భారీ వర్షాలతో ఏడుగురు బలి

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల్లో ఏడుగురు మరణించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి వరదలు ముంచెత్తున్నాయి. ఈ వరదల్లో ఇప్పటికే ఏడుగురిని పొట్టనపెట్టుకున్నాయని రెవెన్యూ శాఖ కార్యదర్శి రత్నప్రభ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2008 | 11:37 am

జమ్మూ ఘర్షణలు : కేంద్ర బృందం పరిశీలన

అమరనాథ్‌కు కేటాయింటిన భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకున్న నేపథ్యంలో జమ్మూలో చెలరేగిన ఘర్షణలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. దీంతో అక్కడి పరిస్థితి సమీక్షించేందుకు ఇద్దరు అధికారులతో కూడిన కేంద్ర బృందం శ్రీనగర్‌లో పర్యటిస్తోంది.
Source: జాతీయ | 5 Aug 2008 | 11:22 am

ఉత్తర ప్రదేశ్‌లో వెల్లువెత్తుతున్న వరదలు

ఉత్తర ప్రదేశ్‌లో ప్రధాన నదులు వరద పోటెత్తటంతో అనేక ప్రాంతాలు జలమయమై వేలాది సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. రాజధాని లక్నో పరిసర ప్రాంతాల్లో గోమతీ నది వరద ఉధృతికి అనేక గ్రామాలు జలమయయ్యాయి. దీంతో ఆయా గ్రామ ప్రజలను రక్షిత ప్రాంతాలకు తరలించారు.
Source: జాతీయ | 5 Aug 2008 | 11:21 am

అహ్మదాబాద్ పేలుళ్లు : నిందితుల కోసం గాలింపు

అహ్మదాబాద్‌లో గత నెల 26న జరిగిన వరుస పేలుళ్లకు సంబంధించిన సూత్రధారులను గుర్తించేందుకు అక్కడి క్రైం బ్రాంచ్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా గతంలో జైపూర్‌లో జరిగిన పేలుళ్లలకు సూత్రధారులుగా పేర్కొంటున్న ఏడుగురు ఊహా చిత్రాలను అహ్మదాబాద్...
Source: జాతీయ | 5 Aug 2008 | 11:21 am

'చిరు' అభిమానులకు నాన్‌బెయిల్ వారెంట్

ప్రముఖ సినీనటుడు రాజశేఖర్ కుటుంబంపై దాడికి పాల్పడిన చిరంజీవి అభిమానులకు మంగళవారం నాంపల్లికోర్టు నాన్‌బెయిల్ వారెంటును జారీ చేసింది. గతంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం చేసినా తాను ఆయన పెట్టబోయే పార్టీలో చేరబోయేది లేదని, చిరంజీవికి రాజకీయాలపై సరైన అవగాహన లేదని రాజశేఖర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2008 | 11:20 am

విడుదలకు సిద్ధమౌతోన్న ముమైత్ "టార్గెట్"

ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో, శివబాలాజీ, శ్రద్ధాదాస్ నటిస్తోన్న సినిమా "టార్గెట్". శ్రీసాయి సూర్య మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు సంగిశెట్టి దశరథ్ దర్శకత్వం వహించగా, రమేష్ రాజా నిర్మిస్తున్నారు. రీ-రికార్డింగ్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా ఆగస్టు నెలలో...
Source: వినోదం | 5 Aug 2008 | 10:25 am

ఆగస్టు 8న "బ్లాక్ అండ్ వైట్" ఆడియో

రాజీవ్ కనకాల, సింధుతులానీ జంటగా, శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "బ్లాక్ అండ్ వైట్". మారుతి ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు ఉదయ్ శంకర్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి...
Source: వినోదం | 5 Aug 2008 | 10:07 am

"పారితోషికం" ఎక్కువడిగితే తప్పేంటి?..!

