బహిష్కరణ తీవ్రంగా నొప్పించింది: సోమనాథ్

సీపీఎం పార్టీతో ఉన్న నాలుగు దశాబ్దాల బంధాన్ని బహిష్కరణ వేటుతో తెంచుకోవడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందని లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ అన్నారు. సీపీఎం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఆయన తొలిసారి పెదవి విప్పారు. కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Source: జాతీయ | 29 Jul 2008 | 12:41 pm

మార్కెట్‌లో నష్టాలు: 557 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

మంగళవారం ఉదయం 263 పాయింట్ల నష్టంతో ప్రారంభమయిన మార్కెట్ పుంజుకుని 14,153కి చేరుకుంది. ఈ లాభాలను కొనసాగించలేక నష్టాల్లో కూరుకుపోయింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి...
Source: Yahoo! Telugu: News | 29 Jul 2008 | 12:20 pm

షార్జా ఛాంపియన్స్ లీగ్‌లో ఆడేందుకు బీసీసీఐ నో

షార్జాలో అక్టోబర్‌లో జరిగే ఛాంపియన్స్ లీగ్‌లో ఆడాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పంపిన ఆహ్వానాన్ని బీసీసీఐ మంగళవారం తిరస్కరించింది. దీంతో ఇరుదేశాల బోర్డుల మధ్య ఉన్న విభేదాలు మరింత జఠిలం అయ్యే అవకాశం ఉంది.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2008 | 12:15 pm

మొయిలీతో వైఎస్, డీఎస్‌ల సమావేశం

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌లు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో సమావేశం అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం వీరప్ప మొయిలీ నగరానికి చేరుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2008 | 12:13 pm

ఆ ఆర్డీవో... అందరికీ ఆదర్శం

సాధారణంగా ప్రభుత్వ కొలువుల్లో కుదురుకున్న తర్వాత తాను, తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచించే అధికారులే ఎక్కువగా ఉంటారు. కింది స్థాయి అధికారులు తప్పు చేసినా చూసీ చూడనట్టుగా పోతుంటారు. అయితే.. కడప జిల్లా
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2008 | 11:57 am

తగ్గిన సాగర్ నీటి మట్టం: రైతుల్లో ఆందోళన

కోస్తాంధ్రా, తెలంగాణా జిల్లాల్లో సిరుల పంటను పండించేందుకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాణాధారం. దేశంలో ఉన్న నీటి ప్రాజెక్టులల్లో ఒకటిగా పేరొందిన సాగర్‌లో నీటి మట్టం ఎపుడూ 548 అడుగులకు తగ్గకుండా చూడాలని మాజీ ముఖ్యమంత్రి
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2008 | 11:54 am

ఆత్మహత్యా యత్నం చేశానా... నేనా..?!

దేవదాసు, పోకిరి సినిమాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ "ఇలియానా". ఈ అందాల భామ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వెలువెత్తాయి. అయితే తను ఆత్మహత్యలకు పాల్పడలేదని, ఆత్మహత్య చేసుకున్నట్లు పలు వెబ్‌సైట్లు...
Source: వినోదం | 29 Jul 2008 | 11:41 am

గ్రూపు 1పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎపీపీఎస్సీ

గ్రూపు- 1లో రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీపీఎస్సీ మంగళవారం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సూచనల ప్రకారం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టులో
Source: Yahoo! Telugu: News | 29 Jul 2008 | 11:36 am

ఆగస్టు 21న మైనారిటీ జంటల సామూహిక వివాహాలు

మైనారిటీ సంక్షేమ శాఖ వచ్చే నెల 21వ తేదీన మైనారిటీ జంటలకు సామూహిక వివాహాలు జరపనుంది. ఈ సామూహిక వివాహాల్లో సుమారు మూడు వేల జంటలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి షబ్బీర్
Source: Yahoo! Telugu: News | 29 Jul 2008 | 11:27 am

