ఢిల్లీ పేలుళ్ళు: ఆరుగురి అనుమానితుల అరెస్టు

దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి ప్రాథమికంగా లభించిన సాక్ష్యాధారాల మేరకు ఆరుగురు అనుమానితులను అరెస్టు చేశారు. మరింత సమాచారం కోసం వీరివద్ద తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. అలాగే పేలుళ్ళ ప్రాంతంలో కీలక ఆధారాలు లభించినట్టు పోలీసులు వెల్లడించారు.
Source: జాతీయ | 14 Sep 2008 | 8:17 am

రూ. 5 లక్షల 7వేలు పలికిన బాలాపూర్ లడ్డు

బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మహా ప్రసాదం లడ్డూ రికార్డు స్థాయిలో రూ. 5 లక్షల 7వేలు పలికింది. దీనితో గత ఏడాదికంటే బాలాపూర్ లడ్డూ 92వేలు పెరిగిందని ఆలయ కమిటీ నిర్వాహకులు వెల్లడించారు. ఆదివారం ఉదయం ఉత్సవ కమిటీ సభ్యులు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Sep 2008 | 7:42 am

ఇద్దరు సిమి కార్యకర్తల అరెస్ట్

రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలోని మౌలాలీలో ఇద్దరు సిమి కార్యకర్తలను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. శనివారం న్యూఢిల్లీలో వరుస బాంబు పేలుళ్ల సంభవించిన నేపథ్యంలో... రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
Source: ఏపీ న్యూస్ | 14 Sep 2008 | 6:30 am

సెప్టెంబరు 14, 2008 కార్యక్రమాలు

00.00 జెమిని కొత్త పాటలు, 06.00 భక్తగీతాల కార్యక్రమం, 07.00 జెమిని వార్తలు, 08.30 కేక, 09.00 జంబెల్ హార్ట్, 09.30 ఫన్‌డే అవార్డ్స్, 10.00 చలనచిత్రం, 12.00 సినిమా నందయ్య శిష్యులు, 12.30 చలనచిత్రం, 13.30 జెమిని వార్తలు, 13.33 చలనచిత్రం తరువాయి భాగం,
Source: Yahoo! Telugu: Entertainment | 14 Sep 2008 | 5:58 am

తదుపరి చర్చలకు తావులేదు: మమతా బెనర్జీ

సింగూర్‌ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. వచ్చే 16వ తేదీన సింగూర్‌కు ర్యాలీగా వెళ్లనున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అంతేకాకుండా గవర్నర్ సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని లెఫ్ట్ ప్రభుత్వం ఉల్లంఘించిందని అందువల్ల తదుపరి చర్చలకు ఏమాత్రం ఆస్కారం లేదని ఆమె తేల్చి చెప్పారు.
Source: జాతీయ | 14 Sep 2008 | 4:27 am

ఢిల్లీ వరుస పేలుళ్లు: 24కు పెరిగిన మృతులు

దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 24కు చేరుకుంది. ఈ పేలుళ్లలో మరో 125 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Source: జాతీయ | 14 Sep 2008 | 4:02 am

ఢిల్లీ పేలుళ్లు : 20కి పెరిగిన మృతుల సంఖ్య

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం సాయంత్రం జరిగిన ఐదు వరస పేలుళ్లలో మృతి చెందినవారి సంఖ్య 20కి పెరిగినట్టు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా వార్తల ప్రకారం 20మంది మృతి చెందినట్టు ఎనభైమంది వరకు గాయపడ్డట్టు పోలీసులు చెబుతున్నా మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు...
Source: జాతీయ | 13 Sep 2008 | 2:34 pm

ఢిల్లీ పేలుళ్లు : ఇద్దరు మహిళల మృతి

ఢిల్లీలో శనివారం సాయంత్రం జరిగిన ఐదు వరుస పేలుళ్లలో ఇద్దరు మహిళలు మృతి చెందినట్టు సమాచారం. దాదాపు 50మంది వరకు గాయపడిన ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ప్రత్యక్ష సాక్షుల కథనం.
Source: జాతీయ | 13 Sep 2008 | 1:53 pm

