తమిళం, ఇంగ్లీషు భాషల్లో క్విక్ గన్ మురుగన్

నటకిరీటీ రాజేంద్రప్రసాద్ హీరోగా నటిస్తోన్న "క్విక్ గన్ మురుగన్" చిత్రం త్వరలో తమిళం, ఇంగ్లీషు భాషల్లో విడుదల కానుంది. మాంటో క్రిస్టో ఇంటర్‌నేషనల్ సమర్పణలో ఫాట్ ఫిష్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ ద్విభాషా చిత్రం రూపొందుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2008 | 1:41 pm

సన్‌రేస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తేజం

"లీవ్ అండ్ లెట్‌లీవ్" అనే డాక్యుమెంటరీ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎ.రాజ్ కె.ఎస్ గోపిని దర్శకుడిగా పరిచయం చేస్తూ "తేజం" అనే సినిమా రూపొందుతోంది. సన్‌రేస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2008 | 1:21 pm

సన్నీ, యామిని జంటగా ఈ వయసులో

సన్ని, యామినిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ, పసులులేటీస్ ప్రొడక్షన్స్ పతాకంపై "ఈ వయసులో" చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్‌కు "రీచ్ ది గోల్" అనే ఉపశీర్షికను జోడించారు. బి.రమేష్ రాయులు దర్శకుడు. పసుపులేటి సుశీల్
Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2008 | 1:10 pm

బెల్టుషాపులపై సమగ్ర నివేదిక సమర్పించాలి : సీఎం

రాష్ట్రంలో బెల్టుషాపులపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయంలో సీఎం ఉన్నతాధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. కల్లుగీత కార్మికుల రుణాలను మాఫీ చేయాలనే అంశంపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు
Source: ఏపీ న్యూస్ | 3 Oct 2008 | 11:40 am

తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా

తిరుపతికి సమీపంలోని రేణిగంట విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రివర్గ సమీక్ష శుక్రవారం జరిగింది. అనంతరం ఎంపి చింతా మోహన్ మీడియా ప్రతినిదులతో మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 3 Oct 2008 | 11:36 am

మహాకూటమి ఏర్పాటు అసాధ్యం : నారాయణ

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు సాధ్యం కాదని శుక్రవారం భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.... విపక్షాల ఆధ్వర్యంలో మాహాకూటమి వీలుకానందువల్లే తాము అధికారాన్ని పంచుకునే ప్రస్తావన తెచ్చామని చెప్పారు
Source: ఏపీ న్యూస్ | 3 Oct 2008 | 11:29 am

ఆర్థిక పరిస్థితి భ్రష్టుపటింది : బాబు

రాష్ట్రంలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆర్థిక పరిస్థితి పూర్తిగా భ్రష్టుపట్టిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 3 Oct 2008 | 11:27 am

చంద్రయాన్ ప్రయోగంపై కసరత్తు

శ్రీహరి కోటనుంచి ఈ నెల చివరిలో చంద్రయాన్ ప్రయోగంపై కసరత్తు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ చంద్రమాన్ ప్రయోగం చేసే అంతరిక్ష నౌకకు సీఎస్‌ఎల్‌వీ-సిగా అంతరిక్ష శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఇది పూర్తిగా మానవ రహిత రోదసీ నౌక.
Source: ఏపీ న్యూస్ | 3 Oct 2008 | 11:24 am

తెలంగాణ వాదులారా... ఏకమవుదాం : గౌడ్

ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ వాదులందరూ ఏకం కావాలని నవ తెలంగాణ ప్రజా పార్టీ అధ్యక్షుడు దేవేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కువద్ద నతెపా నిర్వహించిన సత్యాగ్రహం కార్యక్రమానికి తెలంగాణ పార్టీలన్నింటిని ఆహ్వానించింది
Source: ఏపీ న్యూస్ | 3 Oct 2008 | 11:22 am

సంపన్నశ్రేణి ఆదాయ పరిమితి రూ.4.5 లక్షలకు పెంపు

లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ విభాగంలో మరికొంతమంది ఓబిసీలకు ప్రయోజనం కలిగించేలా సంపన్నశ్రేణి ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.4.5 లక్షలకు కేంద్రప్రభుత్వం పెంచింది.
Source: జాతీయ | 3 Oct 2008 | 11:14 am

వీధి బాలల నేపథ్యమే కేక: తేజ

"కేక" చిత్రం విడుదలకాకముందే ఒక్కోపాటను ఒక్కో ఎఫ్.ఎం. ద్వారా విడుదల చేసి సరికొత్త పంథాలో వెళతాననీ, ఆ తర్వాతే సినిమా ఆడియో విడుదల చేస్తానని ప్రకటించిన తేజ కాస్త వెనక్కు తగ్గారు. సినిమా ముందు ఆడియో విడుదల రొటీన్ అని చెప్పిన ఆయనే అదే మార్గంలో...
Source: వినోదం | 3 Oct 2008 | 10:15 am

