అదిలాబాద్‌లో ఆరుగురి సజీవ దహనం

అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో తలెత్తిన ఘర్షణలు సద్దుమణగలేదు. భైంసా, కరీంనగర్‌ పట్టణాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలతో పాతనగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలు నివసించే సున్నిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 12 Oct 2008 | 10:30 am

ప్రతిభా పాటిల్‌కు ఈమెయిల్ బెదిరింపు

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. రాష్ట్రపతి ప్రస్తుతం మహారాష్ట్రలో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా ఆమె శుక్రవారం పూణెకు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆమెను హతమార్చుతామని గుర్తు తెలియని వ్యక్తి ఈమెయిల్ బెదిరింపు వచ్చిందని సంబంధిత ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 12 Oct 2008 | 9:37 am

పార్టీ నిర్ణయానికి శిరసావహిస్తా: కోడెల

తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినని, అయితే ప్రత్యేక తెలంగాణపై తమ పార్టీ తీసుకున్న నిర్ణయానికి శిరసావహిస్తానని ఆ పార్టీ మాజీ మంత్రి కోడెల శివప్రసాద రావు వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
Source: ఏపీ న్యూస్ | 12 Oct 2008 | 9:00 am

చేనేత కుటుంబాలను ఆదుకుంటాం: వైఎస్సార్

కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. చేనేత కార్మికులందరికీ అంత్యోదయ కార్డులను అందజేనున్నట్లు వైఎస్సార్ ఈ సందర్భంగా వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 12 Oct 2008 | 8:17 am

అస్సోం అల్లర్లపై సీబీఐ విచారణ: గగోయ్

అస్సోం రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లపై సీబీఐ విచారణ జరిపేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ వెల్లడించారు. ఆ అల్లర్ల వెనుక గల సంఘవిద్రోహశక్తులను గుర్తించాల్సిందిగా సీబీఐను కోరినట్టు తెలిపారు.
Source: జాతీయ | 12 Oct 2008 | 8:07 am

సేవే లక్ష్యం.. ప్రేమే మార్గం..: చిరంజీవి

సేవే లక్ష్యం, ప్రేమే మార్గంగా ప్రజారాజ్యం పార్టీ ప్రజల ముందుకు వచ్చిందని ఆ పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. ప్రజాసేవే ధ్యేయంగా తాను రాజకీయాల్లోకి వచ్చానని మెగాస్టార్ వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 12 Oct 2008 | 7:54 am

స్వదేశానికి చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ

కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ న్యూయార్క్ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. శనివారం సాయంత్రం ఆయన దేశ రాజధానికి చేరుకున్నారు. భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన ప్రతిష్టాత్మక అణు ఒప్పందం అమలు బిల్లుపై సంతకాలు చేసేందుకు ఆయన న్యూయార్క్‌కు వెళ్లిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 12 Oct 2008 | 7:30 am

లోక్‌సభ ఎన్నికలపై సీపీఎం కీలక చర్చ

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కేంద్ర కమిటీ ఆదివారం కోల్‌కతాలో సమావేశం కానుంది. ఇందులో వచ్చే లోక్‌సభ ఎన్నికలపై కీలక చర్చ జరుపనున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం, తీవ్రవాదం అణచివేత, ధరల పెరుగుదల
Source: జాతీయ | 12 Oct 2008 | 6:23 am

అమితాబ్‌ క్షేమం కోసం అభిమానుల ప్రార్థనలు

తన 66వ పుట్టిన రోజున తీవ్ర అస్వస్థకు లోనైన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడిన అమితాబ్‌ను శనివారం హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 12 Oct 2008 | 5:29 am

అక్టోబరు 12, 2008 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 శుభోదయం 09.00 పంచతంత్రం 09.30 విష్ణు పురాణం 11.00 చెప్పాలనిఉంది 12.00 ఈనాడు సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 12 Oct 2008 | 5:03 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 12 Oct 2008 | 5:00 am

తెలంగాణపై సరైన నిర్ణయం తీసుకున్నాం : టీడీపీ

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ సకాలంలో సరైన నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.... తెలంగాణ అంశంలో తెదేపా దశల వారిగా చర్చించి తగిన నిర్ణయమే తీసుకుందని చెప్పారు
Source: ఏపీ న్యూస్ | 11 Oct 2008 | 11:55 am

బైంసాలో కొనసాగుతున్న కర్ఫ్వూ

ఆదిలాబాద్ జిల్లా బైంసా పట్టణంలో విధించిన కర్ఫ్యూ కొనసాగుతుంది. శుక్రవారం దుర్గాదేవి నిమజ్జనోత్సవంలో భాగంగా ఇరు వర్గాల మధ్య హింసాకాండ చోటు చేసుకున్న విషయం తెలిసిందే
Source: ఏపీ న్యూస్ | 11 Oct 2008 | 11:52 am

ప్రజల ఆశయాలకు బాసటగా నిలుస్తా! : చిరు

ప్రజల ఆశయాలకు బాసటగా నిలుస్తానని ప్రజారాజ్యం పార్టీ అధినేత, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి హామీ ఇచ్చారు. తన ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఆయన శనివారం శ్రీకాకుళం జిల్లా మందసలో జరిగిన రోడ్‌షోలో చిరు పాల్గొన్నారు
Source: ఏపీ న్యూస్ | 11 Oct 2008 | 11:47 am

ప్రకాష్ కారత్‌తో అల్లు అరవింద్ భేటీ!

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్‌తో శనివారం ప్రజారాజ్యం పార్టీ నేత అల్లు అరవింద్ భేటీ అయ్యారు. పొత్తులు కుదుర్చుకోవడంతో పాటు, పలు రాజకీయ పరిణామాలపై వీరిద్దరి మధ్య వ్యూహాత్మకంగా చర్చలు జరిగింది. కారత్‌తో భేటీ అయిన అనంతరం అల్లు అరవింద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 11 Oct 2008 | 11:43 am

ప్రజలకోరిక మేరకే తెలంగాణ : హరికృష్ణ

ప్రజల కోరిక మేరకే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించామని తెలుగుదేశం పార్టీ ఎంపీ నందమూరి హరికృష్ణ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఇప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే తెలంగాణ విషయంలో తమ పార్టీ సానుకూల నిర్ణయం తీసుకుందని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 11 Oct 2008 | 11:35 am