మనోజ్, ఉల్లాల్ జంటగా "నేను మీకు తెలుసా?"

మనోజ్, స్నేహ ఉల్లాల్, రియాసేన్ ముఖ్య తారలుగా అజయ్ శాస్త్రి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మిస్తోన్న చిత్రం "నేను మీకు తెలుసా?". ఈ సినిమా ఒక పాట మినహా పూర్తయింది. మొత్తం ఆరు పాటల్లో రెండు పాటలను బ్యాంకాక్‌లో చిత్రీకరించారు. చిత్రం గురించి నిర్మాణ...
Source: వినోదం | 16 Aug 2008 | 1:43 pm

సికింద్రాబాద్- కాకినాడల మధ్య ప్రత్యేక రైలు

వరుసగా వచ్చిన శెలవుల నేపథ్యంలో రద్దీని అదుపు చేసే చర్యలో భాగంగా సికింద్రాబాద్- కాకినాడల మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 16 Aug 2008 | 12:21 pm

ఇక గ్రామాల్లో సంచార వైద్య సేవలు

గ్రామాల్లో సంచార వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న అత్యాధునిక సంచార ఆరోగ్య కేంద్రాలు సిద్ధమవుతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 16 Aug 2008 | 12:16 pm

అహ్మదాబాద్ వరుస పేలుళ్ల వెనుక సిమీ హస్తం

అహ్మదాబాద్‌లో వరుస బాంబుపేలుళ్ల వెనుక ఉగ్రవాద సంస్థ సిమీ హస్తముందని గుజరాత్ పోలీసులు గుర్తించారు. సిమీకి చెందిన 10మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరందరూ అహ్మదాబాద్‌లో జులై 26న జరిగిన వరుస బాంబుపేలుళ్లకు కుట్ర పన్నారని...
Source: Yahoo! Telugu: News | 16 Aug 2008 | 12:15 pm

పేదలకు బిపిటి రైస్ రూ.18కే: రోశయ్య

రాష్ట్రంలోని పేదలందరికీ రూ.18కే బిపిటి రైస్ అందించేలా తగిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి రోశయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బియ్యం కోటా తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతులను...
Source: Yahoo! Telugu: News | 16 Aug 2008 | 12:07 pm

హర్యానాలో యమునా నదికి వరదలు

హర్యానాలో యమునా నదికి వరదలు రావటంతో సమీపంలోని దాదాపు 50 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. యమునా నగర్ సమీపంలోని తాజేవాలా హెడ్‌వర్క్స్ నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. దీనితో యమునా నది...
Source: Yahoo! Telugu: News | 16 Aug 2008 | 11:51 am

లడఖ్‌లో కూలిన ఆర్మీ విమానం: సిబ్బంది దుర్మరణం

జమ్మూ కాశ్మీర్‌లోని లడఖ్‌లో ఆర్మీ హెలీకాప్టర్ ఛీటా కూలిన సంఘటనలో ముగ్గురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం లడఖ్ తూర్పు ప్రాంతంలో జరిగిందని ఆర్మీ వర్గాలు తెలిపారు. ఇద్దరు ఆర్మీ మేజర్లతో పాటుగా, ఒక జవాను మృత్యువాతపడ్డారని...
Source: Yahoo! Telugu: News | 16 Aug 2008 | 11:49 am

చిరంజీవి పార్టీ ప్రకటనకు రంగం సిద్ధం

మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆయన పార్టీ పేరును ఆదివారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించనున్నారు.
Source: Yahoo! Telugu: News | 16 Aug 2008 | 11:18 am

ఎట్టకేలకు ముగిసిన అమర్‌నాథ్ యాత్ర!

