ఫెడరల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి: ఏఆర్‌సి

పెట్రేగి పోతున్న తీవ్రవాద పీచమణిచేందుకు ఫెడరల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ (ఏఆర్‌సి) అభిప్రాయపడింది. తీవ్రవాదంతో బహుముఖంగా తలపడేందుకు అనువుగా సమగ్ర, సమర్థవంతమైన చట్టాన్ని తీసుకరావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఆర్‌సి పేర్కొంది.
Source: జాతీయ | 16 Sep 2008 | 1:00 pm

విపక్షాల వైఖరిపై రోశయ్య ధ్వజం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయాన్ని విపక్షాలు ఏ మాత్రం ఉపయోగించుకోలేదని ఆర్థిక మంత్రి రోశయ్య ధ్వజమెత్తారు. ...
Source: ఏపీ న్యూస్ | 16 Sep 2008 | 12:07 pm

కమిటీల ఏర్పాటుకు ప్రజారాజ్యం కసరత్తు

రాష్ట్రంలో వివిధ కమిటీల ఏర్పాటుపై మెగాస్టార్ చిరంజీవి పార్టీ అయిన ప్రజారాజ్యం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఇందులోభాగంగా తొలుత జిల్లా స్థాయిలో అడ్‌హాక్ కమిటీలు, రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని తొలుత భావించింది.
Source: ఏపీ న్యూస్ | 16 Sep 2008 | 12:05 pm

పావలా వడ్డీకే విద్యార్థులకు రుణాలు: సీఎం

ఉపకారవేతనాలకు అనర్హులైన విద్యార్థులకు పావలా వడ్డికే రుణాలను అందిచనున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన కడప జిల్లాలో పర్యటించారు...
Source: ఏపీ న్యూస్ | 16 Sep 2008 | 12:00 pm

వాయుగుడంగా మారిన అల్పపీడనం

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుడంగా మారింది. దీని ప్రభావం వల్ల ఒరిస్సా, కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది....
Source: ఏపీ న్యూస్ | 16 Sep 2008 | 11:56 am

నేడు గవర్నర్‌ను కలవనున్న విపక్షాలు

అసెంబ్లీ సభ నిర్వహణలో ప్రభుత్వ పనితీరు, స్పీకర్ వ్యవహారశైలి వంటి పలు అంశాలతో విపక్షాలు మంగళవారం గవర్నరుకు వినతి పత్రాన్ని సమర్పించాలని నిర్ణయించాయి....
Source: ఏపీ న్యూస్ | 16 Sep 2008 | 11:49 am

పక్కదారి పడుతున్న ప్రభుత్వ పరిహారం

కరీంనగర్ జిల్లాలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రభుత్వం పరిహారం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వరద బాధితులకు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వ అధికారులే ఈ సొమ్మును వాటాలుగా వేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో 239 కిలోమీటర్ల మేరకు
Source: ఏపీ న్యూస్ | 16 Sep 2008 | 11:34 am

నాగర్జునసాగర్ గేట్లన్నీ ఏత్తివేత

నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తివేశారు. దీంతో సాగర్ అందాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఎగువ నుంచి సాగర్ జలాశయంలోకి 2.70 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం పూర్తి నీటిమట్టమైన 590 అడుగుల గరిష్ట స్థాయికి మరో రెండు అడుగులు మాత్రమే తక్కువగా ఉంది.
Source: ఏపీ న్యూస్ | 16 Sep 2008 | 11:31 am

స్టాక్ మార్కెట్: కోలుకున్న సెన్సెక్స్

ముంబయి స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ కోలుకుని 12 పాయింట్లమేర స్వల్పంగా నష్టపోయి 13,519 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 4075 పాయింట్ల వద్ద ముగిసింది. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్...
Source: Yahoo! Telugu: News | 16 Sep 2008 | 11:27 am

ఫెడరల్ ఏజెన్సీ ఏర్పాటుకు సంస్కరణల కమిషన్ సిఫార్సు

దేశంలో తీవ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఫెడరల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని రెండో పాలనా సంస్కరణల కమిషన్ (ఏఆర్‌సీ) మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అంతేకాకుండా సమగ్ర తీవ్రవాద నిరోధన చట్టాలను కూడా
Source: Yahoo! Telugu: News | 16 Sep 2008 | 10:46 am

బలహీనమైన కథతో సరోజ

కిడ్నాప్ కథాంశంతో తెలుగు, తమిళ భాషల్లో ఇటీవల విడుదలైన చిత్రం సరోజ. కథాగమనాన్ని అద్భుతంగా నడిపించిన దర్శకుడు కథలో పట్టును చూపించలేకపోయాడు. వైవిధ్యం కోసం శ్రీహరి పాత్ర ఉన్నప్పటికీ, ఈ పాత్ర చూసే ప్రేక్షకుడికి
Source: Yahoo! Telugu: News | 16 Sep 2008 | 10:27 am

