బీహార్‌లో ఎన్‌కౌంటర్ : 8మంది మృతి

బీహార్‌లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు పోలీసులతో సహా ముగ్గురు సాధారణ పౌరులు మరణించారు. మావోయిస్టులపై పోలీసులు జరిపిన దాడి భీకర పోరుగా మారిందని, ఇరు వర్గాల మధ్య దాడులు ఉద్రిక్తతను సృష్టించిందని పోలీసులు వెల్లడించారు.
Source: జాతీయ | 21 Aug 2008 | 12:10 pm

సెన్సెక్స్ 434 పాయింట్ల భారీ పతనం

ముంబయి స్టాక్ మార్కెట్‌లో గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 434.5 పాయింట్లమేర భారీగా పతనమై 14,243.73 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్ల మేర పతనమై 4284 పాయింట్ల వద్ద నిలిచింది. రియాల్టీ స్టాకులు ఈ రోజు బాగా...
Source: Yahoo! Telugu: News | 21 Aug 2008 | 11:42 am

స్పైసెస్ పార్కుతో ఎగుమతులు వృద్ధి: వైఎస్

గుంటూరు జిల్లాలో ఏర్పాటుచేస్తున్న స్పైసెస్ పార్కు రాక కారణంగా వివిధ రకాల ఉత్పత్తుల ఎగుమతులు భారీగా వృద్ధి చెందుతాయని సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం మైదవోలులో స్పైసెస్...
Source: Yahoo! Telugu: News | 21 Aug 2008 | 11:40 am

వీటీపీఎస్‌లో విద్యుద్పుత్తికి అంతరాయం

విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్‌లో (వీటీపీఎస్) ట్రాన్స్‌ఫార్మర్ పేలిన కారణంగా విద్యుద్పుత్తి గురువారం ఆగిపోయింది. దీనితో 220 మెగావాట్ల విద్యుద్పుత్తి నిలిచిపోయింది. వీటీపీఎస్ మూడవ యూనిట్‌ స్టేషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లో లోపం తలెత్తింది. తద్వారా....
Source: Yahoo! Telugu: News | 21 Aug 2008 | 11:39 am

ఎంఎంటీసీ స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

జంటనగరవాసుల రవాణా సౌకర్యాల్లో ఒకటైన ఎంఎంటీసీకి చెందిన రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే (దమరే) ఒక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని గతంలో ఎన్నోసార్లు విజ్ఞప్తులు...
Source: Yahoo! Telugu: News | 21 Aug 2008 | 11:32 am

తోగాడియా, బీజేపీ ఎమ్మెల్యేల స్వచ్ఛంద అరెస్ట్

విశ్వ హిందూ పరిషత్ నేత ప్రవీణ్ తోగాడియా, ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు, వందలాది మంది సంఘ్ పరివార్ కార్యకర్తలు గురువారం న్యూఢిల్లీలో స్వచ్ఛంద అరెస్టులయ్యారు. జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలో అమర్‌నాథ్ ఆలయ ట్రస్టుకు కేటాయించి,
Source: Yahoo! Telugu: News | 21 Aug 2008 | 11:30 am

ఉత్తరప్రదేశ్‌లో 1100 డిటోనేటర్లతో ఇద్దరు అరెస్ట్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గురువారం 1100 డిటోనేటర్లతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఒక క్వింటాల్ అమ్మొనియం నైట్రేట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఇద్దరిని జితేంద్ర కుమార్ అలియాస్ బబ్లూ, అమరేష్
Source: Yahoo! Telugu: News | 21 Aug 2008 | 11:23 am

తొలి షెడ్యూల్లో మళ్లీ మళ్లీ చిత్రం

సహస్య ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం మళ్లీ మళ్లీ. ఈ చిత్రం ప్రస్తుతం తొలి షెడ్యూల్ జరుపుకుంటోందని చిత్ర యూనిట్ తెలిపింది. సెప్టెంబర్ నెలలో రెండవ షెడ్యూల్ ప్రారంభంకానుందని చిత్ర దర్శకుడు రాజా ఆదిత్య తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2008 | 11:10 am

