ఏ పార్టీతోనైనా పొత్తుకు సై : దేవేందర్

ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తాము ఏ పార్టీతోనైనా పొత్తు కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని నవ తెలంగాణ ప్రజా పార్టీ అధినేత దేవేందర్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఆత్మగౌరవ యాత్రలో భాగంగా శుక్రవారం వరంగల్ జిల్లాలో ప్రవేశించారు...
Source: ఏపీ న్యూస్ | 19 Sep 2008 | 10:46 am

రైతాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతా: వైఎస్

రాష్ట్రాన్ని రైతాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి పర్యటించారు...
Source: ఏపీ న్యూస్ | 19 Sep 2008 | 10:46 am

జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట సీపీఎం మహాధర్నా

రాష్ట్రంలో నిరుపేద ప్రజలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( జీహెచ్ఎంసీ) కార్యాలయం ఎదుట సీపీఎం శుక్రవారం మహాధర్నా నిర్వహించింది. పేద ప్రజలు ఉండటానికి ఇళ్లులేకుండా నానాతంటాలు పడుతున్నారని సీపీఎం వాపోయింది...
Source: ఏపీ న్యూస్ | 19 Sep 2008 | 10:08 am

సెప్టెంబర్ 24న మంత్రివర్గ సమావేశం

సెంప్టెంబర్ 24 తేదీన రాష్ట్ర మంత్రవర్గ సమావేశం జరుగనుంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం జరిగే కేబినేట్ సమావేశం జరుగనుందని ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి...
Source: ఏపీ న్యూస్ | 19 Sep 2008 | 10:07 am

ఢిల్లీలో ఎన్‌కౌంటర్: ఇద్దరు మిలిటెంట్ల హతం

దేశ రాజధాని నగరం ఢిల్లీ శుక్రవారం ఎన్‌కౌంటర్‌తో దద్ధరిల్లింది. గత శనివారం ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 30 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ పేలుళ్లలో ప్రమేయమున్నట్లు అరెస్టయిన అబూ బషీర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దక్షిణ ఢిల్లీ జామియానగర్‌లోని ఒక ఇంటిపై పోలీసులు దాడి చేశారు.
Source: జాతీయ | 19 Sep 2008 | 8:39 am

రాష్ట్రంలో మెట్రోరైలుకు పచ్చజెండా!

మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించిన అవరోధాలు తొలగిపోయాయి. ఈ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకునేందుకు మైటాస్- నవభారత్ కన్సార్టియం రాష్ట్ర ప్రభుత్వంతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది....
Source: ఏపీ న్యూస్ | 19 Sep 2008 | 7:38 am

కరీంనగర్ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శుక్రవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో సీఎం ఈ రోజు ఉదయం కరీంనగర్ జిల్లాకి చేరుకుంటారు. ఒక్క రోజు పర్యటనలో భాగంగా ఆయన కాళేశ్వర ముక్తేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు....
Source: ఏపీ న్యూస్ | 19 Sep 2008 | 5:56 am

కాంగ్రెస్‌ పార్టీని మట్టికరిపిస్తాం: కేసీఆర్

ప్రతిపక్షాలు తమతో చేతులుకలిపితే కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపిస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖరరావు సవాలు విసిరారు. అంబర్‌పేటలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. జగదీశ్వర్ ముస్లింల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేసీఆర్ పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 Sep 2008 | 5:52 am

కాంగ్రెస్ పార్టీకి ఆ అర్హత లేదు: తెదేపా

ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రాంత ఆస్తులను కాంగ్రెస్ నాయకులు రాబందుల్లా దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని తెదేపా సవాలు విసిరింది.
Source: ఏపీ న్యూస్ | 19 Sep 2008 | 4:21 am

ప్రధాని, మున్షీ వ్యాఖ్యలలో తేడా లేదు: కాంగ్రెస్

మరింత కఠినమైన ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను తీసుకురావడంపై ప్రధాని మన్మోహన్, కేంద్ర మంత్రి దాస్ మున్షీలు చేసిన వ్యాఖ్యలలో వైరుధ్యం ఏదీ లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
Source: జాతీయ | 19 Sep 2008 | 4:13 am

వైఎస్ రాక్షస పాలనకు అంతం పలకాలి: దేవేందర్

రాష్ట్రంలో వైఎస్ రాక్షస పాలనకు అంతం పలకాలని నవతెలంగాణ ప్రజాపార్టీ అధినేత దేవేందర్ గౌడ్ పిలుపిచ్చారు. కాంగ్రెస్ పాలన బ్రిటీష్ పాలనను తలపిస్తోందని ఆయన విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 19 Sep 2008 | 3:56 am

పోటాను తీసుకు వచ్చేది లేదు: దాస్ మున్షీ

ఉగ్రవాదుల దాడులతో దేశ అంతర్గత భద్రత తీవ్రంగా చర్చనీయాంశం అవుతున్న నేపధ్యంలో దేశీయ భద్రతా యంత్రాంగాన్ని మరింతగా పటిష్టం చేస్తామని యుపిఎ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగని మళ్లీ పోటా చట్టాన్ని తీసుకు వచ్చేది లేదని స్పష్టం చేసింది.
Source: జాతీయ | 19 Sep 2008 | 3:44 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 19 Sep 2008 | 3:10 am

సెప్టెంబరు 19, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా -జగడం 12:00 నా అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి 14:30 శ్రీ కృష్ణ లీలలు...
Source: Yahoo! Telugu: Entertainment | 19 Sep 2008 | 3:10 am

జేఏసీ చర్చలు 21కి వాయిదా

డిమాండ్ల పరిష్కార సాధనకు సంయుక్త కార్యాచరణ కమిటీ(జేఏసీ) ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఈ నెల 21వ తేదీకి వాయిదా పడింది. ముఖ్యమంత్రితో జేఏసీ రెండోవిడతగా గురువారం సమావేశం జరిపింది.
Source: ఏపీ న్యూస్ | 18 Sep 2008 | 1:48 pm

పర్యాటక రంగానికి పెరుగుతున్న ఆదరణ

దేశంలో పర్యాటక రంగానికి నానాటికీ ఆదరణ పెరుగుతున్నట్టు కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖామంత్రి అంబికాసోనీ వెల్లడించారు. హైదరాబాద్‌లో ఫసిపిక్, ఆసియా టూరిజం మార్ట్ బుధవారం ప్రారంభమైంది. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పర్యాటక సంస్థలు...
Source: వినోదం | 18 Sep 2008 | 1:29 pm