సిమిపై నిషేధం పొడిగింపు : సుప్రీం

స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఆరువారాలు పొడిగిస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సిమిపై కేంద్రం విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్రం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Source: జాతీయ | 25 Aug 2008 | 11:00 am

లక్ష్మణానంద హత్యపై దద్దరిల్లిన ఒరిస్సా అసెంబ్లీ

విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) నేత లక్ష్మణానంద సరస్వతి హత్యోదంతానికి కారణమైన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ఒరిస్సా అసెంబ్లీలో బీజేపీ డిమాండ్ చేసింది. దీనితో సోమవారం ఒరిస్సా అసెంబ్లీ దద్దరిల్లింది. లక్ష్మాణనందను హతమార్చిన వారిని అరెస్టు చేయాలంటూ భాజపా ఎమ్మెల్యేల నినాదాలతో సభా కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి.
Source: జాతీయ | 25 Aug 2008 | 10:43 am

శిబుసోరేన్‌కు మధుకోడా, మరాండీ మద్దతు!

ఎట్టకేలకు జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. యూపీఏ ప్రభుత్వ ఆదేశానుసారం రాజీనామా చేసిన మాజీ జార్ఖండ్ సీఎం మధుకోడా సోమవారం జెఎంఎం అధినేత శిబుసోరెన్‌కు మద్దతిచ్చేందుకు అంగీకరించారు. ఆదివారం వరకు శిబుసోరేన్‌కు పచ్చజెండా ఊపని మధుకోడా... తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో జార్ఖండ్‌లో తలెత్తిన రాజకీయ అనిశ్చితి అంతమైంది.
Source: జాతీయ | 25 Aug 2008 | 10:29 am

జమ్మూలో మళ్ళీ ఘర్షణలు : ఒకరి మృతి

జమ్మూకాశ్మీర్‌లో మళ్ళీ ఘర్షణలు తలెత్తాయి. సోమవారం ఉదయం నాలుగు గంటల నుంచే నిరవధిక కర్ఫ్యూ విధించడంతో కాశ్మీర్‌లోయ, బందీపూరా ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. కర్ఫ్యూ ఉల్లంఘనకు యత్నించిన జెకెఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Source: జాతీయ | 25 Aug 2008 | 9:46 am

అణు ఒప్పందంపై ప్రణబ్ చర్చలు

అణు ఒప్పందంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల రెండు రోజుల పాటు వియన్నాలో జరిగిన చర్చల సందర్భంగా అణు సరఫరా దేశాల బృందం ముసాయిదా సవరణకు కొన్ని సభ్య దేశాలు పట్టుబట్టిన నేపథ్యంలో.. కేంద్రం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Source: జాతీయ | 25 Aug 2008 | 9:00 am

వర్షాకాల సమావేశాలు రేపటికి వాయిదా

వర్షాకాల సమావేశాలను స్పీకర్ సురేష్‌రెడ్డి రేపటికి వాయిదా వేశారు. ఈ రోజు (సోమవారం) నుంచి వచ్చెనెల ఆరో తేదీ వరకూ ఈ సమావేశాలు జరిగనున్నాయి. తొలిరోజు సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ...
Source: ఏపీ న్యూస్ | 25 Aug 2008 | 8:43 am

చిరు పార్టీ 'ప్రజా రాజ్యం' - గుర్తు.. 'ఉదయించే సూర్యుడు'..!

మరో 24 గంటల్లో మెగాస్టార్ తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు. ఇందుకోసం ప్రఖ్యాత పుణ్యస్థలమైన తిరుపతి పట్టణాన్ని వేదికగా చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే మెగా గర్జనకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 25 Aug 2008 | 7:53 am

పటిష్ట భద్రతతో 'చిరు' రంగ ప్రవేశం

రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమైన సినీనటుడు చిరంజీవి తన భద్రతపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. రాష్ట్రాల్లో జరుగుతున్న పలు అవాంఛనీయ సంఘటనల దృష్ట్యా, చిరంజీవి భధ్రతా ఏర్పాట్లను మధ్య ప్రదేశ్‌కు చెందిన ...
Source: ఏపీ న్యూస్ | 25 Aug 2008 | 7:27 am

తితిదేకి కొత్త పాలక మండలి!

తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త పాలక మండలి ఏర్పాటైంది. భూమన కరుణాకర్ రెడ్డి ఛైర్మన్ పదవి కాలం 24 తేదీతో ముగియడంతో ఆ పదవికి చిత్తూరు లోక్‌సభ సభ్యుడు డీకే. ఆదికేశవులు నాయుడును ప్రభుత్వం ...
Source: ఏపీ న్యూస్ | 25 Aug 2008 | 7:26 am

వరంగల్ పర్యటించనున్న సీఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆరోగ్యశ్రీ మెగా వైద్యశిబిరాన్ని ...
Source: ఏపీ న్యూస్ | 25 Aug 2008 | 7:23 am

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు!

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి దివంగత ఎమ్మెల్యేలు శిఖామణి, చనుమోలు వెంకట్రావులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేల మృతికి సీఎం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 25 Aug 2008 | 6:09 am

అసెంబ్లీ వరకు తెదేపా పాదయాత్ర!

తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వరంలో సోమవారం ఉదయం నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర ఘాట్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు. రైతులకు ఎరువులు లభించక నానా తంటాలు పడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Aug 2008 | 5:57 am

నేడు తిరుపతికి రానున్న మెగాస్టార్

సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తిరుపతికి రానున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి తిరుపతికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా తిరుమల వెళుతారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
Source: ఏపీ న్యూస్ | 25 Aug 2008 | 4:35 am

నేటి నుంచి వాడివేడిగా సభాపర్వం

రాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి వాడివేడిగా జరుగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు పది రోజుల పాటు సాగే అవకాశం ఉంది.
Source: ఏపీ న్యూస్ | 25 Aug 2008 | 4:19 am

ఆగస్ట్ 25, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 8.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు...
Source: Yahoo! Telugu: Entertainment | 25 Aug 2008 | 3:45 am

అసాంఘిక శక్తులకు అడ్డాగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిఫల్ కార్పొరేషన్ పరధిలో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిర్మించిన బ్రిడ్జీలు పాదాచారుల వినియోగానికి వీలు లేకుండా దర్శనమిస్తున్నాయి. వీటికి తోడు చెత్తా చెదారలతో నిండి పోయాయి.
Source: ఏపీ న్యూస్ | 24 Aug 2008 | 12:17 pm

'టాటా' తరలింపు వార్తలు కొట్టేసిన బుద్ధదేవ్

నానో కార్ల తయారీ ఫ్యాక్టరీని పశ్చిమ బెంగాల్ నుంచి వేరో రాష్ట్రానికి తరలిపోదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య స్పష్టం చేశారు. సింగూర్‌ నుంచి టాటా నానో కార్ల ఫ్యాక్టరీని వేరే చోటికి మార్చే ప్రశ్నేలేదన్నారు. దీనిపై ఆయన ఆదివారం మాట్లాడుతూ... టాటా ఫ్యాక్టరీ సింగూర్‌ను వేరే చోటకి వెళ్లదు.
Source: జాతీయ | 24 Aug 2008 | 11:35 am