"పారితోషికం" ఎక్కువడిగితే తప్పేంటని అందాల ముద్దుగుమ్మ ప్రియామణి అంటోంది. ప్రముఖ తమిళ దర్శకుడు అమీర్ దర్శకత్వంలో...
Source: వినోదం | 5 Aug 2008 | 9:43 am

విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బూచీ!

ఒకవైపు వరుస బాంబు పేలుళ్లు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే... మరోవైపు బాంబు బూచీ ఫోన్ కాల్స్ పోలీసులను హడలెత్తింప జేస్తున్నాయి. ఇందులో భాగంగానే భువనేశ్వర్-సికింద్రాబాద్ మార్గ మధ్యంలో నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు మంగళవారం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2008 | 8:57 am

మృత్యువుకు వెరవని భక్తి : నయనాదేవి ఆలయంలో రద్దీ

తొక్కిసలాట సందర్భంగా ఆదివారం 146 మంది మృతిచెందిన సంఘటన నయనాదేవిని దర్శించేందుకు వచ్చే భక్తులపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. మృత్యుఘోష అనంతరం సోమవారం నయనాదేవి ఆలయంలో సోమవారం మరోసారి భక్తుల రద్దీ ఎక్కువగా కన్పించింది.
Source: జాతీయ | 5 Aug 2008 | 8:53 am

"ఆరోగ్యశ్రీ" మెగా శిబిరం ప్రారంభం

రాజీవ్ ఆరోగ్యశ్రీ మెగా శిబిరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. విశాఖపట్నంలోని ఎయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ... తమ నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 1,20వేల మందికి సుమారు రూ. 425 కోట్లను సహాయంగా అందించామని తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2008 | 8:44 am

"చిరు" పార్టీతో ప్రయోజనం లేదు : విజయశాంతి

సినీనటుడు చిరంజీవి పెట్టబోయే పార్టితో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విజయశాంతి జోస్యం చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఆయన ఏనాడైనా గ్రామాల్లో తిరిగారా? అని ఆమె ప్రశ్నించారు. అనవసరంగా మీడియా ఆయన్ను ఉన్నత శిఖరాలకెత్తుతోందని విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2008 | 8:33 am

ఉగ్రవాదుల చొరబాటుకు ఐఎస్ఐ ప్రోత్సాహం

భారత్‌లో అల్లకల్లోలం రేపడానికి దాదాపు 800 మంది ఉగ్రవాదులు పూర్తిస్థాయిలో శిక్షణ పొంది దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఏకే మిత్రా చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 5 Aug 2008 | 7:58 am

అరుదుః హిందూ వివాహానికి ముస్లీంలే పెద్దలు

అది జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం.... అల్లర్లతో అట్టడుకిపోతోంది.... బంద్‌లు కాల్పులు... మత ఘర్షణలు చోటు చేసుకుంటున్న సమయమిది. అమర్‌నాథ్‌ భూ వివాదం నేపథ్యంలో ఓ వైపు రాష్ట్రంలో ఉద్రిక్త పర్థిసితులు నెలకొన్నాయి.
Source: Yahoo! Telugu: News | 5 Aug 2008 | 7:39 am

జమ్మూ ఘర్షణలు : అఖిల పక్షానికి ప్రధాని ఆహ్వానం

అమరనాథ్ వ్యవహారంలో చెలరేగిన ఘర్షణలు జమ్మూలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ విషయమై బుధవారం అఖిల పక్షం సమావేశం నిర్వహించడానికి నిర్ణయించారు. దీంతో పాటు జమ్మూలోని పరిస్థితిని
Source: జాతీయ | 5 Aug 2008 | 7:21 am

పిల్లల కోసం స్మోకింగ్ మానేస్తా : షారుక్

'పొగతాగనివాడు దున్నపోతై పుట్టు' అన్నాడు కన్యాశుల్కంలో గిరీశం. గురజాడ కలం నుంచి జాలువారిన ఈ మాటల్లో ఎంతటి మహత్తు ఉందో తెలియదు గానీ మనలో..
Source: వినోదం | 5 Aug 2008 | 7:09 am

