స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 158 పాయింట్ల వృద్ధి

ముంబయి స్టాక్ మార్కెట్‌లో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 158 పాయింట్లు వృద్ధి చెంది 14,401 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 43 పాయింట్ల మేర లాభపడి 4327 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ ఆరంభంలో నష్టాలబాట పట్టినప్పటికి...
Source: Yahoo! Telugu: News | 22 Aug 2008 | 12:06 pm

చురుగ్గా సాగుతున్న చిరు సభ ఏర్పాట్లు

తిరుపతిలో మెగా‌స్టార్ చిరంజీవి పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్థానిక అవిలాల మైదానంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుప్రీం కోర్టు అవాంతరాలు అధిగమించి చిరంజీవి సభ ఏర్పాట్లు జోరందుకున్నాయి. తిరుపతిలో ఆగస్టు...
Source: Yahoo! Telugu: News | 22 Aug 2008 | 11:55 am

కృష్ణా నదికి తగ్గిన వరదనీటి రాక

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం ఆగిపోవడంతో కృష్ణా నదికి వరదనీటి రాక ఆగిపోయింది. తుంగభద్ర నుంచి వరదనీరు రాక నిలిచిపోగా, జారాల నుంచి 1,04,712 క్యూసెక్కులు నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలంకు వచ్చే వరద నీరు తగ్గుముఖం...
Source: Yahoo! Telugu: News | 22 Aug 2008 | 11:40 am

చురుగ్గా సాగుతున్న యురేనియం ప్రాజెక్ట్ పనులు

కడప జిల్లాలో చేపట్టిన యురేనియం ప్రాజెక్ట్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. యురేనియం వెలికితీత పనులను భారత యురేనియం సంస్థ (యూసీఐఎల్) చేపట్టింది. కడప జిల్లాలో ఏర్పాటుచేస్తున్న ప్లాంట్ ద్వారా 2010 చివరి నాటికి ఉత్పత్తి ఆరంభించాలని సంస్థ...
Source: Yahoo! Telugu: News | 22 Aug 2008 | 11:40 am

అల్లర్లు కొనసాగితే ప్రాజెక్టు ఉపసంహరించుకుంటాం: టాటా

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో సింగూరు ప్రాంతంలో తమకు కేటాయించిన భూముల విషయంలో ఆందోళన, అల్లర్లు కొనసాగితే అక్కడి నుంచి నానో కార్ల ప్రాజెక్టును ఉపసంహరించుకుంటామని శుక్రవారం టాటా మోటార్స్ ఛైర్మన్ రతన్ టాటా హెచ్చరించారు.
Source: Yahoo! Telugu: News | 22 Aug 2008 | 11:30 am

పొర్లు కట్టల మరమ్మతులకు రూ.229 కోట్లు

నెల్లూరు జిల్లాలో పంట పొలాలపై విరుచుకుపడే స్వర్ణముఖి, కాళంగి నదులకు అడ్డుకట్టవేసే విధంగా పొర్లుకట్టల శాశ్వత మరమ్మతులకు రూ.229 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీనితో ఈ నదుల అకాల వరదల బారినుంచి పంటపొలాలు...
Source: Yahoo! Telugu: News | 22 Aug 2008 | 11:15 am

కేంద్రం సాయంతో పాఠశాల క్రీడా మైదానాల అభివృద్ధి

మనరాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో అభివృద్ధికి నోచుకోని క్రీడా మైదానాలను మోక్షం రానుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పంచాయిత్ యువ క్రీడా యోజన కింద పాఠశాల క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తారు. 4,600 మంది పైచీలుకు జనాభా ఉన్న...
Source: Yahoo! Telugu: News | 22 Aug 2008 | 11:14 am

నిలిచిపోయిన హంద్రీనీవా పంపింగ్ పనులు

కర్నూలు జిల్లాలో కేసీ కాల్వకు నీటిని వదలటంతో హంద్రీనీవా మొదటి పంపింగ్ ఛానెల్ పనులు నిలిచిపోయాయి. మరోవైపు కృష్ణమ్మ వరదలతో పరవళ్లు తొక్కుతోంది. పంపింగ్ ఛానెల్ పనుల కోసం వంద అడుగుల లోతు మట్టిని తవ్వి కాంక్రీట్ నిర్మాణ పనులు...
Source: Yahoo! Telugu: News | 22 Aug 2008 | 10:42 am

అజంతా చిత్ర ఆడియో ఆవిష్కరణ

ఎల్లోరా బేనర్‌పై రాజ్ పా రవిశంకర్ దర్శకనిర్మాతగా రూపొందిన్న చిత్రం అజంతా. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ చిత్రంలో సాయికిరణ్, శ్రీనాథ్, వందన గుప్త హీరోహీరోయిన్లుగా నటించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Aug 2008 | 10:42 am