జార్ఖంఢ్: శిబు సోరెన్‌కు ఆర్జేడీ ఎమ్మెల్యేల మద్దతు

జార్ఖంఢ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్న జేఎంఎం చీఫ్ శిబు సోరెన్‌కు గురువారం మరో శుభవార్త అందింది. ఆర్జేడీ ఎమ్మెల్యేలు కూడా శిబు సోరెన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారు.
Source: Yahoo! Telugu: News | 21 Aug 2008 | 11:10 am

ప్రముఖ విద్యా కేంద్రంగా కాకినాడ జేఎన్‌టీయూ

ప్రపంచంలో ప్రముఖ విద్యా కేంద్రాల్లో ఒకటిగా కాకినాడ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) గా అభివృద్ధి చేస్తామని కొత్త వైస్‌ఛాన్సలర్ ఆచార్య మల్లం అప్పారావు చెప్పారు. జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయంగా మారిన తర్వాత...
Source: Yahoo! Telugu: News | 21 Aug 2008 | 11:02 am

ముచ్చటగా మూడోసారి డీసీసీ పదవిలో పెనుమత్స

విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ (డీసీసీ) పదవిని ముచ్చటగా మూడోసారి పార్టీ సీనియర్ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు చేపట్టారు. సతివాడ నియోజనకవర్గ శాసనసభ్యుడుగా సాంబశివరాజు ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. డీసీసీ పదవీబాధ్యతలు...
Source: Yahoo! Telugu: News | 21 Aug 2008 | 11:01 am

"బ్యాంక్" సినిమా ట్రైలర్‌ను వీక్షించండి

అరుణ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో వి. అరుణ్ కుమార్ రూపొందించిన చిత్రం ‘బ్యాంక్’. ఈ సినిమాలో జాకీష్రాఫ్, రఘువరన్...
Source: వినోదం | 21 Aug 2008 | 10:59 am

ఛాంపియన్స్ ట్రోఫీపై ఆదివారం ఐసీసీ బోర్డు సమావేశం

పాకిస్థాన్‌లో వచ్చే నెలలో ప్రారంభం కావాల్సివున్న ఛాంపియన్స్ ట్రోఫీపై తుది నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదివారం వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యంపై తుది నిర్ణయం తీసుకునేందుకు
Source: Yahoo! Telugu: News | 21 Aug 2008 | 10:55 am

"గజిబిజి" ట్రైలర్ మీకోసం

అలీ, వేణుమాధవ్ హీరోలుగా, ఫర్జానా హీరోయిన్‌గా కె.వాసు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘గజిబిజి’. గాయత్రి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనున్న...
Source: వినోదం | 21 Aug 2008 | 10:49 am

"చిరు" బహిరంగసభకు సుప్రీం పచ్చజెండా!

తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన తొలి భారీ బహిరంగ సభకు ఎలాంటి అవాంతరాలు ఉండబోవని సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆశించినట్టే జరిగింది. ఈ మేరకు చిరు తొలి బహిరంగ సభను అవిలాల ప్రాంతంలోనే జరుపుకోవచ్చునని సుప్రీంకోర్టు గురువారం పచ్చజెండా ఊపింది.
Source: ఏపీ న్యూస్ | 21 Aug 2008 | 9:36 am

ఆయనతో విభేదాలు లేవు : డీఎస్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుల ఎన్నికలో సామాజిక సమతూల్యం పాటించామని ఆయన తెలిపారు. ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న డీసీసీ అధ్యక్షుల ఎన్నికను వీలైనంత త్వరలో చేస్తామని డీఎస్ వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Aug 2008 | 9:21 am

జైమారుతి ఫిలింస్ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి

జైమారుతి ఫిలింస్ పతాకంపై విక్కీ దర్శకత్వంలో కె.ఆర్.శ్రీనివాస్ అయ్యంగార్ నిర్మిస్తున్న చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో మధుసూధన్, పాయల్‌శెట్టి, మనోజ్, శ్రీలేఖ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2008 | 9:16 am

