అయ్యప్ప షూటింగ్ ప్రారంభం

శశిమోహన్ దర్శకత్వంలో కౌశిక్‌బాబు నటిస్తున్న చిత్రం అయ్యప్ప. అనశ్వర చారిటబుల్ ట్రస్ట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజీష్‌మణి నిర్మాత. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Aug 2008 | 1:25 pm

కన్నడ చిత్ర డబ్బింగ్‌గా గ్యాంగ్‌లీడర్స్

కన్నడ నటుడు దేవరాజ్ కుమారుడు ప్రజ్వల్ దేవరాజ్ నటించిన తొలిచిత్రం గెలియాను తెలుగులో గ్యాంగ్‌లీడర్స్‌గా అనువదిస్తున్నారు. శ్రీ వైష్ణవి దేవీ ఆర్ట్స్ పతాకంపై కె.సుబ్రమణి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష. ఎ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Aug 2008 | 1:14 pm

ఇకపై ‌'చిరు' నాణెం రెండో వైపును చూస్తారు..

నేను రాజకీయ అనుభవం లేని వాడినన్నారు. ఏం చేస్తాడులే అన్నారు... ఇలా ఎన్నో మాటలు మాట్లాడారు. కానీ వారందరూ ఇప్పటి వరకూ సినీ హీరో చిరంజీవినే చూశారు వారందరూ ఇకపై నాణెనికి రెండోవైపు ఉన్న చిరంజీవి (రాజకీయనాయకుడు)ని...
Source: ఏపీ న్యూస్ | 26 Aug 2008 | 12:31 pm

కరణం బలరాంపై ఆరునెలల సస్పెన్షన్ వేటు!

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంతో తెలుగుదేశం ఎమ్మెల్యే కరణం బలరాంను ఆరునెలల పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. గతంలో ఒంగోలులో జరిగిన ఓ కార్యక్రమంలో స్పీకర్ సురేష్‌రెడ్డిపై తెదేపా ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనిపై విచారణ జరపాలని సీఎల్పీ మంగళవారం శాసనసభలో స్పీకర్‌ను కోరింది.
Source: ఏపీ న్యూస్ | 26 Aug 2008 | 11:36 am

'మెగా' పార్టీ నమోదుకు రంగం సిద్ధం

మెగాస్టార్ చిరంజీవి పార్టీకి సంబంధించిన జెండా, ఎజెండాను నమోదు చేసేందుకు భాగ్యనగరం నుంచి ఇద్దరు న్యాయవాదులు ఢిల్లీకి బయలుదేరినట్లు సన్నిహితవర్గాలు వెల్లడించాయి. ఈ సాయంత్రంలోగా పార్టీ నమోదు ...
Source: ఏపీ న్యూస్ | 26 Aug 2008 | 11:07 am

ప్రజల కోరిక మేరకే రాజకియాల్లోకి : చిరంజీవి

ప్రజల కోరిక మేరకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రకటనలో తెలిపారు. రాజకీయాల్లో ప్రవేశించడం ఓ కొత్త అనుభూతికి లోనవుతున్నానని చెప్పారు. దాదాపు 30 ఏళ్ళ సినీమా పరిశ్రమ అనుబంధాన్ని ...
Source: ఏపీ న్యూస్ | 26 Aug 2008 | 10:19 am

పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్లో "16 డేస్"

అరవింద్, ఛార్మీ హీరోహీరోయిన్లుగా ప్రభు సాలమన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం "16 డేస్". శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోందని చిత్ర యూనిట్ వెల్లడించింది. పి. మహేష్‌బాబు డి.వై. చౌదరిల సంయుక్త...
Source: వినోదం | 26 Aug 2008 | 8:33 am

నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పులు

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. పూంఛ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద ఆ దేశ సైనికులు కాల్పులకు పాల్పడ్డారు. పాక్ సైనికులు కావాలనే కాల్పులకు పాల్పడినట్టు బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో నలుగురు భారత సరిహద్దు దళం సిబ్బంది గాయపడ్డారు.
Source: జాతీయ | 26 Aug 2008 | 8:32 am

రామరాజ్యం అయితే బాగుండేది : బొత్స

చిరంజీవి పార్టీ పేరు రామరాజ్యం అయితే బాగుండేదని గృహనిర్మాణ శాఖమంత్రి బొత్స నారాయణ అభిప్రాయం ఎద్దేవా చేశారు. చిరంజీవి పార్టీ ప్రకటించిన తర్వాత కొత్తగా ప్రజలకు ఏం చేస్తారో వేచి చూడాల్సిందేనని బొత్స వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 26 Aug 2008 | 8:32 am

