మారిషస్ విమానంలో మంటలు : ప్రయాణికులు క్షేమం

న్యూఢిల్లీ నుంచి టేకాఫ్ తీసుకునే సమయంలో మారిషస్‌కు చెందిన విమానంలో హటాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే ఫైలట్ల సమయస్పూర్తితో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
Source: జాతీయ | 24 Jul 2008 | 11:46 am

ఐఏఈఏ- భారత్ అణు ఒప్పందంపై పాక్ అభ్యంతరం

అంతర్జాతీయ అణు శక్తి సంస్థతో భారత్ కుదుర్చుకోబోయే భద్రతాంశాల ఒప్పందంపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం అమల్లోకి తెచ్చేందుకు భారత్‌ తప్పనిసరిగా అంతర్జాతీయ అణు శక్తి సంస్థ
Source: Yahoo! Telugu: News | 24 Jul 2008 | 11:34 am

మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 165 పాయింట్ల పతనం

గురువారం ఉదయం 140 పాయింట్ల లాభంతో ప్రారంభమయిన సెన్సెక్స్ 15,130కు చేరుకుంది. అయితే లాభాలను కొనసాగించలేక నష్టాల్లో కూరుకుపోయింది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 165 పాయింట్లు కోల్పోయి...
Source: Yahoo! Telugu: News | 24 Jul 2008 | 11:22 am

లంచం ఇచ్చిన వారిపై ఫిర్యాదు చేయండి : స్పీకర్

విశ్వాస పరీక్షలో తమను ప్రభావితం చేయడానికి డబ్బులు ఎరగా చూపిన వారిపై తనకి రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ బీజేపీ ఎంపీలను కోరారు. ఈ మేరకు వారికి బుధవారం రాత్రి లేఖ రాశారు. అధికారకంగా వారి వాదన వినిపించాలని సూచించారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2008 | 10:34 am

బోగస్ కార్డులను ఏరివేయండి : సీఎం

రాష్ట్రంలో బోగస్ కార్డులను ఏరివేయండని రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర రెడ్డి అధికారులకు ఆదేశించారు. పెరిగిన ఆదాయ పరిమితితో అర్హులైన వారందరికీ తెల్లకార్డులను ఆగస్టులోగా పంపిణీ చేయాలని ఆయన సూచించారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనిమిది ప్రధాన అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2008 | 10:34 am

సీఎంచే "టీటీడీ పుస్తక ప్రసాద పథకం"

తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన "పుస్తక ప్రసాద పథకాన్ని" రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి గురువారం సచివాలయంలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా ప్రతి ఆడకూతురు ఇంటర్ వరకూ చదువుకునేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2008 | 10:29 am

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజి స్వర్ణోత్సవాలు

1959 జులై 23వ తేదీ ఓరుగల్లుకే గర్వకారణమయిన రోజు. వేలాది మందిని వైద్యులుగా తీర్చిదిద్ది లక్షల ప్రాణాలను నిలబెడుతున్న కాకతీయ మెడికల్ కాలేజి ఆవిర్భవించిన రోజు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ స్వర్ణోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. వందేమాతరం...
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2008 | 10:28 am

ప్రధానికి ఇది తగదు : బాబు

విశ్వాస పరీక్షల్లో నెగ్గడానికి ఎంపీలు కొనుగోలుకు ప్రధాని మన్మోహన్ సింగ్‌ ప్రోత్సహించారని, ఆయన హుందాకు ఇది తగని పని అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విశ్వాసపరీక్షల్లో విజయం సాధించేందుకు 24మంది ఎంపీలను కొనుగోలు చేసి ప్రపంచ దేశాల ముందు భారత్ తలదించుకునేలా చేసిందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2008 | 9:54 am

గ్రేనెడు దాడి: శ్రీనగర్‌లో ఐదుగురు మృతి

వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళడానికి జనం బిజీ బిజీగా ఉన్నారు. బ్యాగులు, పిల్లలను చేతపట్టుకుని బస్సుల కోసం వేచి ఉన్నారు. కొందరైతే దగ్గరకు వస్తున్న బస్సులను ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే పెద్ద శబ్ధం.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2008 | 9:49 am

సన్నివేశాల చిత్రీకరణలో నాగార్జున కింగ్

నాగార్జున, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం కింగ్. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం సన్నివేశాల చిత్రీకరణలో ఉంది. సికింద్రాబాద్‌లోని రాయల్‌ప్యాలెస్‌లో కీలక సన్నివేశాలను చిత్రిస్తున్నట్టు యూనిట్ వర్గాలు...
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2008 | 9:30 am

