మళ్లీ భారత్‌ను ఆశ్రయించిన తస్లీమా నస్రీన్!

వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తిరిగి భారత్‌ను ఆశ్రయించారు. గత నవంబరులో దేశాన్ని వీడి స్వీడన్ వెళ్లిన తస్లీమా శుక్రవారం కోల్‌కతా చేరుకున్నారు, విమానం నుంచి దిగీదిగగానే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. భారత్‌ ఆశ్రయంలోనే ఉండేందుకు తస్లీమాకు ఈ నెల ఆగస్టు 12వ తేదీ వరకే వీసా అనుమతి ఉంది.
Source: జాతీయ | 8 Aug 2008 | 12:45 pm

కాంగ్రెస్‌కు సరిజోడి బీజేపీయే : వెంకయ్య

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకి భారతీయ జనతా పార్టీయేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. శుక్రవారం గుంటూరులో ఆయన మీడియా ప్రతినిధులతో ...
Source: ఏపీ న్యూస్ | 8 Aug 2008 | 12:31 pm

సిలిగురిలో బాంబు పేలుడు : బాంబులు నిర్వీర్యం

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయి గురి సమీపంలో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను రైల్వే ఆస్పత్రికి తరలించారు.
Source: జాతీయ | 8 Aug 2008 | 12:16 pm

పూంచ్‌లో కర్ఫ్యూ : రంగంలోకి సైనికులు

పూంచ్ పట్టణంలో శుక్రవారం ఉదయం హిందూ-ముస్లింల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకోవడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు కర్ఫ్యూ విధించారు. కాశ్మీర్‌ లోయలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుండటంతో సైనికులు రంగంలోకి దిగారు.
Source: జాతీయ | 8 Aug 2008 | 11:59 am

సీపీఎంలో చేరే ప్రసక్తే లేదు : స్పీకర్

సీపీఎం నుంచి బహిష్కరించబడిన లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ తిరిగి ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీపీఎం పార్టీలో తిరిగి చేరేందుకు తానెలాంటి ప్రయత్నాలు చేయడం లేదని, పదవీ కాలం ముగిసిన తర్వాత రాజకీయాలకు స్వస్తి చెబుతానని ఛటర్జీ వెల్లడించారు.
Source: జాతీయ | 8 Aug 2008 | 11:45 am

మరో పదిలక్షల ఇళ్లకు విద్యుత్ : వైఎస్సార్

వచ్చే ఏడాది మార్చినాటికంతా రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుద్ధీకరణ పథకం కింద మరో పదిలక్షల మంది ఇళ్లకు కొత్తగా విద్యుత్ అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ పథకం కింద ఇప్పటికే 16 లక్షల...
Source: ఏపీ న్యూస్ | 8 Aug 2008 | 11:42 am

విద్యుత్ కొరతను తీరుస్తాం : షబ్బీర్ అలీ

వచ్చే నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కొరతను తగిస్తామని విద్యుత్ శాఖమంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొగ్గు, విద్యుత్ కొరతలపై సంబంధిత ఉన్నత అధికారులతో ...
Source: ఏపీ న్యూస్ | 8 Aug 2008 | 11:39 am

భారీ వర్షాలతో 40వేల ఎకరాల పంట నష్టం

నైరుతి రుతుపవనాలతో ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రంపై ఈ సారి ధీటుగానే ప్రభావం చూపుతోంది. పలు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో చెరువులు, నదులు పొంగి...
Source: ఏపీ న్యూస్ | 8 Aug 2008 | 11:35 am

చేనేత కార్మికులను ఆదుకుంటాం : వైఎస్సార్

చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. ఆప్కో ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఛైర్మన్ మండలి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో...
Source: ఏపీ న్యూస్ | 8 Aug 2008 | 11:33 am

దేశ రాజధానిలో భారీ వర్షం: ట్రాఫిక్ జామ్

దేశ రాజధాని న్యూఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు చలి ఎక్కువైంది. ఐటీవో క్రాసింగ్స్, నిజాముద్దీన్ క్రాసింగ్స్, గాజీపూర్, అజాద్‌పూర్, లాజ్‌పేట్ నాగర్ తదితర ప్రాంతాల్లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Source: జాతీయ | 8 Aug 2008 | 10:03 am

"సెల్యూట్" పబ్లిసిటీకీ 2.5 కోట్లు!