భారత్‌ను పురోగామి దేశంగా మార్చండి: కలాం

భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చవలసిన అవసరముందని మాజీ రాష్ట్రపతి ఎపిజె కలాం చెప్పారు. ఈ లక్ష్య సాధనకు ఒక సమగ్ర కార్యాచరణను చేపట్టాలని సూచించారు. తంజావూరులోని వల్లమ్ వద్ద గల పెరియార్ మణియమ్మాల్ యూనివర్శిటీ విద్యార్ధులు ప్రదర్శించిన పియుఆర్ఎ కార్యక్రమ నమూనాను కలాం పరిశీలించారు.
Source: జాతీయ | 3 Oct 2008 | 9:24 am

అణు పరీక్షలు జరిపే హక్కు భారత్‌కు ఉంది: ప్రణబ్

అణు పరీక్షలు నిర్వహించే హక్కు భారత్‌ కలిగివుందని విదేశాంగ మంత్రి విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మరోసారి స్పష్టం చేశారు. అమెరికాతో పౌర అణు సహకార ఒప్పందం కుదుర్చుకోవడంతో, ఈ హక్కు పోతుందనే వాదన సరికాదన్నారు. అణు పరీక్షలు
Source: Yahoo! Telugu: News | 3 Oct 2008 | 9:13 am

వివాదాల సుడిగుండంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒకటి. మూడు దశల్లో నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి, ఆ దిశగా పనులు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రెండు లక్షల హెక్టార్లకు సాగు నీరు అందివ్వొచ్చు.
Source: ఏపీ న్యూస్ | 3 Oct 2008 | 9:01 am

మంగుళూరులో 11 మంది అనుమానితుల అరెస్టు

మంగుళూరులో తీవ్రవాదులుగా అనుమానిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భారీ పేలుళ్ళకు కుట్ర పన్నినట్టు వారివద్ద జరిపిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వీరి నుంచి టైమ్ బాంబులతో పాటు.. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Source: జాతీయ | 3 Oct 2008 | 8:56 am

ప్రజారాజ్యం సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం

సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సభ్య నమోదు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమైంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రకటించినట్టుగా పార్టీ తొలి సభ్యత్వాన్ని వికలాంగుడైన బాలకృష్ణ నాయుడుకు అందజేశారు. రెండో సభ్యుడిగా చిరంజీవి స్వీకరించారు.
Source: ఏపీ న్యూస్ | 3 Oct 2008 | 8:54 am

ఎల్లంపల్లి ప్రాజెక్టులో భారీగా అక్రమాలు: బాబు ధ్వజం

ఎల్లంపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగాయని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఒక్కరాత్రిలో అంచనాలను సవరించడం ద్వారా రూ. 392కోట్ల మేర దోచుకున్నారని దుయ్యబట్టారు.
Source: Yahoo! Telugu: News | 3 Oct 2008 | 8:34 am

భారత్‌తో సజీవ స్నేహాన్ని కోరుకుంటున్నాము: రైస్

భారత్‌తో అమెరికా చిరకాల స్నేహాన్ని కోరుకుంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి కండొలిజా రైస్ వ్యాఖ్యానించారు. అమెరికా- భారత్ సంబంధాలు సరైన దిశలో ముందుకెళుతున్నాయని చెప్పారు. తాజాగా అంతిమ దశకు చేరుకున్న అమెరికా- భారత్ పౌర
Source: Yahoo! Telugu: News | 3 Oct 2008 | 8:32 am

అణు విద్యుత్‌ కేంద్ర ఏర్పాటుకు సై: వైఎస్

భారత్-అమెరికా అణు ఒప్పందం కార్యరూపందాల్చనుంది. దీంతో రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు తగు ప్రతిపాదనలు తయారు చేయాలని రెండువారాల కిందట జెన్‌కోకు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 3 Oct 2008 | 7:26 am

అణు ఒప్పందాన్ని సమీక్షిస్తాం: వెంకయ్య

భారతీయ జనతా పార్టీ భారత్-అమెరికా అణు ఒప్పందాన్ని సమీక్షిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు ప్రకటించారు. అలాగే దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న మత మార్పిడులను పూర్తిగా నివారిస్తామని స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 3 Oct 2008 | 7:21 am

రాష్ట్రంలో తొలి దశగా 2వేల మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి

