హైదరాబాద్‌లో మల్లన్న షూటింగ్

విక్రమ్, శ్రియలు జంటగా నటిస్తున్న చిత్రం మల్లన్న. కలైపులి ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Aug 2008 | 10:36 am

పవన్ కళ్యాణ్‌కు విడాకులు మంజూరు

మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు తొలి వివాహ బంధం చిక్కులు తొలగిపోయాయి. తన తొలి భార్య నందిని పెళ్లి వ్యవహారంలో తీవ్ర మనస్థాపానికి గురైన పవన్ కళ్యాణ్‌కు ఎట్టకేవలకు విముక్తి లభించింది.
Source: ఏపీ న్యూస్ | 12 Aug 2008 | 10:23 am

ప్రియురాలి కోసం చిత్రం ప్రారంభం

కె. చంద్రమౌళి దర్శకత్వంలో ఈశ్వరి రూపొందిస్తున్న చిత్రం ప్రియురాలి కోసం. శ్రీరూపశ్రీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవిప్రకాష్, రత్నజ్యోతిలు హీరో, హీరోయిన్లుగా పరిచయం కానున్నారు. ఇటీవలే చిత్రానికి సంబంధించిన...
Source: Yahoo! Telugu: Entertainment | 12 Aug 2008 | 10:11 am

జమ్మూలో ఆగని అల్లర్లు: కాల్పుల్లో ఐదుగురి మృతి

జమ్మూకాశ్మీర్ కల్లోలిత ప్రాంతంగా మారింది. మంగళవారం తిరిగి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిని అణచి వేసేందుకు పోలీసులు కాల్పులు జరుపగా, ఐదుగురు ఆందోళనకారులు మృతి చెందారు. అమర్‌నాథ్ భూముల కేటాయింపు వ్యవహారం ఆ రాష్ట్రంలో అల్లర్లకు దారితీసిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 12 Aug 2008 | 10:02 am

చర్చలకు ఎస్ఏఎస్ఎస్ నేతలకు ఆహ్వానం

జమ్మూకాశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లకు స్వస్తి పలికేందుకు, అమర్‌నాథ్ ఆలయానికి భూముల కేటాయింపు వ్యవహార సమస్యను పరిష్కరించే దిశగా అఖిలపక్షం పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఎఎస్ఎస్) నేతలను చర్చలకు దేశ రాజధానికి ఆహ్వానించాలని తీర్మానించింది.
Source: జాతీయ | 12 Aug 2008 | 9:33 am

'చిరు' సభకు సిద్ధమవుతున్న నందికుంట మైదానం

సినీనటుడు చిరంజీవి స్థాపించనున్న రాజకీయ పార్టీ తొలి బహిరంగ సభ ప్రముఖ పుణ్యస్థలం తిరుపతిలో జరుగనుంది. ఇందుకోసం నందికుంట మైదానం ముస్తాబవుతోంది. సభ నిర్వాహణ ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తిరుపతి సమీపంలోని...
Source: ఏపీ న్యూస్ | 12 Aug 2008 | 8:51 am

విశాఖ కోర్టుకు హాజరైన పవన్ కళ్యాణ్

సినీనటుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని కుటుంబ వ్యవహారాల కోర్టుకు మంగళవారం హాజరయ్యారు. బహు భార్యత్వం కేసులో తొలి భార్య నందినితో రాజీ కుదుర్చుకునేందుకు గాను ఆయన కోర్టుకు వచ్చినట్టు సమాచారం. రాజీలో...
Source: ఏపీ న్యూస్ | 12 Aug 2008 | 8:48 am

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూసొరేన్

జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శిబూసొరేన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానం సమ్మతించింది. ఈ విషయాన్ని సొరేన్ స్వయంగా మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న మధు కోడాను సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించనున్నట్టు ఆయన తెలిపారు.
Source: జాతీయ | 12 Aug 2008 | 8:42 am