విశాల్ లేటెస్ట్ తెలుగు సినిమా "సెల్యూట్" పబ్లిసిటీ కోసం దాదాపు 2.5 కోట్లు వెచ్చిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్‌ ఎక్కడైనా ఖాళీ దొరికితే అక్కడ వినాయిల్‌ను ఏర్పాటు చేయడం, దూర ప్రాంతాల్లోనూ కటౌట్ పెట్టడం చేస్తున్నారు. మొదటి డబ్బింగ్ చిత్రం నుంచి పబ్లిసిటీపై శ్రద్ధపెట్టిన...
Source: వినోదం | 8 Aug 2008 | 9:57 am

ప్రధాని ఆర్థిక మండలికి రంగరాజన్ గుడ్‌బై!

రాష్ట్రంలో కొనసాగుతున్న రాజీనామాల పరంపర ప్రస్తుతం కేంద్రం వరకూ పాకింది. ఇందులో భాగంగా శుక్రవారం ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ) ఛైర్మన్ పదవికి సి. రంగరాజన్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు.
Source: జాతీయ | 8 Aug 2008 | 7:33 am

దేశవ్యాప్తంగా 300 పాలిటెక్నిక్ కళాశాలలు!

పదకొండో పంచవర్ష ప్రణాళిక కాలంలో దేశ వ్యాప్తంగా 300 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పురంధరేశ్వరి పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ-ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో మరో 300 పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయని ఆమె చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 8 Aug 2008 | 6:49 am

తెలంగాణవాదులతో పొత్తుకు సిద్ధమే: తెరాస

ప్రత్యేక తెలంగాణ కోసం కృషి చేసే వారితో పొత్తు పెట్టుకోవడానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్ నేతలైన నాయని నర్సింహరెడ్డి, మధుసూధనాచారి, సురేంద్రరెడ్డి, గోవిందనాయక్, సాంబశివరాజులు తెలంగణ భవన్‌లో విలేకరులతో భేటీ అయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 8 Aug 2008 | 6:20 am

ఆగస్ట్ 08, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 8 Aug 2008 | 5:33 am

22న తిరుపతిలో 'మెగా' ప్రభంజనం

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశానికి ప్రఖ్యాత పుణ్యస్థలం తిరుపతి వేదిక కానుంది. ఈనెల 22వ తేదీన తిరుపతిలో జరిగే భారీ బహిరంగ సభతో ఆయన రాజకీయ అరంగేట్రం ఖరారు కానుంది. ఈ సభలో పార్టీ ప్రకటనతో పాటు తిరుపతి నుంచే రోడ్‌‌ షోను ప్రారంభిస్తారు.
Source: ఏపీ న్యూస్ | 8 Aug 2008 | 4:36 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 8 Aug 2008 | 3:45 am

1942 ఆగస్టు 8... క్విట్ ఇండియా తీర్మానం

8 అంకె చైనాకు అదృష్ట సంఖ్య కావడం చేతనే బీజింగ్ ఒలింపిక్స్ ప్రత్యేకించి ఈ తేదీన ప్రారంభిస్తున్నారు. వారి సంగతి ఏమోగానీ... 8 అంకెతో ముడిపడి మన దేశంలోనూ మంచి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Source: జాతీయ | 7 Aug 2008 | 3:35 pm

ఆదిశంకరాచార్యుని పాత్రలో ఉదయ్‌కిరణ్

ఆదిశంకరాచార్యుని పాత్రతో ఒక చిత్రాన్ని నిర్మించడానికి ప్రముఖ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ పాత్రకు సరిపోయే నటుని కోసం చేపట్టిన అన్వేషణ ఉదయ్‌కిరణ్‌తో ఆగినట్టు తెలిసింది. ఉదయ్‌కిరణ్ అయితే ఈ పాత్రకు బాగా సరిపోతాడని
Source: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2008 | 2:02 pm