అమర్‌నాథ్ భూ కేటాయింపు రద్దుతో పెచ్చరిల్లిన అల్లర్ల నడుమ అమర్‌నాథ్ యాత్ర శనివారంతో ముగిసింది. రెండు నెలలపాటు సాగిన ఈ యాత్రలో 5.5లక్షల మంది యాత్రికులు పాల్గొనడం విశేషం. 160 సంవత్సరాల అమర్‌నాథ్ యాత్ర చరిత్రలో ఇంత ఎక్కువ సంఖ్యలో యాత్రికులు పాల్గొనడం ఇదే మొదటిసారి.
Source: జాతీయ | 16 Aug 2008 | 10:58 am

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది అనుమానమే: సీఏ

పాకిస్థాన్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2008 పోటీల్లో ఆస్ట్రేలియా జట్టు పాల్గొనేది అనుమానమే అని క్రికెట్ ఆస్ట్రేలియా వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎన్ని బుజ్జగింపు పనులు చేసినా తాము అక్కడ ఆడేది లేదని స్పష్టం....
Source: Yahoo! Telugu: News | 16 Aug 2008 | 10:57 am

అహ్మదాబాద్ పేలుళ్లు: కీలక నిందితుడు అరెస్టు

గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లో సంభవించిన వరుస బాంబు పేలుళ్ళకు సంబంధించి కీలక నిందితుడిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. అలాగే మరో ఎనిమిది మంది సిమి సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు.
Source: జాతీయ | 16 Aug 2008 | 10:51 am

క్వార్టర్స్ చేరిన బాక్సర్లకు భారీ నజరానా: హర్యానా

బీజింగ్ ఒలింపిక్స్‌ బాక్సింగ్ క్రీడ క్వార్టర్ పైనల్స్‌లోకి అడుగుపెట్టిన స్వరాష్ట్రానికి చెందిన ఇద్దరు బాక్సర్లకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. బాక్సర్లు అఖిల్ కుమార్, జితేందర్ కుమార్‌లు అత్యద్భుతంగా...
Source: Yahoo! Telugu: News | 16 Aug 2008 | 10:37 am

ప్రారంభమయిన శ్రీహరి పోరు

శ్రీహరి కథానాయకుడిగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పోరు. శుక్రవారం నాడు యూసుఫ్‌గూడలోని సవేలా ఫంక్షన్‌హాల్‌లో ముహూర్తపు షాట్‌ను చిత్రించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.ముఖేష్‌గౌడ్ క్లాప్ కొట్టారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Aug 2008 | 10:37 am

ప్రారంభమయిన మళ్లీ మళ్లీ

ఒకే అవకాశం మళ్లీ మళ్లీ తలుపుతడుతుంటే ఓ వ్యక్తి ఏం చేస్తాడు అనే పాయింట్‌తో సహస్య ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం మళ్లీ మళ్లీ. ఈ చిత్రంలో స్కంద అశోక్, కళ్యాణిలు హీరో, హీరోయిన్లుగా పరిచయం కానున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Aug 2008 | 10:22 am

బాక్సింగ్‌లో భారత్ జోరు: అథ్లెట్ల బేజారు

బీజింగ్ విశ్వ క్రీడల్లో భారత బాక్సింగ్ జట్టు ఉత్సాహంతో ముందుకు కదం తొక్కుతుంటే అథ్లెట్లు నిరాశపరిచారు. బాక్సింగ్‌లో నిన్న అఖిల్ కుమార్ ముందుకు సాగితే నేడు ఆ బాధ్యతను జితేందర్ కుమార్ భుజానకెత్తుకున్నాడు. 400 మీటర్ల పరుగు పందెం అర్హతా...
Source: Yahoo! Telugu: News | 16 Aug 2008 | 10:20 am

కొత్తదనం లోపించిన బలాదూర్

బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్. ఈ చిత్రంలో రవితేజ, అనుష్క హీరో, హీరోయిన్లుగా నటించారు. కృష్ణ, చంద్రమోహన్, బ్రహ్మానందం, సునీల్, ప్రదీప్ రావత్ తదితరులు ముఖ్య పాత్రలు...
Source: Yahoo! Telugu: Entertainment | 16 Aug 2008 | 10:13 am

మోహన్‌బాబు ప్రధాన పాత్రలో కొత్త చిత్రం

కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా, మోహన్‌బాబు ప్రధాన పాత్రతో కుమారస్వామి ప్రొడక్షన్స్ ఓ చిత్రాన్ని ప్రారంభించింది. ఇటీవలే లాంఛనంగా ప్రారంభించిన ఈ చిత్రానికి సాయిప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Aug 2008 | 10:04 am

మోహన్‌బాబు విలన్‌గా సలీమ్ చిత్రం

మోహన్‌బాబు విలన్‌గా ఆయన కుమారుడు విష్ణువర్థన్ హీరోగా శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం సలీమ్. వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో మోహన్‌బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో...
Source: Yahoo! Telugu: Entertainment | 16 Aug 2008 | 9:20 am