రాజధానిలో జంట పేలుళ్లు : 30మందికి గాయాలు

దేశ రాజదాని ఢిల్లీలో శనివారం సాయంత్రం జరిగిన జంట పేలుళ్లలో 30మంది వరకు గాయపడ్డారు. వీరిలో దాదాపు ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం ఈ జంట పేలుళ్లు ఒకదాని వెంట ఒకటి జరిగినట్టుగా తెలుస్తోంది.
Source: జాతీయ | 13 Sep 2008 | 1:26 pm

'ప్రజారాజ్యం' పార్టీ తీర్థం పుచ్చుకున్న సీఆర్‌సి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సి.రామచంద్రయ్య ఎట్టకేలకు సొంత పార్టీ నుంచి తెగతెంపులు చేసుకున్నారు. శనివారం ఆయన తన సన్నిహితులతో పాటు.. ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో పార్టీలో చేరారు.
Source: ఏపీ న్యూస్ | 13 Sep 2008 | 12:19 pm

వరద బాధితులను ఆదుకుంటాం: మంత్రి లాలూ

భీకర వరదలతో అతలాకుతలమైన బీహార్‌ వాసులను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. సర్వం కోల్పోయిన బీహారీల కోసం కేంద్రం ఎన్ని కోట్లైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.
Source: జాతీయ | 13 Sep 2008 | 12:07 pm

70 ఎకరాలు మించి తిరిగి అప్పజెప్పం: పశ్చిమ బెంగాల్

సింగూరు నానో ప్లాంట్ కోసం సేకరించిన భూమిలో 70 ఎకరాలు మించి తిరిగి రైతులకు అప్పజెప్పమని పశ్చిమ బెంగాల్ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బిమన్ బోస్ స్పష్టం చేశారు. రాష్ట్ర గవర్నర్ గాంధీ పిలుపుమేరకు శనివారం మరో దఫా చర్చలు...
Source: Yahoo! Telugu: News | 13 Sep 2008 | 12:06 pm

ఎన్నికల అంశాలను ప్రకటించిన భాజపా

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ద్రవ్యోల్బణం, తీవ్రవాదం, వ్యవసాయ సంక్షోభం, వోటు బ్యాంకు రాజకీయాలు వంటి అంశాల ఆధారంగా ప్రచారం చేస్తామని భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రకటించింది. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు బెంగళూరులో...
Source: Yahoo! Telugu: News | 13 Sep 2008 | 11:56 am

పెద్ద నిర్మాతలు X చిన్న నిర్మాతలు

తెలుగు చలన చిత్ర రంగంలో అంతర్గతంగా దాగివున్న చిన్నా.. పెద్ద.. అంతరాలు మరోసారి బయటపడ్డాయి. ప్రభుత్వం కలిసివచ్చే విషయాల్లో అప్పుడప్పుడు ఒక్కటిగా ఉండే వీరంతా నేడు వేరువేరుగా కుంపటి పెడుతున్నారు. వారం రోజుల నాడు రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల టిక్కెట్ పెంపు...
Source: వినోదం | 13 Sep 2008 | 11:56 am

యూపీఏ విధానాలను ఎండగట్టిన భాజపా

బెంగుళూరులో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో యూపీఏ సర్కారు విధానాలను తూర్పారబట్టారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షిస్తోందని కమలనాథులు ధ్వజమెత్తారు. దేశ విదేశాంగ విధానం అధ్వాన్నంగా తయారయిందని దుయ్యబట్టింది.
Source: జాతీయ | 13 Sep 2008 | 11:49 am

రంభ "ప్రతిక్షణం" ఏం చేస్తుంది?