రెగ్యులర్ షూటింగ్‌లో మోహన్‌బాబు కొత్త చిత్రం

కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా, మోహన్‌బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి భానుశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2008 | 9:00 am

తిరుపతి సభకు ఆటంకాలు ఉండబోవు: చిరు

తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన తొలి భారీ బహిరంగ సభకు ఎలాంటి అవాంతరాలు ఉండబోవని సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 21 Aug 2008 | 7:54 am

"బ్లాక్ అండ్ వైట్" ఆడియో రిలీజ్

మైత్రీ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రాజీవ్‌కనకాల, సింధుతులాని జాకీష్రాప్ ముఖ్య తారాగణంగా రూపొందిన చిత్రం "బ్లాక్ అండ్ వైట్". ఒకే ఒక పాటను మాత్రమే కలిగి ఉన్న ఈ సినిమా ఆడియో కార్యక్రమం.. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూథియేటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి...
Source: వినోదం | 21 Aug 2008 | 7:50 am

సాఫ్ట్‌వేర్ కల్చర్ చిత్రం ప్రారంభం

సంక్రాంతి రాజశేఖర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సాఫ్ట్‌వేర్ కల్చర్. ఊర్మిళ గుణ్ణం ఆధ్వర్యంలో ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. గతంలో జస్ట్ ఎల్లో బ్యానర్‌లో ఐతే, అమ్మ చెప్పింది, తదితర చిత్రాలకు...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2008 | 7:49 am

ప్రేక్షకుల ముందుకు 28న హోమం

జె.డి చక్రవర్తి దర్శకత్వంలో శ్రేయ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం హోమం. జగపతిబాబు, మమతామోహన్‌దాస్‌లు జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాత కిరణ్‌కుమార్ తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2008 | 7:34 am

యూత్ సబ్జెక్ట్‌తో కాలేజ్‌డేస్ టు మ్యారేజ్‌డేస్

చక్కని యూత్ సబ్జెక్ట్‌తో కాలేజ్‌డేస్‌ టు మ్యారేజ్‌డేస్ చిత్రాన్ని రూపొందించినట్టు చిత్ర దర్శకుడు ప్రేమ్ చంద్ తెలిపారు. కాలీజీ కుర్రాళ్లు, అమ్మాయిలు వాళ్ల మాటలు, చిలిపి పనులకు అద్దంపట్టేలా ఈ చిత్రాన్ని తీసినట్టు చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2008 | 7:28 am

డబ్బింగ్ కార్యక్రమాల్లో ఏక్ పోలీస్

రుష్యా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ఏక్‌పోలీస్. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎన్.హెచ్.భాస్కర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2008 | 7:11 am

బ్లాక్ అండ్ వైట్ పాట విడుదల

రాజీవ్‌కనకాల, సింధుతులాని. జాకీష్రాఫ్‌లు ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం బ్లాక్ అండ్ వైట్. ఈ చిత్రంలో ఒకే ఒక్క పాట ఉన్న ఆడియో బుధవారం విడుదలైంది. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2008 | 7:03 am

నిర్మాతకు సహకరించిన హన్సిక!

"దేశముదురు" సినిమాలో బన్నీ సరసన నటించిన అందాల భామ హన్సిక నిర్మాతకు సహకరించిందట! ఎలాగో తెలుసా? షూటింగ్‌లో ఆమెకు గాయం తగిలినప్పటికీ ఒక గంటపాటు చికిత్స పొంది తిరిగి షూటింగ్‌లో పాల్గొందట. చిన్న గాయం తగిలితేనే షూటింగ్‌‌ను...
Source: వినోదం | 21 Aug 2008 | 7:01 am