అణు ఒప్పందం సకాలంలో పూర్తవుతుంది: అమెరికా

అమెరికా- భారత్ పౌర అణు ఒప్పందం ప్రక్రియ సకాలంలో పూర్తవుతుందని అమెరికా ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. ఇరుదేశాల ప్రభుత్వాలు ఈ ఒప్పందాన్ని పూర్తి చేసి, సకాలంలో అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెడతాయని వైట్‌హోస్ మీడియా
Source: Yahoo! Telugu: News | 24 Jul 2008 | 9:25 am

సోమనాథ్‌ను కలసిన ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గురువారం ఉదయం లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీని ఆయన ఇంట్లో కలిశారు. తాజా పరిణామాలల భాగంగా సోమనాథ్‌ను సీపీఎం పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. మన్మోహన్‌ను ఆయన మర్యాధ పూర్వకంగా కలసి ఉంటారని భావిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2008 | 9:20 am

సోమనాథ్ అప్పీలు చేసుకోవచ్చు : కారత్

యూపీఏకు అనుకూలంగా ఓటువేసి సీపీఎం నుంచి బహిష్కరించబడిన స్పీకర్ సోమనాథ్ చటర్జీ పార్టీలో కొనసాగాలనుకుంటే సెంట్రల్ కంట్రోల్ కమిషన్‌కు అప్పీలు చేసుకోవచ్చునని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు.
Source: జాతీయ | 24 Jul 2008 | 9:16 am

త్వరలో బలాదూర్ షూటింగ్ పూర్తి

డి.సురేష్‌బాబు నిర్మాణంలో రూపొందుతున్న బలాదూర్ చిత్రం త్వరలో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది. రవితేజ, అనుష్క జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్‌లను సమపాళ్లలో చూపించామని...
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2008 | 9:14 am

మానవహక్కుల ఉల్లంఘనపై కాశ్మీర్ మహిళల ఆందోళన

కాశ్మీర్ లోయలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ గురువారం మహిళలు ఆందోళనకు దిగారు. శ్రీనగర్ రోడ్లలో ప్రదర్శనలు జరిపారు. ఈ ఆందోళన ముస్లిం ఖవాతీన్-ఇ-మర్కజ్ ఆధ్వర్యంలో జరిగింది
Source: Yahoo! Telugu: News | 24 Jul 2008 | 9:04 am

రోజర్స్ మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భూపతి- నౌల్స్

భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారుడు మహేష్ భూపతి, అతని డబుల్స్ భాగస్వామి మార్క్ నౌల్స్ (బహమాస్) ఇక్కడ జరుగుతున్న 2,615,000 డాలర్ల ఏటీపీ రోజర్స్ మాస్టర్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఈ టోర్నీ డబుల్స్ రెండో రౌండు మ్యాచ్‌లో
Source: Yahoo! Telugu: News | 24 Jul 2008 | 8:58 am

ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ నుంచి సానియా నిష్క్రమణ

భారత మహిళా టెన్నిస్ సంచలనం సానియా మీర్జా రెండో రౌండు పరాజయంతో ఆరు లక్షల డాలర్ల ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ టోర్నమెంట్ సింగిల్స్ నుంచి నిష్క్రమించింది. మెంగ్ యువాన్‌తో సానియా మీర్జా రెండో రౌండు మ్యాచ్‌లో తలపడింది.
Source: Yahoo! Telugu: News | 24 Jul 2008 | 8:50 am

ఛాంపియన్స్ ట్రోఫీ: పాక్ బోర్డుకు బీసీసీఐ మద్దతు

పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగడంపై తమకెటువంటి అభ్యంతరం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. పాకిస్థాన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడంపై గురువారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ బోర్డు
Source: Yahoo! Telugu: News | 24 Jul 2008 | 8:45 am

శ్రీనగర్‌లో గ్రెనేడ్ దాడి : ఐదుగురి మృత్యువాత

జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు జరిపిన గ్రెనేడ్ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అత్యంత రద్దీగా ఉండే శ్రీనగర్ బస్ డిపో సమీపంలో ఈ సంఘటన గురువారం జరిగింది.
Source: జాతీయ | 24 Jul 2008 | 8:39 am

చివరి దశ షూటింగ్ కార్యక్రమాల్లో వినాయకుడు

సాయికిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న వినాయకుడు చిత్రం ప్రస్తుతం చివరి దశ షూటింగ్ కార్యక్రమాల్లో ఉంది. ప్రేమ్‌మూవీస్ పతాకంపై రూపొందుతున్నఈ చిత్రంలో హ్యాపీడేస్‌ ఫేమ్ సోనియా, కృష్ణుడు హీరోహీరోయిన్లుగా...
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2008 | 7:47 am

