 2008 | 4:09 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 15 Oct 2008 | 4:05 am

నేడే అంతర్జాతీయ విమాన ప్రదర్శన ప్రారంభం

నాలుగు రోజుల పాటు సాగే విమానయాన శాఖ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ విమాన ప్రదర్శన మరియు సదస్సు నేడు ప్రారంభం కానుంది. పౌరవిమానయాన శాఖతో కలిసి ఇండియా ఏవియేషన్-2008 సంయుక్తంగా నిర్వహించనున్న ఈ ప్రతిష్టాత్మ ప్రదర్శన మరియు సదస్సుకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం వేదిక కానుంది.
Source: ఏపీ న్యూస్ | 15 Oct 2008 | 12:42 am

ఉత్తరాంధ్ర.. ఉత్త ఆంధ్రగా మిగిలింది: పీఆర్‌పీ విమర్శ

ఉత్తరాంధ్ర.. ఉత్త ఆంధ్రగా మిగిలడానికి కారణం పాలకులేనని... రానున్న ఎన్నికల్లో తమకు అవకాశం వస్తే.. ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దుతామని ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఉండేవి రెండే వర్గాలని అవి పాలకవర్గం.. రెండు ప్రజల వర్గం అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 Oct 2008 | 11:39 pm

ఆదాయ పరిమితిపై సుప్రీం విచారించే అవకాశం

క్రీమీ లేయర్ ఆదయ పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు విచారించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 14 Oct 2008 | 10:14 pm

ఆంక్షలు బేఖాతరు : రాయ్‌బరేలీలో సోనియా

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విధించిన 144 సెక్షన్ ఆంక్షలను బేఖాతరు చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం రాయ్‌బరేలీలో అడుగుపెట్టారు. రాయ్‌బరేలీ తనకు కర్మభూమిలాంటిదని ఇక్కడకు రాకుండా తననెవరూ అడ్డుకోలేరని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Source: జాతీయ | 14 Oct 2008 | 9:27 pm

రామసేతు ఆరాధించే ప్రదేశం కాదు: కేంద్రం

పురాతన కట్టడమైన రామసేతు వంతెన హిందు మతంలో కీలకమైనది కాదని... అలాగే అది ఆరాధించే ప్రదేశం కూడా కాదని కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాముడే లేడని.. రామసేతు మానవ నిర్మితం కాదని వివాదస్పద వ్యాఖ్యాలతో దుమారం లేపిన కేంద్రం.. తాజాగా పైవ్యాఖ్యలు చేయడంతో.. ఈ వివాదం కాస్త కొత్త మలుపు తిరగనుంది.
Source: జాతీయ | 14 Oct 2008 | 9:06 pm

ప్రధాని పదవికి అభ్యర్థిగా మాయావతి...!: సీపీఎం

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయేతర భారతీయ జనతా పార్టీయేతర సంకీర్ణం నుంచి ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి పోటీ చేస్తే మద్ధతిస్తామని సీపీఎం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో బహుజన సమాజ్‌వాది పార్టీ (బీఎస్‌పీ) కీలకమైన పార్టీగా సీపీఎం గుర్తు చేసింది.
Source: జాతీయ | 14 Oct 2008 | 4:50 pm

కాన్పూర్‌లో పేలుడు : ఆరుగురికి గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఈ రోజు సాయంత్రం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడినట్టు ప్రాధమిక సమాచారం. అయితే ఈ పేలుడుకు కారణమైనది దీపావళికి ఉపయోగించే తరహా బాంబు అనే వార్తలు వినవస్తున్నాయి.
Source: జాతీయ | 14 Oct 2008 | 2:41 pm

ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది : బాబు

నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మెదక్ జిల్లాలో ఈ రోజు ధరల పెరుగుదలకు నిరసనగా తెదేపా మహధర్నా నిర్వహించింది.
Source: ఏపీ న్యూస్ | 14 Oct 2008 | 2:37 pm

ఫిరోజ్, నఫిజా జోడీగా కొత్త చిత్రం!

ఫిరోజ్, నఫిజా, నళిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని షార్వి దర్శకత్వంలో ఎన్. సుబ్రమణియన్, ఎన్. లక్ష్మణన్ నిర్మిస్తున్నారు. నఫిజా, చిన్నాలపై చిత్రీకరించిన...
Source: వినోదం | 14 Oct 2008 | 11:17 am

మనోజ్- చంద్రశేఖర్ ఏలేటి ప్రయాణం

మనోజ్ కథానాయుకుడిగా చంద్రశేఖర్ ఏలేటి ఒక కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారు. చంద్రశేఖర్ ఏలేటి గతంలో "ఐతే", "అనుకోకుండా ఒకరోజు", "ఒక్కడున్నాడు" చిత్రాలకు దర్శకత్వం వహించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Oct 2008 | 11:12 am

రాజీవ్ కనకాల కొత్త చిత్రం పాయిజన్

రాజీవ్ కనకాల, నాగేంద్రప్రసాద్, విజయ్ సామ్రాట్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం "పాయిజన్". సింధు తులానీ, సుహాసిని కథానాయికలు. ఫణిరాజు దర్శకుడు. డి.రమేష్‌బాబు ఈ చిత్ర నిర్మాత.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Oct 2008 | 11:06 am