|
బెంగుళూరులో బాంబు పేలుళ్లు: ముగ్గురి మృతిదక్షిణ భారత ఐటి హబ్‌గా పేరుగాంచిన బెంగుళూరులో శుక్రవారం రెండు వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. కేవలం 12 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. బెంగుళూరులోని మడివాలా చెక్‌పోస్ట్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో 15 మంది గాయపడగా, ఒక మహిళ మృతి చెందింది.Source: జాతీయ | 25 Jul 2008 | 2:03 pm తొమ్మిదో వేతన సంఘ ఛైర్మన్‌గా సీ.ఎన్.రావురాష్ట్ర తొమ్మిదో వేతన సవరణ సంఘ ఛైర్మన్ పదవిని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీ.ఎన్. రావు అలంకరించారు. ఎనిమిదో వేతన సంఘ ప్రణాళిక ముగిసిన నేపథ్యంలో, ఈ సంఘానికి ఎప్పటిలాగానే రిటైర్డ్ అయిన ఐఏఎస్ అధికారిని నియమించారు.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2008 | 1:31 pm జలాశయాలకు రక్షణ ఏది? ఎక్కడ?దేశంలోని జలాశయాలకు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచివుందనే హెచ్చరికలూ తరచూ వస్తున్నాయి. అయితే మన పాలకులు మాత్రం రిజర్వాయర్లకు భద్రతను పెంచే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. తెలంగాణా జిల్లాలకు తాగు, సాగు నీటిని అందించే శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పరిస్థితి ఇదే విధంగా ఉంది.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2008 | 12:01 pm సీట్ల కోసం పోటీ పడుతున్న ఔత్సాహికులుమెగాస్టార్ చిరంజీవి ప్రవేశపెట్టనున్న కొత్త రాజకీయ పార్టీలోకి వలసలు భారీగానే ఉన్నాయి. అదే స్థాయిలో సీట్లను ఆశించే వారి సంఖ్యా ఉంది. దీంతో ఏమి చేయాలో తోచక చిరంజీవి శిబిరం తల్లడిల్లుతోంది. మెగాస్టార్ గ్లామర్‌కు తోడు కొత్త పార్టీ కావడంతో తప్పకుండా గెలుస్తామనే ధీమా ప్రతిఒక్కరిలోనూ నెలకొంది.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2008 | 11:57 am రెబెల్ ఎంపీలను బహిష్కరించిన ఎస్పీలోక్సభలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసిన ఆరుగురు రెబెల్ ఎంపీలను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) బహిష్కరించింది. ఉత్తర ప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ. ఓటింగ్ సమయంలో తాము జారీచేసిన..Source: జాతీయ | 25 Jul 2008 | 11:37 am మార్కెట్‌లో నష్టాలు: 502 పాయింట్లు పతనమైన సెన్సెక్స్శుక్రవారం ఉదయం 325 పాయింట్ల నష్టంతో ప్రారంభమయిన మార్కెట్ క్రమంగా లాభాల బాటలో సాగింది. అయితే ఈ లాభాలను కొనసాగించలేక నష్టాల బాటలో పయనించింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి...Source: Yahoo! Telugu: News | 25 Jul 2008 | 11:17 am 80వ పడిలో అడుగిడిన సోమనాథ్లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ శుక్రవారంతో 80 యేటకు అడుగు పెట్టారు. రెండు రోజుల కిందటే సీపీఎం పార్టీ నుంచి ఆయన బహిష్కృతికి గురైన విషయం తెలిసిందే. అక్బర్ రోడ్డులోని తన నివాసంలోని ఆయన ఉదయం నుంచి పలువు నాయకులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 25 Jul 2008 | 11:12 am చిన్నారులకు రాష్ట్రపతి విందుభారత దేశ ప్రథమ పౌరురాలు ప్రతిభాపాటిల్ గురువారం అనాథ పిల్లలకు విందునిచ్చారు. తాను రాష్ట్రపతి భవన్‌లోకి వచ్చి యేడాది కాలం పూర్తయిన సందర్భంగా ఆమె ఈ విందును ఏర్పాటు చేశారు.Source: Yahoo! Telugu: News | 25 Jul 2008 | 11:12 am రాజధాని నగరంలో హై అలర్ట్!బెంగళూరు నగరంలో శుక్రవారం మధ్యాహ్నం వరుసగా ఏడు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించిన కారణంగా, రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌తో సహా అన్ని ప్రధాన నగరాల్లో భద్రతా ఏర్పాట్లను పటిష్ట వంతం చేశారు. దేశంలో అన్ని చోట్ల ముందు జాగ్రత్తగా భద్రతా చర్యలు చేపట్టి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2008 | 11:11 am జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లుఅమర్నాథ్ ఆలయ బోర్డు స్థల వివాదం జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ వివాదం కారణంగా శుక్రవారం మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు చేపట్టిన బంద్‌లో హింసాత్మక సంఘటనలో చోటు చేసుకున్నాయి. దీంతో సాయుధ బలగాలు రంగ ప్రవేశం చేసి అల్లరి మూకలను చెదరగొట్టాయి.Source: జాతీయ | 25 Jul 2008 | 10:59 am వరుణ యాగంతోనే విస్తారంగా వర్షాలు!హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం చేపట్టిన మహా వరుణ యాగంతోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు. వరుణయాగం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజ హితానికి పాటుపడే అర్చకుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2008 | 10:59 am ఎంపీలకు ముడుపులు: ఫిర్యాదుకు భాజపా సిద్ధంలోక్సభలో ఎంపీలకు లంచం ఇవ్వజూపిన వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది. తన ఫిర్యాదులో సమాజ్‌వాది పార్టీ ప్రధానకార్యదర్శి అమర్ సింగ్‌తో సహా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సలహాదారు అహ్మద్ పటేల్ పేర్లను చేర్చాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.Source: జాతీయ | 25 Jul 2008 | 10:47 am నరేంద్రను అనర్హుడుగా ప్రకటించాలి : తెరాసయూపీఏ విశ్వాస పరీక్షలో పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసిన తిరుగుబాటు ఎంపీ అలె నరేంద్రను అనర్హుడిగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటు వేసిన నరేంద్రపై తగిన చర్యలు తీసుకోవాలని సోమనాథ్‌కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2008 | 10:40 am ముగిసిన వరుణయాగం : వైఎస్ అభినందనహైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గత మూడురోజులుగా జరుగుతున్న వరుణయాగం కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వరణయాగాన్ని విజయవంతంగా ముగించిన...Source: Yahoo! Telugu: News | 25 Jul 2008 | 10:38 am ఆరుగురు ఎంపీలను బహిష్కరించిన ఎస్పీవిశ్వాస పరీక్షలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న కారణంగా సమాజ్‌వాదీ పార్టీ ఆరుగురు ఎంపీలపై వేటు వేసింది. వారి పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నిర్ణయాన్ని స్పీకర్‌కు తెలపనున్నట్లు పార్టీ శుక్రవారం ప్రకటించిందిSource: Yahoo! Telugu: News | 25 Jul 2008 | 10:32 am ఆగస్టు 15న విశాల్ 'సెల్యూట్'చురుకైన నటుడు విశాల్ హీరోగా, సెక్సీ తార నయనతార జంటగా నటించిన చిత్రం సెల్యూట్. ఎ. రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం స్వాతంత్రదినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. 'పందెంకోడి' చిత్రంతో తెలుగువారికి పరిచయమైన...Source: వినోదం | 25 Jul 2008 | 10:27 am విప్ ధిక్కరణ : టీడీపీ నుంచి ఆదికేశవులు ఔట్చిత్తూరు ఎంపీ ఆదికేశవులు తెలుగుదేశం పార్టీ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. గత మంగళవారం లోక్‌సభలో జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు పార్టీ ఆయనపై ఈ చర్య తీసుకుంది.Source: Yahoo! Telugu: News | 25 Jul 2008 | 10:27 am తెదేపా నుంచి ఆదికేశవుల నాయుడు బహిష్కరణయూపీఏకు అనుగుణంగా విశ్వాస పరీక్షలో ఓటు వేశారన్న కారణంతో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఆదికేశవుల నాయుడును శుక్రవారం ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. అణుఒప్పందంపై విశ్వాస పరీక్షను ఎదుర్కొన్న యూపీఏ సర్కారుకు మద్దతిస్తూ పార్టీ విప్‌ను ధిక్కరించి, ఆదికేశవుల నాయుడు ఓటు వేసిన సంగతి తెలిసిందే.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2008 | 10:25 am గ్రామీణ పారిశుద్ధ్యంలో దృష్టి పెట్టండి : పిన్నమనేనిగ్రామీణ పారిశుద్ధ్యం విషయంలో రాష్ట్రం వెనుకబడి ఉందని ఉన్నత విద్యాశాఖా మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. 12వ ఆర్థికసంఘం నిధులను గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాకు మాత్రమే కేటాయించాలని పిన్నమనేని అధికారులకు సూచించారు.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2008 | 10:24 am త్వరలో "చిరుపార్టీ" ప్రకటన?రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న మెగాస్టార్ "చిరంజీవి" పార్టీ ఆగస్టు నెలలో ప్రజల ముందుకు రానుంది. త్వరలో ఆ పార్టీ జెండాను, అజెండాను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. మరోవైపు మంచి ముహూర్తాలను చూసుకుని ఆగస్టు 8వ తేదీన తన పార్టీపై చిరంజీవి ప్రకటించబోతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2008 | 10:24 am మర్యాద పూర్వకంగానే బాబును కలిశా : కేసీఆర్హస్తినలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసిన మాట వాస్తవమేనని, యూపీ సీఎం మాయావతి ఇచ్చిన విందులో మర్యాదపూర్వకంగానే ఆయనను కలిశానని తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. ఈ భేటీలో బాబుకు తనకు మధ్య ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని కేసీఆర్ వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2008 | 10:24 am రష్యా అధ్యక్షునితో మన్మోహన్ ఫోన్ భేటీరష్యా అధ్యక్షుడు మెద్వదేవ్‌కు భారత ప్రధాని మన్మోహన్ శుక్రవారం ఫోన్‌లో సమావేశమయ్యారు. త్వరలో రష్యా అధ్యక్షుడు భారత్‌ను సందర్శించనుండడంతో వీరి ఫోన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే అణు ఒప్పందానికి సంబంధించి భారత్‌లో నెలకొన్న ప్రతిష్టంభన సైతం...Source: Yahoo! Telugu: News | 25 Jul 2008 | 9:56 am సోమనాథ్ ఛటర్జీ అట్ 80 నాటౌట్లోక్సభ స్పీకర్, బహిష్కృత కమ్యూనిస్టు వృద్ధనేత సోమనాథ్ ఛటర్జీ శుక్రవారం 80వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.Source: జాతీయ | 25 Jul 2008 | 9:49 am విశ్వాసం కోసం కాంగ్రెస్ అడ్డదారులు : టీడీపీ విమర్శకేంద్రంలో అధికారం నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారులు తొక్కిందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను ఎత్తి చూపేందుకు తెలుగుదేశం శుక్రవారం రాజధానిలో ధర్నా నిర్హహించింది.Source: Yahoo! Telugu: News | 25 Jul 2008 | 9:28 am అమరనాథ్ వివాదం: కాశ్మీర్‌లో అల్లర్లు... ఉద్రిక్తతఅమర్నాథ్ స్థలవివాదం కారణంగా జమ్మూలో అందోళనకారులు చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారుతోంది. శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆందోళకారులు పోలీస్ వాహనాన్ని తగలబెట్టారు. ప్రస్తుతం అక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందోననే పరిస్థితి నెలకొని ఉంది.Source: Yahoo! Telugu: News | 25 Jul 2008 | 8:34 am "మర్మయోగి" అవతారంలో కమల్ హాసన్!"దశావతారం"లో పది పాత్రలను పోషించిన పద్మభూషణ్ కమల్ హాసన్ "మర్మయోగి"గా అవతారమెత్తనున్నారు. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుందని ఇటీవల చెన్నైలో మీడియా ప్రతినిధులతో కమల్ తెలియజేశారు. సాంప్రదాయక-చారిత్రక...Source: వినోదం | 25 Jul 2008 | 8:07 am అనుకూలమైన వారితో పొత్తుకు సై : దేవేందర్తెలంగాణపై స్పష్టమైన హామీ వెలువరించే పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు నవ తెలంగాణా ప్రజా పార్టీ అధినేత దేవేందర్‌గౌడ్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తాము పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 25 Jul 2008 | 8:05 am భవిష్యత్ ప్రణాళికపై కాంగ్రెస్-ఎస్పీ మంతనాలుకష్టకాలంలో ఆపద్భాంధవుడిలా ఆదుకున్న సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, తమ భవిష్యత్ ప్రణాళికపై కాంగ్రెస్ నేతలతో చర్చలు ప్రారంభించనున్నారు. ఒకనాడు బద్ధశత్రువులుగా ఉండి కష్టకాలంలో ఒకటైన ఈ రెండు పార్టీల నేతలు.. తమ పొత్తును భవిష్యత్‌లోనూ కొనసాగించాలని భావిస్తున్నారు.Source: జాతీయ | 25 Jul 2008 | 5:22 am వీధి బాలలకు రాష్ట్రపతి విందురాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కొందరు వీధి బాలలకు విందు ఇచ్చారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన శుభ సందర్భంలో ఆమె ఈ విందును ఏర్పాటు చేశారు. నెహ్రూ బాలవికాస్ సమితి, ఆర్య అనాధాలయం, బచ్చేయేంకా ఘర్, లిటరసీ ఇండియా వంటి సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న బాలబాలికలు ఉన్నారు.Source: జాతీయ | 25 Jul 2008 | 5:02 am జులై 25, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు...Source: Yahoo! Telugu: Entertainment | 25 Jul 2008 | 4:51 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 25 Jul 2008 | 2:55 am క్యాబినెట్ బెర్తులకు కోరలేదు : అమర్ సింగ్కేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేముందు తమకు క్యాబినెట్ బెర్తులు కావాలని డిమాండ్ చేయలేదని సమాజ్‌వాదీ పార్టీ జనరల్ సెక్రటరీ అమర్ సింగ్ స్పష్టం చేశారు.Source: జాతీయ | 24 Jul 2008 | 2:54 pm కథానాయకుడు ట్రెయిలర్ వీక్షించండితమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తమిళ తాజా చిత్రం 'కుచేలన్'. ఈ చిత్రం "కథానాయకుడు" పేరుతో తెలుగులో వైజయంతీ మూవీస్...Source: వినోదం | 24 Jul 2008 | 1:16 pm
|