తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాంటి వారే...!: సీఎం

తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్మకద్రోహులని, మోసగాళ్ళని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ రాజేశేఖర్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పిల్లను ఇచ్చిన మామనే మోసం చేసి సీఎం సీటు దక్కించుకున్న చంద్రబాబు నమ్మక ద్రోహిఅని, మోసగాడని...
Source: ఏపీ న్యూస్ | 4 Sep 2008 | 11:18 am

ప్రజారాజ్యం గూటికి చేరిన తమ్మినేని

తెలుగుదేశం అధికార ప్రతినిధి, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం గురువారం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఈ రోజు (గురువారం) ఉదయం ఆయన భూమా నాగిరెడ్డితో కలిసి పైదరాబాద్‌లోని చిరంజీవి...
Source: ఏపీ న్యూస్ | 4 Sep 2008 | 11:15 am

కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదు : జీవన్‌రెడ్డి

తెలుగుదేశం పార్టీ, భారతీయ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పొత్తు కుదుర్చుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లబోదని రోడ్డు భవనాల శాఖ మంత్రి జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం పైదరాబాద్‌లో...
Source: ఏపీ న్యూస్ | 4 Sep 2008 | 11:09 am

దేవేందర్ గౌడ్ "ఆత్మగౌరవ యాత్ర" ప్రారంభం

తెలంగాణ స్వయం పాలనే లక్ష్యంగా... నవ తెలంగాణా ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు దేవేందర్ గౌడ్ తెలంగాణ ఆత్మగౌరవ యాత్రను గురువారం ప్రారంభించారు. వికారాబాద్‌లో పూజలు జరిపిన అనంతరం దేవేందర్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 4 Sep 2008 | 10:34 am

జైపూర్ పేలుడు : సూత్రధారి నిర్ధారణ

జైపూర్ బాంబు పేలుళ్ల కేసులో కీలక సూత్రధారిని సాక్షి గుర్తుపట్టాడు. జైపూర్ బాంబు పేలుడులో ప్రత్యక్ష సాక్షిగా పరిగణించే ఓ వ్యక్తి గురువారం ఈ పేలుళ్ల ఘటనకు షాబాజ్ అహ్మద్‌ అనే వ్యక్తి ప్రమేయమున్నట్లు నిర్ధారించాడు.
Source: జాతీయ | 4 Sep 2008 | 9:48 am

కొల్లేరు పరిధిపై సభలో తీర్మానం: వాయిదా

వర్షాకాల సమావేశాల్లో భాగంగా గురువారం కొల్లేరు సరస్సు పరిధిని తగ్గిస్తూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఐదవ కాంటూరు నుంచి 3వ కాంటూరు పరిధిని తగ్గిస్తూ సభ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ప్యానల్ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీనితో అసెంబ్లీని సాయంత్రం 4.30 వరకు వాయిదా వేశారు.
Source: ఏపీ న్యూస్ | 4 Sep 2008 | 9:17 am

15న సభాపతిపై అవిశ్వాస తీర్మానం

సభాధిపతిపై తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మాన చర్చకు తేదీ ఖరారైంది. ఈ నెల 15వ తేదీన ఉదయం పది గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చించాలని స్పీకర్ ...
Source: ఏపీ న్యూస్ | 4 Sep 2008 | 9:12 am

బీహార్ వరద బాధితులకు ప్రభుత్వం చేయూత

బీహార్ వరద బాధితులను ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా వరద బాధితులకు ఒక లక్ష దుప్పట్లను అందిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురువారం...
Source: ఏపీ న్యూస్ | 4 Sep 2008 | 9:09 am

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా వైద్యలింగం!

పుదుచ్చేరి ముఖ్యమంత్రి పగ్గాలను వైద్యలింగం చేపట్టారు. ఈ మేరకు పుదుచ్చేరి కొత్త సీఎంగా గురువారం వైద్యలింగం ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాల కారణంగా పుదుచ్చేరి మాజీ సీఎం రంగస్వామి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 4 Sep 2008 | 8:14 am

అణు వివాదం : ప్రధాని రాజీనామాకు బీజేపీ డిమాండ్

అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ చేసిన తాజా ప్రకటనతో అణు వివాదం మరోసారి తెరమీదకొచ్చింది. దీంతో అణు ఒప్పందాన్ని ప్రారంభం నుంచి వ్యతిరేకిస్తున్న బీజేపీ ప్రధానీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తోంది.
Source: జాతీయ | 4 Sep 2008 | 8:10 am

అణు పరీక్షపై భారత్‌కు హక్కు: ప్రధాని

భారత్‌ అణు పరీక్షలు జరిపితే అణు ఇంధన సరఫరాకు తాము హామీ ఇవ్వలేమని అమెరికా అధికార పత్రం లేటుగా బయటపెట్టిన నేపథ్యంలో, మనకు అణు పరీక్షలు జరిపే హక్కు ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 4 Sep 2008 | 7:49 am

