ప్రభుత్వం 'రియల్' బ్రోకర్‌గా పనిచేస్తోంది!

బడాబాబులకు భూములను అప్పగించడంపై వైఎస్సార్ సర్కార్ పూర్తిగా రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తీవ్రంగా విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం మేడిపల్లిలోని ప్రభుత్వ భూమిలో జెండాలు పాతి మారోమారు భూపోరాటాన్ని ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Sep 2008 | 8:41 am

సదస్సులో సోనియా హామీల వెల్లువ!

యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ గురువారం రాయలసీమ పర్యటన ప్రారంభమైంది. తిరుపతిలో పీసీసీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్, ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి తదితరులు సోనియాకు ఘనస్వాగతం పలికారు. ఒక్క రోజు పర్యటనలో భాగంగా తొలిగా తిరుపతిలో జరిగిన మహిళా సాధికారక సదస్సులో ఆమె ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Sep 2008 | 8:03 am

బిగ్ బీ కుటుంబాన్ని క్షమిస్తున్నాం : రాజ్‌థాకరే

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌ కుటుంబంపై ఎమ్ఎన్ఎస్ అధినేత రాజ్‌థాకరే ప్రకటించిన ఆందోళనకు ఎట్టకేలకు తెరపడింది. మరాఠీల విషయంలో తన సతీమణి జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలకు అమితాబ్ స్వయంగా క్షమాపణ కోరడంతో రాజ్‌థాకరే శాంతించారు.
Source: జాతీయ | 11 Sep 2008 | 7:45 am

మహిళా సంతోషం శాశ్వతం కావాలి: సోనియా

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలతో మహిళా జీవితాల్లో కనిపిస్తున్న సంతోషం శాశ్వతం కావాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆకాంక్షించారు. ఇందుకోసం తాము ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Sep 2008 | 7:22 am

సిమిపై నిషేధం పొడిగింపు: సుప్రీం కోర్టు

స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని అత్యున్నత న్యాయస్థానం మరోసారి పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఈ నిషేధం కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది. దీనితో సిమి నిషేధంపై కేసు విచారణను న్యాయస్థానం అక్టోబర్ రెండో వారానికి వాయిదా వేసింది.
Source: జాతీయ | 11 Sep 2008 | 7:22 am

మహిళ సాధికారతే లక్ష్యం: వైఎస్సార్

రాష్ట్రంలో మహిళా సాధికారతే తమ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ సీమ పర్యటనలో భాగంగా... తిరుపతిలో ఏర్పాటు చేసిన మహిళా సాధికారత సదస్సులో ఆయన మాట్లాడుతూ... పావలా వడ్డీ పథకాన్ని మహిళలు సక్రమంగా వినియోగించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 11 Sep 2008 | 7:18 am

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భద్రత డొల్ల!

అంతర్థాతీయ స్థాయిలో నిర్మించిన శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. విమానాశ్రయం గురించి గొప్పలు చెప్పుకుంటున్నా అక్కడ భద్రత డొల్ల అనే విషయం పదే పదే రుజువవుతుంది. గురువారం ఓ వ్యక్తి విమానాశ్రయం ప్రహరీగోడ దూకి లోపలికి అక్రమంగా ప్రవేశించాడు.
Source: ఏపీ న్యూస్ | 11 Sep 2008 | 6:53 am

మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామి: సోనియా

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మహిళా సాధికారతపై భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు దృష్టి సారించాయని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. గురువారం చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో ఆమె మాట్లాడారు.
Source: జాతీయ | 11 Sep 2008 | 6:23 am

సోనియా గాంధీకి ఘన స్వాగతం

కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ గురువారం రాష్ట్రానికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆమెకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, మంత్రి గల్లా అరుణ, పార్టీ విప్ కిరణ్ కుమార్ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
Source: ఏపీ న్యూస్ | 11 Sep 2008 | 6:22 am

మొక్కల పెంపకం వివాదంలో "మాయ"

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి మరో వివాదంలో చిక్కుకున్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన బుండేల్‌ఖండ్‌తో పాటు యూపీ రాష్ట్రంలో మాయావతి ఘనంగా ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమానికి కేటాయించిన నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు వేరే పథకాలను మళ్లించినందుకు మాయ సర్కారుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నట్లు యూపీ కాంగ్రెస్ కమిటీ (యూపీసీపీ) వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 11 Sep 2008 | 5:30 am

సోనియా సీమ పర్యటన

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ గురువారం రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 10.45 నిమిషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో...
Source: ఏపీ న్యూస్ | 11 Sep 2008 | 5:29 am

'బిగ్ బ్యాంగ్‌'తో భయం లేదు : కలాం అభయం

జెనీవాలోని సెంటర్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (సెర్న్) బుధవారం ప్రారంభించిన బిగ్ బ్యాంగ్ ప్రయోగం వల్ల ప్రమాదమేమీ లేదని మాజీ రాష్ట్రపతి, భారత అణు శాస్త్రవేత్త అబ్ధుల్ కలాం పేర్కొన్నారు. బిగ్ బ్యాంగ్ ప్రయోగం వల్ల భూగోళానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందంటూ కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలను...
Source: జాతీయ | 11 Sep 2008 | 4:35 am

