ఆగస్టు 13, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 13 Aug 2008 | 3:42 am

గోదావరికి వరద ముంపులో దేవీపట్నం మండలం

గోదావరి నదికి వరద రావడంతో తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని అనేక ప్రాంతాలు ముంపు బారినపడ్డాయి. వరద కారణంగా దేవీపట్నం మండల వాసులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ...
Source: Yahoo! Telugu: News | 12 Aug 2008 | 12:10 pm

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు: కృష్ణకు వరద

కర్నూలు జిల్లాకు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి అధికంగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నారాయణపూర్ ఆనకట్ట వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతుంది. మహారాష్ట్ర, కర్ణాటకలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణానది పరీవాహక...
Source: Yahoo! Telugu: News | 12 Aug 2008 | 11:58 am

లంకపై పరాజయం: 4 రేటింగ్ పాయింట్లు కోల్పోయిన భారత్

భారత్, శ్రీలంకల మధ్య హోరాహోరీగా జరిగిన తాజా టెస్ట్ సిరీస్ కారణంగా టీం ఇండియా నాలుగు రేటింగ్ పాయింట్లు కోల్పోయింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ జట్టు ర్యాంకింగ్స్‌లో శ్రీలంక నేరుగా నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఇంతకుముందు
Source: Yahoo! Telugu: News | 12 Aug 2008 | 11:56 am

కాశ్మీర్‌లో జగపతి బాబు సినిమా యూనిట్‌పై దాడి

జమ్మూ కాశ్మీర్‌లో సినిమా షూటింగ్‌లో ఉన్న నటుడు జగపతి బాబు చిత్ర యూనిట్ సభ్యులపై దాడి జరిగింది. శ్రీనగర్‌కు సమీపంలోని పహల్‌గావ్ వద్ద వీరి చిత్ర యూనిట్ షూటింగ్ జరుగుతుండగా విద్రోహులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ...
Source: Yahoo! Telugu: News | 12 Aug 2008 | 11:44 am

పవన్‌కళ్యాణ్‌కు విడాకులు మంజూరు

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు విడాకులను విశాఖపట్నం కోర్టు మంగళవారం మంజూరు చేసింది. దీనితో పవన్‌కళ్యాణ్-నందినిలు చట్టబద్దంగా విడిపోయారు. పవన్‌కళ్యాణ్ మొదటి భార్య నందిని. పవన్‌కళ్యాణ్‌కు నందినితో వివాహం 1997లో జరిగింది. మనోవర్తి పిటిషన్లను..
Source: Yahoo! Telugu: News | 12 Aug 2008 | 11:43 am

కెరీర్‌ను అంతం చేసేందుకు పెద్ద కుట్ర జరిగింది: మోనికా

ఇటీవల డోప్ ఆరోపణలు ఎదుర్కొన్న మోనికా దేవి మరోసారి ఈ వివాదంపై నోరువిప్పారు. తన కెరీర్‌కు ముందుగానే ముగింపు పలికేందుకు పెద్ద కుట్ర జరిగిందని మెనికా దేవి మంగళవారం ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలు గొప్ప వ్యూహంలో భాగమని
Source: Yahoo! Telugu: News | 12 Aug 2008 | 11:28 am

జార్జియాపై సైనిక చర్యకు ముగింపు పలికిన రష్యా

జార్జియాపై సైనిక చర్యను నిలిపివేస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు ద్మిత్రీ మెద్వదెవ్ మంగళవారం ప్రకటించారు. ఈరోజు రష్యా రక్షణ శాఖ అధికారులతో సమావేశం అనంతరం మెద్వదెవ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. జార్జియా అధికారిక
Source: Yahoo! Telugu: News | 12 Aug 2008 | 11:21 am

స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 292 పాయింట్లు పతనం

ముంబయి స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 291.79 పాయింట్లమేర భారీగా నష్టపోయి 15,212 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 68 పాయింట్లు కోల్పోయి 4,552 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ ఆరంభంలో లాభాలను చవిచూసినా....
Source: Yahoo! Telugu: News | 12 Aug 2008 | 11:15 am

కాశ్మీర్ లోయలో హింసాకాండ: 10కి చేరిన మృతులు

కాశ్మీర్ లోయలో మంగళవారం జరిగిన హింసాకాండలో మృతి చెందినవారి సంఖ్య 10కి పెరిగింది. కాశ్మీర్ ప్రాంతంలో ఈరోజు కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు రాజ్యమేలాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు వేర్వేరు చోట్ల జరిపిన
Source: Yahoo! Telugu: News | 12 Aug 2008 | 11:10 am