శ్రీకాంత్ క్యాబ్‌డ్రైవర్‌గా అ..ఆ..ఇ..ఈ

శ్రీకల్పన ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో బొద్దం అశోక్‌యాదవ్ నిర్మిస్తున్న చిత్రం అ..ఆ..ఇ..ఈ. ఈ చిత్రంలో శ్రీకాంత్ క్యాబ్‌డ్రైవర్‌గా నటిస్తున్నాడు. సదా, మీరాజాస్మిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Aug 2008 | 10:29 am

ఎన్ఎస్‌జీ షరతులు: భారత్, అమెరికా ఆశాభావం

అణు ఇంధన సరఫరా గ్రూపు దేశాలు భారత్‌కు ఇతర దేశాలతో అణు వాణిజ్యం జరుపుకునే వీలు కల్పించేందుకు కొన్ని షరతులు ప్రతిపాదించాయి. గురువారం భారత్ తన అణు కార్యక్రమంపై 45 అణు ఇంధన సరఫరా గ్రూపు (ఎన్ఎస్‌జీ) దేశాలకు
Source: Yahoo! Telugu: News | 22 Aug 2008 | 10:24 am

మోడల్ రైల్వ్ స్టేషన్‌గా ఘనాపూర్

వరంగల్ జిల్లాలోని ఘనాపూర్ రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్నామని హన్మకొండ లోక్‌సభ సభ్యుడు వినోద్ కుమార్ తెలిపారు. సికింద్రాబాద్-కాజీపేట మార్గంలో మఖ్య స్టేషన్లలో ఘనాపూర్ ఒకటని వివరించారు. ఇక్కడ చేపట్టిన అభివృద్ధి...
Source: Yahoo! Telugu: News | 22 Aug 2008 | 10:23 am

ద్విభాషా చిత్రంగా అనగనగా ఒక అరణ్యం

హ్యాపీ మూవీక్రియేషన్స్ పతాకంపై టి.సుల్తాన్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం అనగనగా ఒక అరణ్యం. హిందీలో ఈ చిత్రానికి హమ్ ఆప్‌కే సాథ్ హై అని పేరు పెట్టారు. ద్విభాషా చిత్రమైన దీనికి జి.శేఖర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Aug 2008 | 10:13 am

లోకకల్యాణార్థం "చిరు" అభిమానుల యాగం!

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా ఆయన సుఖసంతోషాలతో వర్ధిల్లడంతో పాటు లోకకల్యాణార్థం చిరు అభిమానులు లక్ష్మీ నారాయణ యాగం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌, హైటెక్ సిటీ సమీపంలోని అన్నమయ్యపురంలో చిరు యూత్ ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 22 Aug 2008 | 9:23 am

"కింగ్‌" యూనిట్‌తో నాగ్ బర్త్‌డే..!

అక్కినేని నాగార్జున తన బర్త్‌డేను "కింగ్" యూనిట్‌తో జరుపుకోనున్నారు. రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలోని తాజ్ కృష్ట హోటల్‌లో ఈ నెల (ఆగస్టు) 29వ తేదీ సాయంత్రం "మాస్" తన బర్త్‌డేను వైభవంగా జరుపుకోనున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. "కింగ్" బర్త్‌డే పార్టీకి...
Source: వినోదం | 22 Aug 2008 | 9:10 am

మల్లెపూవులో "ఫర్జానా" ఐటంసాంగ్!

టాలీవుడ్ బ్యూటీ "ఫర్జానా" ఐటంసాంగ్‌లో కనిపించబోతోందట. అల్లరి నరేష్ సరసన 'బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్' వంటి పలు సినిమాల్లో నటించిన ఈ అందాల ముద్దుగుమ్మ మొదటిసారిగా "ఐటంసాంగ్‌"లో తన అందచందాలను వలకబోయనుంది.
Source: వినోదం | 22 Aug 2008 | 7:53 am

శివాజీ "ఆలయం" ట్రైలర్ మీకోసం

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో శివాజీ హీరోగా, హనీరోజ్ హీరోయిన్‌గా నటించిన చిత్రం "ఆలయం". అనూప్ చక్రవర్తి నిర్మాత బాధ్యతలు చేపడుతున్న ఈ చిత్ర విశేషాల గురించి శివాజీ తెలియజేస్తూ... ఆలయం లాంటి ఓ పొదరింట్లో జరిగిన సంఘటనల సమాహారమే...
Source: వినోదం | 22 Aug 2008 | 7:50 am

భాజపాను నిషేధించాలి: మంత్రి పాశ్వాన్

దేశంలోని హిందువులు ముస్లింల సోదరభావానికి ప్రతీకగా నిలిచిన అమర్‌నాథ్ ఆలయం పేరుతో భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలు చేస్తోందని లోక్‌జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆరోపించారు. అందువల్ల ఆ పార్టీని నిషేధించాలని కోరుతూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 22 Aug 2008 | 6:34 am

ఆగస్ట్ 22, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు శ్రీకృష్ణ, 06.30 గంటలకు కల్వరి స్వరమ్, 07.00 గంటలకు రామాయణం, 07.30 గంటలకు మీ ఆరోగ్యం మీ చేతిలో, 08.00 గంటలకు న్యూస్, 8.30 గంటలకు మా గ్రామదేవతలు, 09.00 గంటలకు...
Source: Yahoo! Telugu: Entertainment | 22 Aug 2008 | 6:15 am

రెండున్నరేళ్ళ ప్రేమ వ్యవహారం...!