పోస్ట్‌ప్రొడక్షన్‌లో శివబాలాజీ, ముమైత్ టార్గెట్

శివబాలాజీ, ముమైత్ ఖాన్ జంటగా నటిస్తున్న టార్గెట్ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంగిశెట్టి దశరథ్ ఈ సినిమా నిర్మాత. సినిమా ఆడియోను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2008 | 1:46 pm

సిక్స్‌ప్యాక్‌పై హీరోయిన్స్ దృష్టి: నయనతారతో ప్రారంభం

సిక్స్‌ప్యాక్ అనేది ఇటీవల కాలంలో సినిమా రంగంలో బాగా వినిపిస్తున్న పదం. హీరోలు కొవ్వు కరిగించుకొనేందుకు పెట్టిన పేరే ఈ సిక్స్‌ప్యాక్ అని కొందరు ఇప్పటికే వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. తాజాగా సిక్స్‌ప్యాక్ బాడీపై హీరోయిన్స్ కూడా దృష్టిపెట్టారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2008 | 1:44 pm

సెల్యూట్ సినిమా పబ్లిసిటీకే రూ.2.5 కోట్ల ఖర్చు

విశాల్, నయనతార జంటగా నటించిన సెల్యూట్ సినిమా పబ్లిసిటీకే రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వినాయిల్ ఏర్పాటు చేయడంతోపాటు, దూరప్రాంతాల్లోనూ ఈ సినిమా కటౌట్‌లు పెడుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2008 | 1:41 pm

బియ్యంధరల నియంత్రణపై సీఎం సమీక్ష

నింగినంటిన బియ్యం ధరలను అదుపుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గురువారం సంబంధిత ఉన్నతాధికారులు, మంత్రులతో సమావేశమయ్యారు. సమావేశ...
Source: ఏపీ న్యూస్ | 7 Aug 2008 | 1:33 pm

సోషియోఫాంటసీ కథాంశంతో నాగమయ్య

సోషియోఫాంటసీ కథాంశంతో రూపొందే "నాగమయ్య" చిత్ర షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. అంకం రమేష్ స్వీయదర్శకత్వంలో ప్రియ ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. గుంటూరులో సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని
Source: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2008 | 1:33 pm

రజకులను ఆదుకుంటాం : వైఎస్సార్

రజకులకు అవసరమైన సహాయ చర్యలను చేపడుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. తమ సమస్యలను పరిష్కరించాలని వివిధ జిల్లాలకు చెందిన రజకులు గురువారం సీఎంను హైదరాబాద్‌ క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు....
Source: ఏపీ న్యూస్ | 7 Aug 2008 | 1:30 pm

స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 44 పాయింట్లు వృద్ధి

ముంబయి స్టాక్ మార్కెట్‌లో గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 43.71 పాయింట్లమేర లాభపడి 15,117.25 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ కేవలం 6 పాయింట్లు మాత్రమే వృద్ధి చెంది 4,524 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్‌లో ట్రేడింగ్ జరుగుతున్న...
Source: Yahoo! Telugu: News | 7 Aug 2008 | 1:27 pm

మిస్టర్ గిరీశం రెండో షెడ్యూల్ పూర్తి

కృష్ణభగవాన్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న మిస్టర్ గిరీశం చిత్రం రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కానున్నాయని చిత్ర నిర్మాత రమేష్ చంద్ర బెనర్జీబాబు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2008 | 12:50 pm

రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటోన్న నేనింతే

రవితేజ హీరోగా యూనివర్సల్ మీడియా అధినేత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న "నేనింతే" చిత్రం రెగ్యూలర్ షూటింగ్ గత నెల 21న ప్రారంభం అయింది. ఈ సినిమాకు పూరీజగన్నాథ్ దర్శకుడు. ఇప్పటివరకు కొన్ని యాక్షన్ దృశ్యాలు, టాకీ
Source: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2008 | 12:49 pm

త్వరలో షూటింగ్ పూర్తిచేసుకోనున్న జైభద్రకాళి

సాయికుమార్ హీరోగా ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన "జైభద్రకాళి" చిత్రం ఎట్టకేలకు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకోబోతుంది. కోడిరామకృష్ణ ఈ సినిమా దర్శకుడు. బి.వి.శ్రీనివాస్ నిర్మాత. రమ్యకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Aug 2008 | 12:48 pm