బలహీనమైన కథతో సరోజ

కిడ్నాప్ కథాంశంతో తెలుగు, తమిళ భాషల్లో ఇటీవల విడుదలైన చిత్రం సరోజ. కథాగమనాన్ని అద్భుతంగా నడిపించిన దర్శకుడు కథలో పట్టును చూపించలేకపోయాడు. వైవిధ్యం కోసం శ్రీహరి పాత్ర ఉన్నప్పటికీ, ఈ పాత్ర చూసే ప్రేక్షకుడికి
Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2008 | 10:27 am

బలపడిన వాయుగుండం: ఉత్తర కోస్తాలో వరదలు

బంగాళాఖాతంలో వాయుగుండం బలపడటంతో ఉత్తర కోస్తాలో ప్రధాన నదులకు వరదలు వచ్చాయి. ఒరిస్సాలోని పారాదీప్‌కు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల వాయుగుండం బలపడిందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ వర్గాలు తెలిపారు. ఇది మరింత..
Source: Yahoo! Telugu: News | 16 Sep 2008 | 10:20 am

నాగార్జునసాగర్ నుంచి భారీగా వరద నీరు విడుదల

నాగార్జునసాగర్ నుంచి భారీగా వరద నీటిని దిగువకు వదిలారు. సాగర్‌కున్న 26 గేట్లను ఎత్తివేసి దాదాపు 2లక్షల వరదనీటిని విడుదల చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కృష్ణతో పాటుగా...
Source: Yahoo! Telugu: News | 16 Sep 2008 | 10:00 am

ఆశీస్సులు ఉండగా... రాజీనామా ఎందుకు: పాటిల్

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మద్దతు ఉన్నంత వరకు తన పదవికి రాజీనామా చేయబోనని కేంద్ర హోం శాఖామంత్రి శివరాజ్ పాటిల్ స్పష్టం చేశారు. పార్టీ ఆశీస్సులు ఉన్నంత వరకు మంత్రిగా కొనసాగుతున్నట్టు ఆయన తేల్చి చెప్పారు.
Source: జాతీయ | 16 Sep 2008 | 9:56 am

ప్రజారాజ్యంలోకి తెలుగుదేశం నాయకుల సోదరులు

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల సోదరులు చేరారు. వరంగల్ లోక్‌సభ సభ్యుడు, సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ప్రదీప్ రావు ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పుగోదావరి...
Source: Yahoo! Telugu: News | 16 Sep 2008 | 9:45 am

ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రులకు ఏర్పాట్లు పూర్తి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన జగన్మాత కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రులకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శరన్నవరాత్రులు సెప్టెంబరు 30వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని కనకదుర్గ దేవాలయ నిర్వహణాధికారి చంద్ర కుమార్...
Source: Yahoo! Telugu: News | 16 Sep 2008 | 9:31 am

ఔషదాల తయారీ కేంద్రంగా హైదరాబాద్: వైయస్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఔషదాల తయారీ కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఔషద రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మందుల కంపెనీలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 16 Sep 2008 | 9:21 am

సింగూరు వివాదం: రైతుల పునరావాస ప్యాకేజీ విస్తరణ

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అధికార లెఫ్ట్ ఫ్రంట్‌కు నేతృత్వం వహిస్తున్న సీపీఎం సింగూరులో టాటా మోటార్స్ ఏర్పాటు చేస్తున్న నానో కార్ల ప్రాజెక్టు కారణంగా భూమి కోల్పోయిన రైతులకు అందజేస్తున్న పునరావాస ప్యాకేజీని విస్తరించింది. సింగూరు భూవివాదం
Source: Yahoo! Telugu: News | 16 Sep 2008 | 9:16 am

కాంగ్రెస్ కోరుకుంటే రాజీనామా చేస్తా: శివరాజ్ పాటిల్

దేశ అంతర్గత భద్రత విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ మంగళవారం మాట్లాడుతూ.. తనకు కాంగ్రెస్ అధిష్టానం మద్దతు ఉన్నంతవరకు ఈ బాధ్యతల్లో కొనసాగుతానని చెప్పారు. హోం మంత్రి బాధ్యతల
Source: Yahoo! Telugu: News | 16 Sep 2008 | 9:06 am

ఒరిస్సాలో పోలీస్ స్టేషన్‌పై ఆందోళనకారుల దాడి

ఒరిస్సాలోని సమస్యాత్మక కంధమాల్ జిల్లాలో ఆందోళనకారులు మంగళవారం ఉదయం ఆయుధాలతో ఒక పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి, నిప్పంటించారు. ఆందోళనకారుల దాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. దీంతో ఈ ప్రాంతంలో
Source: Yahoo! Telugu: News | 16 Sep 2008 | 8:52 am

ఏపీ భవన్‌‌కు సరికొత్త సొబగులు

దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్రానికి ఏపీ భవన్ ఉంది. ఈ ప్రాంతం ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉంది. దీంతో ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్ సెంటర్‌ను నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రముఖ నిర్మాణ సంస్థ నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీకి నిర్మాణ
Source: ఏపీ న్యూస్ | 16 Sep 2008 | 8:21 am