బెల్టు షాపులు మూసివేయాలి : చంద్రబాబు

లిక్కర్ పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెల్ట్‌షాపులను మూసివేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. మద్యం విధానంపై మంత్రి ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని తెదేపా నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. ఎక్సైజ్ ఆదాయాన్ని ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా చూడరాదని, ప్రభుత్వం పేదల రక్తాన్ని తాగుతుందని తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 26 Aug 2008 | 7:29 am

జైపూర్ పేలుళ్లు: మరో ఏడుగురు అరెస్టు

జైపూర్ వరుస పేలుళ్ళకు సంబంధించిన మరో ఏడుగురు సిమి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద విచారణ జరిపేందుకు వచ్చే నెల ఏడో తేదీ వరకు పోలీసు కష్టడీకి తరలించారు. గత మే నెల 13వ తేదీన జైపూర్‌లో వరుస బాంబు పేలుళ్లు జరుగగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
Source: జాతీయ | 26 Aug 2008 | 7:19 am

వర్షాకాల సమావేశాల్లో గందరగోళం

శాసనసభ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల తీర్మానాలపై విపక్షపార్టీలు పట్టుపట్టడంతో శాసన సభలో దాదాపు 50 నిమిషాలపాటు గందరగోళం చెలరేగింది. విపక్షపార్టీల డిమాండ్‌ను శాసన సభ స్పీకర్ సురేష్ రెడ్డి నిరాకరించారు. రెండో రోజు వ్యవసాయ...
Source: ఏపీ న్యూస్ | 26 Aug 2008 | 7:08 am

కాశ్మీర్‌లో కొనసాగుతున్న కర్ఫ్యూ

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో విధించిన నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ.. పరిస్థితిని సడలించే ప్రసక్తే లేదని భద్రతా అధికారులు స్పష్టం చేశారు. అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు అటవీ భూముల కేటాయింపు వ్యవహారం జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాన్ని ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 26 Aug 2008 | 6:38 am

శ్రీవారి సేవలో చిరంజీవి

చిరంజీవి ఈ రోజు (మంగళవారం) ఉదయం రేణిగంట విమానాశ్రయమునకు చేరుకున్నారు. ఆయనతోపాటు సతీమణి సురేఖ, కుమారుడు రామ్‌చరణ్‌‌ తేజ వచ్చారు. ఇక్కడి నుంచి కుటుంబ సమేతంగా చిరంజీవి తిరుమలలోని...
Source: ఏపీ న్యూస్ | 26 Aug 2008 | 6:12 am

డిసెంబర్‌లో రానున్న"కింగ్"!

కామాక్షి కళా మూవీస్ పతాకంపై శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తోన్న "కింగ్" చిత్రం గురించి సోమవారం నాడు అక్కినేని నాగార్జున పలు విషయాలను వెల్లడించారు. కథ గురించి పెద్దగా చెప్పేదేమీలేదని, ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపకల్పన జరుగుతోందన్నారు.
Source: వినోదం | 26 Aug 2008 | 5:56 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 26 Aug 2008 | 5:09 am

అభిమానులు సహకరించాలి : అరవింద్

చిరంజీవి నిర్వహించే బహిరంగ సభ విజయవంతంగా ముగిసేందుకు అభిమానులు సహకరించాలని చిరంజీవి బావమరిది అల్లుఅరవింద్ కోరారు. తిరుపతిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...చిరంజీవి రాజకీయ...
Source: ఏపీ న్యూస్ | 26 Aug 2008 | 5:07 am

ప్రభుత్వ ఏర్పాటుకు సోరేన్‌కు ఆహ్వానం

జార్ఖండ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలాన్ని సోరేన్ కూడగట్టుకున్నారు. మొత్తం 82 మంది సభ్యులు కలిగిన జార్ఖండ్ అసెంబ్లీలో సోరేన్‌కు 42 మంది ఎమ్మెల్యేల మద్దతు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ సయ్యద్ సిబ్తీ రజేకు లేఖ సమర్పించారు.
Source: జాతీయ | 26 Aug 2008 | 5:00 am

తమిళనాడుకు రానున్న ప్రధాని, సోనియా

ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీలు సెప్టెంబరు మొదటి వారంలో రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేవి.తంగబాలు తెలిపారు. దీనిపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెల మొదటి వారంలో వచ్చే వీరు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.
Source: జాతీయ | 26 Aug 2008 | 4:44 am

ఆగస్టు 26, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలి షాపింగ్, 09.00 గంటలకు ఈనాడు...
Source: Yahoo! Telugu: Entertainment | 26 Aug 2008 | 3:34 am

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు!

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి దివంగత ఎమ్మెల్యేలు శిఖామణి, చనుమోలు వెంకట్రావులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేల మృతికి సీఎం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 25 Aug 2008 | 3:15 pm