అమర్‌నాథ్ వ్యవహారం : భాజపా ఆందోళనలు

జరుపనున్నారు.
Source: జాతీయ | 7 Aug 2008 | 12:44 pm

అమర్‌నాథ్ వ్యవహారం: కమిటీ ఏర్పాటు

అమర్‌నాథ్ ఆలయ భూకేటాయింపు రద్దు వ్యవహారాన్ని పరిష్కరించేందుకుగాను నలుగురితో కూడిన కొత్త బృందాన్ని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రా నియమించారు. అమర్‌నాథ్ ఆలయ భూముల కేటాయింపు రద్దు వ్యవహారం జమ్మూకాశ్మీర్‌ అధికార యంత్రాంగానికి నిద్దుర లేకుండా చేస్తోంది.
Source: జాతీయ | 7 Aug 2008 | 12:41 pm

"అణువు"పై విస్తృత ప్రచారం : రాహుల్

భారత్-అమెరికాల మధ్య కుదుర్చుకున్న అణుఒప్పందంతో దేశానికి కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పిలుపు నిచ్చారు. పేదరిక నిర్మూలనకు, మౌలిక వసతుల కల్పనకు, ఆర్థికవృద్ధికి ఒప్పందం దోహద పడుతుందని రాహుల్ వెల్లడించారు.
Source: జాతీయ | 7 Aug 2008 | 12:25 pm

ఒలింపిక్ స్వర్ణ పతకంపై రోజర్ ఫెదరర్ దృష్టి

చైనా ఆతిథ్యమిస్తున్న బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకునే దానిపై ప్రపంచ నెంబర్‌వన్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ దృష్టి సారించాడు. రోజర్ ఫెదరర్ 27వ జన్మ దినోత్సవాన్ని బుధవారం జరుపుకున్నారు. ఒలింపిక్ క్రీడల్లో ఆడటం నిజంగా ప్రతి...
Source: Yahoo! Telugu: News | 7 Aug 2008 | 12:10 pm

ముషారఫ్ అవసరం లేదు : అమెరికాతో గిలానీ

ప్రథమ పౌరుడు పర్వేజ్ ముషారఫ్ సేవలు దేశానికి అవసరం లేదని అమెరికాతో పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ చెప్పారు. దేశ అవసరాలను పణంగా పెట్టినందువల్ల ఆయనంటే ప్రజల్లో వ్యతిరేక భావన వ్యక్తమవుతుందని తెలిపారు. అమెరికా పర్యటనకు...
Source: Yahoo! Telugu: News | 7 Aug 2008 | 11:50 am

శ్రీనగర్‌కు ఆర్ఎస్ఎస్ ముస్లిం నేతల బృందం

అమర్‌నాథ్ వ్యవహారాన్ని చక్కబెట్టటానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఒక ముస్లిం నేతల బృందాన్ని శ్రీనగర్‌కు పంపించింది. నిరసనకారుల ఆందోళనతో అట్టుడుకుతున్న జమ్మూ, శ్రీనగర్‌‌లోని వివిధ ప్రాంతాల్లో వీరు పర్యటించి శాంతి ప్రచారం...
Source: Yahoo! Telugu: News | 7 Aug 2008 | 11:47 am

చేనేత పరిశ్రమకు ప్రభుత్వం చేయూతనిస్తుంది: వైఎస్

చేనేత పరిశ్రమకు చేయూతనిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురువారం హామీ ఇచ్చారు. ఈ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. చేనేత పరిశ్రమకు గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు
Source: Yahoo! Telugu: News | 7 Aug 2008 | 11:29 am

గ్రామీణ విద్యుదీకరణ పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష

రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ పథకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం వివరాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి షబ్బీర్ అలీ విలేకరులకు వెల్లడించారు. రాజీవ్ గాంధీ గ్రామీణ
Source: Yahoo! Telugu: News | 7 Aug 2008 | 11:24 am