ఆగస్ట్ 14న సిద్దు ఫ్రమ్ సికాకుళం

అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్దు ఫ్రమ్ సికాకుళం చిత్రం ఈ నెల 14న విడుదల కానుందని చిత్ర నిర్మాత మల్లా విజయప్రసాద్ తెలిపారు. వినోదంతో పాటు చక్కని సెంటిమెంట్‌ను కూడా ఇందులో చూపించినట్టు చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Aug 2008 | 6:21 am

ఆరోగ్యశ్రీ కాదు... అది అనారోగ్యశ్రీ: రాఘవులు

అనారోగ్యంతో ఉన్న రోగి ఏడాది కాలం పాటు బతుకుతాడని భావించి, ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయించుకుంటే ఆరు నెలలకే మృత్యువాత పడటం ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బివి.రాఘవులు జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న...
Source: ఏపీ న్యూస్ | 12 Aug 2008 | 6:17 am

రాష్ట్రంలో వరద మృతుల సంఖ్య 61

రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన భారీ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 61కు చేరుకుంది. గుంటూరు జిల్లా మద్దూరు వాగులో లారీ కొట్టుకుని పోయిన సంఘటనల్లో గల్లంతైన 30 మంది ప్రయాణికుల్లో సోమవారం మరో మూడు మృతదేహాలు వెలికి తీశారు.
Source: ఏపీ న్యూస్ | 12 Aug 2008 | 5:42 am

అమర్‌నాథ్ వ్యవహారం: నేడు అఖిలపక్ష భేటీ

అమర్‌నాథ్‌ ఆలయ భూముల కేటాయింపు వ్యవహారంపై నెలకొన్న సంక్షోభాన్ని అఖిలపక్షం చేపట్టిన తొలిదశ చర్యలు విఫలమయ్యాయి. దీంతో రెండో దఫాగా మంగళవారం మరోమారు సమావేశం కానున్నాయి. సమస్య పరిష్కారానికి అఖిలపక్ష నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో సమస్య పరిష్కారం జఠిలంగా మారింది.
Source: జాతీయ | 12 Aug 2008 | 4:57 am

సెప్టెంబర్‌లో నా అనేవాడు

ప్రేమ, నిస్వార్థమైన స్నేహానికి ప్రతీకగా ఉండే కథాంశంతో నా అనేవాడు (ఒక్కరుంటే చాలు ట్యాగ్‌లైన్‌తో) అనే చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం రీరికార్డింగ్ దశలో ఉన్న ఈ చిత్రం డి.టి.ఎస్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Aug 2008 | 4:04 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 12 Aug 2008 | 3:19 am

చిరంజీవికి రాజకీయాలపై అవగాహన లేదు: పీసీసీ

సినీనటుడు చిరంజీవి పెట్టబోయే పార్టీపై మొదటగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) గళం విప్పింది. రాజకీయాలపై చిరంజీవికి సరైన అవగాహన లేదని పిసిసి అధికార ప్రతినిధి బి. కమలాకర్‌రావుతో కలిసి పాలడుగు వెంకటరావు ...
Source: ఏపీ న్యూస్ | 11 Aug 2008 | 2:57 pm

ఆగస్టు 17న పార్టీ ప్రకటన- 26న బహిరంగ సభ

"చిరు" రాజకీయ రైలు కోసం ఎదురు చూస్తున్న వారి ఆనందానికి అంతులేదు. నేరుగా చిరంజీవే మీడియా తెరపై కనిపించడంతో ఆ రైలు ప్రయాణికుల ప్లాట్ ఫామ్‌పై ఎదురు చూస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Aug 2008 | 1:41 pm

'మెగా' పార్టీ కార్యాలయం ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 46లో ఆధునికత ఉట్టిపడేలా, కార్పొరేట్ తరహాలో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ప్రారంభోత్సవం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 11 Aug 2008 | 1:22 pm

నాగబాబుతో "సాధు" ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబుతో మరో నిర్మాత కొత్త సినిమాను తీస్తున్నారు. కెమెరామేన్ అంజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు "సాధు" అనే పేరు ఖరారైంది. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పలు చిత్రాలకు పనిచేసిన ఎల్.వి.రాజు ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
Source: వినోదం | 11 Aug 2008 | 12:57 pm

"మంజీర" షూటింగ్ పూర్తి!

