|
భారత్, పాకిస్తాన్‌లలో స్వల్ప భూకంపందేశ రాజధానితో సహా ఉత్తర, పశ్చిమ భారత్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం రిక్టర్ స్కేల్‌లో 5.8 తీవ్రతతో భూమి కంపించింది. మధ్యాహ్నం 11.20 గంటలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం ఆప్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ ప్రాతంలో కేంద్రీకరించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.Source: జాతీయ | 6 Sep 2008 | 8:12 am తిరుచ్చికి 2,975 టన్నుల ఎరువుల కేటాయింపుతమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా రైతుల సౌకర్యార్ధం 2,975 టన్నుల ఎరువులను కేటాయించినట్టు ఆ జిల్లా కలెక్టర్ టి.సౌండయ్య తెలిపారు. కావేరీ డెల్టా పారివాహక జిల్లాలలో ఒకటై తిరుచ్చిలో ఇటీవల ఎరువుల కొరత తలెత్తింది.Source: జాతీయ | 6 Sep 2008 | 7:24 am వాయిదా తీర్మానాలపై విపక్షాల డిమాండ్అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉదయం సభ ప్రారంభంకాగానే ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలను ప్రవేశ పెట్టాలని పట్టుబట్టాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతి సురేష్‌రెడ్డి తిరస్కరించారు..Source: ఏపీ న్యూస్ | 6 Sep 2008 | 4:49 am నేడు కూడా కొనసాగనున్న సింగూర్ చర్చలుసింగూర్ సమస్యకు పరిష్కార మార్గం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ మధ్యవర్తిత్వం ఫలించింది. ఇరు వర్గాలతో ఆయన శుక్రవారం జరిపిన చర్చలు ఆశావహంగా ముగిశాయి.Source: జాతీయ | 6 Sep 2008 | 4:20 am అవన్నీ పగటి కలలే: చంద్రబాబువచ్చే ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని చిరంజీవి ప్రకటించడాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎద్దేవా చేశారు. అవన్నీ పగటి కలలు మాత్రమేనని ఆయన అన్నారు. ఎంతమంది వచ్చినా ప్రజలు తమవైపే ఉంటారని...Source: ఏపీ న్యూస్ | 6 Sep 2008 | 4:07 am సెప్టెంబరు 6, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:30 సినిమా ఆధారిత కార్యక్రమం, 09:00 టాలీవుడ్ టైమ్, 10:00 స్టార్‌తో సరదాగా, 10:30 నటరత్నాలు, 11:00 రంగుల పల్లకిలో,Source: Yahoo! Telugu: Entertainment | 6 Sep 2008 | 3:41 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 6 Sep 2008 | 3:31 am ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరిస్తాం: వైఎస్ఉపాధ్యాయుల డిమాండ్లను త్వరలో పరిష్కరిస్తామని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ...Source: ఏపీ న్యూస్ | 5 Sep 2008 | 3:02 pm మన్మోహన్‌కు డాక్టరేట్ పురస్కారంప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధిలకు మద్రాస్ విశ్వవిద్యాలయం శుక్రవారం గౌరవ డాక్టరేట్ డిగ్రీలను ప్రదానం చేసింది. మద్రాస్ యూనివర్శిటీని స్థాపించి 150 ఏళ్లు గడిచిన సందర్భంగా జరిగిన వార్షికోత్సవంలో ఈ ముగ్గురు నేతలు పాల్గొన్నారు.Source: జాతీయ | 5 Sep 2008 | 2:32 pm ప్రజారాజ్యం పార్టీకి సమాజ్‌వాదీ మద్దతుమెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి సమాజ్‌వాది పార్టీ మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. ప్రజారాజ్యం పార్టీతో దోస్తి కట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సమాజ్‌వాది పార్టీ నాయకుడు...Source: ఏపీ న్యూస్ | 5 Sep 2008 | 1:29 pm తెదేపాను ఓడించే సత్తా పీఆర్పీకి లేదు: ఎర్రన్నాయుడుచిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి తెలుగుదేశం పార్టీని ఓడించే సత్తా లేదని శుక్రవారం తెదేపా నాయకుడు ఎర్రన్నాయుడు చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...Source: ఏపీ న్యూస్ | 5 Sep 2008 | 1:12 pm విడుదలకు ముస్తాబవుతోన్న కాలేజ్ డేస్ఆర్య, సోనీ అగర్వాల్ (7/జి బృందావన కాలనీ ఫేం) జంటగా నటించిన "ఒరు కల్లూరిన్ కథై" అనే తమిళ చిత్రాన్ని "కాలేజ్ డేస్" పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సినిమా పేరుకు "గోల్డెన్ డేస్" అనే ఉప శీర్షికను కూడా జోడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 