ప్రజల జేబులు బరువెక్కించనున్న ప్రభుత్వ నిర్ణయం

దేశ ప్రజల జేబులు బరువెక్కించేందుకు ప్రభుత్వం తాజాగా సంకల్పించింది. జేబులు బరువెక్కించడమంటే ఎక్కువ డబ్బుని మీ జేబుల్లోకి చేర్చడం అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ప్రస్తుతం మీ జేబులో ఉన్న డబ్బుకే కాస్త రూపాన్ని మార్చి మీ జేబును బరువెక్కించేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
Source: జాతీయ | 5 Aug 2008 | 6:54 am

శృతి మించిన అల్లర్లుః జమ్ములో మరో ఇద్దరి మృతి

జమ్ము-కాశ్మీర్‌లో అల్లర్లు రోజురోజుకు శృతిమించిపోతున్నాయి. తాజాగా సోమవారం జరిగిన అల్లర్లలో మరో ఇద్దరు మృతి చెందారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా, రక్షణ శాఖ కార్యదర్శి విజయ్ సింగ్‌లు హుటాహుటిన జమ్ము-కాశ్మీర్‌కు పరుగులు పెట్టారు
Source: Yahoo! Telugu: News | 5 Aug 2008 | 6:37 am

తమిళ సిఎంకు అక్షింతలుః మీరు చట్టానికి అతీతులా?

తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, కేంద్ర మంత్రి టీఆర్‌ బాలుల వ్యవహారశైలిపై సోమవారం సుప్రీంకోర్టు మండిపడింది. వారిపై న్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోర్టు జారీచేసిన నోటీసుపై స్పందించకపోవడంతో వారు తీవ్రంగా పరిగణించారు.
Source: Yahoo! Telugu: News | 5 Aug 2008 | 6:22 am

'ఆరోగ్యశ్రీ' పై చర్చకు సిద్దం : దత్తాత్రేయ

ఆరోగ్యశ్రీ పథకంపై తాము చర్చించేందుకు సిద్దంగానే ఉన్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పార్టీకార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుపేదలకు...
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2008 | 5:42 am

త్వరలో మూడో ప్రత్యామ్నాయం: కారత్

దేశ రాజకీయలను అనుసరించి ప్రస్తుత పరిస్థితులలో మూడో ప్రత్యామ్నయం అవసరముందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అభిప్రాయపడ్డారు. త్వరలో ఇది రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఇందులో బీఎస్పీ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు.
Source: Yahoo! Telugu: News | 5 Aug 2008 | 5:29 am

అఫ్ఘన్‌కు సాయం ఆపబోం : ప్రధాని ఉద్ఘాటన

అప్ఘనిస్థాన్‌కు అందిస్తున్న సాయాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోదని ప్రధాని మన్మోహన్ స్పష్టం చేశారు. ఎవరు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా అప్ఘన్‌తో తాము సాగిస్తున్న స్నేహబంధాన్ని కొనసాగించే తీరుతామని ఆయన పేర్కొన్నారు.
Source: జాతీయ | 5 Aug 2008 | 5:23 am

విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం విశాఖపట్నం చేరుకున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు విశాఖ చేరుకున్న ఆయన ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో రాజీవ్ ఆరోగ్య శ్రీ మెగా ఆరోగ్య శిబిరం ప్రారంభం, విశాఖ బీచ్‌లో ప్రతిపాదిత రాజీవ్ స్మృతి భవనం వద్ద ఎగ్జిబిషన్‌ను సందర్శించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2008 | 5:07 am

బీసీలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు : ప్రభుత్వం

చట్ట సభల్లో బీసీలకు సరైన ప్రాతినిథ్యం లభించేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మాణించింది. ఇందుకోసం బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా అసెంబ్లీ తీర్మాణం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది.
Source: ఏపీ న్యూస్ | 5 Aug 2008 | 4:49 am