ఆగస్టు 25 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానున్నాయి. పని రోజుల్లో.. 10 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. వర్షాకాల సమావేశాలు ప్రారంభం రోజున స్పీకర్ అధ్యక్షతన జరిగే శాసనసభ సభా వ్యవహారాల సంఘం (బీఏసీ) రోజు వారి కార్యకలాపాల ఎజెండాను ఖరారు చేయనుంది.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2008 | 7:42 am

మళ్లీ ప్రారంభమైన "మీకోసం" యాత్ర

ఐదురోజుల పాటు విరామం తీసుకున్న "మీకోసం" యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లా నుంచి గురువారం యథాతథంగా ప్రారంభం కానుంది. యూపీఏ విశ్వాస పరీక్ష సందర్భంగా హస్తినకు వెళ్ళిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 19వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు తన యాత్రకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2008 | 7:30 am

సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభం

సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ కమిటీ సమావేశానికి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరీ, రామ్ చంద్రన్ పిళ్లై హాజరయ్యారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా భవిష్యత్ కార్యచరణ ప్రణాళికలు, చిరంజీవి పార్టీ, ప్రజా సమస్యలపై పోరాటాలు వంటి తదితర అంశాలపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2008 | 7:27 am

తెల్లకార్డుల వార్షికాదాయ పరిమితి పెంపు!

రాష్ట్రంలో తెల్లకార్డుల వార్షికాదాయ పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవోను జారీ చేసింది. జీవో ఎమ్మెస్ 27 అనే జీవో జారీ ద్వారా తెల్లకార్డును పొందగోరే కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో 20వేల నుంచి 60వేలకు, పట్టణ ప్రాంతాల్లో 24వేల నుంచి 75వేల వరకు పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2008 | 7:26 am

సాహిత్యజీవి "హరి" ఇకలేరు!

సినిమా నిపుణుడు, వామపక్ష సాహిత్య జీవి సూరపనేని హరి పురుషోత్తమరావు (హరి) పరమపదించారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబీకులు వెల్లడించారు. చాలాకాలంగా హరి అస్వస్థులై ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించే బుధవారం కన్నుమూశారని వారు తెలియజేశారు.
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2008 | 7:25 am

పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్లో అడుగు చిత్రం

సమరేంద్ర, రిచాసోనీ హీరోహీరోయిన్లుగా నటిస్తూ, వీరప్రసాద్ నీలంను దర్శకుడిగా పరిచయం చేస్తున్న చిత్రం అడుగు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని బొమ్మకంటి మాధవి...
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2008 | 7:14 am

రీరికార్డింగ్‌ కార్యక్రమాల్లో ఆదివిష్ణు

దాసరినారాయణరావు, కథ, స్క్రీన్‌ప్లేతో రూపొందుతున్న చిత్రం ఆదివిష్ణు. సౌభాగ్యమీడియా పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో దాసరి అరుణ్‌కుమార్, స్నేహలు హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2008 | 7:03 am

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్‌బాబు వరుడు

త్రివిక్రమ్ శ్రీనివాసం దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం వరుడు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 4న హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్టు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2008 | 6:48 am

బాబుపై విమర్శలా: జగన్నాథంపై కార్యకర్తల ఆగ్రహం

కేంద్రప్రభుత్వంపై విశ్వాస తీర్మాణం సందర్భంగా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటువేసి టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన మంద జగన్నాథంపై ఆ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీని ధిక్కరించి యూపీఏకు మద్దతుగా ఓటు వేయడమే కాకుండా చంద్రబాబుపై విమర్శలు గుప్పించినందుకు నిరసనగా వారు...
Source: ఏపీ న్యూస్ | 24 Jul 2008 | 6:30 am

వైవిధ్య కథాంశంతో పోలీస్ పోలీస్

శ్రీరామ్, మలయాళ నటుడు పృథ్వీరాజ్‌లు హీరోలుగా నటిస్తున్న చిత్రం పోలీస్ పోలీస్. పినాకిర్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి మన్‌మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2008 | 6:11 am

సోమనాథ్ నివాసంలో ప్రధాని భేటీ

విశ్వాస పరీక్షలో విజయం సాధించిన అనంతరం ప్రధాని మన్మోహన్ స్పీకర్ సోమనాథ్ చటర్జీతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన విషయాలను మాత్రం ప్రధాని మీడియాకు వెల్లడించలేదు.
Source: జాతీయ | 24 Jul 2008 | 6:11 am

సంధ్య హీరోయిన్‌గా లేచిపోదామా

ప్రేమిస్తే ఫేమ్ సంధ్య హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం లేచిపోదామా. శ్రీవారు ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహిస్తున్నారు. వి.భరణి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి సంగీత సోదరుడు పరిమళ్ హీరోగా నటిస్తున్నాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2008 | 5:53 am