5 Sep 2008 | 12:34 pm డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు నేనింతేరవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం "నేనింతే". ఈ సినిమాకు పూరీజగన్నాథ్ దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు ఘన విజయాలు దక్కించుకున్నాయి. ఇదేSource: Yahoo! Telugu: Entertainment | 5 Sep 2008 | 12:33 pm సంజీవ్ నందాకు ఐదేళ్లు జైలుశిక్షబీఎండబ్ల్యూ కారు కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్ నందాకు ఐదేళ్ళ కారాగారశిక్ష విధిస్తూ పాటియాలా కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. అలాగే ఇదే కేసులో సంబంధం ఉన్న మరో ముగ్గురికి కూడా కోర్టు శిక్షలను ఖరారు చేసింది.Source: జాతీయ | 5 Sep 2008 | 12:30 pm అసెంబ్లీ రేపటికి వాయిదావర్షాకాల సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం సభ ప్రశ్నోత్తర సమయంలో విద్యుత్ కోతపై విపక్షాల ప్రశ్నలకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన సమాధానంతో సభ రేపటికి...Source: ఏపీ న్యూస్ | 5 Sep 2008 | 12:29 pm అనగనగా ఒక అరణ్యం తొలి షెడ్యూల్ పూర్తికౌశల్, సైరాభాను, ఏక్తా త్రివేది, శ్రీరేఖ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "అనగనగా ఒక అరణ్యం". జి.శేఖర్ చంద్ర ఈ సినిమా దర్శకుడు. టి.సుల్తాన్ ఈ చిత్రాన్ని రెండు భాషల్లో నిర్మిస్తున్నారు. హిందీలో ఈ సినిమా "హమ్ ఆప్‌కే సాథ్ హై" పేరుతో రూపొందుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 5 Sep 2008 | 12:26 pm విన్నూత్నంగా వినాయకుడు ఆడియో ఆవిష్కరణకృష్ణుడు, సోనియా జంటగా నటిస్తోన్న చిత్రం "వినాయకుడు". ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వినాయకచవితినాడు శిల్పకళామందిరంలో విన్నూత్న రీతిలో జరిగింది. చిత్ర నిర్మాత ప్రేమ్ కుమార్ తనయుడు ప్రధాన్ గణేశుని వేషధారణతోSource: Yahoo! Telugu: Entertainment | 5 Sep 2008 | 12:25 pm అలీ, శివాజీ, శ్రీనివాసరెడ్డి హీరోలుగా కొత్త చిత్రంఅలీ, శివాజీ, శ్రీనివాసరెడ్డి హీరోలుగా ఒక కొత్త చిత్రం రూపొందుతోంది. ఎస్పీ కృష్ణారెడ్డి ఈ సినిమా దర్శకుడు. సినిమా షూటింగ్ కార్యక్రమాలు గురువారం జూబ్లీహిల్స్‌లోని ఒక భవంతిలో ప్రారంభం అయ్యాయి. చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు సెంటిమెంట్ మిళితమైనSource: Yahoo! Telugu: Entertainment | 5 Sep 2008 | 12:22 pm అభిమానులనే ఎక్కువగా ప్రేమిస్తా: అమీషా పటేల్"కహోనా.. ప్యార్‌హై" చిత్రం ద్వారా బాలీవుడ్‌లో తనకంటూ ఒక ఇమేజ్‌ను సృష్టించుకున్న అందాల తార అమీషా పటేల్ ప్రస్తుతం హిందీ సినిమాలతోనే బిజీగా ఉంది. అమీష్ పటేల్ తెలుగు ప్రేక్షుకులకు కూడా సుపరిచతమైన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: Entertainment | 5 Sep 2008 | 12:21 pm కొల్లేరు సరస్సు కాపాడుతాం: నారాయణనాయకుల రాజకీయాలతో ఆక్రమణలకు గురైన కొల్లేరు సరస్సును కాపాడుతాం అని సీపీఐ పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. కొల్లేరు సరస్సు ప్రాముఖ్యతను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లేవిధంగా నిపుణుల సలహాలను..Source: Yahoo! Telugu: News | 5 Sep 2008 | 12:11 pm స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 415 పాయింట్ల భారీ పతనంముంబయి స్టాక్ మార్కెట్‌లో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 415.27 పాయింట్లమేర భారీ నష్టాన్ని చవిచూసి 14,483.83 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96 పాయింట్లమేర కోల్పోయి 4352 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్‌లో రియాల్టీ, టెక్నాలజీ...Source: Yahoo! Telugu: News | 5 Sep 2008 | 11:50 am దేవేందర్ గౌడ్ నల్గొండ పర్యటన ఖరారునవ తెలంగాణ ప్రజా పార్టీ అధినేత దేవేందర్ గౌడ్ నల్గొండ పర్యటన ఖరారు అయింది. గౌరవ యాత్రలో ఎక్కువ సమయం దేవేందర్ నల్గొండలో గడుపుతారు. నల్గొండ జిల్లాలో ఆరు రోజులపాటు దేవేందర్ పర్యటిస్తారని నవ తెలంగాణ నేతలు అన్నారు. నల్గొండ...Source: Yahoo! Telugu: News | 5 Sep 2008 | 11:16 am అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉన్నాం: ప్రణబ్ఇతర దేశాలతో అణు వాణిజ్యం జరుపుకునేందుకు అనుమతి ఇవ్వడానికి కొన్ని అణు ఇంధన సరఫరా గ్రూపు (ఎన్ఎస్‌జీ) దేశాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకునేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈSource: Yahoo! Telugu: News | 5 Sep 2008 | 11:10 am చిరు పార్టీకి ఆ సత్తా లేదు: ఎంపీ ఎర్రంనాయుడువచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించే సత్తా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి లేదని ఆ పార్టీ ఎంపీ ఎర్రంనాయుడు ఘాటుగా స్పందించారు. ప్రజారాజ్యం పార్టీ ప్రతినిధులు పరకాల ప్రభాకర్, డాక్టర్ మిత్రాలు తమను తక్కువగా అంచనాSource: Yahoo! Telugu: News | 5 Sep 2008 | 10:58 am బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా విడుదలకు సన్నాహాలుబంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముడుపుల కేసులో ఏడాది కాలంగా జైలు జీవితం గడుపుతున్న ఆమెను వచ్చే వారం విడుదల చేయవచ్చని అధికారవర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 5 Sep 2008 | 10:49 am ప్రజారాజ్యంతో కలిసి బరిలోకి: అమర్ సింగ్మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజరాజ్యం పార్టీతో కలిసి తాము వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పనిచేస్తామని సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్ సింగ్ ప్రకటించారు. కలిసి పనిచేసే విషయంపై చిరంజీవితో చర్చలు జరపటానికి తమ పార్టీ నేతలు జయప్రద...Source: Yahoo! Telugu: News | 5 Sep 2008 | 10:39 am దేశాన్ని తప్పుదోవ పట్టించిన ప్రధాని: ఏచూరీభారత్-అమెరికా అణు ఒప్పందం వ్యవహారంలో అటు పార్లమెంట్‌తో పాటు.. ఇటు దేశ ప్రజలను ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పుదోవ పట్టించారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ అరోపించారు.Source: జాతీయ | 5 Sep 2008 | 10:28 am చెన్నైకు చేరుకున్న ప్రధాని మన్మోహన్ఒక రోజు పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ శుక్రవారం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకు చేరుకున్నారు. ఆయన వెంట కేంద్ర ఉక్కుగనుల శాఖామంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కూడా ఉన్నారు. వీరందరూ ఐఎఎఫ్‌కు చెందిన ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌లో రాజధాని న్యూఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చారు.Source: జాతీయ | 5 Sep 2008 | 10:26 am సమరస పరిష్కారానికి సిద్ధం: మమతవివాదాస్పద సింగూర్ సమస్యపై సమరస పరిష్కారానికి తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.Source: జాతీయ | 5 Sep 2008 | 10:25 am కాంగ్రెస్‌పై 'చిరు' పార్టీ ప్రభావం ఉండదు : ధర్మానకాంగ్రెస్ పార్టీపై చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ప్రభావం ఉండదని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరవు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...Source: ఏపీ న్యూస్ | 5 Sep 2008 | 10:24 am ప్రజారాజ్యంలోకి తూర్పు గోదావరి జిల్లా తెదేపా నేతలుమెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు చేరారు. నేతల వలసలతో తెలుగుదేశం పార్టీ కష్టాల్లో పడింది. జిల్లాలోని కొత్తపేట తెదేపా మాజీ శాసనసభ్యుడు సత్యానందరావుతో పాటు 40 మంది...Source: Yahoo! Telugu: News | 5 Sep 2008 | 9:36 am చిరంజీవిని లాగడంలో అర్థం లేదు : నళినితన వివాహ వివాదంలో ప్రజాపార్టీ అధినేత చిరంజీవిని లాగడంలో అర్థం లేదని పద్మారావు కోడలు నళిని స్పష్టం చేశారు. తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని నళిని వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసమే ఎవరో తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను రెచ్చగొడుతున్నారని ఆమె ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 5 Sep 2008 | 8:59 am
|