ఆగస్ట్ 27న నేను తను ఆమె ఆడియో

మాధవన్, సదా, షమితాశెట్టిలు ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం నేను తను ఆమె. ఈ చిత్ర ఆడియో ఆగస్ట్ 27న విడుదల కానుంది. స్టార్మ్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రచయిత కోనవెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2008 | 6:25 am

సాయికుమార్ ముఖ్యపాత్రలో ఢీఅంటేఢీ

సి.వి.ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సాయికుమార్ ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం ఢీఅంటేఢీ. మొదట సిటిజన్ అనే పేరును ఖరారు చేశామని ప్రస్తుతం ఈ పేరును మార్చినట్టు చిత్ర నిర్మాత సి.వి.రెడ్డి తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2008 | 6:10 am

ప్రధాని అభ్యర్థిని ఖరారు చేయలేదు: బాబు

మూడో కూటమి అభ్యర్థి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనిపై ఆయన బుధవారం ఒక న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. తృతీయ కూటమి తరపున ప్రధాని ఎంపికపై కూటమిలోని అన్నిపార్టీలతో సహా, వామపక్షాలతో చర్చించాల్సి వుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Aug 2008 | 5:51 am

గుంటూరు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి గురువారం గుంటూరు జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నర్సారావుపేటలోని సత్తెనపల్లిలో లాంఛనంగా ....
Source: ఏపీ న్యూస్ | 21 Aug 2008 | 5:32 am

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జీవిత?

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నూతన అధ్యక్షురాలిగా సినీనటి. జీవిత పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. ప్రస్తుత అధ్యక్షురాలు కె. గంగాభవానికి పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవినిస్తారని పార్టీ వర్గాల సమాచారం. ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్‌తో కలిసి జీవిత ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Source: ఏపీ న్యూస్ | 21 Aug 2008 | 5:23 am

వర్షాకాల సమావేశాలకు ప్రభుత్వం సిద్ధం

ఈనెల 25వ తేదీ నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. ప్రభుత్వం పనితీరును ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతుండగా, ఆరోపణలకు తగ్గట్టుగానే స్పందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.
Source: ఏపీ న్యూస్ | 21 Aug 2008 | 4:25 am

పీవీ ప్రభుత్వంపై అద్వానీ ప్రశంసల జల్లు

భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఏ క్షణంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఎవరికీ అంతుచిక్కదు. గతంలో పాక్ జాతిపిత మహ్మద్ జిన్నాను పొగడ్తల వర్షంలో ముంచెత్తి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా 1990 నాటి మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు.
Source: జాతీయ | 21 Aug 2008 | 3:37 am

రాజీవ్ ఉంటే దేశం మరింత అభివృద్ధి : వైఎస్

మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ బ్రతికి ఉంటే దేశం మరింత అభివృద్ధి పథంలో ఉండేదని రాష్ట్ర ముక్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. రాజీవ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించిన వైఎస్ పై విధంగా స్పందించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Aug 2008 | 2:33 pm

నేటి నుంచి కాంగ్రెస్ సమైక్యతా సంబరాలు

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆశయాలపై దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఇందులోభాగంగానే రాజీవ్ గాంధీ జన్మదినోత్సవాలను పురస్కరించుకుని ...
Source: ఏపీ న్యూస్ | 20 Aug 2008 | 1:33 pm

"చిరు" తీర్థం పుచ్చుకున్న భూమాదంపతులు

సినీ నటుడు చిరంజీవి పెట్టనున్న పార్టీలోకి వలసల పర్వం నానాటికి అధికమిస్తోంది. నిన్న జోగయ్య, నేడు భూమా దంపతులు మోగా తీర్థాన్ని పుచ్చుకున్నారు. తమ సొంత పార్టీలకు రాజీనామా చేసి వలస ...
Source: ఏపీ న్యూస్ | 20 Aug 2008 | 11:33 am

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం

దేశవ్యాప్తంగా ఎన్ఐటీయుసీ, సీఐటీయూ కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు బుధవారం సమ్మెను పాటిస్తున్నాయి.
Source: జాతీయ | 20 Aug 2008 | 11:31 am