పార్లమెంట్‌లో అమర్త్య సేన్ ప్రసంగం

నోబెల్ బహుమతి గ్రహీత, భారత రత్న ప్రొఫెసర్ అర్త్యసేన్‌కు అరుదైన అవకాశం లభించనుంది. ఆయన సోమవారం పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రొఫెసర్ హీరేన్ ముఖర్జీ పార్లమెంటరీ ప్రారంభోసన్యాసం చేయనున్నారు. సమాజ న్యాయంపై ఈ ఆర్థికవేత్తకు గల అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
Source: జాతీయ | 10 Aug 2008 | 8:50 am

చర్చల ద్వారాలు తెరిచే ఉంచాం: సమితి

శ్రీ అమర్‌నాథ్ ఆలయ భూముల కేటాయింపు, రద్దు వ్యవహారంపై చర్చలు జరిపేందుకు తమ వైపు ద్వారాలు తెరిచే ఉంచామని శ్రీ అమర్‌నాథ్ సంఘర్షక్ సమితి (ఎస్ఎఎస్ఎస్) ప్రకటించింది.
Source: జాతీయ | 10 Aug 2008 | 8:07 am

అక్టోబరులో చెన్నయ్ మెట్రోరైల్ పనులు ప్రారంభం

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో నిర్మించతలపెట్టిన మెట్రోరైల్ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. వచ్చే అక్టోబరులో ఈ పనులు ప్రారంభించేందుకు జపనీస్ ప్రభుత్వం సమ్మతించింది.
Source: జాతీయ | 10 Aug 2008 | 7:49 am

కడపలో యురేనియం శుద్ధి కేంద్రం ప్రారంభం

కడప జిల్లా తుమ్మలపల్లిలో యురేనియం శుద్ధి కేంద్రాన్ని భారత అణు శక్తి సంస్థ అనిల్ కగోద్కర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జిల్లాలో యురేనియం నిల్వలు పుష్కలంగా ఉన్నట్టు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 10 Aug 2008 | 7:32 am

తస్లీమా వీసాపై నిర్ణయం తీసుకోలేదు: ప్రణబ్

బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్‌ వీసా గడువు పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. గత శుక్రవారం భారత్‌కు చేరుకున్న తస్లీమ నస్రీన్ వీసా గడువు ఈనెల 12వ తేదీతో ముగియనుంది.
Source: జాతీయ | 10 Aug 2008 | 7:04 am

వాయు'గండం'గా మారిన అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావం కారణంగా రాష్ట్రానికి భారీ వర్ష ప్రమాదం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాగా, అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు మృతి చెందిన వారి సంఖ్య 51కు చేరుకుంది. రాష్ట్రంలోని వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 10 Aug 2008 | 6:07 am

ఆగస్టు 10, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30
Source: Yahoo! Telugu: Entertainment | 10 Aug 2008 | 5:15 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 10 Aug 2008 | 5:09 am

వరంగల్‌లో వర్ష భీభత్సం : సహాయక చర్యలు ప్రారంభం

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లా మొత్తం మీద పరిస్థితి తీవ్రంగా మారింది. జిల్లాల్లోని దాదాపు 12 మండల్లాలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 9 Aug 2008 | 2:51 pm

భారీ వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలం

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అల్పపీడనంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్ర రాజధాని భాగ్యనగరం అతలాకుతలమైంది. నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు...
Source: ఏపీ న్యూస్ | 9 Aug 2008 | 1:34 pm

రవాణామంత్రితో చర్చలు సఫలం : ఎన్ఎంయూ

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) శనివారం రవాణా శాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణతో జరిపిన చర్చలు...
Source: ఏపీ న్యూస్ | 9 Aug 2008 | 1:32 pm