సెప్టెంబరు 11, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా - చంటబ్బాయి, 12:00 అభిరుచి, 12:30 భారతీ, 13:00 స్టార్ మహిళ, 14:00 బాలచందర్ కథాంజలి,
Source: Yahoo! Telugu: Entertainment | 11 Sep 2008 | 3:54 am

రాష్ట్రానికి నేడు సోనియా : తిరుపతి, అనంతలో భారీ సదస్సు

ఒక్కరోజు పర్యటనకై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం రాష్ట్రానికి విచ్చేయనున్నారు. సోనియా రాక పురస్కరించుకుని తిరుపతి వేదికగా భారీ మహిళా సదస్సును ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటే అనంతపురంలోనూ మరో భారీ సదస్సు ఏర్పాటు చేయనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Sep 2008 | 3:47 am

పార్లమెంట్ సమావేశాలు అక్టోబర్ 17న ప్రారంభం

నెలరోజుల పాటు కొనసాగే పార్లమెంట్ సమావేశాలు అక్టొబర్ 17 నుంచి ప్రారంభమవుతాయని అధికారికవర్గాలు తెలిపాయి. సభ తీరు తెన్నులబట్టి నవంబర్ 21 దాకా పార్లమెంట్ కొనసాగే అవకాశముంది.
Source: జాతీయ | 10 Sep 2008 | 3:13 pm

అసెంబ్లీచే పంజాబ్ మాజీ సిఎం బహిష్కరణ

కాంగ్రెస్ నేత, పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను ఆ రాష్ట్ర శాసనసభ బహిష్కరించింది. అవినీతి కేసులో తన పాత్రను శాసనసభా కమిటీ నిర్ధారించడంతో ఈ తీవ్రచర్యను తీసుకున్న సభ ఆయన స్థానం ఖాళీ అయిందని ప్రకటించింది.
Source: జాతీయ | 10 Sep 2008 | 3:03 pm

సోనియా సీమ పర్యటనకు సర్వం సిద్ధం!

యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ సీమ పర్యటన సందర్భంగా అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభకు జనసమీకరణ అంచనాలు ఎక్కువవుతున్నాయి...
Source: ఏపీ న్యూస్ | 10 Sep 2008 | 2:03 pm

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం బంద్

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం తాగడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో పొగతాగడాన్ని నిషేంధించిన ప్రభుత్వం దాన్ని అతిక్రమించిన వారికి జరిమానా విధించాలని నిర్ణయించింది.
Source: జాతీయ | 10 Sep 2008 | 1:59 pm

సచివాలయంలో స్వల్ప అగ్ని ప్రమాదం

సచివాలయంలో బుధవారం సాయంత్రం స్వల్ప అగ్ని ప్రమాదం సంబవించింది. సమతాబ్లాక్‌లోని నాలుగో అంతస్తులో ఏర్పడిన షార్ట్‌సక్యూట్ వల్ల సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీనితో సమతాబ్లాక్....
Source: ఏపీ న్యూస్ | 10 Sep 2008 | 1:59 pm

విశ్వ రహస్యాలపై బిగ్‌బ్యాంగ్ ప్రయోగం ప్రారంభం

విశ్వం పుట్టుక, జీవావిర్భావం ఇతర విశేషాలు కనుగొనేందుకు ఉద్దేశించిన బిగ్‌బ్యాంగ్ ప్రయోగం స్విజ్జర్లాండ్‌లోని జెనీవా సమీపంలో బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. వివిధ దేశాల బౌతిక శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం ద్వారా ఇప్పటివరకు అంతుపట్టని
Source: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 12:42 pm

అనువాద కార్యక్రమాల్లో అర్జున్ గజేంద్ర

అర్జున్ కథానాయకుడిగా నటించిన ఒక తమిళ చిత్రాన్ని విక్టరీ క్రియేషన్స్ పతాకంపై సీహెచ్ రామకృష్ణ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సినిమా పేరు "గజేంద్ర". ఎ.వెంకటేష్ ఈ సినిమా దర్శకుడు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Sep 2008 | 12:34 pm

మాజీ సీఎం అమరీందర్ శాసనసభ నుంచి వెలి

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ఆ రాష్ట్ర శాసనసభ నుంచి వెలివేశారు. శాసనసభలో మిగిలిన పదవీకాలమైన మూడున్నరేళ్ల పాటు ఆయన సభకు రాకుండా బహిష్కరిస్తున్నామని స్పీకర్ ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 12:33 pm