"చిరు" సినిమా చూపిస్తున్నారు : పొంగులేటి

ప్రజా జీవితంలో కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా చూపిస్తున్నారని, పార్టీ వచ్చేస్తుందని ట్విస్ట్‌లు పెడుతున్నారని ఎఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్క్రిఫ్ట్ సిద్ధంగా ఉందని, ఒక సారి కార్యాలయం ప్రారంభమైందని, త్వరలో పార్టీ ప్రకటిస్తానని చెప్పడం సినిమా టిక్‌గా ఉందని ఆయన ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 16 Aug 2008 | 9:02 am

అస్సాంలో వరుస బాంబు పేలుళ్లు!

అస్సాంలోని బొంగైగాన్ జిల్లాల్లో శనివారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉగ్రవాదులు దేశంలోని అనేక ప్రాంతాల్లో పంజా విసురుతున్నట్లు నిఘా సంస్థలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం అస్సాంలోని బొంగైగాన్ జిల్లాలో స్వహిద్ బేడి పోలీస్ చెక్ పోస్ట్, పగ్లథాన్‌లలో బాంబు పేలుడు సంభవించింది.
Source: జాతీయ | 16 Aug 2008 | 7:46 am

సోదరీమణులకు సీఎం "రాఖీ" శుభాకాంక్షలు!

అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక అయిన రాఖీ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ సంస్కృతి విశిష్టమైందని దీన్ని ప్రపంచదేశాలు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Aug 2008 | 7:24 am

నవంబరులో రానున్న "కామెడీ ఎక్స్‌ప్రెస్"

టీవీ మీడియా పతాకంపై జితేంద్ర సమర్పణలో కె. శంకర్ రెడ్డి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం "కామెడీ ఎక్స్‌ప్రెస్". ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. వచ్చేనెలలో రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుందని, అక్టోబర్‌లో పాటల చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను...
Source: వినోదం | 16 Aug 2008 | 5:29 am

ఈనెల 23న మంత్రులతో సీఎం సమీక్ష

రాష్ట్రంలో శాసనసభ వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వంపై దాడి చేసేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అధికారపక్షం సిద్ధమవుతోంది.
Source: ఏపీ న్యూస్ | 16 Aug 2008 | 4:19 am

మన్మోహనుడే యూపీఏ ప్రధాని అభ్యర్థి: సోనియా

వచ్చే ఏడాదిలో జరుగనున్న లోక్‌సభ సాధారణ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కదలికలు ఊపందుకుంటున్నాయి. ఇందులోభాగంగా.. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రకటించడమేకాకుండా.. ఎన్నికల్లో పోటీ చేసే తొలి అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది.
Source: జాతీయ | 16 Aug 2008 | 3:53 am

ఆగస్ట్ 16, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు అన్నమయ్య కీర్తనలు, 06.30 గంటలకు క్రైస్తవ కార్యక్రమాలు, 07.00 గంటలకు ఏకముఖ రుద్రాక్ష, 07.30 గంటలకు మీ ఆరోగ్యం మీ చేతిలో, 08.00 గంటలకు న్యూస్, 8.30 గంటలకు మా పుణ్యక్షేత్రాలు...
Source: Yahoo! Telugu: Entertainment | 16 Aug 2008 | 3:18 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 16 Aug 2008 | 2:59 am

ఐటీఏ ఆధ్వర్వంలో 'తెలుగు జ్యోతి' మాసపత్రిక

చెన్నయ్ నగరంలోని ప్రముఖ తెలుగు సాంస్కృతి సంస్థ ఇండియన్ తెలుగు అసోసియేషన్ 'తెలుగు జ్యోతి' అనే పేరుతో మాసపత్రికను విడుదల చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భంగా ఈ పత్రికను తమిళనాడు రాష్ట్ర రవాణా శాఖామంత్రి కేఎన్.నెహ్రూ తొలి ప్రతిని ఆవిష్కరించి, ఆర్చిడ్ కెమికల్స్ కార్పొరేట్ కమ్యూనికేషన్ హెడ్ సీహెచ్.రామ్‌కు అందజేశారు.
Source: ఏపీ న్యూస్ | 15 Aug 2008 | 12:41 pm