గౌతమ్ హీరోగా శ్రీదేవి హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "మంజీర". ప్రస్తుతం ఈ చిత్రషూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి చిత్ర హీరో మాట్లాడుతూ... కథ, కథను దర్శకుడు సాయిభాను చక్కగా తెరకెక్కించారని, ఈ చిత్రంలో రఘువరన్ పాత్ర కీలకంగా ఉంటుందని...
Source: వినోదం | 11 Aug 2008 | 12:48 pm

వరద ఉధృతి : లక్ష ఎకరాల్లో పంటనష్టం

వారంరోజులుగా కుండపోతగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా గుంటూరు జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల పంట నీటమునిగింది. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని...
Source: ఏపీ న్యూస్ | 11 Aug 2008 | 12:11 pm

ఆగస్టు 17న కాంగ్రెస్‌కు గుడ్‌బై : జోగయ్య

ఆగస్టు 17న కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు నర్సాపురం ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు. సినీనటుడు చిరంజీవి పెట్టబోయే పార్టీకి సంబంధించి కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన...
Source: ఏపీ న్యూస్ | 11 Aug 2008 | 12:08 pm

లాభపడ్డ బ్యాంకుల షేర్లు: సెన్సెక్స్ 336 పాయింట్లు వృద్ధి

ముంబయి స్టాక్ మార్కెట్‌లో సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 336.1 పాయింట్ల మేర భారీగా వృద్ధి చెంది 15,503.92 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 91 పాయింట్లు లాభపడి 4,620 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ ట్రేడింగ్‌లో బ్యాంకులు, రియాల్టీ...
Source: Yahoo! Telugu: News | 11 Aug 2008 | 12:00 pm

మూడో టెస్ట్‌లో భారత్ పరాజయం: సిరీస్‌ లంక కైవసం

కొలంబోలో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టునే విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియాపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన శ్రీలంక మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. శ్రీలంక స్పిన్
Source: Yahoo! Telugu: News | 11 Aug 2008 | 11:54 am

జమ్ము- కాశ్మీర్‌లో మళ్లీ హింసాకాండ: ఇద్దరు మృతి

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో నానాటికి అశాంతి పెరుగుతూనే ఉంది. అమర్‌నాథ్ భూవివాదంపై శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి చేస్తున్న ఆందోళనతో గత కొన్నిరోజులుగా జమ్ము ప్రాంతం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కాశ్మీర్
Source: Yahoo! Telugu: News | 11 Aug 2008 | 11:43 am

ఓటుకు నోటు వివాదం: ఎస్పీ ఎంపీకి సమన్లు

పార్లమెంటరీ కమిటీ సోమవారం ఓటుకు నోటు వివాదంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రెటీ రామన్ సింగ్‌కు, మరో ముగ్గురికి సమన్లు జారీ చేయాలని నిర్ణయించింది. లోక్‌సభలో గత నెల 22న జరిగిన విశ్వాసపరీక్ష సందర్భంగా వెలుగుచూసిన ఓటుకు
Source: Yahoo! Telugu: News | 11 Aug 2008 | 11:24 am

హైదరాబాద్‌కు బస్సుల రాకపోకల పునరుద్ధరణ

కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద మునేరు నది వరద తగ్గుముఖం పట్టడంతో విజయవాడ-హైదరాబాద్ మధ్య బస్సుల రాకపోకలను పునరుద్ధరించారు. మునేరు నది వరద కారణంగా జాతీయ రహదారిని ముంచెత్తింది. దీంతో ఆదివారం నుంచి వాహనాల...
Source: Yahoo! Telugu: News | 11 Aug 2008 | 11:15 am