అన్సాల్ సోదరుల ఖైదుకు సుప్రీంకోర్టు ఆదేశం

ఉపహార్ కేసులో అన్సాల్ సోదరులైన సుశీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్‌లకు ఇచ్చిన బెయిల్‌లను రద్దు చేసిన సుప్రీంకోర్టు వారిని వెంటనే ఖైదు చేయాలని ఆదేశించింది. అలాగే థియేటర్ మేనేజర్లు అజిత్ చౌదరి, ఎన్ ఎస్ చోప్రాలకు మంజూరు చేసిన బెయిళ్లను కూడా సుప్రీం...
Source: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 12:19 pm

అన్సాల్ బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌కు సుప్రీం నో

న్యూఢిల్లీలోని ఉపహార్ థియేటర్‌లో అగ్ని ప్రమాదం కేసులో నిందితులైన అన్సాల్ సోదరులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అన్సాల్ సోదరులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది.
Source: జాతీయ | 10 Sep 2008 | 12:18 pm

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బహిష్కరణ

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే అమరిందర్ సింగ్‌పై బహిష్కరణ వేటు పడింది. పదవిలో ఉన్న కాలంలో అమరిందర్ సింగ్ ఎన్నో అవినీతి కార్యాలకు పాల్పడ్డారని పేర్కొంటూ అసెంబ్లీ ఈ నిర్ణయం తీసుకుంది.
Source: జాతీయ | 10 Sep 2008 | 12:09 pm

ఇరవైవేల మీటర్ల నడకలో హర్విందర్‌కు స్వర్ణం

కొచ్చిలో జరిగే 48వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో సర్వీసెస్‌కు చెందిన హర్విందర్ సింగ్ 20వేల మీటర్ల నడకలో పసిడి పతకం సాధించాడు. పోటీలకు మరో రోజు మాత్రమే ఉండగా, ఈ పోటీలో 23 ఏళ్ల హర్విందర్ గమ్యాన్ని గంటా 35 నిమిషాల 21సెకన్లలో ఛేదించాడు.
Source: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 11:50 am

తస్మాత్ జాగ్రత్త..!

నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కుంటున్న నెల్లూరు మేయర్ శైలజా రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా, త్వరలోనే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో...
Source: వినోదం | 10 Sep 2008 | 11:38 am

అంటే...నమ్మేయాల్సిందేనా..!

త్వరలోనే కాశ్మీర్‌ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకు వచ్చేలా శుభవార్త వినగలరని పాక్ ప్రజలకు హామీ ఇచ్చిన కొత్త అధ్యక్షుడు జర్దారీ దానిపై వివిధ రాజకీయ పక్షాలతో...
Source: వినోదం | 10 Sep 2008 | 11:37 am

భారత్ టూర్ కోసం ఇంగ్లాండ్ జట్టు ప్రకటన

భారత్‌తో జరిగే వన్డే టూర్ కోసం నవంబర్‌లో రానున్న ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. కెవిన్ పీటర్సన్ సారధ్యంలోని ఈ జట్టులో దక్షిణాఫ్రికాతో తలపడిన జట్టునే మళ్లీ ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-0తో గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 11:36 am

ఇంటర్ రెండో సంవత్సర పరీక్ష ఫీజుకు 24 వరకు గడువు

ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరీక్ష ఫీజును ఈ నెల 24లోగా చెల్లించాలి. అన్ని సబ్జెక్టులకు కలిపి పరీక్ష ఫీజు రూ.200 చెల్లించాలి. ఇలాకాకుండా రూ.100 అపరాథ రుసుముతో అక్టోబర్ 3 వరకు పరీక్ష ఫీజు చెల్లించొచ్చు.
Source: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 11:36 am

బీసీ విద్యార్థుల బోధన, ప్రత్యేక ఫీజులు రద్దు

బీసీ విద్యార్థుల బోధన, ప్రత్యేక ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. బీసీ విద్యార్థుల నుంచి బోధన, ప్రత్యేక ఫీజులను వసూలు చేయొద్దని రాష్ట్ర ఉన్నత విద్యామండలి విద్యా సంస్థల యాజమాన్యాలను కోరింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి మంగళవారం
Source: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 11:27 am

సోనియాచే రేపు ఇడపులపాయ విశ్వవిద్యాలయం ప్రారంభం

కడప జిల్లాలోని ఇడపులపాయలో కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ గురువారం రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీని ప్రారంభించనున్నారు. ఈ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను ముఖ్యమంత్రి
Source: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 10:50 am

రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

రాజమండ్రిలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. పట్టణంలోని మోరంపూడి జంక్షన్‌లో ఆటోపై లారీ పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. విజయవాడ వెళుతున్న లారీ ఈ జంక్షన్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి,
Source: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 10:42 am

కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు మేయర్ శైలజారెడ్డి రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు మేయర్ శైలజారెడ్డి బుధవారం రాజీనామా చేశారు. జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఉన్న విభేదాల కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆనంతోపాటు, ఆయన వర్గీయులైన కార్పొరేటర్లతో కూడా
Source: Yahoo! Telugu: News | 10 Sep 2008 | 10:28 am