హుస్సేన్ సాగర్‌లో పెరుగుతున్న నీటిమట్టం

జంట నగరాల నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని వరద నీరు భారీ ఎత్తున హుస్సేన్ సాగర్‌లోకి చేరుకుంటోంది. తద్వారా హుస్సేన్ సాగర్‌కు సమీపంలోని పల్లపు ప్రాంత ప్రజలను రక్షిత ప్రాంతాలకు...
Source: Yahoo! Telugu: News | 9 Aug 2008 | 1:32 pm

కృష్ణా జిల్లాలో భారీ వర్షాలవల్ల వరి పంట మునక

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా జిల్లాలో చాలాచోట్ల వరి పంట మునిగిపోయింది. ముఖ్యంగా మచిలీపట్నం, గుడివాడ డివిజన్ పరిధిలో వరి పంటకు భారీ నష్టం సంభవించింది. ఈ డివిజన్ల పరిధిలోని మచిలీపట్నం...
Source: Yahoo! Telugu: News | 9 Aug 2008 | 1:31 pm

జమ్ము శాంతి చర్చలకు సంఘర్ష్ సమితి సుముఖత

శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి శనివారం అఖిలపక్ష నేతల బృందంతో చర్చలు జరిపేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఇంతకుముందు వరకు అఖిలపక్ష నేతల బృందంలో నేషనల్ కాన్ఫెరెన్స్ (ఎన్సీ) నేత ఫరూఖ్ అబ్దుల్లా, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ
Source: Yahoo! Telugu: News | 9 Aug 2008 | 1:13 pm

ఆర్టీసీతో మంత్రి కన్నా చర్చలు సఫలం

ఆర్టీసీ కార్మికుల సమస్యలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆర్టీసీలో పనిచేస్తున్న 3,700 మంది కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్దీకరణ ప్రక్రియ చేపట్టడానికి మంత్రి కన్నా అంగీకరించారని...
Source: Yahoo! Telugu: News | 9 Aug 2008 | 1:06 pm

వెంకటేష్‌చే అష్టాచమ్మా ఆడియో ఆవిష్కరణ

విక్టరీ వెంకటేష్ చేతులమీదగా శుక్రవారం రాత్రి "అష్టా చమ్మా" ఆడియో ఆవిష్కరింబడింది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ సినిమాల్లోకి వస్తున్న యువతరానికి అంతా మంచి జరగాలని, వారంతా బిజీ కావాలని ఆకాంక్షించారు. "అష్టా
Source: Yahoo! Telugu: Entertainment | 9 Aug 2008 | 12:57 pm

విజయవాడ వద్ద వరద పోటెత్తుతున్న కృష్ణా నది

విజయవాడ వద్ద కృష్ణా నది వరద పోటెత్తుతుంది. దీనితో ప్రకాశం బ్యారేజ్‌కున్న 70 క్రస్ట్ గేట్లను ఎత్తివేసి దిగువకు భారీగా వరద నీరును వదులుతున్నారు. బ్యారేజ్ నుంచి 61,740 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని అధికారులు అంటున్నారు. కృష్ణా నదికి
Source: Yahoo! Telugu: News | 9 Aug 2008 | 12:46 pm

ఒలింపిక్ జూడో స్వర్ణాలు దుమిత్రూ, చోయ్ కైవసం

బీజింగ్ ఒలింపిక్స్‌లో రుమేనియా క్రీడాకారిణి అలినీ దుమిత్రూ మహిళల 48 కిలోల జూడోలో బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. యానెట్ బెర్మోయ్ (క్యూబా), ప్రపంచ ఛాంపియన్ ర్యోకో తానీ (జపాన్)లను కంగుతినిపించి దుమిత్రూ స్వర్ణ పతకాన్ని
Source: Yahoo! Telugu: News | 9 Aug 2008 | 12:46 pm

భారీ వర్షాలు : రాకపోకలకు అంతరాయం

కృష్ణాజిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు వాగులు పొంగి పొరలుతున్నాయి. మరోవైపు గన్నవరం మండలం గొల్లగూడెం వద్ద నిర్మాణం పూర్తిగాని కాల్వకట్ట తెగిపోవడంతో విజయవాడ నుంచి భద్రాచలం జాతీయ రహదారిపై...
Source: ఏపీ న్యూస్ | 9 Aug 2008 | 12:42 pm