పీస్‌ మిషన్ రద్దుపై ప్రధానికి సమన్లు : పాల్

తను స్థాపించిన గ్లోబల్ పీస్ మిషన్‌ను రద్దు చేసినందుకు ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాలకు అమెరికా కోర్టు సమన్లు జారీ చేసిందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు పాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని కొలంబియా కోర్టు దాఖలు...
Source: జాతీయ | 5 Aug 2008 | 4:37 am

జమ్మూలో ఆందోళనకారుల వీరంగం : ముగ్గురి మృతి

జమ్మూలో చిచ్చు రేపిన అమర్‌నాథ్ వివాదం ఇప్పట్లో ముగిసే సూచనలు కన్పించడం లేదు. ఈ వివాదం ద్వారా జమ్మూలో చెలరేగుతున్న అల్లర్ల కారణంగా సోమవారం ముగ్గురు మృతి చెందగా మరో 59మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో 31మంది పోలీసులు కూడా ఉన్నారు.
Source: జాతీయ | 5 Aug 2008 | 4:21 am

మీ రోజు


Source: Yahoo! Telugu: News | 5 Aug 2008 | 3:20 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 5 Aug 2008 | 3:20 am

ఆగస్టు 05, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలి షాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 5 Aug 2008 | 3:20 am

ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు : ఆనం

ఎరువుల కొరత, రైతన్నల ఆందోళనలపై భాగ్యనగరంలో మంత్రివర్గ సమావేశం సోమవారం జరిగింది. అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఎరువులను నల్లబజారుకు తరలించే వారిపై ...
Source: ఏపీ న్యూస్ | 4 Aug 2008 | 2:22 pm

రైలు ప్రయాణికుల భద్రతకు తూట్లు

దేశంలోని రైలు ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది. రైలు ఎక్కిన ప్రయాణికుడు.. సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునేంత వరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇందుకు నిదర్శనం... రాష్ట్రంలో
Source: ఏపీ న్యూస్ | 4 Aug 2008 | 1:42 pm

రాజీవ్ గాంధీ ఖేల్‌ రత్న అవార్డుకు ధోనీ ఎంపిక

టీం ఇండియా వన్డే, ట్వంటీ- 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సోమవారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికయ్యాడు. దేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇదే. మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ తరువాత ఈ అవార్డును అందుకుంటున్న
Source: Yahoo! Telugu: News | 4 Aug 2008 | 12:34 pm

రేపు ముఖ్యమంత్రిచే మెగా వైద్య శిబిరం ప్రారంభం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంగళవారం విశాఖపట్నంలో ఆరోగ్యశ్రీ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించనున్నారు. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 4 Aug 2008 | 12:20 pm

ప్రైవేట్ టీవీ ఛానల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా

రాష్ట్ర మంత్రి దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల రవాణా శాఖ అధికారులపై చేసిన వ్యాఖ్యలను ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ వక్రీకరించి ప్రసారం చేసిందంటూ బీసీ, ఎస్సీ యువజన్ కాంగ్రెస్ నాయకులు అనంతపురంలో సోమవారం నిరసనకు దిగారు.
Source: Yahoo! Telugu: News | 4 Aug 2008 | 12:15 pm

తెదేపాకు మరో షాక్: గుంటూరు- 2 ఇన్‌ఛార్జ్ రాజీనామా

మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీలో చేరేందుకు గుంటూరు- 2 తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ టీవీ రావు సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ విధానాల పట్ల విసుగుతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన విలేకరులతో చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 4 Aug 2008 | 12:08 pm

కరుణానిధి వైఖరి పట్ల సుప్రీం తీవ్ర ఆగ్రహం

తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి వైఖరి పట్ల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే అరెస్టు వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. గతంలో కోర్టు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు కరుణానిధి, కేంద్ర మంత్రి టీఆర్.బాలు మరో నలుగురికి నాలుగు వారాల సమయం ఇచ్చింది.
Source: జాతీయ | 4 Aug 2008 | 11:32 am