19న ప్రేక్షకుల ముందుకురానున్న రక్ష

జగపతిబాబు, కళ్యాణి, రాజీవ్‌కనకాల, సుబ్బరాజు, చంద్రశేఖర్, బేబి నేహా తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం "రక్ష". ఒన్‌‍మోర్‌థాట్, జెడ్ 3 పిక్చర్స్ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ కంపెనీ నుంచి వస్తున్న ఈ సినిమాను ఈ నెల 19న ప్రేక్షకుల
Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2008 | 8:03 am

వన్ చిత్ర ఆడియో విడుదల

మాస్టర్ ఎన్టీఆర్ సమర్పణలో 9 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వడ్డే నవీన్, ఆర్తీ ఖైతాన్ హీరోహీరోయిన్లుగా నల్ల చరణ్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "వన్". కృష్ణతేజ దర్శకుడు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం రాత్రి ప్రసాద్‌ల్యాబ్స్ ప్రివ్యూ
Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2008 | 7:52 am

నవనీత్‌కౌర్ ప్రధాన పాత్రలో టెర్రర్

నవనీత్‌కౌర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "టెర్రర్" చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. నిషానేహా ప్రొడక్షన్స్ అనే నూతన నిర్మాణ సంస్థ ఏ.ఏ. ఆర్ట్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తోంది. బ్రహ్మాజీ, ప్రభాకర్, విజయచందర్, సమీర్ నిళల్‌గళ్‌రవి, అభినయశ్రీ
Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2008 | 7:13 am

ఆర్యన్ రాజేష్, శ్రద్దా ఆర్య జంటగా రోమియో

శ్రీహరి ప్రధానపాత్రలో ఆర్యన్ రాజేష్, శ్రద్దా ఆర్య జంటగా రూపొందుతోన్న చిత్రం "రోమియో". రామకృష్ణ దర్శకుడు. సుధా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో మంగళవారం ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రారంభం
Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2008 | 7:00 am

నూతన నటీనటులతో మ్యావ్ బీ కేర్‌ఫుల్

నూతన నటీనటులతో "మ్యావ్" అనే చిత్రం తెరకెక్కుతోంది. దీనికి "బీ కేర్‌ఫుల్" అనే కాప్షన్‌ను కూడా జోడించారు. దర్శకుడు విద్య. ఏకరుద్రాదేవి ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై చెన్నుపాటి నాగమల్లేశ్వరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2008 | 6:43 am

నేటి నుంచి రెండు రోజుల గవర్నర్ల సదస్సు

దేశ అంతర్గత భద్రతపై రాష్ట్రపతి దృష్టి సారించారు. ఇందులోభాగంగా.. అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రెండు రోజుల పాటు ప్రత్యేక సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సు మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఇందులో 28 రాష్ట్రాల గవర్నర్లతో పాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరవుతారు.
Source: జాతీయ | 16 Sep 2008 | 6:38 am

వచ్చే వారంలో సరిహద్దు వాణిజ్యంపై చర్చలు

పాకిస్థాన్-భారత్‌ జాయింట్ వర్కింగ్ గ్రూపు వచ్చే వారంలో భేటీ కానుంది. సరిహద్దు వాణిజ్యం, రాకపోకలపై చర్చించేందుకుగాను ఈ వర్కింగ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ వచ్చే వారంలో సమావేశం కానుంది. ఇందులో అక్టోబరు నుంచి సరిహద్దు వాణిజ్యాన్ని నిర్వహించే విషయంపై తుది నిర్ణయం తీసుకోనుంది.
Source: జాతీయ | 16 Sep 2008 | 6:21 am

సొంత జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ పర్యటన

ఒక రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి మంగళవారం కడప జిల్లాకు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రానికే వైఎస్సార్ ఇడుపులపాయ చేరుకోవాల్సి ఉంది.
Source: ఏపీ న్యూస్ | 16 Sep 2008 | 5:54 am

నేడు సింగూరుకు తృణమూల్ కవాతు

సింగూర్ సిగపట్లు ఇప్పట్లో వీడిపోయేలా కనిపించడం లేదు. రైతుల నుంచి స్వాధీనం చేసుకున్న భూములను ప్రభుత్వం తిరిగి ఇవ్వాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్నారు.
Source: జాతీయ | 16 Sep 2008 | 5:48 am

ప్రజల కోసం ప్రధాని రాజీనామా చేయాలి: రాజ్‌నాథ్

దేశ ప్రజల మేలు, సంక్షేమం కోసం ప్రధాని మన్మోహన్ సింగ్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని రాజ్‌నాథ్ ఆరోపించారు.
Source: జాతీయ | 16 Sep 2008 | 4:47 am

సెప్టెంబరు 16, 2008 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 శుభమస్తు -చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి 14.30 శ్రీ కృష్ణ లీలలు
Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2008 | 2:52 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2008 | 2:49 am