భారీ వర్షాలతో హైదారాబాద్ అతలాకుతలం

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలవల్ల హైదరాబాద్ అతలాకుతలం అయింది. నగరంలోని అనేక పల్లపు ప్రాంతాలు ముంపు బారినపడ్డాయి. భారీ వర్షాలవల్ల హైదరాబాద్ నగరంలో 11 మంది మృత్యువాత పడ్డారు. మృతుల...
Source: Yahoo! Telugu: News | 9 Aug 2008 | 12:40 pm

అఖిలపక్షంతో చర్చలకు సమితి గ్రీన్‌సిగ్నల్!

అమర్‌నాథ్ భూ కేటాయింపు వ్యవహారంపై అఖిలపక్షంతో చర్చలు జరిపేందుకు శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఏఎస్ఎస్) పచ్చజెండా ఊపిందింది.
Source: జాతీయ | 9 Aug 2008 | 12:35 pm

వర్షాలపై సీఎం సమీక్ష

రాష్ట్రంలో కుంభవృష్టిగా కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమీక్ష జరిపారు. హైదరాబాద్ సచివాలయంలో శనివారం ఉదయం సీఎం ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం....
Source: ఏపీ న్యూస్ | 9 Aug 2008 | 12:35 pm

కర్ఫ్యూ ఉల్లంఘన: జమ్ములో 50 మంది అరెస్ట్

జమ్ము ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల్లో కర్ఫ్యూ ఆదేశాలను ధిక్కరించినందుకు పోలీసులు శనివారం 50 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే జమ్ము ప్రాంతంలోని అనేక జిల్లాల్లో ఆర్మీ ప్లాగ్ మార్చ్‌లు నిర్వహించింది. అమర్‌నాథ్
Source: Yahoo! Telugu: News | 9 Aug 2008 | 12:12 pm

జమ్మూలో 50మంది ఆందోళన కారుల అరెస్టు

అమర్‌నాథ్ వ్యవహారంపై అవతారమెత్తిన ఆందోళనలను అదుపులోకి తీసుకునే దిశగా జమ్మూలో కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ కర్ఫ్యూను ఉల్లంఘించి ఆందోళన బాట పట్టిన 50 మంది ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు.
Source: జాతీయ | 9 Aug 2008 | 12:11 pm

బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో చెక్‌రిపబ్లిక్‌కు తొలి స్వర్ణం

బీజింగ్‌లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన ఒలింపిక్ క్రీడల్లో తొలి స్వర్ణ పతకాన్ని చెక్‌రిపబ్లిక్ దేశం కైవసం చేసుకుంది. ఎమ్మొన్స్ కతెరినా రికార్డు స్థాయి ప్రదర్శనతో షూటింగ్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల పది మీటర్ల
Source: Yahoo! Telugu: News | 9 Aug 2008 | 12:02 pm

మహబూబాబాద్ సమీపంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

వరంగల్ జిల్లా మహబూబాబాద్ సమీపంలో మద్దివంక వద్ద రైల్వే ట్రాక్‌పై వరద నీరు ప్రవహిస్తుండటంతో విజయవాడ-వరంగల్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో మద్దివంక ఉంది. వరంగల్ జిల్లాలో....
Source: Yahoo! Telugu: News | 9 Aug 2008 | 11:49 am

భారీ వర్షాలు : రైళ్ల రాకపోకలకు అంతరాయం

వరంగల్ జిల్లా మహబూబాబాద్ సమీపంలో మద్దివంక వద్ద రైల్వే ట్రాక్‌పై వరద నీరు ప్రవహిస్తుండటంతో విజయవాడ-వరంగల్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో మద్దివంక ...
Source: ఏపీ న్యూస్ | 9 Aug 2008 | 11:39 am