'చిరు' పార్టీ తీర్థం పుచ్చుకోనున్న తమ్మినేని

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీలోకి వలసల వెల్లువ నానాటికీ పుంజుకుంటోంది. వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు చిరు పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలుగుదేశం ...
Source: ఏపీ న్యూస్ | 4 Sep 2008 | 7:47 am

నీటి ప్రాజెక్ట్ నిర్మాణాలపై సభలో రగడ

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం సాగునీటి పారుదల పథకాల నిర్మాణంపై సభలో వాడీవేడీగా చర్చ జరిగింది. నీటి ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం రోజు రోజుకు శృతిమించుతోందని విపక్షాలు ఆందోళన వ్యక్తం...
Source: ఏపీ న్యూస్ | 4 Sep 2008 | 7:41 am

బీహార్ వరద బాధితులను ఆదుకోండి : ప్రధాని

బీహార్‌ వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా ప్రధాని మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లోని కోసీ నదీ ఉప్పొంగడంతో బీహార్‌ను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో చిక్కుకుని 77 మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులైయ్యారు
Source: జాతీయ | 4 Sep 2008 | 7:24 am

అప్పు తీర్చటానికి

"కొత్తగా కట్టిన బిల్టింగ్‌ను అమ్మేశావటగా ఎందుకని..?"...
Source: వినోదం | 4 Sep 2008 | 6:44 am

ఎవరితో చెప్పకూడదని..!

"మీ బాస్ లంచం తీసుకుంటున్నాడన్న విషయాన్ని రాసి చూపిస్తున్నాడేంటి?" అని అడిగాడు శివ సుందర్‌ని...
Source: వినోదం | 4 Sep 2008 | 6:42 am

శరవేగంగా "అ..ఆ...ఇ...ఈ" షూటింగ్!

శ్రీకాంత్, మీరాజాస్మిన్, సదా కాంబినేషన్‌లో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం "అ..ఆ...ఇ...ఈ" (అతను ఆమె... ఇంతలో ఈమె). శ్రీకల్పన ఆర్ట్స్ పతాకంపై బొద్దం అశోక్ యాదవ్ నిర్మిస్తోన్న ఈ సినిమా 25శాతం టాకీ, ఓ పాట చిత్రీకరణను పూర్తిచేసుకుంది.
Source: వినోదం | 4 Sep 2008 | 6:03 am

సీపీఎం నేతలతో బాబు, మిత్రాల మంతనాలు

తదుపరి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం పొత్తుల హావా నడుస్తోంది. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన జాతీయ నేతలు ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరిలతో బుధవారం టీడీపీ చీఫ్...
Source: ఏపీ న్యూస్ | 4 Sep 2008 | 5:28 am

తీవ్రవాదంపై యూపీఏ మెతక వైఖరి : అద్వానీ

తీవ్రవాదంపై యూపీఏ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్. కె. అద్వానీ ధ్వజమెత్తారు. నిషేధిత స్టూడెండ్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) కార్యకలాపాలపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని భాజపా డిమాండ్ చేసింది.
Source: జాతీయ | 4 Sep 2008 | 5:25 am

నిబద్ధతతో ఎదుర్కోవాలి : సోనియా గాంధీ

భారత సంప్రదాయాన్ని నాశనం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని నిబద్దతతో ఎదుర్కోవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపు నిచ్చారు. కేంద్ర మాజీ మంత్రి కమలాపతి త్రిపాఠి 103వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... త్రిపాఠితో తమ కుటుంబానికి మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు
Source: జాతీయ | 4 Sep 2008 | 4:24 am

చిరంజీవి మెగా యాత్రకు ఆదిలాబాద్ నుంచి శ్రీకారం

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తలపెట్టిన ప్రజాయాత్ర కసరత్తులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజాయాత్రకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసేందుకు ప్రజారాజ్యం కార్యనిర్వాహకవర్గం బుధవారం సమావేశమైంది.
Source: Yahoo! Telugu: News | 3 Sep 2008 | 12:20 pm

ఒరిస్సా: కంధమాల్‌లో పరిస్థితిపై హోంమంత్రి సమీక్ష

ఒరిస్సాలో మతపరమైన ఉద్రిక్తతలతో అల్లర్లు చెలరేగిన కంధమాల్ జిల్లాలో పరిస్థితిపై కేంద్ర హోం శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ బుధవారం సమీక్ష నిర్వహించారు. కంధమాల్ జిల్లా హింసాకాండపై రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తోపాటు, వివిధ
Source: Yahoo! Telugu: News | 3 Sep 2008 | 11:07 am