వచ్చే నెల 8 నుంచి లాసెట్ కౌన్సెలింగ్

లాసెట్ కౌన్సెలింగ్ వచ్చే నెల 8న ప్రారంభం కానుంది. మూడు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఈ కౌన్సెలింగ్‌ను హైదరాబాద్, తిరుపతి, గంటూరు, విశాఖపట్నం, వరంగల్, అనంతపురంలలో నిర్వహిస్తామని కన్వీనర్ రామసుబ్బయ్య వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2008 | 11:16 am

ఆగస్టు 11, 12 తేదీల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణకు సంబంధించిన తాము చేసిన డిమాండ్‌లు పరిష్కారం అయ్యే మార్గం చర్చల ద్వారా కనిపించకపోవడంతో ఎన్ఎంయూ వచ్చే నెల 11, 12 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగాలని నిర్ణయించింది.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2008 | 11:09 am

ఉత్తర ప్రదేశ్: దిగ్విజయ్ సింగ్ అరెస్ట్

కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి మాయవతి స్వగ్రామంలోని ఓ భూవివాదంలో విషయంలో నిరసన తెలపడానికి వెళ్లుతున్న వారిని ఉత్తరప్రదేశ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2008 | 11:02 am

ఎంపీల కొనుగోలుకు వాడిన నల్లడబ్బు రాష్ట్రానిదే: సీపీఎం

రాష్ట్రం నుంచి తీసుకెళ్లిన నల్లడబ్బుతోనే విశ్వాసపరీక్ష కోసం యూపీఏ కూటమి ఎంపీలను కొనుగోలు చేసిందని సీపీఎం ఆరోపించింది. యూపీఏ కూటమి నేతలు ఎంపీలు కొనుగోలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి అందిన నల్లడబ్బును ఉపయోగించారని
Source: Yahoo! Telugu: News | 29 Jul 2008 | 11:01 am

డీకేలోనూ కాంగ్రెస్ రక్తమే ఉంది: డీఎస్ ఉద్ఘాటన

ఆదికేశవులునాయుడిలోనూ కాంగ్రెస్ రక్తమే ఉందని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ నెల 22న జరిగిన విశ్వాసపరీక్షలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినందుకు చిత్తూరు ఎంపీ
Source: Yahoo! Telugu: News | 29 Jul 2008 | 10:56 am

తెలంగాణ కోసమే టీడీపీని వదిలిపెట్టాను: దేవేందర్

తెలంగాణ ప్రజల కోసమే తాను తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టానని నవ తెలంగాణ ప్రజా పార్టీ అధ్యక్షుడు దేవేందర్ గౌడ్ తెలిపారు. ఆయన సోమవారం పార్టీకి చెందిన ఇతర నేతలు పెద్దిరెడ్డి, స్వామినాథంలతో కలసి విలేకరులతో మాట్లాడారు.
Source: Yahoo! Telugu: News | 29 Jul 2008 | 10:33 am

సూరత్‌లో పోలీసులు కనుగొన్న మరో బాంబు

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో మంగళవారం మరొక బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ బాంబును చాకచక్యంగా నిర్వీర్యం చేశారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు రోజు సూరత్‌లోని అశోక్‌నగర్‌, లాధేశ్వర్ పోలీస్ చెక్‌ పోస్ట్‌ల రెండు బాంబులను స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే.
Source: జాతీయ | 29 Jul 2008 | 10:20 am

సూరత్‌లో మరో 15 బాంబులు: ఆరు నిర్వీర్యం

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో తీవ్రవాదులు పెట్టిన బాంబులు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే 15 బాంబులను పోలీసులు కనుగొన్నారు. వీటిలో ఆరు బాంబులను నిర్వీర్యం చేశారు. మరికొన్ని బాంబులు ఉండొచ్చనే భయంతో సూరత్ నగరమంతా పోలీసులు జల్లెడ వేసి తనిఖీలు చేస్తున్నారు.
Source: జాతీయ | 29 Jul 2008 | 10:20 am

వేలాంగణిలో గోపిక దంపతులు!