మాయావతి ప్రమాదకారి : థాకరే విమర్శ

ఎంపీలకు లంచాలు ఎర చూపినవారికంటే మాయావతి ప్రమాదకారి అని శివసేన అధినేత బాల్‌థాకరే పేర్కొన్నారు. ప్రధాని పదవికి మాయావతి పేరును ప్రతిపాధించడం ద్వారా లెప్ట్ పార్టీలు ఘోరమైన తప్పిదానికి పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శివసేన అధికార పత్రిక సామ్నా...
Source: జాతీయ | 24 Jul 2008 | 4:19 am

కలిసివస్తే మూకుమ్మడి రాజీనామాలు : అద్వానీ

ప్రతిపక్షాలన్నీ కలిసివస్తే యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూకుమ్మడి రాజీనామాలు సమర్పిద్దామని అద్వానీ పేర్కొన్నారు. తాజాగా జరిగిన విశ్వాస పరీక్షలో యూపీఏ విజయం నైతికంగా లేదని ఆరోపించిన ఆయన అందుకు నిరసనగా రాజీనామాలు చేయాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు.
Source: జాతీయ | 24 Jul 2008 | 3:49 am

జులై 24, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2008 | 3:21 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2008 | 3:06 am

రామసేతును రాముడే ధ్వంసం చేశాడు: యూపీఎ

భారత-శ్రీలంక మధ్య రామ సేతు లేదని సుప్రీం కోర్టుకు కేంద్రం వివరణ ఇచ్చింది. సేతు పనులను కేంద్రం కొనసాగించుకోవచ్చునని సుప్రీం పచ్చజెండా ఊపింది. సేతు సముద్రం కాల్వ పనుల్లో భాగంగా ఎటువంటి వారధులను కూలగొట్టకూడదని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
Source: జాతీయ | 23 Jul 2008 | 4:01 pm

సంస్కరణలు వేగిరం చేస్తాం : మంత్రి చిదంబరం

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వివిధ రంగాల్లో సంస్కరణలను వేగిరం చేస్తుందని కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం చెప్పారు. ఇందులో భాగంగా ఇతర బిల్లులతో పాటుగా బీమా రంగంపై దృష్టిపెడతామన్నారు.
Source: జాతీయ | 23 Jul 2008 | 2:57 pm

సోమనాథ్‌పై బహిష్కరణ వేటు

అనుకున్నట్టుగానే సీపీఎం పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీపై బహిష్కరణ వేటు వేసింది. ఈమేరకు సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకోగా, సభ్యడు బిమన్ బోస్ విలేకరులకు వెల్లడించారు
Source: జాతీయ | 23 Jul 2008 | 12:53 pm

విడుదలకు సిద్ధమైన "ఝాన్సీ ఐపీఎస్"

"ప్రేమ" పోలీస్ ఆఫీసర్‌గా నటించిన "ఝాన్సీ ఐపీఎస్" అనే కన్నడ చిత్రాన్ని తెలుగులో సర్వసాయి ఫిలింస్ బైనర్‌పై అనువదిస్తున్నారు. ఈ చిత్రానికి సాయిరత్నం నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. సినిమాను ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Source: వినోదం | 23 Jul 2008 | 12:31 pm

సింహాచలంలో "చింతకాయల రవి"

విక్టరీ వెంకటేష్, అనుష్క, ఛార్మీ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "చింతకాయల రవి". ప్రస్తుతం ఈ సినిమా సింహాచలం నరసింహస్వామి ఆలయంలో...
Source: వినోదం | 23 Jul 2008 | 12:15 pm

ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు "రెయిన్‌ బో"

"హ్యాపీడేస్" ఫేమ్ రాహుల్, సోనాలి చౌహాన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "రెయిన్‌ బో". ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర దర్శకుడు, నిర్మాత వి.ఎన్. ఆదిత్య తెలిపారు. ఈ సినిమాను భారీ అంచనాలతో యూనిట్ కృషితో...
Source: వినోదం | 23 Jul 2008 | 12:05 pm

8 మంది ఎంపీలపై బహిష్కరణ వేటు: భాజపా

భారతీయ జనతా పార్టీ అధిష్టానం కొరఢా ఝుళిపించింది. యూపీఏకు మద్దతు తెలిపిన ఎంపీలపై వేటు వేసింది. వీరిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత రాజ్‌నాథ్ సింగ్ బుధవారం తెలిపారు. అలాగే నగదు ఎర చూపినా లొంగని ముగ్గురు ఎంపీలను అభినందించారు.
Source: జాతీయ | 23 Jul 2008 | 11:10 am