రాష్ట్రంలో తొలి దశగా రెండు వేల మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ తెలియజేశారు. దీనిపై వారం రోజుల్లో జెన్ కో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తుందన్నారు.
Source: Yahoo! Telugu: News | 3 Oct 2008 | 6:46 am

బ్లాక్ డేగా నవంబర్ 1: దేవేందర్ గౌడ్ పిలుపు

ఆంధ్ర రాష్ట్రావతరణ దినమైన నవంబర్ 1ని బ్లాక్ డేగా పాటించాలని తెలంగాణ పార్టీల నేతలకు నవ తెలంగాణ పార్టీ చీఫ్ దేవేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చాటేందుకై ఈ రోజును బ్లాక్ డేగా పాటించాలన్నారు.
Source: Yahoo! Telugu: News | 3 Oct 2008 | 6:42 am

స్టట్‌గార్ట్ ఓపెన్ టోర్నీ క్వార్టర్స్‌లో వీనస్‌, సఫీనా ఢీ

స్టట్‌గార్ట్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ క్వార్టర్ ఫైనల్‌లో వింబుల్డన్ ఛాంపియన్ వీనస్ విలియమ్స్, ప్రపంచ మూడో నెంబర్ క్రీడాకారిణి దినారా సఫినాలు తలపడేందుకు రంగం సిద్ధమైంది. రెండో రౌండ్లో వీనస్ విలియమ్స్ గంటపాటు పోరు సాగించి...
Source: Yahoo! Telugu: News | 3 Oct 2008 | 5:42 am

ఒరిస్సాలో ఆగని హింసాకాండ: గృహాలకు నిప్పు

ఒరిస్సా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లాలో చెలరేగిన మత ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అల్లర్లు చిన్నగా పొరుగున్న ఉన్న బౌద్ జిల్లాకు కూడా వ్యాపించాయి. ఆందోళనకారులు బౌద్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో 111 గృహాలకు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయాయి.
Source: జాతీయ | 3 Oct 2008 | 5:37 am

ముడుపుల కేసులు: ఇజ్రాయేల్ ప్రధాని ఓల్మర్ట్‌ వద్ద విచారణ

ఇజ్రాయేల్ ప్రధానమంత్రి ఎహుద్ ఓల్మర్ట్‌ను అవినీతి కేసులకు సంబంధించి డిటెక్టివ్‌లు మరోసారి ప్రశ్నించారు. ఈ ఏడాది మే నుంచి అవినీతి ఆరోపణలపై ఓల్మర్ట్ వద్ద డిటెక్టివ్‌లు విచారణ జరపడం ఇది ఎనిమిదోసారి. ముడుపుల కేసులపై ప్రతిపక్షాలు, భాగస్వాముల
Source: Yahoo! Telugu: News | 3 Oct 2008 | 5:30 am

గాయంతో ఖతార్ టోర్నీకి షరపోవా గుడ్‌బై

భుజంగాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నీనుంచి షరపోవా వైదొలిగింది. ఇప్పటికే ఈ గాయం కారణంగా ఆగస్టునుంచి టెన్నిస్‌కు దూరంగా ఉన్న షరపోవా తద్వారా ఈ సీజన్‌ను ముగించినట్లయింది.
Source: Yahoo! Telugu: News | 3 Oct 2008 | 5:23 am

పంచాయతీలకు 29 అధికారాల బదిలీ: చిరు హామీ

తమ పార్టీ అధికారంలోకి వస్తే 29 అధికారాలను పంచాయతీలకు బదిలీ చేస్తామని మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన 73, 74 రాజ్యాంగ సవరణలను తప్పక అమలు చేస్తామన్నారు.
Source: Yahoo! Telugu: News | 3 Oct 2008 | 5:16 am

అగర్తలా వరుస బాంబు పేలుళ్లు: ఆరుగురి నిర్బంధం

త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలాలో బుధవారం సాయంత్రం సంభవించిన నాలుగు వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి పోలీసులు ఆరుగురు అనుమానితులను అరెస్టు చేశారు. ఈ పేలుళ్లను ఖండించేందుకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌‍కు ప్రధాని
Source: Yahoo! Telugu: News | 3 Oct 2008 | 5:15 am

బుద్ధదేవ్‌తో భేటీ కానున్న రతన్ టాటా

నానో కార్ల ప్రాజెక్టు భవితవ్యాన్ని తేల్చేందుకు టాటా మోటార్స్ ఛైర్మన్ రతన్ టాటా శుక్రవారం పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యతో భేటీ కానున్నారు. ఈ సమావేశం రైటర్స్ భవనంలో శుక్రవారం మధ్యాహ్నం జరుగవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 3 Oct 2008 | 5:14 am

అక్టోబరు 03, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి
Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2008 | 3:03 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 3 Oct 2008 | 3:00 am