నటి రంభ చాలాకాలం తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. భోజ్‌పూరీ చిత్రాల్లో బిజీగా ఉన్న రంభ తెలుగు, తమిళంలో రూపొందే ఓ కొత్త చిత్రంలో నటిస్తోంది. తెలుగులో ఈ చిత్రానికి "ప్రతిక్షణం" అనే పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని రంభ సోదరుడు పల్లవి శ్రీనివాసన్ నిర్మిస్తుండగా, వ్యాస్ దర్శకత్వం...
Source: వినోదం | 13 Sep 2008 | 11:45 am

'చిరు'ను ఉద్దేశించి అనలేదు : వైఎస్

రాజకీయాలంటే నటన కాదు అని తాను ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఉద్దేశించి అనలేదని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి చెప్పారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తమ పార్టీలో కూడా సినీనటులు ఉన్నారని గుర్తుచేశారు....
Source: ఏపీ న్యూస్ | 13 Sep 2008 | 11:43 am

రాజకీయాల్లో దేనికైనా సిద్ధంగా ఉండాలి: వైఎస్

రాజకీయాల్లోకి ప్రవేశించాక దేనికైనా ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. అలాగే ఎలాంటి త్యాగానికైనా సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు...
Source: ఏపీ న్యూస్ | 13 Sep 2008 | 11:43 am

పంచాయతీ ఉద్యోగుల వినూత్న ధర్నా

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా పంచాయితీ ఉద్యోగులు శిరోమండనం చేసుకుని శనివారం వినూత్న ధర్నాకు దిగారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ఉద్యోగులు ....
Source: ఏపీ న్యూస్ | 13 Sep 2008 | 11:43 am

గోపాల్‌రెడ్డి భౌతిక కాయానికి బాలయ్య అంజలి

సినీ నిర్మాత, భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్.గోపాల్‌ రెడ్డి భౌతిక కాయానికి సినీనటుడు బాలకృష్ణ శనివారం ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి కంటతడి పెట్టారు...
Source: ఏపీ న్యూస్ | 13 Sep 2008 | 11:42 am

దేశ రాజధానికి వెళ్లిన వైఎస్సార్

ఒక రోజు పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఢిల్లీలో జరుగనున్న అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం పాల్గొంటారు...
Source: ఏపీ న్యూస్ | 13 Sep 2008 | 11:42 am

స్పీకర్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకే : రోశయ్య

రాష్ట్ర శాసనసభ స్పీకర్ సురేష్ రెడ్డిని బ్లాక్‌మెయిల్ చెసేందుకే తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిందని ఆర్థిక శాఖామంత్రి కె.రోశయ్య ఆరోపించారు. సచివాలయంలో నిత్యావసర సరుకుల ధరలపై జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు...
Source: ఏపీ న్యూస్ | 13 Sep 2008 | 11:42 am

ఈనెల 26 నుంచి మెగాస్టార్ ప్రజాయాత్ర..!

ఈ నెల 26వ తేదీ నుంచి ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఆయన పర్యటన జిల్లాల వారీగా సాగనుంది. తెలంగాణ లేదా ఉత్తరాంధ్రలోని ఒక జిల్లా నుంచి చిరంజీవి పర్యటన ప్రారంభమవుతుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Source: ఏపీ న్యూస్ | 13 Sep 2008 | 11:42 am

మూసీ నదినుంచి నల్గొండకు జలాలు విడుదల

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మూసీ నదికి భారీగా వరద జలాలు వచ్చాయి. దీంతో నల్గొండ జిల్లాకు సాగునీరును విడుదల చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గత మూడు రోజులుగా...
Source: Yahoo! Telugu: News | 13 Sep 2008 | 11:27 am

శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలవల్ల కృష్ణా నదికి వరద జలాలు వస్తున్నాయి. ఎగువన జూరాల జలాశయం, తుంగభద్రల నుంచి 2.25 లక్షల క్యూసెక్కుల వరద నీరు కృష్ణలో...
Source: Yahoo! Telugu: News | 13 Sep 2008 | 11:18 am

రూపకల్పన దశలో నేషనల్ డెయిరీ ప్లాన్

దేశంలో పాల ఉత్పత్తిని పెంపొందించేందుకు నేషనల్ డెయిరీ ప్లాన్‌ను రూపొందిస్తున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన పనిలో ఉందని తెలిపారు. వివిధ రాష్ట్రాల పశుసంవర్ధక, పాడి....
Source: Yahoo! Telugu: News | 13 Sep 2008 | 11:05 am