కొత్తగా వివాహమాడిన "నా ఆటోగ్రాఫ్" నటీమణి గోపిక, తన భర్త అజ్లేష్‌తో కలిసి వేలాంగణి మాతను దర్శించుకుంది. ఐర్లాండ్ డాక్టర్‌ అజ్లేష్‌ను వివాహమాడిన ఈ మలయాళ ముద్దుగుమ్మ గోపిక, తన భర్తతో కలిసి వేలాంగణి మాతను, సమీపంలోని చర్చిని దర్శించుకుని ...
Source: వినోదం | 29 Jul 2008 | 8:29 am

ఉద్యోగులపై దౌర్జన్యం : నిరసనగా పెన్‌డౌన్ సమ్మె

ఉద్యోగ నిర్వహన సమయంలో టౌన్ ప్లానింగ్ ఉద్యోగులపై దౌర్జన్యం జరగడాన్ని నిరసిస్తూ ఆశాఖ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా పెన్‌డౌన్ సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వారంతా మంగళవారం కార్యాలయాల్లో విధి నిర్వహించకుండా నిరసన తెలపనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2008 | 7:34 am

మనుగడ కోసమే తెదేపా తెలంగాణ జపం!

మనుగడ కోసమే తెలుగుదేశం పార్టీ తెలంగాణా వాదాన్ని జపిస్తుందని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విమర్శించారు. తెలంగాణ పట్ల తెదేపాకు స్పష్టమైన వైఖరి లేదని, గతంలో బీజేపీ లాగే ప్రస్తుతం తెరాసతో , టీడీపీ పొత్తుకు సిద్ధమౌతోందని ఆయన ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2008 | 7:24 am

అస్సోంలో 32 మంది ఉగ్రవాదులు లొంగుబాటు

ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో 32 మంది ఉగ్రవాదులు సైన్యం ఎదుట లొంగిపోయారు. అస్సోం రాష్ట్రంలోని దిబ్రూగర్ జిల్లాలోని దింజన్ ఆర్మీ క్యాంపుకు వచ్చిన ఉగ్రవాదులు తమ ఆయుధాలను సైనికులకు అప్పగించి స్వతహాగా లొంగిపోయారు.
Source: జాతీయ | 29 Jul 2008 | 6:41 am

నేడే నగరానికి వీరప్ప మొయిలీ రాక!

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ మంగళవారం రాష్ట్ర రాజధాని భాగ్యనగరం చేరుకోనున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కొత్త డీసీసీ అధ్యక్షుల జాబితా ఖరారు, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు వంటి తదితర అంశాలపై చర్చలు జరిపేందుకు మొయిలీ రాష్ట్రానికి చేరుకోనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2008 | 6:36 am

బలపడిన అల్పపీడనం : విస్తారంగా వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఒరిస్సా తీరం దాటి ఛత్తీస్‌గఢ్-భువనేశ్వర్ మధ్య కేందీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2008 | 6:18 am

ముంబైను ముంచెత్తిన వర్షం

భారీ వర్షంతో ముంబై మరోసారి జలమయమైంది. సోమవారం ముంబయిలో కురిసిన వర్షాలతో రైలు పట్టాలపై నీళ్లు నిలిచాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ముంబయి లోకల్ రైళ్లు రెండు గంటలు ఆలస్యంగా నడిచాయి. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు.
Source: జాతీయ | 29 Jul 2008 | 6:15 am

31న తెలంగాణ కోర్ కమిటీ సమావేశం

తెలంగాణ కోర్ కమిటీ సమావేశం జూలై 31న మహబూబ్ నగర్ జిల్లా అయిజలో ఏర్పాటు చేసినట్లు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా "మీకోసం" యాత్రలో భాగంగా చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణపై అభిప్రాయ సేకరణ, అపోహల తొలగింపు వంటి తదితర అంశాలను కోర్‌కమిటీలో చర్చించనున్నట్లు ప్రకటించారు
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2008 | 5:52 am