నటుడు శివబాలాజీ రెండున్నరేళ్ళుగా ప్రేమిస్తున్న ప్రేమికురాలితో ఓ ఇంటివాడు కానున్నాడు. "ఆర్య" సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శివబాలాజీ ప్రేమ వివాహం త్వరలో జరుగనుంది. "పుట్టింటికి రా చెల్లి"తో అర్జున్ తోబుట్టువుగా నటించిన స్వప్నమాధురి, శివబాలాజీలు...
Source: వినోదం | 22 Aug 2008 | 6:05 am

జేఎంఎం చీఫ్‌ ఆశలకు ఆర్జేడీ మోకాలడ్డు

జార్ఖండ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలన్న జార్ఖండ్ ముక్తి మోర్ఛా అధినేత శిబూ సోరేన్ ఆశలకు రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ మోకాలడ్డుతోంది. ఆర్జేడీ అధినేత, కేంద్ర రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తో సహా.. జేఎంఎం చీఫ్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు.
Source: జాతీయ | 22 Aug 2008 | 5:58 am

భూకంపమా? అవన్నీ వదంతులే...!

రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో భూకంపం వస్తోందన్న వదంతులు జోరుగా షికార్లు చేశాయి. దీనితో గత రాత్రి నగరవాసులంతా అనేక చోట్ల జాగారం చేశారు. అర్థరాత్రి కర్ణాటకలోని గుల్బర్గా నుంచి నగరంలో ఉంటున్న కొంత మందికి భూకంపం రానుందనే ఫోన్లు రావడంతో, నగరవాసులు నిద్రలో మునిగిన వారి ఇంటి తలుపులు తడుతూ, ఒకరినొకరు నిద్రలేపుతూ ఇళ్ల బయటకు వచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 22 Aug 2008 | 5:47 am

నేటి నుంచే 104 సంచార వైద్య సేవలు

వైద్య సేవలు త్వరలో గ్రామీణ ప్రజల ముంగిటికి చేరువకానున్నాయి. దీనికోసం ప్రభుత్వం సంచార వైద్యసేవల సదుపాయాల్ని చేపట్టింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 104 సంచార వైద్యసేవల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి...
Source: ఏపీ న్యూస్ | 22 Aug 2008 | 5:40 am

దళితులపై చంద్రబాబు వరాల వర్షం!

దళితులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వరాల వర్షం కురిపించారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి తరి అయితే రెండెకరాలు, మెట్ట అయితే మూడెకరాల పొలం ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. దీంతో పాటు ప్రతి కుటుంబానికి జీవనోపాధి కోసం పశువులను ఇస్తామని ఆయన చెప్పారు
Source: ఏపీ న్యూస్ | 22 Aug 2008 | 5:12 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 22 Aug 2008 | 3:42 am

పగ్గాలు లేని ద్రవ్యోల్బణం: 12.63% చేరిక

సామాన్యుడి బతుకుబండి మెడలో మరోసారి ద్రవ్యోల్బణం గుదిబండ పడింది. కూరగాయలు, పండ్లు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణం క్రమంగా పైకి దూసుకెళుతోంది. ఆగస్టు 16వ తేదీతో ముగిసే వారానికి 12.63 శాతంగా నమోదైంది. గత వారంలో 12.44 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ప్రస్తుత...
Source: జాతీయ | 21 Aug 2008 | 2:23 pm

'మెగా' బహిరంగ సభకు 17 ప్రత్యేక రైళ్లు

పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఈ నెల 26న చిరంజీవి తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ సభకు వచ్చే వారి కోసం 17 ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. ఇవి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ...
Source: ఏపీ న్యూస్ | 21 Aug 2008 | 1:04 pm

కాంగ్రెస్‌కు నష్టం లేదు : వైఎస్

పలు పార్టీలు పొత్తులతో ఏకమైనా, కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం నష్టం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధిమా వ్యక్తం చేశారు. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...
Source: ఏపీ న్యూస్ | 21 Aug 2008 | 12:43 pm

రాష్ట్ర రాజధానిలో సిమి కార్యకర్త అరెస్టు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సిమి (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా)కు చెందిన సయ్యద్ అహ్మద్ హుస్సేన్‌ అనే కార్యకర్తను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బెంగళూరు, అహ్మదాబాద్ పేలుళ్లలో అహ్మద్ ప్రమేయమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Aug 2008 | 12:37 pm