అమర్‌నాథ్ వివాదం: అఖిలపక్ష చర్చలు విఫలం

అమర్‌నాథ్ భూవివాదానికి పరిష్కారం కనుగొనేందుకు అఖిలపక్ష నేతలు తాజాగా జరిపిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. ఈ వివాదానికి పరిష్కార మార్గాలు కనుగొనేందుకు అఖిలపక్ష నేతల బృందం మంగళవారం కూడా సమావేశం అయింది.
Source: Yahoo! Telugu: News | 12 Aug 2008 | 10:53 am

హైదరాబాద్‌లో మల్లన్న షూటింగ్

విక్రమ్, శ్రియలు జంటగా నటిస్తున్న చిత్రం మల్లన్న. కలైపులి ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Aug 2008 | 10:36 am

పవన్ కళ్యాణ్‌కు విడాకులు మంజూరు

మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు తొలి వివాహ బంధం చిక్కులు తొలగిపోయాయి. తన తొలి భార్య నందిని పెళ్లి వ్యవహారంలో తీవ్ర మనస్థాపానికి గురైన పవన్ కళ్యాణ్‌కు ఎట్టకేవలకు విముక్తి లభించింది.
Source: ఏపీ న్యూస్ | 12 Aug 2008 | 10:23 am

ప్రియురాలి కోసం చిత్రం ప్రారంభం

కె. చంద్రమౌళి దర్శకత్వంలో ఈశ్వరి రూపొందిస్తున్న చిత్రం ప్రియురాలి కోసం. శ్రీరూపశ్రీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవిప్రకాష్, రత్నజ్యోతిలు హీరో, హీరోయిన్లుగా పరిచయం కానున్నారు. ఇటీవలే చిత్రానికి సంబంధించిన...
Source: Yahoo! Telugu: Entertainment | 12 Aug 2008 | 10:11 am

జమ్మూలో ఆగని అల్లర్లు: కాల్పుల్లో ఐదుగురి మృతి

జమ్మూకాశ్మీర్ కల్లోలిత ప్రాంతంగా మారింది. మంగళవారం తిరిగి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిని అణచి వేసేందుకు పోలీసులు కాల్పులు జరుపగా, ఐదుగురు ఆందోళనకారులు మృతి చెందారు. అమర్‌నాథ్ భూముల కేటాయింపు వ్యవహారం ఆ రాష్ట్రంలో అల్లర్లకు దారితీసిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 12 Aug 2008 | 10:02 am

చర్చలకు ఎస్ఏఎస్ఎస్ నేతలకు ఆహ్వానం

జమ్మూకాశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లకు స్వస్తి పలికేందుకు, అమర్‌నాథ్ ఆలయానికి భూముల కేటాయింపు వ్యవహార సమస్యను పరిష్కరించే దిశగా అఖిలపక్షం పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఎఎస్ఎస్) నేతలను చర్చలకు దేశ రాజధానికి ఆహ్వానించాలని తీర్మానించింది.
Source: జాతీయ | 12 Aug 2008 | 9:33 am

'చిరు' సభకు సిద్ధమవుతున్న నందికుంట మైదానం

సినీనటుడు చిరంజీవి స్థాపించనున్న రాజకీయ పార్టీ తొలి బహిరంగ సభ ప్రముఖ పుణ్యస్థలం తిరుపతిలో జరుగనుంది. ఇందుకోసం నందికుంట మైదానం ముస్తాబవుతోంది. సభ నిర్వాహణ ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తిరుపతి సమీపంలోని...
Source: ఏపీ న్యూస్ | 12 Aug 2008 | 8:51 am

విశాఖ కోర్టుకు హాజరైన పవన్ కళ్యాణ్

సినీనటుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని కుటుంబ వ్యవహారాల కోర్టుకు మంగళవారం హాజరయ్యారు. బహు భార్యత్వం కేసులో తొలి భార్య నందినితో రాజీ కుదుర్చుకునేందుకు గాను ఆయన కోర్టుకు వచ్చినట్టు సమాచారం. రాజీలో...
Source: ఏపీ న్యూస్ | 12 Aug 2008 | 8:48 am

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూసొరేన్

జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శిబూసొరేన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానం సమ్మతించింది. ఈ విషయాన్ని సొరేన్ స్వయంగా మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న మధు కోడాను సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించనున్నట్టు ఆయన తెలిపారు.
Source: జాతీయ | 12 Aug 2008 | 8:42 am