నల్లధనంతో ఎంపీల కొనుగోలు : బృందా కారత్

యూపీఏ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గడానికి నల్లధనంతో ఎంపీలను కొనుగోలు చేసిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ నుంచే డబ్బు సూట్‌కేసులు వచ్చాయని, ప్రజాస్వామ్య హరణం ఇక్కడి నుంచే ప్రారంభమైందని ఆమె విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2008 | 5:52 am

ఆగస్టు 11, 12 తేదీల్లో ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్త సమ్మె

కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రతిపాదించిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం నిరాకరించడంతో వచ్చే నెల 11, 12 తేదీలలో సమ్మె చేపడుతామని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయు) ప్రకటించింది. హైదరాబాద్‌లోని 'బస్‌' భవన్‌లో...
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2008 | 5:48 am

ఆగస్టు 1 నుంచి రాహుల్ బంగ్లా పర్యటన!

ఆగస్టు ఒకటో తేదీ నుంచి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఐదు రోజుల పాటు బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ బంగ్లా పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ గ్రామీణ పురోగతి కేంద్రం (బీఆర్‌ఏసీ) విజయవంతంగా చేపడుతున్న అనేక కార్యక్రమాలను రాహుల్ గాంధీ పరిశీలిస్తారు.
Source: జాతీయ | 29 Jul 2008 | 4:55 am

బాంబు పేలుళ్లు యూపీఏ కుట్ర: భాజపా

కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ కుట్రగా భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. యూవీఏ విశ్వాస పరీక్షా సమయంలో ఎంపీల కొనుగోలు అంశం నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందని ఆ పార్టీ సీనియర్ మహిళా నేత సుష్మాస్వరాజ్ ఆరోపించారు.
Source: జాతీయ | 29 Jul 2008 | 4:43 am

జులై 29, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలి షాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2008 | 4:05 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2008 | 2:50 am

ముంబయిని ముంచెత్తిన భారీవర్షాలు

దేశ ప్రధాన వాణిజ్య రాజధాని ముంబయి మహానగరాన్ని భారీవర్షాలు ముంచెత్తటంతో ప్రజలు, ప్రయాణీకులు నానాఇబ్బందులు పడ్డారు. ముంబయిలో సోమవారం భారీవర్షం కురిసింది. నగరంలోని ప్రధాన రహదారులు, ఇతర వీధులు నీటితో నిండిపోయాయి.
Source: జాతీయ | 28 Jul 2008 | 3:24 pm

అహ్మదాబాద్ సందర్శించిన పీఎం, సోనియాలు

విద్రోహుల వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లిన అహ్మదాబాద్ నగరంలో బాధితులను పరామర్శించటానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలు సోమవారం ఇక్కడకు వచ్చారు. ప్రధానమంత్రి సింగ్ పర్యటన ఒకరోజు పాటు అహ్మదాబాద్‌లో పర్యటించారు.
Source: జాతీయ | 28 Jul 2008 | 2:01 pm

శివాజీ నటించిన ఆలయం పాటల ప్రదర్శన

శివాజీ హీరోగా నటించిన ఆలయ చిత్ర పాటల ప్రదర్శన ఆదివారం రామానాయుడు స్టూడియోలో విలేకరులకు ప్రదర్శించారు. ఇది చక్కని కుటుంబ కథా చిత్రమని దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2008 | 1:19 pm

సాయికుమార్ మిలటరీ అధికారిగా ఇంద్రజిత్

సాయికుమార్ మిలట్రీ అధికారిగా, పృథ్వీరాజ్ తీవ్రవాదిగా నటిస్తున్న చిత్రం ఇంద్రజిత్. దేశంలో జరుగుతున్న మారణహోమాలకు సమాధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు గూనా నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jul 2008 | 1:17 pm