ప్రధానమంత్రి మన్మోహన్‌తో ఆర్మీ ఛీఫ్ కపూర్ మంతనాలు

జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఆర్మీ ఛీఫ్ దీపక్ కపూర్ వివరించారు. పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్‌లలో నెలకొన్న పరిస్థితులపై కూడా చర్చించారు. కాశ్మీర్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని...
Source: Yahoo! Telugu: News | 13 Sep 2008 | 10:49 am

భోపాల్‌లో 18నుంచి ఏషియన్ ఆల్ స్టార్ మీట్

ఏషియన్ ఆల్ స్టార్ అథ్లెటిక్ పోటీలను భోపాల్‍లో సెప్టెంబర్ 18న నిర్వహించనున్నామని మధ్యప్రదేశ్ క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి తురోజిరావో పవార్ తెలిపారు. నగరంలోని టీటీ నగర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగనున్నాయన్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Sep 2008 | 10:43 am

గోపాల్ రెడ్డి మృతికి ఎన్టీఆర్ సంతాపం

ప్రముఖ నిర్మాత, భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్. గోపాల్‌రెడ్డి మృతి పట్ల ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. భార్గవ్ ఆర్ట్స్ బేనర్ అంటేనే నందమూరి అభిమానులు తమ సొంత సంస్థగా భావిస్తారని, గోపాల్‌రెడ్డిగారిని తమ ఫ్యామిలీ మెంబర్‌గా భావిస్తున్నామని ఎన్టీఆర్ అన్నారు.
Source: వినోదం | 13 Sep 2008 | 10:38 am

ప్రాంతీయ అంశాలు పరిగణలోకి తీసుకుంటాం: భాజపా

ప్రాంతీయ అంశాలను పరిగణలోకి తీసుకుని పొత్తులు పెట్టుకుంటామని భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రకటించింది. భాజపా జాతీయ కార్యవర్గ మూడు రోజుల సమావేశాలు బెంగళూరులో జరుగుతున్నాయి. శనివారం నాడు రెండో రోజు చర్చలు...
Source: Yahoo! Telugu: News | 13 Sep 2008 | 10:20 am

సింగూరులో పని చేయని 'గాంధీ గిరి'

సింగూర్ సమస్య పరిష్కారానికి గాంధీ గిరి సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రతిష్టాత్మక నానో కార్ల ప్రాజెక్టు నిర్మాణం సక్రమంగా పూర్తి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు మళ్లీ విఫలమయ్యాయి. ముఖ్యంగా ఆ రాష్ట్ర గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ సమక్షంలో కుదిరిన ఒప్పందం ఆటకెక్కింది.
Source: జాతీయ | 13 Sep 2008 | 10:04 am

మర్చిపోలేని మధురజ్ఞాపకం... ఆగ్రా సందర్శనం

ఉత్తర భారతదేశంలోని ప్రముఖమైన పర్యాటక ప్రాంతాల్లో ఆగ్రాను ప్రముఖంగా చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని యమునానదీ తీరాన వెలసిన ఈ నగరంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. ప్రపంచం యావత్తూ చూడాలని తపించే పాలరాతి కట్టడం...
Source: వినోదం | 13 Sep 2008 | 10:04 am

సింగూరు పరిష్కారం కోసం మళ్లీ చర్చలు : గవర్నర్

సింగూరు వివాదం ప్రతిష్ఠంభన తొలగింపు కోసం మరోసారి చర్చలకు రావాలని ఇరుపక్షాలకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీలు...
Source: Yahoo! Telugu: News | 13 Sep 2008 | 9:58 am

ప్రజారాజ్యం పార్టీలో చేరిన సి రామచంద్రయ్య

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సి రామచంద్రయ్య (సీఆర్సీ) పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పార్టీ వ్యవస్థాపకుడు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో పార్టీలోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీకి గత 26 ఏళ్లుగా...
Source: Yahoo! Telugu: News | 13 Sep 2008 | 9:48 am